హిట్‌ డైరెక్టర్‌తో రజనీకాంత్‌ కొత్త సినిమా | Rajinikanth And Mari Selvaraj New Movie Plans | Sakshi
Sakshi News home page

హిట్‌ డైరెక్టర్‌తో రజనీకాంత్‌ కొత్త సినిమా

Aug 23 2024 1:10 PM | Updated on Aug 23 2024 1:18 PM

Rajinikanth And Mari Selvaraj New Movie Plans

కోలివుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జైలర్‌ హిట్‌ తర్వాత ఆ రేంజ్‌లో తన తర్వాతి సినిమా ఉండాలని ఆయన ప్లాన్‌ చేస్తున్నారు. ఈ దసరా పండక్కి 'వేట్టైయాన్‌' సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్‌పై సుభాస్కరన్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు కూలీ సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లతో పాటు జైలర్‌ సీక్వెల్‌ కూడా ఉంది. అయితే, ఇప్పుడు రజనీకాంత్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని తెలుస్తోంది.

కోలీవుడ్‌ టాప్‌, టాలెంట్‌ డైరెక్టర్స్‌తో సినిమాలు తీసేందుకు రజనీకాంత్‌ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వేట్టైయాన్‌ సినిమాతో టీజే జ్ఞానవేల్‌, కూలీ ప్రాజెక్ట్‌తో లోకేశ్ కనగరాజ్ , జైలర్‌తో నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఇలా వరుస బిగ్‌ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న రజనీకాంత్‌.. తాజాగా డైరెక్టర్‌ మారి సెల్వరాజ్‌తో ఒక సినిమా చేయనున్నట్లు నెట్టింట ఒక వార్త వైరల్‌ అవుతుంది. కర్ణన్‌, మామన్నన్‌ చిత్రాలతో సౌత్‌ ఇండియా ప్రేక్షకులను మెప్పించిన మారి సెల్వరాజ్‌కు రజనీ ఛాన్స్‌ ఇచ్చారని తెలిసిన అభిమానులు సంబరపడుతున్నారు.

తాజాగా ఓ ఇంటర్వయూలో పాల్గొన్న మారి సెల్వరాజ్‌ ఈ విషయం గురించి ఇలా క్లారిటీ ఇచ్చారు. 'రజనీకాంత్‌ గారికి నేను అంటే చాలా ఇష్టం. నేను డైరెక్ట్‌ చేసిన కర్ణన్‌, మామన్నన్‌ చిత్రాలను ఆయన చూసి అభినందించారు. ఆ సమయంలోనే ఒక సినిమా చేయాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఇప్పటికైతే కథ రెడీ అయింది. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.' అని మారి సెల్వరాజ్‌ తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్‌ సినిమాలు అన్నీ కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement