![Udhayanidhi stalin mari selvaraj maamannan to release in Telugu - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/14/Udayanidhi-Stalin-IMG_1560.gif.webp?itok=IQbIph5j)
‘‘నాయకుడు’ చాలా మంచి కథ, పొలిటికల్ డ్రామా, సామాజిక న్యాయం, ప్రజల మధ్య సమానత్వం గురించి ఈ మూవీలో చర్చించాం. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది’’ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘మామన్నన్’. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించి, నిర్మించారు. కీర్తీ సురేష్ హీరోయిన్. జూన్ 29న ఈ చిత్రం విడుదలైంది.
తెలుగులో ‘నాయకుడు’ పేరుతో ఏషియన్ మల్టీప్లెక్స్, సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్నాయి. నేడు ఈ మూవీ రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ–‘‘తెలుగులో నా గత చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈ సినిమాను తమిళంలో మాత్రమే విడుదల చేయాలనుకున్నాం. అయితే తమిళంలో మంచి వసూళ్లను సాధించడంతో ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నేను సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాక నా చివరి సినిమాని బలమైన కథతో మారి సెల్వరాజ్‌తో చేయాలనుకున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment