Nayakudu
-
పాత సినిమాకు సీక్వెల్ చేయబోతున్న కమల్
-
కమల్ హాసన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘నాయకుడు’ మళ్లీ వచ్చేస్తున్నాడు
తమిళసినిమా: కమలహాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన నాయకన్(తెలుగులో ‘నాయకుడు’) చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. 36 ఏళ్ల క్రితం తమిళం, తెలుగు భాషల్లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రం ద్వారా నటి శరణ్య కథానాయకిగా పరిచయం అయ్యారు. జనకరాజ్, విజయం ఎంవీ వాసుదేవరావు, ఢిల్లీ గణేష్ తార నటించిన ఈ చిత్రంలో కమలహాసన్ వరదరాజన్ మొదలియార్ అనే ముంబైకి చెందిన అండర్ వరల్డ్ డాన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అందులో ఆయన బాల్య దశ నుంచి చివరి వరకు కమలహాసన్ అద్భుతంగా నటించి మెప్పించారు. నాయకన్ చిత్రం కమలహాసన్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఈ చిత్రంలోని నటనగాను ఆయన ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్నారు. అదే చిత్రానికి ఉత్తమ కళాదర్శకుడుగా తోటతరణి ఉత్తమ ఎడిటర్‌గా బి.లెనిన్ జాతీయ అవార్డులను అందుకున్నారు. అలాంటి నాయకన్ ఇప్పుడు మరోసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీన్ని ఏటీఎల్ ప్రొడక్షన్ అధినేత మధురాట్ డిజిటల్ టెక్నాలజీతో కమలహాసన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 3న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కమలహాసన్ వీరాభిమానిగా ఈతరం ప్రేక్షకులు కూడా నాయకన్ చిత్రాన్ని చూడాలని తలంపుతో డిజిటల్ ఫార్మెట్లో రూపొందించి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కమలహాసన్ నటించిన వేట్టైయాడు విళైయాడు చిత్రం ఇటీవల మళ్లీ విడుదలై ఆరు వారాలపాటు ప్రదర్శింపబడి మంచి వసూళ్లను రాబట్టిందని చెప్పారు. కాగా నాయకన్ చిత్రం అంతకంటే మంచి వసూళ్లను రాబడుతుందని నమ్మకం ఉందన్నారు. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను కమలహాసన్ చేతులమీదుగా ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నాయకన్ చిత్రాన్ని తమిళనాడులోని 120 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. బయట అడుగుపెట్టే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. ఇలాంటి టైంలో ఎవరైనా ఏం చేస్తారు. మంచిగా తిని పడుకుంటారు. బోర్ కొడితే కొత్తగా వచ్చిన సినిమా లేదంటే వెబ్ సిరీస్ చూస్తారు. అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు ఈ వీకెండ్(జూలై 27) బోలెడన్ని కొత్త మూవీస్ రిలీజ్‌కి రెడీ అయిపోయాయి. వాటిలో 'సామజవరగమన', 'స్పై', 'నాయకుడు' లాంటి చిత్రాలతో పాటు పలు సిరీసులు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?) శుక్రవారం(జూలై 28) రిలీజయ్యే సినిమాలు-సిరీసులు అమెజాన్ ప్రైమ్ ద ఫ్లాష్ - ఇంగ్లీష్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) స్పై - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ ఏ ఫెర్ఫెక్ట్ స్టోరీ - స్పానిష్ వెబ్ సిరీస్ కెప్టెన్ ఫాల్ - ఇంగ్లీష్ సిరీస్ D.P. సీజన్ 2 - కొరియన్ సిరీస్ హిడ్డెన్ స్ట్రైక్ - ఇంగ్లీష్ సినిమా హౌ టూ బికమ్ ఏ కల్ట్ లీడర్ - ఇంగ్లీష్ సిరీస్ మిరాక్యూలస్: లేడీ బగ్ & క్యాట్ నోయిర్, ద మూవీ - ఫ్రెంచ్ మూవీ ద టైలర్ సీజన్ 2 - టర్కిష్ సిరీస్ ద విచర్ సీజన్ 3: పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) నాయకుడు - తెలుగు డబ్బింగ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద లేడీ ఆఫ్ సైలెన్స్: ద మటవిటస్ మర్డర్స్ - స్పానిష్ మూవీ (స్ట్రీమింగ్) ప్యారడైజ్ - ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది) టుడే వుయ్ ఆల్ టాక్ అబౌట్ ద డే - ఇండోనేసియన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద మర్డరర్ - థాయ్ మూవీ (స్ట్రీమింగ్) హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) ఆహా సామజవరగమన - తెలుగు సినిమా ఈ-విన్ పోలీస్ స్టోరీ: కేస్ 1: నైట్ ఔల్స్ - తెలుగు సినిమా జియో సినిమా వన్ ఫ్రైడే నైట్ - హిందీ సినిమా అప్పత - తమిళ చిత్రం కాల్‌కూట్ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) సోనీ లివ్ ట్విస్టెడ్ మెటల్ - ఇంగ్లీష్ సిరీస్ మనోరమ మ్యాక్స్ కొళ్ల - మలయాళ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే) -
ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్
సోమవారం వచ్చిందంటే చాలు ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతారు. మూవీ లవర్స్ మాత్రం ఈ వారం కొత్త సినిమాలేం వస్తున్నాయి. వాటిని ఎప్పుడు చూసేయ్యాలా అని ప్లాన్ చేసుకుంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారం దాదాపు 17 మూవీస్ వరకు పలు ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. వాటిలో హిట్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసులు కూడా ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఈ మొత్తం లిస్ట్‌లో జనాలు ఎక్కువగా ఎదురుచూస్తున్నవి అయితే మాత్రం 'సామజవరగమన', 'నాయకుడు' (మామన్నన్) కోసమే. థియేటర్లలో రచ్చ లేపిన ఈ చిత్రాలు ఓటీటీల్లో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తాయో? (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్) ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ డ్రీమ్ (కొరియన్ సినిమా) - జూలై 25 నాయకుడు (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూలై 27 ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 27 హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 27 హిడ్డెన్ స్ట్రైక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 28 హౌ టూ బికమ్ ఏ కల్ట్ లీడర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 28 అమెజాన్ ప్రైమ్ రెజీనా (తెలుగు డబ్బింగ్ సినిమా) జూలై 25 ఆహా సామజవరగమన (తెలుగు సినిమా) - జూలై 28 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆషిఖానా (హిందీ సిరీస్) - జూలై 24 జియో సినిమా కాల్‌కూట్ (హిందీ మూవీ) - జూలై 27 వన్ ఫ్రైడే నైట్ (హిందీ సినిమా) - జూలై 28 అప్పత (తమిళ చిత్రం) - జూలై 29 సోనీ లివ్ ట్విస్టెడ్ మెటల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 28 ఈ-విన్ పోలీస్ స్టోరీ: కేస్ 1: నైట్ ఔల్స్ (తెలుగు సినిమా) - జూలై 28 బుక్ మై షో జస్టిస్ లీగ్: వార్ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 25 ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 26 ద ఫ్లాష్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 27 మనోరమ మ్యాక్స్ కొళ్ల (మలయాళ సినిమా) - జూలై 27 (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!) -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్‌హిట్ సినిమా!
ఆ సినిమా ఒరిజినల్ భాషలో సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. కోట్ల కలెక్షన్స్ తో బోలెడన్ని లాభాలు వచ్చాయి. దీంతో ఇతర భాషల్లోకి డబ్ చేశారు. తెలుగులోనూ గత శుక్రవారం థియేటర్లలో రిలీజ్ చేశారు. చూసినవాళ్లు బాగుందని మెచ్చుకున్నారు. కానీ ఏం లాభం, ఇప్పుడు సడన్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించి అందరికీ షాకిచ్చారు. తమిళంలో మరి సెల్వరాజ్ సినిమాలంటే యూనిక్‌గా ఉంటాయి. పెద్ద, చిన్న స్థాయి మనుషుల, వాళ్ల మధ్య జరిగే కథలతో సినిమాలు తీస్తుంటారు. ఆయన తీసిన 'పరియారుమ్ పెరుమాళ్', 'కర్ణన్' లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేశ్ లాంటి స్టార్స్ తీసిన చిత్రం 'మామన్నన్'. (ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'సలార్' మరో రికార్డ్) ప్రస్తుతం డీఎంకే మంత్రి ఉన్న ఉదయనిధి స్టాలిన్‌కు ఇది చివరి సినిమా కావడంతో రిలీజ్ కు ముందే అంచనాలు నెలకొన్నాయి. వాటిని 'మామన్నన్' పూర్తిస్థాయిలో అందుకుంది. సింపుల్ బడ్జెట్ తో తీస్తే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. దీంతో జూలై 14న తెలుగులో 'నాయకుడు' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు జూలై 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని ప్రకటించేశారు. ఇప్పటికే థియేటర్లలో చూసినవాళ్లు.. ఇది చూసి ఉసూరుమన్నారు. 'నాయకుడు' కథేంటి? కాశీపురం అనే ఊరికి తిమ్మరాజు(వడివేలు) ఎమ్మెల్యే. ఈయన వెనకబడిన వర్గానికి చెందినవాడు. అతడు కొడుకు రఘువీరా(ఉదయనిధి స్టాలిన్) మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా పనిచేస్తుంటాడు. పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) ఫ్రీగా కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో ఒకే పార్టీలో ఉన్న రత్నవేలుకు.. తిమ్మరాజు, రఘువీరా కలిసి ఎదురెళ్తారు. ఈ కులాల గొడవల కారణంగా తండ్రికొడుకులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేదే స్టోరీ. VADIVELU, UDHAYANIDHI, FAHADH, KEERTHY, MARI SELVARAJ AND AR RAHMAN TOGETHER!! We’re seeing stars🤩#Maamannan, coming to Netflix on the 27th of July!🍿#MaamannanOnNetflix pic.twitter.com/Fl8ulKvdID — Netflix India South (@Netflix_INSouth) July 18, 2023 (ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ హారర్ మూవీ.. నెలలోపే స్ట్రీమింగ్కు రెడీ) -
నా చివరి సినిమాని బలమైన కథతో చేయాలనుకున్నా!
‘‘నాయకుడు’ చాలా మంచి కథ, పొలిటికల్ డ్రామా, సామాజిక న్యాయం, ప్రజల మధ్య సమానత్వం గురించి ఈ మూవీలో చర్చించాం. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది’’ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘మామన్నన్’. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించి, నిర్మించారు. కీర్తీ సురేష్ హీరోయిన్. జూన్ 29న ఈ చిత్రం విడుదలైంది. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో ఏషియన్ మల్టీప్లెక్స్, సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్నాయి. నేడు ఈ మూవీ రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ–‘‘తెలుగులో నా గత చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈ సినిమాను తమిళంలో మాత్రమే విడుదల చేయాలనుకున్నాం. అయితే తమిళంలో మంచి వసూళ్లను సాధించడంతో ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నేను సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాక నా చివరి సినిమాని బలమైన కథతో మారి సెల్వరాజ్‌తో చేయాలనుకున్నాను’’ అన్నారు. -
సినిమా ఒప్పుకునేముందు ఆ మూడు చూస్తాను: ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్ దాదాపు 150 చిత్రాలకు పాటలు స్వర పరిచారు. ఆస్కార్ అవార్డు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అయితే ‘‘నేనింకా నేర్చుకునే దశలో ఉన్నాను. నా కెరీర్ ఇప్పుడే మొదలైనట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతీ పదేళ్లకు సంగీతంలో మార్పులొస్తున్నాయి’’ అన్నారు రెహమాన్. ఉదయనిధి స్టాలిన్, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన తమిళ ‘మామన్నన్’కి రెహమాన్ సంగీతం అందించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ... ► ఇటీవల పొన్నియిన్ సెల్వన్’లాంటి పీరియాడికల్ ఫిల్మ్‌కి సంగీతం అందించిన మీకు ‘నాయకుడు’లాంటి రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేయడం ఎలా అనిపిస్తుంటుంది? ‘నాయకుడు’ రాజకీయ నేపథ్యంలో రూపొందించిన సినిమా. సమాజంలోని అసమానతలతో పాటు చాలా విషయాల గురించి చర్చించారు. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం సవాల్ అని చెప్పలేను కానీ ఓ కొత్త అనుభూతి మాత్రం దక్కుతుంది. చాలా రోజుల తర్వాత నేను జానపద తరహా పాటలు ఇచ్చిన చిత్రమిది. ► మీరు ఒక సినిమా ఒప్పుకోడానికి కథ, హీరో, దర్శకుడు.. ఈ మూడింటిలో ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తారు? మూడూ ముఖ్యమే. మంచి కథ ఉంటే మంచి పాటలు ఇవ్వగలం. ఆ పాటలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాలి. హీరో చేసే మంచి పెర్ఫార్మెన్స్ని బట్టి ఆ పాట హైలైట్ అవుతుంది. ఇప్పుడు ‘నాయకుడు’ విషయానికి వస్తే.. హీరో ఉదయనిధి స్టాలిన్ ముందు నన్ను సంప్రదించారు. సంగీతం అందించాలని అడిగారు. ఆ తర్వాత నేను కథ విన్నాను.. ఆసక్తిగా అనిపించింది. దర్శకుడు మారీ సెల్వరాజ్ ఇప్పటివరకూ తీసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రకథ ఉంది. మారి ఈ కథకు చాలా మాస్ అప్పీల్ ఇచ్చారు. అందుకు తగ్గట్టు పాటలు ఇచ్చాను. ఈ సినిమాలో ప్రతి పాట కథను ముందుకు తీసుకుని వెళుతుంది. అందుకే మ్యూజిక్ ఇవ్వడాన్ని ఎంజాయ్ చేశా. ► అందుకేనా ఈ సినిమా ఫంక్షన్‌కి సంబంధించిన వేదికపై ‘జివ్వు జివ్వు...’ పాటకు డ్యాన్స్ కూడా చేశారు.. ఈ సాంగ్ సిట్యువేషన్ చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. అది మైండ్‌లో పెట్టుకోవడంతో పాటు ఫన్ టచ్ ఇవ్వాలనుకుని ట్యూన్ చేశా. ఫన్ కోసమే స్టేజి మీద డ్యాన్స్ కూడా చేశాను. ► సంగీతంలో మార్పులు వస్తున్నట్లే మీ ఆలోచనా విధానం కూడా మారుతోందా? ఎన్ని మార్పులు వచ్చినా మెలోడీ మారదు. లిరిక్ కూడా మారదు.. 30, 40 ఏళ్లుగా అదే. అయితే వైబ్రేషన్ కొంచెం మారుతుంది... బీట్ మారుతుంది. ‘రోజా’ నుంచి నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే. అదేంటంటే నా పాట సింపుల్‌గా, క్యాచీగా ఉండాలి. ప్రేక్షకుల్లో, సమాజంలో వచ్చిన మార్పు తాలూకు ప్రభావం సంగీతంపై ఉంటుంది. ఇప్పుడు సంగీతానికి ఇంకా స్కోప్ పెరిగింది. ► తెలుగులో బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్‌చరణ్ హీరోగా రూపొందనున్న చిత్రం గురించి? ఇది చాలా ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇప్పుడే రివీల్ చేయలేను. ► మీ అమ్మాయి ఖతీజా తమిళ చిత్రం ‘మిన్మిని’తో సంగీత దర్శకురాలిగా పరిచయం కానున్నారు... ఓ ఫాదర్‌గా మీ ఫీలింగ్? మహిళలు తాము అనుకున్నది సాధించాలనుకునే మైండ్ సెట్ నాది. మా ఇంట్లో మా అమ్మగారు, నా వైఫ్ వెరీ స్ట్రాంగ్. నా కూతురు ఖతీజా కూడా అంతే. ఏ మాత్రం టెన్షన్ పడటంలేదు. ట్యూన్స్ ఎలా ఇవ్వాలనే విషయంలో తనకు మెచ్యూర్టీ ఉంది. ఓ ఫాదర్‌గా ఐయామ్ హ్యాపీ. ► ‘గాంధీ టాక్స్’ అనే సైలెంట్ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడంపై మీ అనుభూతి గురించి? గతంలో ‘పుష్పక విమానం’లాంటి సైలెంట్ సినిమాలను అద్భుతంగా చేశారు. ఇప్పుడు నాకలాంటి మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి సినిమాలు సవాల్ అనాలి. అందుకే ఈ సినిమా డైరెక్టర్ కిశోర్‌తో ‘ఐ హేట్ యు.. లవ్ యు’ అని సరదాగా అన్నాను. డైలాగ్స్ లేకుండా సాగే ఈ సినిమాలోని సందర్భాలకు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడం అనేది నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. -
నాయకుడుతో...
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తీ సురేష్ లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం ‘మామన్నన్’. ‘పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్’ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా ఏషియన్ మల్టీప్లెక్స్– సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ‘‘పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
ఆకలి రోజుల్లో ఆపద్బాంధవుడు నాయకుడు
కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు– ఎంత మంచి కారణానికి పట్టినా.భారత దేశంలో కన్సిస్టెంట్గా ఉన్న ఒకే ఒక్క విషయం– ఆకలి. స్వాతంత్య్రం వచ్చాక ఇరవై, ముప్పై ఏళ్లకు జనాభా పెరిగిందని అందరూ అన్నారు కానీ పెరిగింది జనాభా కాదు ఆకలి. పేదరికం. సంపద అతి స్వల్పమంది చేతుల్లోకి వెళ్లిపోయింది. ఉపాధి అత్యల్పం అయిపోయింది. కనుక పని దొరకని వాళ్లంతా పెరిగిపోయిన జనాభా కింద జమ కట్టబడ్డారు. ఈ సమస్య గురించి పాలకులకు శ్రద్ధ లేదు... ఒక వేళ ఏం చేయాలనుకున్నా ఇంత పెద్ద దేశంలో ఏ పనీ తొందరగా తెమలదు. వ్యవస్థ విఫలమైన చోట సమాంతరమైన వ్యవస్థ ప్రాణం పోసుకుంటుంది. డబ్బు ఎక్కువ ఉన్న చోట దీనికి తేజం ఎక్కువ. ‘ఆర్థిక రాజధాని’ బొంబాయిలో అండర్ వరల్డ్ పురుడు పోసుకోవడానికి కారణం అదే. అందరు పేదవాళ్లు ఊరికే ఉండరు. ఆకలేసిన వాళ్లందరూ కడుపుకు తడిబట్ట చుట్టుకుని పడుకోరు. ఒకడు తెగిస్తాడు. వాడు తన అవసరాల కోసమో, అవసరమైన జనం కోసమో, నిజంగా తన మనుషులు అనే భావం వల్లో కొందరికి సాయం చేస్తాడు.అలాంటి వాడు బయటి సమాజానికి ఎలా కనిపించినా తన సమాజానికి నాయకుడిలా కనిపిస్తాడు. ఈ సినిమాలో కమలహాసన్ అలాంటి నాయకుడే. ఖద్దరు పంచె, తెల్ల చొక్కా ధరించిన రాబిన్‌హుడ్. పేదలకు పెద్ద దిక్కు. తండ్రిది మద్రాసు. యూనియన్ లీడర్. కాని ప్రభుత్వం అతణ్ణి కాల్చి పారేసింది. ఆ తండ్రి లక్షణం, తిరగబడే స్వభావం ఉన్న కమలహాసన్ బొంబాయి పారిపోతాడు. అలా పారిపోయినవాళ్లు ఎక్కడకు చేరతారు? ఆసియాలోనే అతి పెద్ద మురికివాడైన ధార్వికి చేరుతారు. కమలహాసన్ అక్కడ ఒక ముస్లిం ఇంటిలో నీడ పొందుతాడు. అక్కడే పెరుగుతాడు. ‘అటు సరుకు ఇటు చేర్చడం’ అనే విద్య ఊపిరి పోసుకుంటున్న ఆ రోజుల్లో అందులో దిగుతాడు. సముద్రం చాలా అఘాతాలతో మాత్రమే కాదు నేరాలతో కూడా నిండి ఉంటుంది. ముంబై తీరం తన గర్భంలో ఎన్నో నేరాలను దాచుకుని ఉంటుంది. కమల హాసన్ ఆ నేర ప్రపంచంలోకి అడుగు పెడతాడు. సినిమా ప్రారంభంలోనే దర్శకుడు ఒక ప్రశ్నను అడిగిస్తాడు –‘ఈ పని మంచిదా... చెడ్డదా’. దానికి జవాబు దర్శకుడే చెప్పిస్తాడు –‘నలుగురికి మేలు చేసే పని మంచిదే’. ఈ స్పష్టత ఇచ్చాక కమలహాసన్ మురికివాడ ప్రజల కోసం ఏదో ఒక తెగింపు చేస్తూనే ఉంటాడు. అందులో ఒకటి– వీరోచిత ప్రతీకారంతో నిండినది– తమను పీడిస్తున్న ఇన్స్పెక్టర్ని చంపడం. తన ప్రాంతాన్ని కబ్జా చేయాలనుకున్న సేట్ని తన్ని తగలేయడం. ఆడవాళ్లకు రక్షణ ఇవ్వడం. సాయం కోరి వచ్చే వాళ్లకు సాయం చేయడం. గణేశ్ మండపాల్లో వినాయక చవితినాడు చేతికి అందిన నోట్లను జనం మీదకు విసరడం. కమల్ ఇప్పుడు నాయకుడు. ముఖ్యంగా ఊరుగాని ఊరులో, దక్షిణాది వారని మూలకు నెట్టివేయబడ్డ తమిళులలో వారి సమస్యలు తీర్చే ఆపద్బాంధవుడు. వాళ్లు తమకు ఏ కష్టం వచ్చినా వ్యవస్థను ఆశ్రయించరు. ఈ సమాంతర వ్యవస్థనే ఆశ్రయిస్తారు. తక్షణమే జవాబు దొరికే దర్బారు అది. కాని కింద నీటిలో ఉండే చేప అక్కడక్కడే తిరుగాడాలి. పై నీటికి ఎగబాకితే అక్కడ మొసళ్లుంటాయి. షార్క్‌లు కాచుకుని ఉంటాయి. బస్తీ స్థాయి నాయకుడి నుంచి కమలహాసన్ ఇంకా ఎదుగుదామని చూస్తాడు. షిప్‌యార్డ్ మీద జెండా ఎగరేయాలని చూస్తాడు. కాని అప్పటికే అక్కడ పాతుకుపోయి ఉన్నవారు తన ప్రయోజనాలకు అడ్డు తగిలితే ఊరుకుంటారా?కమలహాసన్ భార్య తుపాకీ బుల్లెట్లు దిగబడి మరణిస్తుంది.అంతేనా?ఇలాంటి పనుల వల్లే చెట్టంత కొడుకు మరణిస్తాడు.సొంత మనుషులు పోయినప్పుడు ప్రాణంలా చూసుకునే జనం ప్రాణం పోస్తారు. కమలహాసన్ తట్టుకుని నిలబడగలడు. కాని అతని కూతురు? ఆమె తండ్రిని అసహ్యించుకుంటుంది. ఈ పనులు మానేయమంటుంది. చివరకు అతణ్ణే విడిచిపెట్టి వెళ్లిపోతుంది.చుక్కానిని పారేసి ఓడ ఎక్కిన మనిషి గమ్యం లేని ఏదో ఒక వడ్డుకు చేరుకోవాలిగాని ఎక్కిన తీరానికి కాదు. ఇప్పుడు కమలహాసన్ చేస్తున్నది పులి మీద సవారి. దిగలేడు. వెనక్కి రాలేడు.అప్పటికే అతడి నేర ప్రపంచం పెద్దదైపోయింది. పెద్దవాడైపోయాడు.కాని వ్యవస్థ కూడా చాలా గమ్మత్తుది. అది తనకు ప్రయోజనాలు నెరవేరే వరకూ సమాంతర వ్యవస్థలను అంగీకరిస్తుంది. తనను కూడా దాటేస్తే.. తన చేతుల్లో లేనంత స్థాయికి చేరుకుంటే అప్పుడు బూజు పట్టిన తుపాకీని తళతళ మెరిపిస్తుంది. ఇప్పుడు కమలహాసన్ మీద ఒక పోలీసు ఆఫీసరు పులిలా వచ్చి పడతాడు. అతడి మనుషులను లోపలేస్తాడు. వ్యాపారాలు బంద్ చేయిస్తాడు. కమల హాసన్‌ను వెంటాడతాడు. చివరకు కమలహాసన్ లొంగిపోతాడు. కాని ఇలాంటి మనిషికి వ్యతిరేకంగా సాక్ష్యం ఉంటుందా?ఏమీ ఉండదు.కమలహాసన్ కోర్టు నుంచి నిర్దోషిగా బయటపడ తాడు.ఇది ప్రకృతి అంగీకరించని నియమం. కత్తి పట్టినవాడు కత్తితోనే పోవాలి. కథ సుఖాంతమైన కమలహాసన్ ఏ ఇన్స్పెక్టర్నైతే తాను చంపాడో ఆ ఇన్స్పెక్టర్ కొడుకు చేతిలోనే హతమవుతాడు.కథ ముగుస్తుంది.ఎలాంటి కథ ఇది? ఎంత రోమాంచితమైనది. జీవితంలోని సకల ఆటుపోట్లను చూసినది. ఒక మనిషి తెగబడి చూడగలిగిన జీవితాన్నంతా చూపించగలిగినది.ఇది కొందరి జీవితం.ఎంతో మందికి పనికి వచ్చిన కొందరి జీవితం.కాని వ్యవస్థను దాటిన జీవితం ఇల్లాగే ముగుస్తుంది.ఇవాళ దేశం అభివృద్ధి చెందింది. ఉపాధి పెరిగింది. ఆకలి అలాగే ఉంది. సముద్రం ఒడ్డున లైట్‌హౌస్ వ్యవస్థ అంగీకారం కలిగిన మార్గాన్ని చూపిస్తుంటుంది.కాని ఈ ఆకలి నశించకపోతే ఇదిగో ఇవాళ, రేపు కూడా ఒక దివిటీ నేరానికి దారి చూపిస్తూనే ఉంటుంది. ఒక కాలంలో వెలిగి ఆరిపోయిన దివిటీ కథ– ఈ కథ– నాయకుడు. నాయకన్ 1987లో మణిరత్నం తీసిన క్లాసిక్ ‘నాయకన్’. తెలుగులో ‘నాయకుడు’గా విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఒక స్ట్రయిట్ ఫిల్మ్ చూసిన అనుభూతి కలగడానికి కారణం స్రవంతి మూవీస్ వారు పెట్టిన శ్రద్ధ కావచ్చు. రాజశ్రీ ప్రతిభ కావచ్చు. అన్నింటికి మించి మొదటి ప్రశంస చేయాల్సింది ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంనే. కమల్‌కు ఆయన చెప్పిన డబ్బింగ్ ఎంతో ప్రతిభావంతమైనది. డబ్బింగ్ ఆర్టిస్టులకు ఈ ఒక్క సినిమాలో ఎస్.పి చూపిన వేరియేషన్సే పెద్ద పాఠాలు. ఇది ముంబైలో స్థిరపడ్డ తమిళ అండర్ వరల్డ్ డాన్ ‘వరదరాజ ముదలియార్’ జీవితం ఆధారంగా తయారైంది. సినిమా చూసిన వరద రాజ ‘మరీ అంత మంచివాణ్ణి కానులే’ అని మణిరత్నంతో చిన్న చిర్నవు నవ్వాడట. డాన్ జీవితాన్ని, హింసను గ్లోరిఫై చేసిందనే విమర్శ ఈ సినిమా ఎదుర్కొన్నా జనం పట్టించుకోలేదు. ‘గాడ్‌ఫాదర్’ ప్రభావం దీని మీద ఉన్నా మణిరత్నం అదేం లేదని అంటాడు. ఇందులోని చాలా సన్నివేశాలు కాలానికంటే ముందే తీసినవి. పిసి శ్రీరామ్ పనితనం గమనించి చూడాలి తప్ప చెప్పలేం. ఇందులోని కొన్ని షాట్స్‌ను పోలినవి ‘శివ’లో చూస్తాం. శరణ్యకు ఇది తొలి సినిమా. ఇళయరాజా చేసిన ఆర్.ఆర్, పాటలూ గొప్పవి. ఇందులో ‘నీ గూడు చెదిరింది’... ఇప్పటికీ కామెడీ సన్నివేశాల్లో ఉపయోగిస్తుంటారు. కమలహాసన్‌కు ఈ సినిమా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తెచ్చింది. కొడుకు చచ్చిపోయినప్పుడు కమల్ ఏడ్చే సన్నివేశం గొప్ప నటనగా చెప్పుకున్నారు. ఇలాంటి సినిమాలో నటించాలన్న రజనీకాంత్ తపన చాలా ఏళ్లకు ‘కబాలి’తో గాని తీరలేదు. -
మరోసారి థ్రిల్లర్ మూవీలో శర్వానంద్..!
కొత్త కథలతో వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో శర్వానంద్ మరో డిఫరెంట్ సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా సీరియస్, థ్రిల్లర్ సినిమాలు మాత్రమే చేసిన శర్వానంద్, ప్రస్తుతం కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో అలరిస్తున్నాడు. అయితే మరోసారి థ్రిల్లర్ సినిమాకు ఓకె చెప్పాడట ఈ యంగ్ హీరో. స్వామి రారా, కేశల లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. కమల్ హాసన్ నాయకుడు తరహా కథతో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ వయసైన పాత్రలో కూడా కనిపించనున్నాడట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మహానుభావుడు పూర్తయిన తరువాత సుధీర్ వర్మ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. -
నాయకుడు 25th Aug 2013
-
నాయకుడు