Udhayanidhi Stalin Maamannan OTT Release Date Out Now - Sakshi
Sakshi News home page

Maamannan In OTT: మొన్ననే రిలీజ్.. వెంటనే ఓటీటీలోకి!

Published Tue, Jul 18 2023 2:23 PM | Last Updated on Tue, Jul 18 2023 2:45 PM

Maamannan OTT Release Date Udhayanidhi Stalin - Sakshi

ఆ సినిమా ఒరిజినల్ భాషలో సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. కోట్ల కలెక్షన్స్ తో బోలెడన్ని లాభాలు వచ్చాయి. దీంతో ఇతర భాషల్లోకి డబ్ చేశారు. తెలుగులోనూ గత శుక్రవారం థియేటర్లలో రిలీజ్ చేశారు. చూసినవాళ్లు బాగుందని మెచ్చుకున్నారు. కానీ ఏం లాభం, ఇప్పుడు సడన్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించి అందరికీ షాకిచ్చారు. 

తమిళంలో మరి సెల్వరాజ్ సినిమాలంటే యూనిక్‌గా ఉంటాయి. పెద్ద, చిన్న స‍్థాయి మనుషుల, వాళ్ల మధ్య జరిగే కథలతో సినిమాలు తీస్తుంటారు. ఆయన తీసిన 'పరియారుమ్ పెరుమాళ్', 'కర్ణన్' లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేశ్ లాంటి స్టార్స్ తీసిన చిత్రం 'మామన్నన్'.

(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'సలార్' మరో రికార్డ్)

ప్రస్తుతం డీఎంకే మంత్రి ఉన్న ఉదయనిధి స్టాలిన్‌కు ఇది చివరి సినిమా కావడంతో రిలీజ్ కు ముందే అంచనాలు నెలకొన్నాయి. వాటిని 'మామన్నన్' పూర్తిస్థాయిలో అందుకుంది. సింపుల్ బడ్జెట్ తో తీస్తే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. దీంతో జూలై 14న తెలుగులో 'నాయకుడు' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు జూలై 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని ప్రకటించేశారు. ఇప్పటికే థియేటర్లలో చూసినవాళ్లు.. ఇది చూసి ఉసూరుమన్నారు.

'నాయకుడు' కథేంటి?

కాశీపురం అనే ఊరికి తిమ‍్మరాజు(వడివేలు) ఎమ్మెల్యే. ఈయన వెనకబడిన వర్గానికి చెందినవాడు. అతడు కొడుకు రఘువీరా(ఉదయనిధి స్టాలిన్) మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా పనిచేస్తుంటాడు. పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) ఫ్రీగా కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో ఒకే పార్టీలో ఉన్న రత్నవేలుకు.. తిమ్మరాజు, రఘువీరా కలిసి ఎదురెళ్తారు. ఈ కులాల గొడవల కారణంగా తండ్రికొడుకులు ఎలాంటి ఇబ‍్బందులు పడ్డారనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ హారర్ మూవీ.. నెలలోపే స్ట్రీమింగ్‌కు రెడీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement