Maamannan Movie
-
దర్శకుడి ప్రేమలో డబ్బింగ్ ఆర్టిస్ట్.. ఫోటో వైరల్
సౌత్ ఇండియన్ యాక్టర్, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి ప్రేమ పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆర్టిస్ట్ తన సోషల్ మీడియా పేజీలో ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం సినిమాలకు ఆమె వాయిస్ ఇచ్చింది. అయితే, మలయాళ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు ఆమె ప్రకటించింది. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు పేర్కొంది. తెలుగులో ఓకే బంగారం, ప్రేమమ్, 2.0, నవాబ్ వంటి సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది.చెన్నైకి చెందిన రవీనా రవి మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాల్లో కూడా నటించింది. జవాన్ సినిమాలో దీపికా పదుకోన్‌కు తెలుగు వాయిస్ అందించింది. లవ్ టుడే, మామన్నన్ వంటి సినిమాల్లో కీలకమైన పాత్రలలో మెరిసింది. నయనతార, త్రిష,నిధి అగర్వాల్.మాళవిక మోహన్,శ్రీనిధి శెట్టి, అమలా పాల్,రాశీ ఖన్నా,కాజల్ అగర్వాల్, సమంత వంటి స్టార్ హీరోయిన్లకు వివిధ భాషలలో డబ్బింగ్ చెప్పింది. అయితే, 'వాలట్టి' అనే మలయాళ సినిమాతో పాపులర్ అయిన దర్శకుడు దేవన్ జయకుమార్తో ఆమె ప్రేమలో ఉంది. త్వరలో పెళ్లి చేసుకున్నట్లు ఒక ఫోటోను కూడా పంచుకుంది. తన అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలో పెళ్లి తేదీని కూడా ఈ జోడీ ప్రకటించనుంది. View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) -
ఉదయనిధి స్టాలిన్ రూ. 25 కోట్లు చెల్లించాల్సిందే.. కోర్టుకెళ్లిన నిర్మాత
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తమకు రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని చిత్ర నిర్మాత కోర్టుకు వెళ్లారు. ఒకప్పుడు పాపులర్ హీరోగా కోలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించిన ఆయన గతేడాదిలో 'మామన్నన్' సినిమానే తన చివరి ప్రాజెక్ట్ అని ప్రకటించారు. ఆ తర్వాత తమిళనాడు పాలిటిక్స్‌లో ఆయన బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ అప్పటికే ఒప్పుకున్న ఒక సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆయన నష్టపరిహారం కట్టించాలని ఆ చిత్ర నిర్మాత రామశరవణన్ కోర్టుకు వెళ్లారు.'మామన్నన్' సినిమా కంటే ముందే 'ఏంజెల్' అనే చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, ఆనంది కథానాయికలు. 2018లో ప్రారంభమైన ఈ మూవీని కేఎస్.అదయమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది. మరో 20 శాతం చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఈ సినిమా కోసం నిర్మాత రూ.13 కోట్లకు పైగా ఖర్చు పెట్టాడని తెలుస్తోంది. అయితే.. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల పాటు ఆలస్యం అయ్యింది. ఇంతలో 'మామన్నన్' తన చివరి చిత్రమని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. దీంతో తను భారీగా నష్టపోయానని అందుకుగాను తనకు నష్టపరిహారంగా రూ. 25 కోట్లు ఉదయనిధి స్టాలిన్ చెల్లించేలా కోర్టు ఆదేశించాలని పిటీషన్లో నిర్మాత రామశరవణన్ పేర్కొన్నారు.ఏంజెల్ చిత్ర నిర్మాత వేసిన పిటీషన్‌ను కొట్టివేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తరపున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో జస్టిస్ డీకారామన్ ముందుకు తాజాగా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. మొదట నిర్మాత తరపున న్యాయవాది తియాగేశ్వరన్ వాదనలు వినిపిస్తూ.. 'ఏంజెల్' చిత్రానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ఎనిమిది రోజులు షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన సహకరించకపోవడం వల్ల సినిమా ఆగిపోయిందన్నారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థకు భారీగా నష్టం వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఉదయనిధి స్టాలిన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇళంగో మాట్లాడుతూ.. ఏంజెల్ చిత్రానికి సంబంధించి ఉదయనిధి పలుమార్లు చిత నిర్మాతను సంప్రదించారని, సినిమాలో తన సన్నివేశాలు పూర్తి అయ్యాయని చెప్పిన తర్వాతే మామన్నన్‌లో నటించారని తెలిపారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి డీకారామన్.. అక్టోబర్ 28న తుది తీర్పు వెళ్లడిస్తామని ప్రకటించారు. -
అనుమానస్పదంగా 'మామన్నన్' అసిస్టెంట్ డైరెక్టర్ మృతి
కోలీవుడ్ చిత్రపరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ మరి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువ డైరెక్టర్ మృతి చెందాడు. పరియేరుం పెరుమళ, కర్ణన్, మమన్నన్ వంటి మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి తమిళ చిత్రసీమలోని ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయాడు మరి సెల్వరాజ్. ఈ సినిమాల అన్నింటికి ఆయన వద్ద మారిముత్తు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ సినిమాల విజయాల వెనుక మారిముత్తు పాత్ర చాలా ఎక్కువగానే ఉందని బహిరంగంగానే మరి సెల్వరాజ్ అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న మారిముత్తు కేవలం 30 ఏళ్ల వయసులోనే మరణించడం చాలా బాధాకరం. (ఇదీ చదవండి: ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి ఫిక్స్..!) ఊపిరాడకనే మరిముత్తు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. తూత్తుకుడి జిల్లా శ్రీవైకుండం సమీపంలోని తిరుపుళియంగుడి అనే మారు మూల గ్రామానికి చెందిన మారిముత్తుకు సినిమాల్లో దర్శకుడవ్వాలనే కోరికతో చెన్నైకి వచ్చాడు. మూడు హిట్ సినిమాలకు మరి సెల్వరాజ్ వద్ద ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో తనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించేందుకు కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మారిముత్తుకు శామ్యూల్ అనే 5 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. మారిముత్తుకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. భోజనం తర్వాత సిగరెట్ తాగుతుండగా ఒక్కసారిగా దగ్గు రావడం ఆపై ఊపిరాడటం లేదని చెప్పడంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మారిముత్తు అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మామన్నన్ విజయంతో స్టాలిన్ చేతుల మీదుగా మరిముత్తు అవార్డును ఉదయనిధి అందుకోవడం గమనార్హం. -
Maamannan: ఉదయనిధి స్టాలిన్ ‘మామన్నన్’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
జైలర్‌లో టాలీవుడ్‌కు చెందిన లెజండరీ పర్సన్ వారసుడిని గుర్తించారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో నటించిన కొంతమంది నటీనటులకు పరిమిత స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు. అలాంటి వారిలో నటుడు సునీల్ రెడ్డి కూడా ఉన్నారు. జైలర్ సినిమా ద్వితీయార్ధంలో కామెడీ ట్రాక్‌లో అతను తమన్నా లవర్‌గా, సినిమా డైరెక్టర్ బాగున్నారా బాలు పాత్రలో కనిపిస్తాడు. ఇప్పుడు అంతటా అతని గురించే చర్చ జరుగుతుంది. ఇంతకు అతను ఎవరో కాదు.. టాలీవుడ్‌కు చెందిన లెజెండరీ ఫిల్మ్ మేకర్ కోదండ రామిరెడ్డి పెద్ద కుమారుడు. ముఖ్యంగా ఆయన మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించారు. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) ఇకపోతే జైలర్‌లో సునీల్ రెడ్డి పాత్ర ఎక్కడొస్తుందటే.. తెలుగు ప్రముఖ నటుడు అయిన సునీల్, తమన్నా పాత్రల మధ్య సునీల్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. సునీల్ ఇస్తున్న గిఫ్ట్‌లను తీసుకుని తమన్నాకు ఇస్తుంటాడు. సునీల్, తమన్నా మధ్య జరిగే సీన్లలో సునీల్ రెడ్డి మెప్పిస్తాడు. సునీల్లాగే విగ్‌తో సహా కామెడీ ఎలిమెంట్స్‌ని వివిధ సన్నివేశాల్లో అతను అలరించాడు. ఈ మధ్యే విడుదలైన మామన్నన్ సినిమాలో కూడా ఫహాద్ ఫాజిల్‌కు అన్నయ్య పాత్రలో కాలేజీ యజమానిగా మెప్పించాడు. (ఇదీ చదవండి: శ్రీహరి చనిపోయాక మమ్మల్ని మోసం చేశారు.. ఆర్థికంగా అన్నీ కోల్పోయాం: డిస్కో శాంతి) సునీల్ రెడ్డి తమ్ముడు వైభవ్ రెడ్డి కూడా తమిళ చిత్రాల్లో హీరోగా నటించారు. తెలుగు ఇండస్ట్రీలో మొదట 'గొడవ' అనే సనిమా తీసినా.. ఇక్కడ కాంపీటేషన్ ఎక్కువ కావడంతో వైభవ్ తమిళ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. తన సోదరుడి అడుగుజాడల్లో, సునీల్ రెడ్డి సినీ ప్రపంచంలోకి ప్రవేశించాడు, ప్రధానంగా హాస్య పాత్రలతో ఆయన అక్కడ పేరుగాంచాడు. సునీల్ రెడ్డి ఇప్పటి వరకు మాస్టర్, బీస్ట్, డాక్టర్, మామన్నన్ వంటి భారీ చిత్రాల్లో నటించారు. డాక్టర్ చిత్రంలో సునీల్ రెడ్డి నటనకు ఫిదా అయిన నెల్సన్ జైలర్‌లో మరో అవకాశం ఇచ్చాడు. అలా తమిళనాట సునీల్ రెడ్డి కూడా ట్రెండింగ్ నటుల జాబితాలో చేరిపోయాడు. -
వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు: సినీ నటి
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన వడివేలు మామన్నన్ చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో అతని నటన చాలా అద్భుతంగా ఉంటుందనడంలో ఎంలాంటి సందేహం ఉండదు. తాజాగా పలువురు నటీనటులు ఆయనపై పలు ఆరోపణలు చేస్తుంటే నటి షకీలా మాత్రం ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి బహిరంగంగానే మాట్లాడింది. (ఇదీ చదవండి: భార్య వల్లే హీరో ప్రశాంత్ కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో) 90వ దశకంలో హాట్ నటిగా వెలుగొందిన నటి షకీలా తమిళంలోనే కాకుండా పలు భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. గ్లామర్ చిత్రాల్లోనే నటించే షకీలా.. ఇప్పుడు కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లో తనదైన నటనను ప్రదర్శిస్తోంది. తమిళ్ విజయ్ టీవీలో 'కుక్ విత్ కోమలి' షో తర్వాత షకీలా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ కోసం నటీనటులను ఇంటర్వ్యూ చేస్తోంది. అందులో భాగంగానే తమిళ నటి అయిన ప్రేమ ప్రియను కూడా షకీలా ఇంటర్వ్యూ చేసింది వడివేలు గురించి ప్రేమ ప్రియ కామెంట్ నా సినిమా కెరీయర్ ప్రారంభంలో వడివేలు, వివేక్, సంతానం వంటి హాస్య నటులతో చిన్న చిన్న పాత్రల్లో నటించాను. నాకు అప్పట్లో మంచి అవకాశాలే వచ్చేవి. ఇండస్ట్రీలో నా ఎదుగుదలకు వడివేలు అడ్డుకట్ట వేశారు. సినిమాల్లో నటించే అవకాశాలు చాలా వచ్చాయి. కానీ ఆయన వల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఒక్కోసారి ఏదోరకంగా అవకాశం వచ్చింది కదా అని నేను షూటింగ్‌కు వెళ్తాను.. కానీ వడివేలు నన్ను చూడగానే ఈ అమ్మాయి వద్దని అక్కడి మూవీ మేకర్స్‌తో చెప్పించి వెనక్కి పంపేవారు. ఇలా చాలా సినిమాల్లో ఇదే జరిగింది.' అని ప్రేమ ప్రియ తెలిపింది. బెదిరించారు ఒక దర్శకుడు నన్ను ఫోన్లో బెదిరించాడు. నేను యూట్యూబ్ ఛానెల్లో వడివేలు గురించి చెప్పిన మాటల్లో నిజం లేదని తిరిగి తెలపాలని ఒకరు వార్నింగ్ ఇచ్చారు. అందుకు నేను బయపడలేదు. వడివేలు గురించి ఏదైతే నిజమో అదే చెప్పాను. 2010లో వచ్చిన విజయ్ 'సురా' సినిమాలో వడివేలుతో కలిసి నటించినప్పుడు కూడా ఆయన నో చెప్పారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. కారణం ఏంటో చెప్పరు.' అని ప్రేమ ప్రియ తెలిపింది. వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు వడివేలుపై మీ-టూ ఫిర్యాదు చేసి ఉండవచ్చు కదా అని షకీలా ప్రశ్నించింది. అందుకు సమాధానంగా వడివేల్కి, తనకు మీ టూ సమస్య లేదని, అది వేరే సమస్య అని ప్రేమ ప్రియ చెప్పింది. అయితే వడివేలు తనకు బాగా తెలుసని షకీలా పేర్కొంది. షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటాడో, ఏం అడుగుతాడో తనకు బాగా తెలుసని నటి షకీలా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్‌హిట్ సినిమా!
ఆ సినిమా ఒరిజినల్ భాషలో సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. కోట్ల కలెక్షన్స్ తో బోలెడన్ని లాభాలు వచ్చాయి. దీంతో ఇతర భాషల్లోకి డబ్ చేశారు. తెలుగులోనూ గత శుక్రవారం థియేటర్లలో రిలీజ్ చేశారు. చూసినవాళ్లు బాగుందని మెచ్చుకున్నారు. కానీ ఏం లాభం, ఇప్పుడు సడన్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించి అందరికీ షాకిచ్చారు. తమిళంలో మరి సెల్వరాజ్ సినిమాలంటే యూనిక్‌గా ఉంటాయి. పెద్ద, చిన్న స్థాయి మనుషుల, వాళ్ల మధ్య జరిగే కథలతో సినిమాలు తీస్తుంటారు. ఆయన తీసిన 'పరియారుమ్ పెరుమాళ్', 'కర్ణన్' లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేశ్ లాంటి స్టార్స్ తీసిన చిత్రం 'మామన్నన్'. (ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'సలార్' మరో రికార్డ్) ప్రస్తుతం డీఎంకే మంత్రి ఉన్న ఉదయనిధి స్టాలిన్‌కు ఇది చివరి సినిమా కావడంతో రిలీజ్ కు ముందే అంచనాలు నెలకొన్నాయి. వాటిని 'మామన్నన్' పూర్తిస్థాయిలో అందుకుంది. సింపుల్ బడ్జెట్ తో తీస్తే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. దీంతో జూలై 14న తెలుగులో 'నాయకుడు' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు జూలై 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని ప్రకటించేశారు. ఇప్పటికే థియేటర్లలో చూసినవాళ్లు.. ఇది చూసి ఉసూరుమన్నారు. 'నాయకుడు' కథేంటి? కాశీపురం అనే ఊరికి తిమ్మరాజు(వడివేలు) ఎమ్మెల్యే. ఈయన వెనకబడిన వర్గానికి చెందినవాడు. అతడు కొడుకు రఘువీరా(ఉదయనిధి స్టాలిన్) మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా పనిచేస్తుంటాడు. పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) ఫ్రీగా కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో ఒకే పార్టీలో ఉన్న రత్నవేలుకు.. తిమ్మరాజు, రఘువీరా కలిసి ఎదురెళ్తారు. ఈ కులాల గొడవల కారణంగా తండ్రికొడుకులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేదే స్టోరీ. VADIVELU, UDHAYANIDHI, FAHADH, KEERTHY, MARI SELVARAJ AND AR RAHMAN TOGETHER!! We’re seeing stars🤩#Maamannan, coming to Netflix on the 27th of July!🍿#MaamannanOnNetflix pic.twitter.com/Fl8ulKvdID — Netflix India South (@Netflix_INSouth) July 18, 2023 (ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ హారర్ మూవీ.. నెలలోపే స్ట్రీమింగ్కు రెడీ) -
సినిమా ఒప్పుకునేముందు ఆ మూడు చూస్తాను: ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్ దాదాపు 150 చిత్రాలకు పాటలు స్వర పరిచారు. ఆస్కార్ అవార్డు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అయితే ‘‘నేనింకా నేర్చుకునే దశలో ఉన్నాను. నా కెరీర్ ఇప్పుడే మొదలైనట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతీ పదేళ్లకు సంగీతంలో మార్పులొస్తున్నాయి’’ అన్నారు రెహమాన్. ఉదయనిధి స్టాలిన్, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన తమిళ ‘మామన్నన్’కి రెహమాన్ సంగీతం అందించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ... ► ఇటీవల పొన్నియిన్ సెల్వన్’లాంటి పీరియాడికల్ ఫిల్మ్‌కి సంగీతం అందించిన మీకు ‘నాయకుడు’లాంటి రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేయడం ఎలా అనిపిస్తుంటుంది? ‘నాయకుడు’ రాజకీయ నేపథ్యంలో రూపొందించిన సినిమా. సమాజంలోని అసమానతలతో పాటు చాలా విషయాల గురించి చర్చించారు. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం సవాల్ అని చెప్పలేను కానీ ఓ కొత్త అనుభూతి మాత్రం దక్కుతుంది. చాలా రోజుల తర్వాత నేను జానపద తరహా పాటలు ఇచ్చిన చిత్రమిది. ► మీరు ఒక సినిమా ఒప్పుకోడానికి కథ, హీరో, దర్శకుడు.. ఈ మూడింటిలో ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తారు? మూడూ ముఖ్యమే. మంచి కథ ఉంటే మంచి పాటలు ఇవ్వగలం. ఆ పాటలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాలి. హీరో చేసే మంచి పెర్ఫార్మెన్స్ని బట్టి ఆ పాట హైలైట్ అవుతుంది. ఇప్పుడు ‘నాయకుడు’ విషయానికి వస్తే.. హీరో ఉదయనిధి స్టాలిన్ ముందు నన్ను సంప్రదించారు. సంగీతం అందించాలని అడిగారు. ఆ తర్వాత నేను కథ విన్నాను.. ఆసక్తిగా అనిపించింది. దర్శకుడు మారీ సెల్వరాజ్ ఇప్పటివరకూ తీసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రకథ ఉంది. మారి ఈ కథకు చాలా మాస్ అప్పీల్ ఇచ్చారు. అందుకు తగ్గట్టు పాటలు ఇచ్చాను. ఈ సినిమాలో ప్రతి పాట కథను ముందుకు తీసుకుని వెళుతుంది. అందుకే మ్యూజిక్ ఇవ్వడాన్ని ఎంజాయ్ చేశా. ► అందుకేనా ఈ సినిమా ఫంక్షన్‌కి సంబంధించిన వేదికపై ‘జివ్వు జివ్వు...’ పాటకు డ్యాన్స్ కూడా చేశారు.. ఈ సాంగ్ సిట్యువేషన్ చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. అది మైండ్‌లో పెట్టుకోవడంతో పాటు ఫన్ టచ్ ఇవ్వాలనుకుని ట్యూన్ చేశా. ఫన్ కోసమే స్టేజి మీద డ్యాన్స్ కూడా చేశాను. ► సంగీతంలో మార్పులు వస్తున్నట్లే మీ ఆలోచనా విధానం కూడా మారుతోందా? ఎన్ని మార్పులు వచ్చినా మెలోడీ మారదు. లిరిక్ కూడా మారదు.. 30, 40 ఏళ్లుగా అదే. అయితే వైబ్రేషన్ కొంచెం మారుతుంది... బీట్ మారుతుంది. ‘రోజా’ నుంచి నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే. అదేంటంటే నా పాట సింపుల్‌గా, క్యాచీగా ఉండాలి. ప్రేక్షకుల్లో, సమాజంలో వచ్చిన మార్పు తాలూకు ప్రభావం సంగీతంపై ఉంటుంది. ఇప్పుడు సంగీతానికి ఇంకా స్కోప్ పెరిగింది. ► తెలుగులో బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్‌చరణ్ హీరోగా రూపొందనున్న చిత్రం గురించి? ఇది చాలా ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇప్పుడే రివీల్ చేయలేను. ► మీ అమ్మాయి ఖతీజా తమిళ చిత్రం ‘మిన్మిని’తో సంగీత దర్శకురాలిగా పరిచయం కానున్నారు... ఓ ఫాదర్‌గా మీ ఫీలింగ్? మహిళలు తాము అనుకున్నది సాధించాలనుకునే మైండ్ సెట్ నాది. మా ఇంట్లో మా అమ్మగారు, నా వైఫ్ వెరీ స్ట్రాంగ్. నా కూతురు ఖతీజా కూడా అంతే. ఏ మాత్రం టెన్షన్ పడటంలేదు. ట్యూన్స్ ఎలా ఇవ్వాలనే విషయంలో తనకు మెచ్యూర్టీ ఉంది. ఓ ఫాదర్‌గా ఐయామ్ హ్యాపీ. ► ‘గాంధీ టాక్స్’ అనే సైలెంట్ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడంపై మీ అనుభూతి గురించి? గతంలో ‘పుష్పక విమానం’లాంటి సైలెంట్ సినిమాలను అద్భుతంగా చేశారు. ఇప్పుడు నాకలాంటి మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి సినిమాలు సవాల్ అనాలి. అందుకే ఈ సినిమా డైరెక్టర్ కిశోర్‌తో ‘ఐ హేట్ యు.. లవ్ యు’ అని సరదాగా అన్నాను. డైలాగ్స్ లేకుండా సాగే ఈ సినిమాలోని సందర్భాలకు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడం అనేది నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. -
తెలుగులోకి వచ్చేస్తున్న తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమా
కోలీవుడ్‌లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా కీర్తి సురేష్, వడివేలు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మామన్నన్' జూన్ 29న విడుదలై అక్కడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఉదయనిధి కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన ఈ చిత్రంపై పలు విమర్శలు వచ్చినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపే సినిమాలు చేస్తాడని పేరున్న మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అతని కెరీర్లో బెస్ట్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్) ఇతర భాషల్లో హిట్ టాక్ వచ్చి.. భారీగా ప్రేక్షకాధరణ పొందిన సినిమాలను టాలీవుడ్లో కూడా విడుదల చేస్తుంటారు. తెలుగులో 'నాయకుడు' అనే పేరుతో విడుదల చేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చారు. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకున్నారు. జులై 14వ తేదీన ఈసినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఆరురోజులకు గాను రూ. 52 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక తెలుగులో విడుదల అయిన తర్వాత ఏమేరకు కలెక్ష్న్స్ రాబడుతుందో చూడాలి. 'మామన్నన్' కథేంటి? కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) -
సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?
ఆయన స్వయానా ముఖ్యమంత్రి కొడుకు. తమిళనాడు ప్రభుత్వంలో ప్రస్తుతం క్రీడాశాఖ మంత్రి. మరోవైపు హీరోగా తన కెరీర్ లోనే చివరి సినిమా చేశారు. ఆయనే ఉదయనిధి స్టాలిన్. చిత్రం పేరు 'మామన్నన్'. ఇందులో ఏముంది అంత గొప్ప అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో కాస్తోకూస్తో తెలిసి ఉండొచ్చేమో. కానీ ఈ చిత్రంలో కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు లాంటి అద్భుతమైన యాక్టర్స్ నటించారు. 'కర్ణన్'తో హిట్ కొట్టిన మరి సెల్వరాజు దర్శకుడు కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ 'మామన్నన్' ఎలా ఉంది? 'మామన్నన్' కథేంటి? కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ) టాక్ ఏంటి? మరి సెల్వరాజ్.. గతంలో 'పరియారుమ్ పెరిమాళ్', 'కర్ణన్' లాంటి క్లాసిక్స్ తో మెప్పించారు. ఈ రెండూ ధనిక వర్సెస్ పేద అనే కాన్సెప్ట్‌తోనే తీశారు. ఇప్పుడు 'మామన్నన్' చిత్రాన్ని అదే తరహా స్టోరీతో తీశారు. కాకపోతే ఈసారి పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇది కొంతవరకు అయితే బాగుండేది కానీ మరీ ఎక్కువ కావడంతో సెకండాఫ్ లో రొటీన్ గా అనిపించిందని చెబుతున్నారు. ఇది తప్పితే సినిమా నెక్స్ట్ లెవల్ ఉందని ప్రేక్షకుల్ని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. వడివేలు, ఫహాద్ ఫాజిల్.. ఒకరిని మించి మరొకరు అన్నట్లు నటించారట. ఏఆర్ రెహమాన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కలెక్షన్స్ ఎంత? గత పదేళ్లుగా సినిమాలు చేస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి కావడం, రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల 'మామన్నన్'.. తన చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాకు హిట్ టాక్ రావడం ఓ ప్లస్ అయితే, తొలిరోజు రూ.5.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే ఉదయనిధి కెరీర్ లోనే అత్యధికం అవుతుంది. ఈ వసూళ్లపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ)