సౌత్ ఇండియన్ యాక్టర్, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి ప్రేమ పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆర్టిస్ట్ తన సోషల్ మీడియా పేజీలో ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం సినిమాలకు ఆమె వాయిస్ ఇచ్చింది. అయితే, మలయాళ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు ఆమె ప్రకటించింది. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు పేర్కొంది. తెలుగులో ఓకే బంగారం, ప్రేమమ్, 2.0, నవాబ్ వంటి సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది.
చెన్నైకి చెందిన రవీనా రవి మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాల్లో కూడా నటించింది. జవాన్ సినిమాలో దీపికా పదుకోన్‌కు తెలుగు వాయిస్ అందించింది. లవ్ టుడే, మామన్నన్ వంటి సినిమాల్లో కీలకమైన పాత్రలలో మెరిసింది. నయనతార, త్రిష,నిధి అగర్వాల్.మాళవిక మోహన్,శ్రీనిధి శెట్టి, అమలా పాల్,రాశీ ఖన్నా,కాజల్ అగర్వాల్, సమంత వంటి స్టార్ హీరోయిన్లకు వివిధ భాషలలో డబ్బింగ్ చెప్పింది.
అయితే, 'వాలట్టి' అనే మలయాళ సినిమాతో పాపులర్ అయిన దర్శకుడు దేవన్ జయకుమార్‌తో ఆమె ప్రేమలో ఉంది. త్వరలో పెళ్లి చేసుకున్నట్లు ఒక ఫోటోను కూడా పంచుకుంది. తన అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలో పెళ్లి తేదీని కూడా ఈ జోడీ ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment