కోలీవుడ్‌లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా కీర్తి సురేష్, వడివేలు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మామన్నన్' జూన్ 29న విడుదలై అక్కడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఉదయనిధి కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన ఈ చిత్రంపై పలు విమర్శలు వచ్చినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపే సినిమాలు చేస్తాడని పేరున్న మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అతని కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచింది.
(ఇదీ చదవండి: నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్)
ఇతర భాషల్లో హిట్ టాక్ వచ్చి.. భారీగా ప్రేక్షకాధరణ పొందిన సినిమాలను టాలీవుడ్‌లో కూడా విడుదల చేస్తుంటారు. తెలుగులో 'నాయకుడు' అనే పేరుతో విడుదల చేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చారు. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకున్నారు. జులై 14వ తేదీన ఈసినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఆరురోజులకు గాను రూ. 52 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక తెలుగులో విడుదల అయిన తర్వాత ఏమేరకు కలెక్ష్‌న్స్ రాబడుతుందో చూడాలి.
'మామన్నన్' కథేంటి?
కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment