Udayanidhi Stalin
-
మరోసారి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై:తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడుకు రావాల్సిన సమగ్రశిక్ష అభియాన్ రూ.2190 కోట్ల రూపాయల నిధులు తామేమీ అడుక్కోవడం లేదన్నారు. మీ తండ్రి సొమ్ము అడగడం లేదని ఫైరయ్యారు.‘మేమేమీ మీ తండ్రి సంపాదించిన సొమ్ము అడగడం లేదు. మాకు హక్కుగా రావాల్సిన నిధులే మేం అడుగుతున్నాం. తమిళనాడు ప్రజలు కట్టే పన్ను డబ్బులనే మేం అడుతున్నాం. బీజేపీ బెదిరింపులకు భయపడేదే లేదు. తమిళనాడుపై హిందీని రుద్దాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని రెండు భాషల పాలసీ ప్రస్తుతం ప్రమాదంలో పడింది. ఫాసిస్టు బీజేపీపై ఈ విషయంలో పోరాడేందుకు ప్రతిపక్షం అన్నాడీఎంకే మాతో కలిసి రావాలి. తమిళనాడు ప్రజలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తోంది’అని ఉదయనిధి మండిపడ్డారు. కాగా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) కింద మూడు భాషల పాలసీని అమలు చేసేదాకా తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇటీవలే స్పష్టం చేసిన నేపథ్యంలో ఉదయనిధి స్పందించారు. గతంలోనూ ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. -
తమిళనాడులో 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్.. భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ
సౌత్ ఇండియాలో ఈ సారి సంక్రాంతికి సినీ సంబరాలు గ్యారెంటీ అనిపిస్తోంది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా బరిలోకి చాలా చిత్రాలు ఉన్నా యి. తెలుగులో డాకు మహరాజ్, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు టాప్‌లో ఉన్నాయి. కానీ, తమిళ్లో నటుడు అజిత్, త్రిష జంటగా నటించిన 'విడాముయర్చి' ప్రధానంగా రేసులో ఉంది. ఈ చిత్రం పొంగల్‌కు తెరపైకి రానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర విడుదలను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది నటుడు అజిత్ అభిమానులను నిరాశ పరచే విషయమే అవుతుంది.కాగా విడాముయర్చి చిత్రం వాయిదా పడటంతో కొత్తగా మరిన్ని చిత్రాలు సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్‌కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అజిత్ సినిమా వాయిదాతో ఇప్పుడు రామ్ చరణ్ చిత్రానికి మరిన్ని థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంది. పొంగల్ రేసులో తమిళ పెద్ద హీరోలు ఎవరూ లేకపోవడంతో శంకర్, రామ్ చరణ్‌లు అక్కడ గేమ్ ఛేంజర్స్‌గా నివలనున్నారు. అయితే, ఈ సంక్రాంతి బరిలో నటుడు జయంరవి, నిత్యామీనన్ జంటగా నటించిన 'కాదలిక్క నేనమిలై' చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. మంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. అదే విధంగా సంచలన దర్శకుడు బాలా తెరకె క్కించిన వణంగాన్ చిత్రం ఈ నెల 10న తెరపైకి రానుంది. నటుడు అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సురేశ్కామాక్షీ భారీ ఎత్తున నిర్మించారు.ఇకపోతే వీటంన్నిటిలో భారీ బడ్జెట్ సినిమాగా శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్‌పైనే కోలీవుడ్ అభిమానులు ఉన్నారు. సంక్రాంతి బరి నుంచి అజిత్ నటించిన విడాముయర్చి తప్పుకోవడంతో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌కు భారీ ప్లస్ అవుతుందని చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే సంక్రాంతి చిత్రాల్లో ఈ రెండు చిత్రాలపైనే భారీ అంచనాలు ఇప్పటి వరకు ఉన్నాయి. చివరి క్షణంలో అజిత్ తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్‌కు కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్తో కోలీవుడ్ సినీ అభిమానులకు చరణ్ దగ్గరయ్యాడు. ఇప్పుడు అక్కడ పెద్ద సినిమాలు లేవు కాబట్టి గేమ్ ఛేంజర్‌కు భారీ ఓపెనింగ్స్ ఉండే ఛాన్స్ ఉంది. -
కీచకపర్వంపై విజయ్ దిగ్భ్రాంతి.. ఉదయ్‌నిధిపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
చెన్నై: నగరం నడిబొడ్డున జరిగిన దారుణ ఘటన.. తమిళనాడును ఉలిక్కి పడేలా చేసింది. ప్రముఖ ప్రభుత్వ విద్యాసంస్థ వర్సిటీ క్యాంపస్‌లోనే ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. ఆమెతో ఉన్న స్నేహితుడిపై దాడి చేసి మరీ.. దగ్గర్లోని పొదల్లో లాక్కెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కీచకపర్వంతో విద్యార్థి లోకం భగ్గుమంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టింది. మరోవైపు ఈ ఘటనపై అగ్ర నటుడు, టీవీకే అధినేత విజయ్(TVK VIjay) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘చెన్నై అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారనే సమాచారం మాకు అందింది. అయితే ఈ కేసులో ఉన్నవాళ్లు ఎంతటివాళ్లైనా వదలిపెట్టకూడదు. బాధితురాలికి తక్షణ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.. சென்னை அண்ணா பல்கலைக்கழக வளாகத்திற்கு உள்ளேயே, மாணவி ஒருவர் பாலியல் வன்கொடுமைக்கு உள்ளாகி இருக்கும் செய்தி, மிகுந்த அதிர்ச்சியையும் வேதனையையும் அளிக்கிறது.மாணவியைப் பாலியல் வன்கொடுமை செய்தவர் கைது செய்யப்பட்டிருப்பதாகக் காவல் துறை தரப்பில் தெரிவிக்கப்பட்டிருந்தாலும் அவர் மீது…— TVK Vijay (@tvkvijayhq) December 25, 2024.. రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. అఘాయిత్యాలు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతను పెంచాలి. ఉమెన్ సేఫ్టీ కోసం మొబైల్ యాప్స్, స్మార్ట్ పోల్స్, ఎమర్జెన్సీ బటన్స్, సీసీ కెమెరాలు, టెలిఫోన్లను ఏర్పాటు చేయాలి. పబ్లిక్ ప్లేసుల్లో వాళ్ల కోసం కనీస వసతులు ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ-ప్రవేట్ విద్యా సంస్థలను కూడా ఇందులో చేర్చాలి. బాధితులకు అవసరమైన న్యాయ సహాయం ప్రభుత్వమే అందించాలి. మానసికంగా ధైర్యంగా ఉంచేందుకు కౌన్సెలింగ్‌లాంటివి ఇప్పించాలి. వీటన్నింటి కోసం ప్రతీ ఏడాది నిర్భయ ఫండ్ నుంచి ఖర్చు చేయాలి. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం వెనకడుగు ఉండకూడదు. నిరంతరం ఈ వ్యవస్థను సమీక్షిస్తూ ఉండాలి’’ అని విజయ్ (Vijay) తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.మరోవైపు.. ప్రభుత్వ విద్యా సంస్థలో జరిగిన ఈ ఘటనపై ప్రతి పక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి . అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai), డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు వేర్వేరు ప్రకటనలో ఈ ఘటనను ఖండించారు. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను వ్యక్తంచేశారు. ఈ ఘటన సిగ్గుచేటు అని, నేరగాళ్లకు తప్పా, ఇతరులు ఎవ్వరికి ఈ ప్రభుత్వంలో కనీస భద్రత కరువైందని మండిపడ్డారు.కాగా ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్ మాట్లాడుతూ, ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం శోచనీయమన్నారు. నిందితులు కఠినంగా శిక్షించ బడుతారన్నారు. ఓ విద్యార్థినిపై జరిగిన ఈ దాడిని కూడా రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.ShameOnYouStalinకాగా ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జ్ఞానశేఖరన్.. క్యాంపస్ దగ్గర్లోనే ఓ బిర్యానీ సెంటర్ నడిపిస్తున్నాడు. అయితే అతనికి నేర చరిత్ర ఉండడంతో పాటు అధికార డీఎంకే పార్టీ కార్యకర్త కావడం ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాకు ఎక్కించింది. గతంలోనూ డిప్యూటీ సీఎం ఉదయ్‌నిధి స్టాలిన్‌తోపాటు మరికొందరు డీఎంకే పెద్దలతో నిందితుడు దిగిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. అంతేకాదు.. డీఎంకే యువ విభాగం ప్రెసిడెంట్‌గానూ పని చేశాడనతను. నిందితుడు జ్ఞానశేఖరన్ అధికార డీఎంకే కార్యకర్త కావడంతో విషయాన్ని పక్కదోవ పట్టించి నిందితుడ్ని తప్పించే ప్రయత్నం జరుగుతోందని విద్యార్థులు అంటున్నారు. ఘటన తర్వాత బాధితురాలి దగ్గరకు ఎవరినీ వెళ్లనివ్వలేదని.. యూనివర్సిటీ అధికారులు కేసును పక్కదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు తోడు మరోవైపు.. పెరియాకుప్పం సముద్ర తీరంలో పిక్నిక్ వెళ్లిన కొందరు యువతులపై తప్పతాగిన ఆగంతకులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే తమిళనాడులో మహిళలకు భద్రత కరువైందంటూ.. #ShameOnYouStalin హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.It has come to light that the accused in the Sexual Assault of a student at Anna University is a repeat offender and a DMK functionary.A clear pattern emerges from the number of such cases in the past:1. A criminal becomes close to the local DMK functionaries and becomes a… pic.twitter.com/PcGbFqILwk— K.Annamalai (@annamalai_k) December 25, 2024నిందితుడు జ్ఞానశేఖరన్ కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలి.. బ్యాండేజ్‌తో ఉన్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో డీఎంకే ప్రభుత్వం న్యాయం చేసిందని, గతం పొల్లాచ్చి కేసులో నిందితుడు పారిపోయినప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉందని.. ఆ సమయంలో బీజేపీ కూడా ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసలు చేయలేదని కొందరు డీఎంకే అనుకూల పోస్టులు పెడుతున్నారు. అయితే విక్షాలు దీన్ని ప్రభుత్వ జిమ్మిక్కుగా కొట్టి పారేస్తున్నాయి.இனி பெண்கள் மேல கை வைக்கனும்னு நினைச்சாலே இந்த ட்ரீட்மெண்ட் தான் நினைவுக்கு வரனும்.சிறப்பு மிகச் சிறப்பு🔥🔥 pic.twitter.com/wyswZSuEg1— ஜீரோ நானே⭕ (@Anti_CAA_23) December 25, 2024 డీఎంకే స్పందన ఇదిఈ ఆరోపణలను అధికార డీఎంకే ఖండించింది. ఒక నేతతో ఒకరు ఫొటో తీసుకుంటే సరిపోతుందా?. నేరం ఎవరు చేసినా చట్టం ఊరుకోదు. ఈ కేసులోనూ అంతే. ప్రతిపక్షాలకు డీఎంకేను విమర్శించడానికి ఏం దొరక్కట్లేదు. అందుకే శాంతి భద్రతల వంకతో నిత్యం విమర్శలు చేస్తోంది. మా పాలనలో నిజంగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి ఉంటే విమర్శించనివ్వండి. నిజంగా.. నిందితుడు తప్పించుకుని ఉంటే నిందించండి. అధికార పార్టీ ఎంపీనే అరెస్ట్ అయ్యి రెండు నెలలు జైల్లో ఉన్నారు. ఇక్కడే డీఎంకే పాలన ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉండాలి. తప్పు ఎవరూ చేసినా మా ప్రభుత్వం.. శిక్ష పడేవరకు ఊరుకోదు అని డీఎంకే నేత శరవణన్ మీడియాకు తెలిపారు.నిఘా నీడలోని క్యాంపస్‌లోనే..చైన్నె నగరంలోని గిండి సమీపంలోని అన్నావర్సిటీ(Anna university) ఉంది. ఇక్కడే యూజీ, పీజీ హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగానూ ఉంటాయి. ప్రభుత్వ రంగ విద్యా సంస్థ కావడంతో ఈ పరిసరాలన్నీ సీసీ కెమెరాల నిఘాతో ఉంటాయి. దీనికి కూతవేటు దూరంలోనే ఐఐటీ మద్రాసు ఉంది. ఈ పరిసరాలన్నీ విద్యా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉండడంతో ఎల్లప్పుడూ భద్రత నీడలోనే ఉంటాయి. ఈ పరిస్థితులలో బుధవారం ఉదయం ఓ ఘటన కలకలం రేపింది.సోమవారం రాత్రి 8గం. టైంలో ఓ యువతి తన స్నేహితుడితో ఉండగా.. దాడి చేసి ఆమెను పొదల్లోకి లాక్కెల్లి అత్యాచారం చేశారు. 19 ఏళ్ల ఆ విద్యార్థిపై ఇద్దరు అగంతకులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం బయటకు వచ్చింది. దీంతో విద్యార్థులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను పట్టుకోవాలని నినదిస్తూ ఆందోళనకు దిగారు. అయితే.. மாணவி பலாத்காரத்தை ஏன் போலீசார் மூடி மறைக்க முயல்கிறது.??கற்பழித்த திமுகக்காரனை காப்பாற்ற முயற்சித்த போலீசை வெச்சி செய்த மாணவர்கள்🤮#AnnaUniversity #ShameOnYouStalin pic.twitter.com/ZcAkYB6NWH— Sanghi Prince 🚩 (@SanghiPrince) December 25, 2024బుధవారం ఉదయాన్నే ఈ సమాచారం మీడియా చెవిన పడింది. దీంతో అన్ని మార్గాలను వర్సిటీ అధికారులు మూసి వేశారు. మీడియానూ లోనికి అనుమతించకుండా జాగ్రత్త పడ్డాయి. ఈ విషయం తెలిసి కొందరు విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు వాళ్లను బుజ్జగించారు. బాధితురాలి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వాళ్లు శాంతించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు వేగాన్ని పెంచారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో 30కు పైగా ఉన్న సీసీ కెమెరాలలోని దృశ్యాలను పరిశీలించారు. విధులలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వద్ద విచారించారు. తమకు లభించిన సమాచారం మేరకు 37 ఏళ్ల జ్ఞానశేఖరన్‌ను అరెస్ట్ చేశారు.கேடுகெட்ட திராவிட model ஆட்சியில் !!திமுக காரனால் தொடர்ந்து சூறையாடப்பட்ட கல்லூரி பெண்களின் அவல நிலை ??#ShameOnYouStalin pic.twitter.com/LZcrftyckU— Yuvaraj Ramalingam (@YuvarajPollachi) December 26, 2024ఇదీ చదవండి: దుస్తులు మార్చుకుంటుండగా వీడియోలు తీసి.. -
గుకేశ్‌కు భారీ నజరానా
పిన్న వయస్సులోనే చదరంగ రారాజుగా అవతరించిన దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పద్దెనిమిదేళ్ల వయసులో ఈ కుర్రాడు సాధించిన విజయం పట్ల యావత్ భారతావని పులకరించిపోతోంది. ‘‘సరిలేరు నీకెవ్వరు’’ అంటూ ఈ ప్రపంచ చాంపియన్‌కు క్రీడాలోకం నీరాజనాలు పలుకుతోంది.ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం గుకేశ్‌కు భారీ నజరానా ప్రకటించింది. చెన్నైకి చెందిన ఈ చెస్ ప్లేయర్‌కు ఏకంగా రూ. 5 కోట్ల రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.రూ. 5 కోట్ల నజరానా‘‘చిన్న వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌గా దొమ్మరాజు గుకేశ్ అవతరించిన ఈ చారిత్రక సందర్భంలో రూ. 5 కోట్ల నజరానా అందిస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది.గుకేశ్ చారిత్రాత్మక విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసింది. అతడు భవిష్యత్తులోనూ ఇలాంటి గొప్ప విజయాలెన్నో మరిన్ని సాధించాలని కోరుకుంటున్నా. ఇలాంటి యువ తారలను తీర్చిదిద్దడంలో శక్తి వంచన లేకుండా తమ మద్దతు అందిస్తున్న తమిళనాడు క్రీడా శాఖ, ఉదయనిధి స్టాలిన్‌కు అభినందనలు’’ అని స్టాలిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించి.. రూ. 11 కోట్ల ప్రైజ్మనీసింగపూర్ సిటీ వేదికగా జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ వరల్డ్ చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో గుకేశ్ 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. 58 ఎత్తుల్లో 32 ఏళ్ల లిరెన్ ఆటకు చెక్ పెట్టి అత్యుత్తమ ప్రదర్శనతో చదరంగ రారాజుగా అవతరించాడు. తద్వారా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక వరల్డ్ చాంపియన్‌గా ట్రోఫీతో పాటు గుకేశ్‌కు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ.11.45 కోట్ల ప్రైజ్‌మనీ) లభించింది. అంతేకాకుండా మూడు గేమ్‌లు గెలిచినందుకు అదనంగా రూ.5.07 కోట్లు గుకేశ్‌కు అందాయి.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
హీరో విజయ్‌కు ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
జట్టుగా వచ్చినా.. సింగిల్‌గా వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్టార్ హీరో విజయ్‌కు పరోక్షంగా సవాల్ విసిరారు ఈ యువనేత. వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని దీమా ప్రదర్శించారు. హీరో విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తొలి బహిరంగ సభలో తమపై పరోక్షంగా విమర్శలు చేసిన విజయ్‌పై డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్‌కు కౌంటర్ ఇచ్చారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా తమకు తిరుగులేదని, 2026లోనూ తిరిగి అధికారంలోకి వస్తామంటూ ‘దళపతి’కి పరోక్షంగా జవాబిచ్చారు. తంజావూరులో గురువారం జరిగిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు.తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. అక్టోబరు 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో మానాడు పేరుతో మొదటి బహిరంగ సభ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని ఇన్‌డైరెక్ట్‌గా స్టాలిన్ ఫ్యామిలీపై ఎటాక్ చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలను వదిలేసి తమను మాత్రమే విమర్శించడంతో విజయ్‌పై డీఎంకే నాయకులు మాటల దాడి పెంచారు.ఎంత మంది వచ్చినా మాదే గెలుపుఅయితే తమిళనాడు ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎంత మంది వచ్చినా డీఎంకే నీడను కూడా తాకలేరని తాజాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రజారంజక పాలన అందిస్తున్నామని, 2026 లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడోసారి డీఎంకే పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని వ్యతిరేకించేవారంతా జట్టు కట్టినా.. ఢిల్లీ నుంచి వచ్చినా, స్థానికంగా ఏ దిక్కు నుంచి వచ్చినా డీఎంకేనే గెలుస్తుంది. మా పార్టీని నాశనం చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతార’ని వార్నింగ్ ఇచ్చారు. కాగా, విజయ్ను ఉద్దేశించే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే విక్రవండిలో మానాడు సభ సందర్భంలో విజయ్‌కు ఉదయనిధి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.చదవండి: హీరో విజయ్.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభంవిజయ్ ఓడిపోతాడు..మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ.. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం పార్టీకి గెలుపు అవకాశాలు లేవని, విజయ్ కూడా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. మదురైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదన్నారాయన.చదవండి: ‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?69 సినిమాపై విజయ్ ఫోకస్కాగా, విజయ్ ప్రస్తుతం తన 69 సినిమాపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో ఇదే ఆయన అఖరి సినిమాగా ప్రచారం జరుగుతోంది. దళపతి రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా ఉంటుందని టాక్. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
రేసులో అజిత్.. ఉదయనిధి స్టాలిన్ అభినందన
కోలీవుడ్ సినీ నటుడు అజిత్ కుమార్‌కు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటుతుండటాన్ని గుర్తు చేస్తూ కొనియాడారు. సినీ నటుడు అజిత్ కొత్త అవతారం ఎత్తారు. అజిత్‌కుమార్ రేసింగ్ టీం పేరిట టీమ్ లోగోను తాజాగా ఆవిష్కరించారు. సరికొత్త పాత్రలో రేసర్‌గా వస్తున్నట్టు అజిత్ ఆనందంగా ప్రకటించారు. రేసర్‌గా తన ప్రయాణంలో గెలవాలనే సంకల్పంతో ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు. దుబాయ్‌లో త్వరలో జరగనున్న దుబాయ్ 24 హెచ్ 2025 పోటీలలో తొలిసారిగా అజిత్‌కుమార్ రేసింగ్ టీం పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఈ పోటీల ట్రయల్ రన్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఇందులో తమిళనాడు స్పోర్ట్స్ విభాగం లోగోను ధరించి ఈ ట్రయల్ రన్లో దూసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. తమిళనాడు స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ విభాగం నేతృత్వంలో క్రీడాభ్యున్నతికి జరుగుతున్న తోడ్పాటుకు మరింత బలం చేకూర్చే విధంగా అజిత్ ఆ లోగో ధరించడాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికగా తమిళనాడు స్పోర్ట్స్‌ను చాటడం గర్వించ దగ్గ విషయం అని, ఇందుకు అభినందనలు తెలియజేశారు. -
ఉదయనిధి స్టాలిన్ రూ. 25 కోట్లు చెల్లించాల్సిందే.. కోర్టుకెళ్లిన నిర్మాత
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తమకు రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని చిత్ర నిర్మాత కోర్టుకు వెళ్లారు. ఒకప్పుడు పాపులర్ హీరోగా కోలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించిన ఆయన గతేడాదిలో 'మామన్నన్' సినిమానే తన చివరి ప్రాజెక్ట్ అని ప్రకటించారు. ఆ తర్వాత తమిళనాడు పాలిటిక్స్‌లో ఆయన బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ అప్పటికే ఒప్పుకున్న ఒక సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆయన నష్టపరిహారం కట్టించాలని ఆ చిత్ర నిర్మాత రామశరవణన్ కోర్టుకు వెళ్లారు.'మామన్నన్' సినిమా కంటే ముందే 'ఏంజెల్' అనే చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, ఆనంది కథానాయికలు. 2018లో ప్రారంభమైన ఈ మూవీని కేఎస్.అదయమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది. మరో 20 శాతం చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఈ సినిమా కోసం నిర్మాత రూ.13 కోట్లకు పైగా ఖర్చు పెట్టాడని తెలుస్తోంది. అయితే.. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల పాటు ఆలస్యం అయ్యింది. ఇంతలో 'మామన్నన్' తన చివరి చిత్రమని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. దీంతో తను భారీగా నష్టపోయానని అందుకుగాను తనకు నష్టపరిహారంగా రూ. 25 కోట్లు ఉదయనిధి స్టాలిన్ చెల్లించేలా కోర్టు ఆదేశించాలని పిటీషన్లో నిర్మాత రామశరవణన్ పేర్కొన్నారు.ఏంజెల్ చిత్ర నిర్మాత వేసిన పిటీషన్‌ను కొట్టివేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తరపున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో జస్టిస్ డీకారామన్ ముందుకు తాజాగా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. మొదట నిర్మాత తరపున న్యాయవాది తియాగేశ్వరన్ వాదనలు వినిపిస్తూ.. 'ఏంజెల్' చిత్రానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ఎనిమిది రోజులు షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన సహకరించకపోవడం వల్ల సినిమా ఆగిపోయిందన్నారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థకు భారీగా నష్టం వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఉదయనిధి స్టాలిన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇళంగో మాట్లాడుతూ.. ఏంజెల్ చిత్రానికి సంబంధించి ఉదయనిధి పలుమార్లు చిత నిర్మాతను సంప్రదించారని, సినిమాలో తన సన్నివేశాలు పూర్తి అయ్యాయని చెప్పిన తర్వాతే మామన్నన్‌లో నటించారని తెలిపారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి డీకారామన్.. అక్టోబర్ 28న తుది తీర్పు వెళ్లడిస్తామని ప్రకటించారు. -
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి
చెన్నై: తమిళనాట వారసుడికి పట్టాభిషేకం జరిగింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి లభించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 46 ఏళ్ల ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని డీఎంకే శ్రేణులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. శనివారం స్టాలిన్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయనిధి డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు కూడా. పలు చిత్రాల్లో నటించడంతో పాటు సినిమాలు నిర్మించారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని కూడా స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో 471 రోజుల తర్వాత రెండ్రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బాలాజీతో పాటు గోవి చెజియన్, రాజేంద్రన్, నాజర్‌లను స్టాలిన్ కేబినెట్లోకి తీసుకున్నారు. టి.మనో తంగరాజ్, జింజీ ఎస్.మస్తాన్, కె.రామచంద్రన్‌లను మంత్రివర్గం నుంచి తొలగించారు. -
డిప్యూటీ సీఎంగా పగ్గాలు.. స్పందించిన ఉదయనిధి స్టాలిన్
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై తాజాగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతారనే వార్తలు కేవలం వదంతులేనని మరోసారి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియతో మాట్లాడుతూ..ఈ నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. ‘ఇది సీఎం వ్యక్తిగత నిర్ణయం. మీరు.(మీడియాను ఉద్ధేశిస్తూ..) నిర్ణయం తీసుకోకూడదు. మంత్రులందరూ ఆయనకు మద్దతుగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిని అడగండి. ఇది సీఎం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయం’ అని ఉదయనిధి పేర్కొన్నారు.అయితే ఈ పుకార్లను ఉదయనిధి కొట్టిపారేయడం తొలిసారి కాదు. గతంలోనూ మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తన వరకు యువజన విభాగం కార్యదర్శి పదవి ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.చదవండి :జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లుకాగా తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పగ్గాలు అందుకోనున్నట్లు అధికార డీఎంకేలో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఖరారు అయినట్లు వార్తలు రాగా.. వాటిని ఆయన కొట్టిపారేశారు.ఇక ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. -
ఉదయనిధికి డిప్యూటీ లేనట్టేనా?
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవీ ఇప్పట్లో లేనట్టే కనిపిస్తోంది. స్వయంగా సీఎం స్టాలిన్ పరోక్ష వ్యాఖ్యలతో ఈ అంశం స్పష్టమవుతోంది. వివరాలు.. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చైన్నె కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం సీఎం స్టాలిన్ విస్తృతంగా పర్యటించారు. రూ. 8.45 కోట్లతో పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించారు. గణేష్ నగర్లో పాఠశాల పనులకు శంకుస్థాపన చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, తదితర పనులను పరిశీలించారు. పెరియార్ నగర్ రూ. 355 కోట్లతో జరుగుతున్న ప్రభుత్వ సబర్బన్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వీక్షించారు. తమిళనాడు పవర్ జనరేషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ తరపున రూ.110 కోట్లతో జరుగుతున్న అతి పెద్ద విద్యుత్‌సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. వీనస్ నగర్లో రూ.19.56 కోట్లతో సాగుతున్న మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను తనిఖీ చేశారు. చైన్నె 2.0 పథకం కింద రూ.5.4 కోట్లతో ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి నిర్మాణాలకు ఈసందర్భంగా శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు విద్యా సామగ్రిని ఆయన అందజేశారు. అనంతరం ఆధునిక మార్కెట్ నిర్మాణ పనులను సందర్శించి పరిశీలించారు . జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఐనావరం, మాధవరం సర్కిల్లో రూ. 91.36 కోట్లతో సాగుతున్న కాలువ నిర్మాణ పనులు, వరద నివారణ పనులను వీక్షించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు ఎం.సుబ్రమణి యన్, పీకే శేఖర్‌బాబు, మేయర్ ఆర్. ప్రియా, ఎంపీ కళానిధి వీరాస్వామి తదితరులు ఉన్నారు.డిప్యూటీపై పరోక్ష వ్యాఖ్యడీఎంకే యువజన నేత, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న నినాదం పార్టీలో మిన్నంటుతున్న విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉదయనిధికి డిప్యూటీ పదవి అప్పగించి పరిపాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టించబోతున్నట్టుగా చర్చ జోరందుకుంది. అయితే ఈ పదవీ విషయంగా ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడే సమయంలో అన్నీ ప్రచారాలే అని పేర్కొంటూ వచ్చారు. అదే సమయంలో తనకు ఏ బాధ్యత అప్పగించినా, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పదవే తనకు కీలకం అని పేర్కొంటూ వచ్చారు. ఈ పరిస్థితులలో కొళత్తూరు పర్యటన సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సీఎం స్టాలిన్‌ను మీడియా డిప్యూటీ పదవి విషయంగా ప్రశ్నించింది. ఆయనకు ఆ పదవి అప్పగిస్తారా? మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయా? అని ప్రశ్నించగా, నినాదం బలంగానే ఉన్నా.. పండు కాలేదుగా అని పేర్కొంటూ డిప్యూటీ ప్రచారంతోపాటు మంత్రి వర్గంలో మార్పులనే ప్రచారానికీ చెక్ పెట్టారు. అలాగే వర్షాల గురించి మాట్లాడుతూ, ఎంతటి భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. -
ఉదయనిధి ప్రమోషన్‌పై స్టాలిన్ క్లారిటీ
చెన్నై: తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు డిప్యూటీ సీఎం చేసేందుకు ఇంకా టైమ్ రాలేదని సీఎం స్టాలిన్ అన్నారు. అయితే ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని పార్టీలో డిమాండ్ మాత్రం గట్టిగా ఉందని చెప్పారు. ఈ విషయమై సోమవారం(ఆగస్టు5) స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఉదయనిధికి ప్రమోషన్ ఇచ్చేందుకు సరైన సమయం రావాల్సి ఉందన్నారు. కాగా, ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వంలో క్రీడా, యువజన సంక్షేమ, ప్రత్యేక కార్యక్రమాల అమలు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ద్రవిడవాదంలో వేర్పాటు నినాదం
వెనుకబాటుతనం ఆ ప్రాంతంలో అసంతృప్తిని రేకెత్తించడం, అది ఆగ్రహమై, ఉద్యమంగానో, ఆఖరికి ఉగ్రవాదంగానో పరిణమించడం పరిపాటే. ఒకప్పుడు ఈశాన్య భారతదేశంలో ప్రత్యేక దేశం నినాదాలు వినిపించేవి. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు కూడా ఇదే వినిపించేవారు. రెడ్ కారిడార్ నినాదంలో కూడా ఇందుకు సంబంధించిన ఛాయలు ఉన్నాయి. కానీ తమిళనాడులో ద్రవిడవాదం మోతాదు ఎక్కువగా ఉన్న డీఎంకే వినిపించే వేర్పాటువాదం, తామొక జాతి అని చెప్పుకోవడం వెనుక కుత్సిత రాజకీయం మాత్రమే ఉంది. ఆ పార్టీలో కొందరు ప్రత్యేక దేశం నినాదాన్ని అందుకోవడం చరిత్ర పట్ల మహా ద్రోహం. భారతదేశం ఐక్యంగా ఉండాలన్న భావన కేవలం బీజేపీది అనుకోవడం అజ్ఞానం. ఒక పార్టీ మీద ద్వేషం దేశ ఐక్యతకు విఘాతం కారాదు. భారత ఈశాన్య ప్రాంతాన్నో, కశ్మీర్ లోయ పరిస్థితులతోనో పోలిస్తే తమిళనాడు ప్రాంతం వేర్పాటువాద నినాదాన్ని అందుకోవలసిన అగత్యం ఏమాత్రం లేదు. కొందరు నాయకుల అజెండా ప్రజలందరి ఆశయం కూడా కాదు. తమిళ సమాజంలో అందుకు సంబంధించిన రుజువులు కూడా లేవు. చెన్నై ఇవాళ నాలుగు మెట్రో నగరాలలో ఒకటి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం (ఏ పార్టీది అయినా) అండ లేకుండా అది సాధ్యమయ్యే దేనా? ఢిల్లీ వివక్షే చూపి ఉంటే జరిగేదేనా? ద్రవిడవాదం, అది చెప్పే ప్రాంతీయవాదం, వేర్పాటువాదం, నాస్తికత్వం తమిళనాట కొద్దిమందిలో ఉంటే ఉండవచ్చు. మెజారిటీ ప్రజలు కచ్చితంగా వాటికి దూరంగానే ఉన్నారు. అక్కడి జీవన సరళిని చూసినవారు ఎవరైనా దీనిని ఒప్పుకుంటారు. కాబట్టి తమిళనాడులో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే వాదనలు కుత్సిత రాజకీయానికి సంబంధించినవే. డీఎంకే ఎంపీ ఎ.రాజా తాజాగా భారత్ ఒక దేశం కాదని తీర్పు ఇచ్చాడు. ఇది కొన్ని రాష్ట్రాల కూటమి అంటాడు. ఒక దేశమైతే ఒకే భాష ఉంటుందని వింత భాష్యం చెప్పాడు. తమిళనాడుకు దేశం అనదగ్గ లక్షణాలు ఉన్నాయంటాడు. ఈ దేశంలో అనుసంధాన భాషగా సంస్కృతం చిరకాలం ఉంది. రాజా వాదన మీదే ఒక్క క్షణం నిలబడి ఇంకొక ప్రశ్న వేయాలి. తమిళనాడులోనే ఉన్న కొంగునాడు (కొంత భాగం కేరళ, కర్ణాటకలలో కూడా విస్తరించి ఉంది) ప్రజలు ఇది కూడా ‘నాడు’, కాబట్టి తమదీ ఒక జాతేననీ, తమకూ దేశం కావాలనీ అంటే డీఎంకే ప్రభుత్వం నుంచి ఏం సమాధానం వస్తుంది? ‘నాడు’ అనేది భౌగోళిక ఉనికికి పేరు. అది మరచిపోతే ఎలా? తమిళులకో ప్రత్యేక దేశం కోరికతో ఈవీ రామస్వామి నాయకర్ క్రిప్స్ మిషన్‌కు వినతిపత్రం సమర్పించాడు. దానికి హేతుబద్ధమైన ప్రాతిపదిక ఏమిటో ఇప్పటికీ తెలియదు. ద్రవిడస్థాన్ నినాదంతో, కోరికతో ఏమాత్రం పొంతన లేనిది ముస్లింలకో ప్రత్యేక రాజ్యం. అది జిన్నా, కొందరు ముస్లింల కోరిక. అలాంటి జిన్నాను తనకు వత్తాసుగా తెచ్చుకోవాలని చూసి ఈవీ భంగపడిన సంగతి చరిత్ర ప్రసిద్ధమే. ‘నేను ముస్లింలందరికీ నాయకుడినే; కానీ తమిళులంతా నీ (ఈవీ) వెనుక లేరు’ అన్నది జిన్నా వివరణ. నేటికీ అదే వాస్తవం. తమిళులంతా ద్రవిడవాదం మత్తులో లేరు. ఏనాడూ లేరు. 1942లోనే కాలం చేసిన ఆ వాదాన్ని ఆవాహన చేస్తామని బెదిరిస్తూ డీఎంకే పబ్బం గడుపుకొంటున్నది. ఇదంతా గమనించాక ఈవీ రామస్వామి నాయకర్ను పిచ్చాసుపత్రిలో ఉంచవలసిన వ్యక్తిగా ప్రథమ ప్రధాని నెహ్రూ కూడా భావించారు. కానీ ఇప్పటికీ అలాంటివాడి వికృత వాదంతో పార్టీలు రాజకీయాలు సాగించడమే విషాదం. ఎ.రాజా తాజా ప్రకటన కావచ్చు, ఆ మధ్య ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమా రుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలు కావచ్చు, ఆ ఆవాహన బెదిరింపులో భాగమే. వీటికి తాజా నేపథ్యం ఉంది. దేశ రాజకీయాలలో బీజేపీ ప్రబల శక్తిగా ఎదగడం. ద్రవిడవాద అడ్డా తమిళనాడుకు రాదనుకున్న బీజేపీ... అన్నామలై (తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు) రూపంలో విశ్వరూపం దాల్చడం! భారత్ ఒక దేశం కాదు, ఉపఖండం అంటాడు రాజా. ఈ ఒక్క అంశమే కేంద్రబిందువుగా ఆయన వాదం సాగడం లేదు. దీనికి రాముడినీ, రామాయణాన్నీ జోడిస్తున్నాడు. ఆ రెండు అంశాల మీద ఆయనకి విశ్వాసం లేదట. లేకపోవచ్చు. కానీ రాజా ఈ రాముడినీ, రామాయణాన్నీ డీఎంకే వేర్పాటువాదానికి తోడు తెచ్చుకునే పిచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. రాముడు భారతదేశ ఉత్తర భాగం వాడనీ, భారతభూమి దక్షిణ భాగంతో సంబంధమే లేదనీ డీఎంకే మొదటి నుంచి భాష్యం చెబుతోంది. ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం వద్ద ఇటీవలే జరిగిన సభలో రాజా ఇవన్నీ మాట్లాడాడు. నిజానికి ఈ వాదం కూడా తప్పే. దీనికి అన్నామలై ఇటీవలనే చక్కని వివరణ ఇచ్చాడు. తమిళనాడులోనే ఆరణి క్షేత్రంలో శివాలయం ఉంది. దాని పేరు పుత్తరకామెట్టీశ్వరాలయం. దశరథుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసిన తరువాతే ఆయనకు సంతానం కలిగిందని ప్రతీతి. అలాగే రామేశ్వరానికీ, వారణాసికీ నేటికీ చెక్కుచెదరకుండా కొనసాగుతున్న బంధాన్ని మరచిపోరాదు. ఈ జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన బాలరాముడి ప్రతిమకు దక్షిణాది కన్నడిగుడే జన్మనివ్వడం యాదృచ్ఛికం కావచ్చు. భారతదేశం ఐక్యంగా ఉండాలన్న భావన 1950లలో పుట్టిన భారతీయ జనసంఘ్దో లేదా 1980లలో ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీదో అనుకోవడం శుద్ధ అజ్ఞానం. మొత్తం భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తం చేసే ఉద్దేశంతోనే భారత స్వాతంత్య్రోద్యమం సాగింది. దీనికి వందలాది ఉదాహరణలు చూపించవచ్చు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి జీవితమే దీనికి రుజువు. గాంధీజీ పిలుపునకు, సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమానికి తమిళనాడు కూడా కదిలింది. జాతీయ భావనతో, సాంస్కృతికంగా ఏకత్వం ఉన్న దేశంలో సామాజిక రాజకీయ ఏకత్వం తేవడానికి భారత జాతీయ కాంగ్రెస్, కొన్ని ఇతర అతివాద జాతీయ భావాలను నమ్మిన సంస్థలు పనిచేశాయి. జాతీయ కాంగ్రెస్ తన సభలు తమిళనాడులోనూ (నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ) పలుసార్లు నిర్వహించింది. అడయార్ కేంద్రంగా పనిచేసిన అనీబిసెంట్ భారతీయులందరి స్వేచ్ఛ కోసం పనిచేశారు. కానీ మరొక పక్క తమిళనాడులో బలపడిన జస్టిస్ పార్టీ బ్రిటిష్ వాళ్ల మోచేతి నీళ్లు తాగింది. భారత్ ఐక్యతకూ, భారతీయులు చైతన్యవంతం కావడానికీ ఇంగ్లండ్ బద్ధవ్యతిరేకి. ఎవరో ఒకరిని వివక్షతో అణచివేయడానికి కుటిలనీతిని అవలంబించడమే బ్రిటిష్ లక్షణం. దాని అవశేషమే ద్రవిడవాదం. దాని పేలికే డీఎంకే. భారతదేశ చరిత్రను బట్టి, సమీప గతాన్ని బట్టి, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ పరిణామాల ఆధారంగా డీఎంకే నేతల వదరుబోతుతనం ఎంత నిర్హేతుకమో అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయాలి. నాలుగు ముక్కలైన పోలెండ్ కలసిపోయింది. రెండు ముక్కలయిన జర్మనీ ఐక్యమైంది. వేరుకావడం వల్ల కలిగే కష్టనష్టాలను ప్రపంచం గుర్తిస్తున్న క్షణాలివి. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా, ఆక్రమిత కశ్మీర్లో, బలూచిస్తాన్‌లో ప్రజలు తాము భారత దేశంలో భాగం కావాలనుకుంటున్నామని చెప్పుకోవడం వాస్తవం. ఇన్ని ఉదాహరణలు ఉండగా ఇంత అభివృద్ధి చెందిన దేశంలో వేరే దేశం కోరుకోవడం, అది కూడా తమ పార్టీ బలహీనపడే లేదా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రత్యేక దేశం నినాదాన్ని అందు కోవడం చరిత్ర పట్ల మహా ద్రోహం. ఓట్ల రాజకీయంతో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని భగ్నం చేయాలని అనుకుంటే ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడం అవసరమే. ఇప్పుడు ఎ. రాజా ప్రకటననీ, అప్పుడు ఉదయనిధి స్టాలిన్ వాగుడునూ బీజేపీ ఖండించింది. అది సహజమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. ‘రాజా వ్యాఖ్యలతో నేను నూరు శాతం విభేదిస్తున్నాను’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ నిర్ద్వంద్వంగా పేర్కొనడం స్వాగతించవలసినదే. ఆ పార్టీ కర్ణాటక ఎంపీ డీకే సురేశ్ రెండు భారతదేశాల గురించి మాట్లాడినందుకు ఇది పాప పరిహారం కావచ్చు. రేపు ఎన్నికలలో ‘ఇండి’ పేరుతో ఎన్డీఏని ఎదుర్కొ నబోతున్న కూటమి భాగస్వాములు తోటి ద్రవిడ భాగస్వామి చేస్తున్న ఇలాంటి ప్రేలాపనలను నిర్ద్వంద్వంగా ఖండించడం అవసరం. భార తీయ జనతా పార్టీని వ్యతిరేకించడం, దానిని అధికారం నుంచి దించా లనుకోవడం తప్పు పట్టవలసిన విషయం కాదు. కానీ ఒక రాజకీయ పార్టీ మీద ద్వేషం భారతదేశ ఐక్యతకు విఘాతం కారాదు. పి. వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ‘ pvg@ekalavya.net -
ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు ఊరట
చెన్నై: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాతోపాటు మరో డీఎంకే నేత చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. అయితే, డీఎంకే నాయకులు వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ, మలేరియా, డెంగ్యూతో పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా మాట్లాడడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ సమాజంలో విభజన తెచ్చేలా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. -
మంత్రులూ... అవేం మాటలు?
చెన్నై: అధికారంలో ఉన్నవారిలో సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేసే ధోరణి ప్రబలుతోందంటూ మద్రాస్ హైకోర్టు ఆందోళన వెలిబుచి్చంది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంపై చూపే ప్రతికూల ప్రభావం తాలూకు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెపె్టంబర్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. ‘సనాతన ధర్మ నిర్మూలన’పేరిట జరిగిన ఆ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు అందులో పాల్గొన్న అధికార డీఎంకేకు చెందిన పలువురు ఇతర మంత్రులు కూడా మద్దతు పలికారు. ఈ ధోరణిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు దిగే బదులు డ్రగ్స్, అవినీతి, అంటరానితనం తదితర పెడ ధోరణుల నిర్మూలనపై దృష్టి పెడితే మంచిదని వారికి సూచించింది. సదరు మంత్రులపై ఇంకా చర్యలెందుకు తీసుకోలేదంటూ పోలీసులకు తలంటింది. మంత్రుల వ్యాఖ్యలకు పోటీగా ద్రవిడ సిద్ధాంత నిర్మూలన సదస్సుకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి స్టవిస్ జి.జయచంద్రన్ కొట్టేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మ నిర్మూలన సభను ఉదాహరిస్తూ, అందుకు పోటీగా సభ పెట్టుకునేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రులు తదితరులపై అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా! పిటిషనర్ విజ్ఞప్తికి అంగీకరించడమంటే సమాజంలో మరింత చీలిక తేవడమే కాదా?’’అని ప్రశ్నించారు. మంత్రుల తీరుపైనా ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడతామంటూ చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా అధికారంలో ఉన్న కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి సమావేశాలకు అనుమతినిచ్చి వారికి శాంతిని మరింత కరువు చేయమంటారా?’’అన్నారు. నా వ్యాఖ్యలకు కట్టుబడ్డా: ఉదయనిధి చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తమిళనాడు యువజన సంక్షేమ మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ అంశంపై న్యాయ వివాదం తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. ‘సనాతన ధర్మం కరోనా, మలేరియా, డెంగీ వంటిది. అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం. దాన్ని నిర్మూలించాలి‘ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త దుమారానికి దారితీయడం తెలిసిందే. అణగారిన, పీడిత వర్గాల తరఫున తనలా మాట్లాడానని ఆయన సోమవారం చెప్పుకొచ్చారు. అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ వంటి గొప్ప నేతలు కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. -
మాటలు జాగ్రత్త.. విద్వేషాలను రెచ్చగొట్టకూడదు
చెన్నై: ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కే కానీ అది ద్వేషపూరితంగా ఉండకూడదని తెలిపింది. బాధ్యతలను తెలియజేసేది.. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు సనాతన ధర్మంపై వ్యతిరేకత గురించి డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఎలాంగోవన్ వేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ శేషసాయి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అనేది మన దేశం, మన పరిపాలకులు, తల్లిదండ్రులు, గురువుల పట్ల మన శాశ్వత బాధ్యతను గుర్తుచేసే ధర్మాల సమూహమని పేదల పట్ల దయ చూపించమని చెబుతుందని అన్నారు. సనాతన ధర్మంపై డిబేట్లా.. ఈ సందర్బంగా ఆయన సనాతన ధర్మంపై డిబేట్లు పెట్టడంపై మరింత తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మం కులవ్యవస్థను ప్రోత్సహించి అంటరానితనాన్ని ప్రేరేపిస్తుందన్న అసత్యాన్ని ప్రజల మనసుల్లో నాటే ప్రయత్నం చేయడాన్ని ఆయన ఖండించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని ఎప్పుడో నిర్మూలించడం జరిగిందని గుర్తుచేశారు. మనుషులంతా ఒక్కటే.. ఈ దేశంలో అందరూ ఒక్కటేనని ఇటువంటి దేశంలో అంటరానితనాన్ని సహించేది లేదని అన్నారు. మతం అనేది సహజమైన కల్మషంలేని స్వచమైన విశ్వాసం అనే పునాది మీద నిర్మితమైందని భావ ప్రకటన స్వేచ్ఛ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండకూడదని అన్నారు. ఇది కూడా చదవండి: ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ -
హిందీపై అమిత్ షా సందేశం హాస్యాస్పదం
చెన్నై: హిందీ భాష దేశంలోని ఇతర భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తోందని, అన్ని భాషలను, యాసలను గౌరవిస్తోందని ‘హిందీ దివస్’ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచి్చన సందేశాన్ని తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గురువారం తప్పుపట్టారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అమిత్ షా సందేశం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఎలా ఏకం చేస్తుందని ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
హిందూత్వను నిర్మూలించేందుకు కుట్ర జరుగుతోంది: మోదీ
-
వాళ్ల నాలుక చీరేయాలి.. కళ్లు పెరికేయాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
జైపూర్: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుక చీరేయాలి, కనుగుడ్లు పెరికివేయాలంటూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గత వారం రాజస్తాన్‌లోని బర్మేర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మంత్రి మాట్లాడారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. ‘ఇటువంటి సవాళ్లను మనం ఎదుర్కోవాలి. సనాతన్‌కు వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుక చీరేయాలి. వారి కళ్లు పెరికివేయాలి. సనాతనధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మన చరిత్ర, సంస్కృతులపై దాడికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వారికి అధికారం, పదవులు దక్కనివ్వరాదు’అని పేర్కొన్నారు. హిందూయిజంతో ప్రపంచానికే ప్రమాదం: రాజా చెన్నై: హిందూమతంపై తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. ఇటీవల సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఆ పార్టీకే చెందిన ఎంపీ ఎ.రాజా హిందూమతాన్ని హెచ్ఐవీ, కుష్టు వ్యాధితో పోల్చారు. తాజాగా ఎంపీ రాజా మరోసారి హిందూమతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న వీడియోను తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తాజాగా విడుదల చేశారు. ‘కులమనే ప్రపంచ వ్యాధికి హిందూమతానిదే బాధ్యత. భారత్ కులం ఆధారంగా ప్రజలను విడదీస్తోంది. సామాజిక అస్థిరత, ఆర్థిక అసమానతలను సృష్టించేందుకు కులాన్ని వాడుకున్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు హిందూయిజం పేరుతో కులాన్ని వ్యాప్తి చేస్తున్నారు. భారత్‌కే కాదు, ప్రపంచానికే హిందూమతం ప్రమాదకరం’అని ఆయన అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. చదవండి: ప్రధాని మోదీకి ఖలిస్తానీ నేత హెచ్చరిక -
డీఎంకే వ్యాఖ్యలను ఒప్పుకోం
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజా చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించబోమని కాంగ్రెస్ పేర్కొంది. అన్ని మతాలకు సమాన గౌరవం(సర్వధర్మ సమభావ) భావననే తమ పార్టీ విశ్వసిస్తుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ పవన్ ఖెరా స్పందిస్తూ..‘సమధర్మ సమభా వమనే దానినే కాంగ్రెస్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుంది, ప్రతి మతం, ప్రతి విశ్వాసాలకు ఇందులో సమస్థానం ఉంటుంది. ఎవరూ ఎవరినీ తక్కువగా చూడరు. ఇలాంటి వ్యాఖ్య లను కాంగ్రెస్ పార్టీ కూడా సమ్మతించదని అన్నారు. విద్వేషాలు తొలిగేదాకా యాత్ర: రాహుల్ విద్వేషాలు తొలిగిపోయి భారత్ ఏకమయ్యేదాకా తన యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభమై గురువారం ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్ స్పందించారు. నాలుగు వేల కిలోమీటర్ల పైచిలుకు సాగిన తన పాదయాత్ర తాలూకు వీడియో ఫుటేజిని ఎక్స్‌లో పంచుకుంటూ.. ‘ఈ యాత్ర కొనసాగుతుంది. ఇది నా ప్రామిస్’ అని రాహుల్ పేర్కొన్నారు. భారత్ జోడోయాత్రలో రాహుల్ 12 బహిరంగ సభల్లో, 100 పైచిలుకు రోడ్డు కార్నర్ మీటింగ్‌లలో, 13 విలేకరుల సమావేశాల్లో పాల్గొన్నారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ యత్నం
చెన్నై: సనాతన ధర్మకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చేస్తున్న తీవ్ర ఆరోపణలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఎదురుదాడి ప్రారంభించారు. ప్రధాని మోదీ సహా కాషాయ పార్టీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వ్యాఖ్యలపై దాఖలైన కేసులన్నిటినీ చట్టపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మణిపూర్‌లో నెలలుగా కొనసాగుతున్న హింసపై విమర్శలను ఎదుర్కోలేని ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తన వ్యాఖ్యలపై రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ, మంత్రులు సనాతన ధర్మపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై చర్చించిన విషయం తెలిసిందే. ‘ప్రజలకిచ్చిన వాగ్దానాలను తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. దీనిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నేతలు ‘జనహననం’అంటూ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. తమను తాము రక్షించుకునేందుకు దీనిని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు’అని గురువారం ఉదయనిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. ‘మణిపూర్‌లో ఆగని హింసపై సమాధానం ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే మోదీజీ స్నేహితుడు అదానీని వెంటేసుకుని ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నారు. మణిపూర్ హింసలో 250 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు..మోదీ ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది. వీటన్నిటినీ మరుగుపరిచేందుకే మోదీ, ఆయన బ్యాచ్ సనాతన వ్యాఖ్యలను వాడుకోవాలనుకుంటున్నారు. ప్రజల అమాయకత్వమే వారి రాజకీయాలకు పెట్టుబడి. ’అని విమర్శించారు. ‘ఈ రోజుల్లో సాధువులు కూడా ప్రచారం కోరుకుంటున్నారంటూ తన తలపై రూ.10 కోట్లు ప్రకటించిన సాధువుపై ఉదయనిధి వ్యాఖ్యానించారు. అంతా త్యాగం చేసిన ఆ సాధువుకు రూ.10 కోట్లు ఎలా వచ్చాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమానవీయ విశ్వాసాలపైనే..: స్టాలిన్ సనాతన ధర్మంపై తన కొడుకు, మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై రేగుతున్న దుమారంపై సీఎం స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మంలో భాగమైన అమానవీయ సిద్ధాంతాలపైనే ఉదయనిధి మాట్లాడారని చెప్పారు. వీటి ఆధారంగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. -
‘సనాతన ధర్మం అంశంపై చర్చలకు ఎవరు రమ్మన్నా వస్తా’
చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యధికులు స్టాలిన్ మాటలను వ్యతిరేకిస్తుంటే కొందరు మాత్రమే సమర్థిస్తున్నారు. తాజాగా డీఎంకే మరో మంత్రి ఏ రాజా.. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఏ రాజా మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ సున్నిత మనస్కులు కాబట్టి సున్నితంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో పోల్చారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులకు సమాజంలో ఎలాంటి బెరుకు ఉండదని సనాతన ధర్మాన్ని సమాజాన్ని భయపెట్టే హెచ్ఐవి, కుష్టు వంటి వ్యాధులతో పోల్చాలని అన్నారు. సనాతన ధర్మం, విశ్వకర్మ యోజన రెండు వేర్వేరు కాదని రెండూ ఒక్కటేనని అన్నారు. ఈ అంశంపై డిబేట్ పెడితే చర్చలకు పెరియార్, అంబేద్కర్ పుస్తకాలను వెంటబెట్టుకుని ఢిల్లీ వస్తానని అన్నారు. నాపై రివార్డులు కూడా ప్రకటించనీ నేనైతే భయపడేది లేదని అన్నారు. ఒకవేళ ప్రధాన మంత్రి చర్చలకు రమ్మన్నా వెళతాను.. అనుమతిస్తే కేంద్ర కేబినెట్ మంత్రులతో కూడా దీనిపై చర్చకు సిద్ధమని సనాతన ధర్మం అంటే ఏమిటో చెబుతానని అన్నారు. ఇది కూడా చదవండి: ‘బాలకృష్ణలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా? -
ఉదయనిధి వ్యాఖ్యల దుమారంపై మౌనం వీడిన సీఎం స్టాలిన్..
డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన దర్శంపై చేసిన వ్యాఖ్యల దుమారంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. ఉదయనిధి ఏం మాట్లాడారో తెలుసుకోకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామెంట్ చేయడం సరికాదని అన్నారు. కాగా సనాతన ధర్మాన్ని వ్యతికించడమే కాకుండా నిర్మూలించాలని మంత్రి ఉదయనిధి ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రిపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేది లేదని ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. కుల వివక్ష లేకుండా అందరికీ అన్నీ దక్కాలన్నదే ద్రావిడ మోడల్ ఉద్దేశమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దీంతో బీజేపీ, డీఎంకే మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. Hon'ble Minister @UdhayStalin didn't call for 'genocide' as distorted by BJP, but only spoke against discrimination. Disheartening to see the 'responsible' Hon'ble Prime Minister, Union Ministers and BJP Chief Ministers ignore facts and driven on fake narratives despite having… pic.twitter.com/F9yrdGjxqo — M.K.Stalin (@mkstalin) September 7, 2023 ప్రధాని మాటలు నిరుత్సాహపరిచాయి తాజాగా కొడుకు మాటల దుమారంపై తండ్రి స్టాలిన్ స్పందిస్తూ.. బీజేపీ వక్రీకరించినట్లు 'జాతి నిర్మూలన'కు మంత్రి పిలుపునివ్వలేదని కేవలం వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారని స్పష్టం చేశారు.వాస్తవాలను ధృవీకరించడానికి అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ.. బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు వాస్తవాలను విస్మరిండం, నకిలీ వార్తలను ప్రచారం చేయడం బాధ కలిగించిందన్నారు. తప్పుగా ప్రచారం చేస్తున్నారు సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై తప్పుగా విమర్శిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. అణచివేత సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బీజేపీ అనుకూల శక్తులు అతని(ఉదయనిధి) వైఖరిని సహించలేకపోతున్నాయని మండిపడ్డారు. అందుకే ‘సనాతన ఆలోచనలు గల వ్యక్తులను నరమేధం చేయాలని ఉదయనిధి పిలుపునిచ్చాడంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ పెంచి పోషిస్తున్న ఓ వర్గం సోషల్ మీడియా గ్రూపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోందని విమర్శించారు. స్వామిజీపై ఏం చర్యలు తీసుకున్నారు? ఉధయనిధిన తల నరికి తీసుకువస్తే రూ. 10 కోట్లు ఇస్తామంటూ ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యకు చెందిన ఓ స్వామీజీ చేసిన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్టాలిన్ ఘాటుగా స్పందిస్తూ ఇలాంటి ప్రకటన చేసిన స్వామిపై ఏం చర్యలు తీసుకున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే ఉదయనిధిపై అయితే కేసులు పెట్టారని అన్నారు. కేంద్ర కేబినెట్ భేటీలో ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని ప్రధాని మోదీ చెప్పినట్లు మీడియా ద్వారా తెలిసిందని.. ఇది చాలా నిరాశ పరిచిందన్నారు. డీఎంకే ప్రతిష్టను దిగజార్చలని చూస్తే.. ‘ఏదైనా ఆరోపణలను, నివేదికను ధృవీకరించడానికి ప్రధాన మంత్రికి అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఉదయనిధిపై ప్రచారమవుతున్న అబద్ధాల గురించి ప్రధానికి తెలియదా, లేక తెలిసి అలా చేస్తున్నారా?. సనాతన వివక్షత పట్ల బీజేకిపీ అసలు పట్టింపు లేదు. ఒకవేళ డీఎంకే పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని బీజేపీ ప్రయత్నిస్తే.. వారు ఆ ఊబిలో మునిగిపోతారు. కొందరు వ్యక్తులు ఇప్పటికీ ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తారు, మహిళలు కొన్ని పని చేయకూడదు. వితంతువులు పునర్వివాహం చేసుకోకూడదని వాదిస్తున్నారు. మానవ జాతిలో సగానికి పైగా ఉన్న స్త్రీలపై అణచివేతను కొనసాగించడానికి వారు 'సనాతన' అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అలాంటి అణచివేత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాత్రమే ఉదయనిధి మాట్లాడాడు. ఆ సిద్ధాంతాలపై ఆధారపడిన పద్ధతులను నిర్మూలించాలని పిలుపునిచ్చారు’అని స్టాలిన్ తన కొడుకు వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. -
ఉదయనిధిపై ట్వీట్.. బీజేపీ నేతపై కేసు
డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అటు బీజేపీ నేతలు సైతం ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఘాటుగా స్పందించారు. డీఎంకే మంత్రి సనాతన ధర్మం వ్యాఖ్యలపై సరైన విధంగా స్పందిస్తూ ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై చేసిన ట్వీట్ నేపథ్యంలో ఆయనపై తాజాగా కేసు నమోదు అయ్యింది. కాగా అమిత్ మాల్వియా ట్విటర్లో..‘తమిళనాడు సీఎం కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న భారతదేశంలోని 80% జనాభాను ఉచకోత కోయాలని ఆయన(ఉదయనిధి) అనుకుంటున్నారు. తన అభిప్రాయాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాల్సిందే. డీఎంకే ప్రతిపక్ష ఇండియా కూటమిలో ప్రముఖ పార్టీ. కాంగ్రెస్‌కు దీర్ఘకాల మిత్రపక్షం. ముంబై సమావేశంలో ఇదేనా మీరు అంగీకరించింది? అని ప్రశ్నించారు. చదండి: రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు Udhayanidhi Stalin, son of Tamilnadu CM MK Stalin, and a minister in the DMK Govt, has linked Sanatana Dharma to malaria and dengue… He is of the opinion that it must be eradicated and not merely opposed. In short, he is calling for genocide of 80% population of Bharat, who… pic.twitter.com/4G8TmdheFo — Amit Malviya (@amitmalviya) September 2, 2023 అమిత్ మాల్వియా ట్వీట్‌పై ఇక డీఎంకే కార్యకర్త కేఏవీ దినకరన్ ఫిర్యాదు చేయగా.. తమిళనాడులోని తిరుచ్చిలో మాల్వియాపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. సనాతన ధర్మంపై చేసిన తన వాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇచ్చినప్పటికీ రాజకీయ ఉద్దేశ్యంతో రెండు వర్గాల మధ్య హింస, ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా మంత్రి (ఉదయనిధి) వ్యాఖ్యలను అమిత్ మాల్వియా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారు’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు మాల్వియా ట్వీట్ తర్వాత, సనాతన ధర్మాన్ని అనుసరించే వారిపై హింసకు తాను పిలుపు ఇవ్వలేదని ఉదయనిధి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని, సనాతన ధర్మం వల్ల నష్టపోతున్న అట్టడుగు వర్గాల తరపున తాను మాట్లాడానని మంత్రి వివరణ ఇచ్చారు. కాగా సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని అన్నారు. దీంతో సనాతన ధర్మాన్ని, హిందూ సంప్రదాయాన్ని కించపరిచేలా చేసిన తన వ్యాఖల్యను ఉదయనిధి వెనక్కి తీసుకొని.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఉదయనిధి లాంటి వారికి గుణపాఠం చెప్పాలి: బండి
సాక్షి, హైదరాబాద్: సనాతన ధర్మాన్ని కించపరుస్తూ తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయప్రదాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఖండించారు. సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తే..సోనియాగాంధీ కొడుకైనా, స్టాలిన్ కొడుకైనా తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించా రు. ‘దీనిపై నిఖార్సైన హిందువని చెప్పుకున్న కేసీఆర్ ఎందుకు స్పందించరు? హిందూధర్మాన్ని కించపర్చడం, హిందువులను హేళన చేయడమే ఐఎన్డీఐఏ కూటమి ఎజెండాగా కనిపిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ వంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని హిందూసమాజాన్ని కోరుతున్నాం’అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా అమెరికాలో పర్యటనలో భాగంగా బండి సంజయ్ నార్త్ కరోలినాలోని చార్లెట్లోని హిందూ సెంటర్లో ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ర్యాలీలో పాల్గొన్నారు. -
సనాతన ధర్మం వ్యాఖ్యలపై ధీటుగా స్పందించండి.. ప్రధాని మోదీ ఆదేశం
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు పెనురాజకీయ దుమారాన్నే సృష్టించాయి. ఇప్పటివరకు ఈ అంశంపై మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జరిగిన మంత్రుల సమావేశంలో స్పందించారు. ఈ వ్యాఖ్యలపై సరైన విధంగా స్పందించాలని ఆదేశించారు. ఇది హైలైట్ చెయ్యండి.. బుధవారం జరిగిన క్యాబినెట్ మంత్రుల సమావేశంలో ప్రధాని రెండు అంశాలపై వారికి స్పష్టతనిచ్చారు. మొదటిది సనాతన ధర్మంపై డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలపై కఠినంగా స్పందించమన్నారు. రెండవది 'ఇండియా' 'భారత్' అంశంపై మాట్లాడవద్దని మంత్రులకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. కేవలం పార్టీ అధికార ప్రతినిధులు మాత్రమే ఈ అంశంపై స్పందిస్తారని మిగతావారంతా సనాతన ధర్మాన్ని కించపరచిన వ్యాఖ్యలకు దీటుగా సమాధానమివ్వాలని కోరారు. కుర్రనేత తగ్గేదెలే.. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకపక్క బీజేపీ నేతలంతా ఈ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తుంటే.. మరోపక్క డీఎంకే యువనేత మాత్రం తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని మళ్ళీ మళ్ళీ ఇదే మాట అంటానని తెగేసి చెబుతున్నారు. కేంద్రం కులవివక్షను పెంచి పోషిస్తోందని, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఉదయనిధి స్టాలిన్ పైన ఆ వ్యాఖ్యలను సమర్ధించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే పైన కూడా యూపీలోని రామ్‌పూర్‌లో కేసు నమోదైంది. ఇది కూడా చదవండి: రామ్‌నాథ్ కోవింద్ కమిటీ మొదటి సమావేశంలో కీలకాంశాలు -
ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోదీ
-
ఉదయనిధి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగని దుమారం
-
ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన విశాఖ శారదా పీఠాధిపతులు
-
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ ప్రకంపనలు
-
ఇండియా కూటమి హిందూ వ్యతిరేకి
న్యూఢిల్లీ: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ప్రతిపక్ష ఇండియా కూటమిపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశం హిందూమతమే లక్ష్యంగా జరిగిందని ఆరోపించారు. అయితే, తాము అన్ని మతాలను, ప్రతి ఒక్కరి విశ్వాసాలను గౌరవిస్తామని, అదేసమయంలో ఇతరులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని కాంగ్రెస్ పేర్కొంది. మనుషుల్ని సమానంగా చూడలేని మతం మతమే కాదని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. అటువంటి మతం రోగంతో సమానమన్నారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్ మాత్రం ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. దేశంలోని కోట్లాదిమంది ఆచరించే సనాతనధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని కరణ్ సింగ్ అన్నారు. క్షమాపణ చెప్పాలి ఉదయనిధి వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు సోనియాగాంధీ, రాహుల్, అశోక్ గెహ్లాట్ తదితరులు మౌనంగా ఎందుకున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆ కూటమి హిందూ మతానికి వ్యతిరేకమని ఆరోపించింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి,అనురాగ్ ఠాకూర్ ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. ఇండియా కూటమి నేతలు క్షమాపణ చెప్పకుంటే దేశం వారిని క్షమించబోదన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉదయనిధిపై ముజఫర్‌పూర్‌కు చెందిన లాయర్ సుధీర్ కుమార్ ఓఝా కోర్టులో పిటిషన్ వేశారు. -
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. అతడొక జూనియర్
కోల్‌కతా: తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమిలో ఒక్కొక్క పార్టీ విభేదిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా చేరిపోయారు. వివాదం జరిగిన ఒక రోజు తర్వాత మమతా బెనర్జీ స్పందిస్తూ ఏమన్నారంటే.. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. నా దృష్టిలో ఉదయనిధి స్టాలిన్ చాలా జూనియర్. ఆయన ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారన్నది నాకు తెలియదు. అన్ని మతాలను గౌరవించాలన్నది నా అభిప్రాయం. నాకు తమిళనాడు ప్రజలంటే అమితమైన గౌరవం. కానీ వారు అన్ని మతాలను సమానంగా గౌరవించాలని కోరుతున్నాను. భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. నాకు సనాతన ధర్మం మీద అపార గౌరవముంది. వేదాల నుంచే మనం అన్నీ నేర్చుకున్నాము. పౌరోహిత్యాన్ని గౌరవించుకుంటాము.. పౌరోహిత్యం చేస్తున్న వారికి పెన్షన్లు కూడా ఇస్తున్నాము. దేశ వ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. మనమంతా దేవాలయాలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, చర్చిలకు కూడా వెళ్తుంటాం. భారతదేశ మూలాల నుంచి గమనిస్తే భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇక్కడ అనాదిగా కొనసాగుతూ వస్తోంది. దాన్ని మనం గౌరవించాలని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల ప్రభావం పరిణామ క్రమంలో వృద్ధి చెందుతున్న 'ఇండియా' కూటమిపైన పడే అవకాశమున్నందున ఇప్పటికే ఈ కూటమిలోని పార్టీలు నష్ట నివారణ చర్యలు చేపట్తాయి. కాంగ్రెస్ పార్టీ తమకు అన్ని మతాలపైనా గౌరవముందని ప్రకటించగా.. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీ ఉదయనిధి వ్యాఖ్యలతో తీవ్రంగా విభేదించింది. తాజాగా మమతా బెనర్జీ కూడా ఈ జాబితాలో చెరిపియారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ఎన్ని సెలవులు తీసుకున్నారో తెలుసా? -
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి
చెన్నై: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సనాతన ధర్మాన్ని ఆయన కరోనా వైరస్, మలేరియా, డెంగీ జ్వరం, దోమలతో పోల్చారు. ఇలాంటి వాటిని వ్యతిరేకించడం కాదు, నాశనం చేయాలన్నారు. శనివారం చెన్నైలో తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి మాట్లాడారు. ‘సనాతన్ అనేది సంస్కృత పదం. సనాతన్ అంటే ఏమిటి? ఇది శాశ్వతమైంది. అంటే మార్చేందుకు వీల్లేనిది. ఎవరూ ప్రశ్నించలేనిది. మతం, కులం ఆధారంగా ఇది ప్రజలను విడదీస్తుంది’ అని ఉదయనిధి అన్నారు. ‘సనాతన ధర్మం కారణంగా భర్త కోల్పోయిన మహిళలు నిప్పుల్లోకి నెట్టివేయబడ్డారు(గతంలో సతీసహగమనం). వితంతువులకు శిరోముండనం చేయించారు. తెల్ల చీరలు ధరింపజేశారు. బాల్య వివాహాలూ జరిగాయి. ద్రవిడ విధానంలో అటువంటి వాటిని లేకుండా చేశాం . వారికి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విశ్వకర్మ యోజన పథకం, 1953లో రాజగోపాలాచారి తీసుకువచ్చిన కులాధారిత విద్యా పథకం వంటిదే. డీఎంకే దీనిని గట్టిగా వ్యతిరేకిస్తుంది. వెనుకబడిన, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు నోచుకోరాదనే నీట్ వంటి వాటిని కేంద్రం తీసుకు వచ్చింది. దీనిని మేం వ్యతిరేకిస్తున్నాం’అని ఉదయనిధి చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సనాతనం ఓడాలి, ద్రావిడం గెలవాలి అని ఉదయనిధి అన్నారు. ‘అన్ని కులాల వారు ఆలయా ల్లో అర్చకత్వానికి అర్హులేనంటూ కరుణా నిధి చట్టం తెచ్చారు. మన సీఎం స్టాలిన్ అర్చకత్వంలో శిక్షణ పొందిన వారిని ఆలయాల్లో పూజారులుగా నియమించారు. ఇదే ద్రవిడియన్ మోడల్’ అని ఆయన చెప్పారు. అది విద్వేష ప్రసంగం: బీజేపీ సనాతన ధర్మాన్ని ఆచరించే 80% మందిని సామూహికంగా చంపేయాలంటూ ఉదయనిధి వ్యాఖ్యానించడం విద్వేష ప్రసంగమేనని బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ అన్నారు. మిత్ర పక్షం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకవైపు ప్రేమ దుకాణం తెరుద్దామని పిలుపునిస్తుండగా డీఎంకే వారసుడు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్నారన్నారు. సామూహికహననం వ్యాఖ్యలపై కాంగ్రెస్ మౌనం మద్దతు నివ్వడమే అవుతుంది. పేరుకుతగ్గట్లే ఇండియా కూటమికి అధికారమిస్తే వేలాది సంవత్సరాల భారత సంస్కృతిని ధ్వంసం చేస్తుంది’ అని పేర్కొన్నారు. నేనలా అనలేదు: ఉదయనిధి తన వ్యాఖ్యలపై చెలరేగిన విమర్శలపై ఉదయనిధి ‘ఎక్స్’లో స్పందించారు. ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని సాధించడమే. సనాతన ధర్మం కారణంగా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన వారి తరఫున మాట్లాడాను. నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను. సనాతన ధర్మాన్ని ఆచరించే వారిని సామూహికంగా హతమార్చాలని మాత్రం నేను అనలేదు. సమాజంపై సనాతన ధర్మం ఎటువంటి చెడు ప్రభావం చూపిందనే విషయంలో అంబేడ్కర్, పెరియార్ వంటి వారు అధ్యయనం చేసి రాసిన పుస్తకాల్లో ఏముందో చూపిస్తాను. ఎటువంటి సవాళ్లయినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం’అని పేర్కొన్నారు. ఓట్ల కోసమే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుంగార్పూర్(రాజస్తాన్): సామాజిక న్యాయానికి, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకమంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ ఈ విధమైన ఆరోపణలకు దిగుతున్నాయని మండిపడ్డారు. లష్కరే తోయిబా కంటే హిందుత్వ సంస్థలే మరింత ప్రమాదకరమంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఇలాంటివి వీరికి కొత్తకాదు, ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తారని పేర్కొన్నారు. -
నా చివరి సినిమాని బలమైన కథతో చేయాలనుకున్నా!
‘‘నాయకుడు’ చాలా మంచి కథ, పొలిటికల్ డ్రామా, సామాజిక న్యాయం, ప్రజల మధ్య సమానత్వం గురించి ఈ మూవీలో చర్చించాం. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది’’ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘మామన్నన్’. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించి, నిర్మించారు. కీర్తీ సురేష్ హీరోయిన్. జూన్ 29న ఈ చిత్రం విడుదలైంది. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో ఏషియన్ మల్టీప్లెక్స్, సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్నాయి. నేడు ఈ మూవీ రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ–‘‘తెలుగులో నా గత చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈ సినిమాను తమిళంలో మాత్రమే విడుదల చేయాలనుకున్నాం. అయితే తమిళంలో మంచి వసూళ్లను సాధించడంతో ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నేను సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాక నా చివరి సినిమాని బలమైన కథతో మారి సెల్వరాజ్‌తో చేయాలనుకున్నాను’’ అన్నారు. -
సినిమా ఒప్పుకునేముందు ఆ మూడు చూస్తాను: ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్ దాదాపు 150 చిత్రాలకు పాటలు స్వర పరిచారు. ఆస్కార్ అవార్డు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అయితే ‘‘నేనింకా నేర్చుకునే దశలో ఉన్నాను. నా కెరీర్ ఇప్పుడే మొదలైనట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతీ పదేళ్లకు సంగీతంలో మార్పులొస్తున్నాయి’’ అన్నారు రెహమాన్. ఉదయనిధి స్టాలిన్, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన తమిళ ‘మామన్నన్’కి రెహమాన్ సంగీతం అందించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ... ► ఇటీవల పొన్నియిన్ సెల్వన్’లాంటి పీరియాడికల్ ఫిల్మ్‌కి సంగీతం అందించిన మీకు ‘నాయకుడు’లాంటి రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేయడం ఎలా అనిపిస్తుంటుంది? ‘నాయకుడు’ రాజకీయ నేపథ్యంలో రూపొందించిన సినిమా. సమాజంలోని అసమానతలతో పాటు చాలా విషయాల గురించి చర్చించారు. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం సవాల్ అని చెప్పలేను కానీ ఓ కొత్త అనుభూతి మాత్రం దక్కుతుంది. చాలా రోజుల తర్వాత నేను జానపద తరహా పాటలు ఇచ్చిన చిత్రమిది. ► మీరు ఒక సినిమా ఒప్పుకోడానికి కథ, హీరో, దర్శకుడు.. ఈ మూడింటిలో ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తారు? మూడూ ముఖ్యమే. మంచి కథ ఉంటే మంచి పాటలు ఇవ్వగలం. ఆ పాటలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాలి. హీరో చేసే మంచి పెర్ఫార్మెన్స్ని బట్టి ఆ పాట హైలైట్ అవుతుంది. ఇప్పుడు ‘నాయకుడు’ విషయానికి వస్తే.. హీరో ఉదయనిధి స్టాలిన్ ముందు నన్ను సంప్రదించారు. సంగీతం అందించాలని అడిగారు. ఆ తర్వాత నేను కథ విన్నాను.. ఆసక్తిగా అనిపించింది. దర్శకుడు మారీ సెల్వరాజ్ ఇప్పటివరకూ తీసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రకథ ఉంది. మారి ఈ కథకు చాలా మాస్ అప్పీల్ ఇచ్చారు. అందుకు తగ్గట్టు పాటలు ఇచ్చాను. ఈ సినిమాలో ప్రతి పాట కథను ముందుకు తీసుకుని వెళుతుంది. అందుకే మ్యూజిక్ ఇవ్వడాన్ని ఎంజాయ్ చేశా. ► అందుకేనా ఈ సినిమా ఫంక్షన్‌కి సంబంధించిన వేదికపై ‘జివ్వు జివ్వు...’ పాటకు డ్యాన్స్ కూడా చేశారు.. ఈ సాంగ్ సిట్యువేషన్ చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. అది మైండ్‌లో పెట్టుకోవడంతో పాటు ఫన్ టచ్ ఇవ్వాలనుకుని ట్యూన్ చేశా. ఫన్ కోసమే స్టేజి మీద డ్యాన్స్ కూడా చేశాను. ► సంగీతంలో మార్పులు వస్తున్నట్లే మీ ఆలోచనా విధానం కూడా మారుతోందా? ఎన్ని మార్పులు వచ్చినా మెలోడీ మారదు. లిరిక్ కూడా మారదు.. 30, 40 ఏళ్లుగా అదే. అయితే వైబ్రేషన్ కొంచెం మారుతుంది... బీట్ మారుతుంది. ‘రోజా’ నుంచి నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే. అదేంటంటే నా పాట సింపుల్‌గా, క్యాచీగా ఉండాలి. ప్రేక్షకుల్లో, సమాజంలో వచ్చిన మార్పు తాలూకు ప్రభావం సంగీతంపై ఉంటుంది. ఇప్పుడు సంగీతానికి ఇంకా స్కోప్ పెరిగింది. ► తెలుగులో బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్‌చరణ్ హీరోగా రూపొందనున్న చిత్రం గురించి? ఇది చాలా ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇప్పుడే రివీల్ చేయలేను. ► మీ అమ్మాయి ఖతీజా తమిళ చిత్రం ‘మిన్మిని’తో సంగీత దర్శకురాలిగా పరిచయం కానున్నారు... ఓ ఫాదర్‌గా మీ ఫీలింగ్? మహిళలు తాము అనుకున్నది సాధించాలనుకునే మైండ్ సెట్ నాది. మా ఇంట్లో మా అమ్మగారు, నా వైఫ్ వెరీ స్ట్రాంగ్. నా కూతురు ఖతీజా కూడా అంతే. ఏ మాత్రం టెన్షన్ పడటంలేదు. ట్యూన్స్ ఎలా ఇవ్వాలనే విషయంలో తనకు మెచ్యూర్టీ ఉంది. ఓ ఫాదర్‌గా ఐయామ్ హ్యాపీ. ► ‘గాంధీ టాక్స్’ అనే సైలెంట్ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడంపై మీ అనుభూతి గురించి? గతంలో ‘పుష్పక విమానం’లాంటి సైలెంట్ సినిమాలను అద్భుతంగా చేశారు. ఇప్పుడు నాకలాంటి మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి సినిమాలు సవాల్ అనాలి. అందుకే ఈ సినిమా డైరెక్టర్ కిశోర్‌తో ‘ఐ హేట్ యు.. లవ్ యు’ అని సరదాగా అన్నాను. డైలాగ్స్ లేకుండా సాగే ఈ సినిమాలోని సందర్భాలకు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడం అనేది నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. -
వడివేలు పేరు చెప్పగానే షాక్ అయ్యాను: ఉదయనిధి స్టాలిన్
కోలీవుడ్ ప్రముఖ హీరో, నిర్మాత, తమిళనాడు రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మామన్నన్'. నటి కీర్తి సురేష్ నాయకిగా నటించిన ఇందులో వడివేలు, ఫాహత్ ఫాజిల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 29వ తేదీన విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక స్టార్ హోటల్లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. (ఇదీ చదవండి: జవాన్ ట్రైలర్: నేను విలనైతే ఏ హీరో నాముందు నిలబడలేడు) ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం 'ఆరుకల్ ఆరు కన్నాడీ' పెద్ద విజయం సాధించిందన్నారు. కాగా ఇప్పుడు తన చివరి చిత్రం 'మామన్నన్' మంచి ఓపినింగ్స్ సాధిస్తూ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని 510 థియేటర్లలో విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పుడు రెండవ వారంలో కూడా 470 థియేటర్లలో రన్ అవుతోందని చెప్పారు. ఇంత మంచి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం చేస్తున్నప్పుడు చాలా అనుభవాలను చవి చూశామన్నారు. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) చిత్ర ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సన్నివేశాలను నాలుగు రోజులు పాటు చిత్రీకరించినట్లు చెప్పారు. షూటింగ్ మొదలైన 8 రోజులు వరకు దర్శకుడు మారి సెల్వరాజ ఏం తీస్తున్నారో అర్థం కాలేదన్నారు. తర్వాత క్రమంగా అవగాహన వచ్చిందన్నారు. ఈ చిత్రంలో తనకు తండ్రిగా వడివేలు పేరు చెప్పగానే షాక్‌కు గురయ్యానన్నారు. అయితే ఇందులో వడివేలు నటించకపోతే ఈ చిత్రమే వద్దు వేరే చిత్రం చేద్దామని మారి సెల్వరాజ అన్నారన్నారు. ఆయనకు ఈ నమ్మకంతో ఈ చిత్రాన్ని అప్పగించానో దాన్ని పూర్తి చేశారని అన్నారు. మామన్నన్ చిత్రం 9 రోజుల్లోనే రూ.52 కోట్లు వసూలు చేసిందని, తన కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రం ఇదని ఆయన పేర్కొన్నారు. తెలుగులో మామన్నన్ జులై 14న 'నాయకుడు' పేరుతో విడుదల కానుంది. -
కుటుంబంలో ఒకరికే రూ.1000.. రేషన్ కార్డుల్లో కుటుంబ పెద్దగా మహిళ
సాక్షి, చైన్నె: ఎన్నికల హామీగా గృహిణులకు రూ.1000 నగదు పంపిణీ పథకం కలైంజ్ఞర్ మగలిర్ ఉరిమై తొగై (కలైంజర్ మహిళా హక్కు మొత్తం) అమలుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అర్హులైన వారందరికి ఈ పథకం వర్తింపచేయాలని సీఎం స్టాలిన్ శుక్రవారం ఆదేశించారు. సాయంత్రం సచివాలయంలో ఈ పథకం అమలుకు లబ్ధిదారుల ఎంపిక అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయి అధికారులు, సీఎస్ శివదాస్ మీనా, మంత్రులు ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. తమిళనాడు ప్రభుత్వ పరిపాలనా చరిత్రలోనే ఈ పథకం ఓ చిహ్నంగా మారబోతోందని ఈసందర్భంగా సీఎం ధీమా వ్యక్తంచేశారు. ఈ పథకానికి కలైంజ్ఞర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. కోటి మంది మహిళాలకు నెలకు రూ.1000 నగదు పంపిణీ చేస్తామని తెలిపారు. కలైంజ్ఞర్ ‘మహిళల హక్కుల మొత్తం’ దీనిని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈపథకం కోసం 2023–2024 బడ్జెట్లో 7 వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఈ పథకం సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్హులైన వారికి న్యాయం చేకూర్చాలని సూచించారు. నిర్ణీత గడువులోపు అర్హులను ఎంపికచేయాలని ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేయాలని, ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. ఈ పథకం కోసం కోటిన్నర మంది నుంచి దరఖాస్తులు వస్తాయని అంచనా వేశామన్నారు. దరఖాస్తులను చౌకదుకాణాలు, ప్రత్యేక శిబిరాల ద్వారా స్వీకరించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను పోలీసు యంత్రాంగం కల్పించాలన్నారు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటున్న వారి నుంచి రేషన్, ఆధార్ కార్డు వివరాలను సేకరించాలన్నారు. అర్హులైన వారి వద్ద వివరాలు లేకుంటే పరిశీలించి న్యాయం చేయాలన్నారు. అలాగే రేషన్ కార్డు కలిగిన ఓ కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ నగదు పంపిణీ జరుగుతుందన్నారు. అలాగే, ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ పథకం కింద ఎంపికయ్యే మహిళలు ఇక, కుటుంబ పెద్దలుగా ఉంటారని ప్రకటించారు. -
నాయకుడుతో...
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తీ సురేష్ లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం ‘మామన్నన్’. ‘పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్’ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా ఏషియన్ మల్టీప్లెక్స్– సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ‘‘పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
తెలుగులోకి వచ్చేస్తున్న తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమా
కోలీవుడ్‌లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా కీర్తి సురేష్, వడివేలు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మామన్నన్' జూన్ 29న విడుదలై అక్కడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఉదయనిధి కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన ఈ చిత్రంపై పలు విమర్శలు వచ్చినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపే సినిమాలు చేస్తాడని పేరున్న మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అతని కెరీర్లో బెస్ట్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్) ఇతర భాషల్లో హిట్ టాక్ వచ్చి.. భారీగా ప్రేక్షకాధరణ పొందిన సినిమాలను టాలీవుడ్లో కూడా విడుదల చేస్తుంటారు. తెలుగులో 'నాయకుడు' అనే పేరుతో విడుదల చేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చారు. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకున్నారు. జులై 14వ తేదీన ఈసినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఆరురోజులకు గాను రూ. 52 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక తెలుగులో విడుదల అయిన తర్వాత ఏమేరకు కలెక్ష్న్స్ రాబడుతుందో చూడాలి. 'మామన్నన్' కథేంటి? కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) -
కృతిక ఉదయ నిధి ఆస్తుల అటాచ్?
సాక్షి, చెన్నై: సీఎం ఎంకే స్టాలిన్ కోడలు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయ నిధికి సంబంధించిన రూ. 36.3 కోట్లు విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అటాచ్ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఉదయ నిధి సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో లభించిన ఆధారాల మేరకు ఉదయ నిధి సేవా ట్రస్ట్‌కు సంబంధించిన నిర్వాహణ బాధ్యతల్లో ఉన్న కృతికను ఈడీ టార్గెట్ చేసినట్లు సమాచారం. ఆమె పేరిట ఉన్న స్థిర, చర ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో పాటు ఆమె పేరిట బ్యాంక్‌లో ఉన్న రూ. 34 లక్షల నగదును సీజ్ చేసింది. -
CII Dakshin 2023: యువత సినీపరిశ్రమకు రావాలి
‘‘దక్షిణాది సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం గొప్ప విషయం. యువత సినిమా పరిశ్రమకు రావాలి. ‘ఆర్ఆర్ఆర్, ‘ది ఎలిఫెంట్ ఆఫ్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డులు సాధించడం గర్వకారణం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. బుధవారం చెన్నైలో జరిగిన సీఐఐ (కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) దక్షిణ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఐఐ దక్షిణ్ చైర్మన్, మేనేజింగ్ పార్ట్నర్ టీజీ త్యాగరాజన్ నేతృత్వంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు ప్రారంభోత్సవంలో తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, స్వామినాథన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీఐఐ దక్షిణ్ కమిటీ సభ్యురాలు సుహాసిని, నిర్మాత అల్లు అరవింద్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటులు కార్తీ, రిషబ్ శెట్టి, నటి మంజు వారియర్, దర్శకుడు వెట్రిమారన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెల్వమణి మాట్లాడుతూ– ‘‘తమిళ చిత్రాల షూటింగ్‌లు తమిళనాడులో అధికంగా జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకూ దక్షిణాదిలో 50 వేల చిత్రాలు రూపొందాయి. అయితే సినిమాలనే నమ్ముకున్న కార్మికులకు ప్రోత్సాహం లేదు. వారి కోసం తమిళనాడు సినీ కార్మికుల డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి’’ అన్నారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ – ‘‘తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్ సినీ పరిశ్రమకు అండగా ఉంటారు. సెల్వమణి తదితరులు పేర్కొన్న అంశాల గురించి చర్చించి, చర్యలు తీసుకుంటాం’’ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు...’ పాట నృత్యదర్శకుడు ప్రేమ్ రక్షిత్, ‘ది ఎలిఫెంట్ ఆఫ్ విస్పరర్స్’ షార్ట్ ఫిలిం దర్శకురాలు కార్తీకీలను సత్కరించారు. -
పది నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో మినీ క్రీడాస్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పది అసెంబ్లీ నియోజకవర్గాలలో తొలి విడతగా అన్ని హంగులతో క్రీడామైదానాలను తీర్చిదిద్దనున్నారు. ఒక్కో మైదానం పనులకు రూ. 3 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, క్రీడాకారులకు ప్రోత్సాహం, అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీలకు చైన్నెను వేదికగా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వేదికగా క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ క్రీడా ప్రగతి గురించి ప్రత్యేక విజన్‌ను రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇందులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయనున్నామని, ఇది మినీస్టేడియం తరహాలో ఉంటాయని ప్రకటించారు. దీనిని కార్యరూపంలోకి తెస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. పది నియోజకవర్గాలలో.. తొలి విడతగా పది అసెంబ్లీ నియోజకవర్గాలలో మినీ స్టేడియంల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సీఎం స్టాలిన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కొళత్తూరు, మంత్రి ఉదయనిధి ప్రాతినిథ్యం వహిస్తున్న చే పాక్కం– ట్రిప్లికేన్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అలాగే వాణియంబాడి, కాంగేయం, చోళవందాన్, తిరువెరంబూరు, శ్రీ వైకుంఠం, పద్మనాభపురం, ఆలంకుడి, కారైక్కుడి అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గంలో రూ.3 కోట్లతో ఈ మైదానాలు ఏర్పాటు కానున్నాయి. మినీ స్టేడియంను తలపించే విధంగా ప్రేక్షకుల గ్యాలరీ, పరుగు పందెం ట్రాక్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఆటల కోసం ప్రత్యేక ఏర్పాటు, క్రీడాకారులకు వసతి, ఇతర సౌకర్యాలతో ప్రత్యేక నిర్మాణాలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాలలో మినీస్టేడియంల నిర్మాణానికి అవసరమైన స్థల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ఇక్కడ త్వరితగతిన పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలపై దృష్టిపెట్టారు. -
నటన వదిలినా సినిమా వదలను
తమిళసినిమా: రాజకీయ కుటుంబం నుంచి సినీరంగ ప్రవేశం చేసి నిర్మాతగా మారి, ఆపై నటుడిగా, డిస్ట్రిబ్యూటర్‌గా అవతారమెత్తి, ఆ తరువాత ఎమ్మెల్యేగా గెలిచి, ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన యువ రాజకీయ నాయకుడు ఉదయనిధిస్టాలిన్. ఈయన మంత్రి అయిన తరువాత నటనకు స్వస్తి పలికారు. ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం మామన్నన్. కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని మారి సెల్వరాజ్ తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇకపోతే డిస్ట్రిబ్యూషన్ రంగంలో నంబర్‌వన్ స్థాయికి ఎదిగిన ఆయనకు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాల వరకూ వదలకుండా విడుదల చేస్తోంది. ఇటీవల పొంగల్‌కు విడుదలైన విజయ్ వారిసు, అజిత్ తుణివు చిత్రాలు కూడా ఈ సంస్థ ద్వారా వచ్చినవే. ఆ మధ్య కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థనే విడుదల చేసింది. ఇలా డిస్ట్రిబ్యూటర్‌గానూ భారీ లాభాలను గడిస్తున్నారు. (వారిసు చిత్రం కొన్ని ఏరియాలు మాత్రమే) అలా ఉదయనిధి స్టాలిన్ నటనకు దూరం అయినా, సినిమాను మాత్రం వదులుకోవడం లేదు. ఇందుకు మరో ఉదాహరణ సినిమాల కోసం ఈయన రూ. 2వేల కోట్లు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల బ్లాక్ షీప్ అనే యూట్యూబ్ చానల్‌ను కొనేసినట్లు సమాచారం. అది ఇప్పుడు టీవీ చానల్‌గా రూపాంతరం చెందింది. ఈ చానల్ కోసం, యూట్యూబ్ చానల్ కోసం కొత్తగా సినిమాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
మోడ్రన్ పాత్రల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నా : నటి
తమిళ సినిమా: ఎస్సీ జననాథన్ దర్శకత్వం వహింన పేరాన్మై చిత్రం ద్వారా పరిచయం అయిన నటి వసుంధర. జయం రవి కథానాయకుడిగా నటించారు. ఐదుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన కన్నై నంబాదే చిత్రం, సముద్రఖని సరసన తలైకుత్తల్ చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా నటి వసుంధర తన భావాలను వ్యక్తం చేస్త దర్శకుడు, నటుడు సముద్రఖని, శీనరామసామి వంటి దర్శకులు తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఆ మధ్య నటించిన కన్నే కలైమానే, బక్రీద్ వంటి త్రాలు తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయన్నారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్, ప్రసన్న శ్రీకాంత్ నాతో నటింన కన్నై నంబాదే చిత్రం మల్టీస్టార్‌గా రపొందిందన్నారు. ఇరవుక్కు అయిందు కన్గళ్ చిత్రం ఫేమ్ ఎం.వరన్ ఈ చిత్రానికి దర్శకుడు అని చెప్పారు. ఇందులో తనది కొంచెం మోడ్రన్ పాత్ర అని చెప్పారు. ఇలాంటి మోడ్రన్ పాత్రల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. పేరాన్మై చిత్రం తరువాత ఇందులో కొంచెం గరుకు తనం కలిగిన పాత్రలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో తనకు ఉదయనిధి స్టాలిన్‌కు మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయన్నారు. ఆయనది రాజకీయ కుటుంబం అయినా అందరితో ఎంతో మర్యాదగా ఉండేవారని, ఫైట్ సన్నివేశాల్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా కేర్ తీసుకునే వారిని చెప్పారు. ప్రస్తుతం క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్లు చెప్పారు. అదేవిధంగా కలైకుత్తల్ చిత్రంలో సముద్రఖని సరసన నటించడం మం అనుభవంగా పేర్కొన్నారు. ఇందులో ఖదిర్, వయ్యాపురి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారని చెప్పారు. జయప్రకాష్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహింన చిత్రం ఇదని తెలిపారు. ఈ చిత్రంలో సముద్రఖని నుం తాను చాలా నేర్చుకున్నానన్నారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణన్ దర్శకత్వంలో రపొందుతున్న థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న త్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రేక్షకుల అభిరుచిని మార్చే విధంగా వినూత్న కథా చిత్రాలను అందిస్తున్నాయన్నారు. అలాంటి చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహింన పొన్నియిన్ సెల్వన్ వంటి చారిత్రక కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు నటి వసుంధర పేర్కొన్నారు. -
ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్
నటి నిధి అగర్వాల్ ప్రస్తుతం కోలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇంతకుముందు శింబు సరసన ఈశ్వరన్, జయం రవికి జంటగా భూమి చిత్రాల్లో మెరిసింది. తాజాగా ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా కలగ తలైవన్ చిత్రంలో నాయికగా నటించింది. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా నటి నిధి అగర్వాల్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కలగ సంఘం చిత్రంలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఒకసారి దర్శకుడు మగిళ్ తిరుమేణి నుంచి ఫోన్ వచ్చిందని, వెంటనే ఆయన్ని కలుస్తానని చెప్పానంది. అలా కలిసిన వెంటనే ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోమని చెప్పారంది. ఆ తర్వాత ఆయన తన ముఖ కవళికలను మాత్రమే ఫొటో షూట్ చేశారని చెప్పింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించాలని తెలిపారు. ఇందులో నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నట్లు చెప్పింది. ఆయన సహ నటీనటులకు ఎంతో గౌరవం ఇస్తారంది. ఉదయనిధి స్టాలిన్‌కు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు, పనుల ఒత్తిడి ఉంటుందని, అయితే వాటిని షూటింగ్లో ఎప్పుడు కనబరిచే వారు కాదని చెప్పింది. తమిళ చిత్రాల్లో నటిస్తున్నప్పటి నుంచి తమిళభాషను నేర్చుకుంటున్నానని నిధి అగర్వాల్ తెలిపింది. చదవండి: మహాలక్ష్మి తల్లి కాబోతుందా? ఫొటో వైరల్ ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. -
నిధి అగర్వాల్ ఇకపై నటిస్తుందో, లేదో?. హీరో షాకింగ్ కామెంట్స్
తమిళసినిమా: నెంజిక్కు నీతి వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఉదయనిధి స్టాలిన్ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. అలా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రాల్లో ఒకటి కలగ తలైవన్. తన రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఈయన నిర్మించిన ఈ చిత్రంలో ఈశ్వరన్, భూమి చిత్రాల ఫేమ్ నిధిఅగర్వాల్ కథా నాయకిగా నటించింది. బిగ్‌బాస్ ఆరవ్ విలన్‌గా నటించిన ఈ చిత్రానికి మీగామన్, తోడు చిత్రాల ఫేమ్ మేడి న్ తిరుమేణి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ దేవా సంగీతం, దిల్ రాజు చాయాగ్రహణం అందించిన ఈ చి త్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఈ నెల 18వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం రాత్రి చెన్నైలోని సత్యం థియేటర్లో చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పా ల్గొన్న శాసనసభ్యుడు, చిత్ర కథానాయకుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ దర్శకుడు చిత్రాన్ని చాలా చక్కగా, త్వరగా చిత్రీకరించా రని పేర్కొన్నారు. అయితే దీన్ని మూ డేళ్లుగా చెక్కుకుంటూ వచ్చారన్నారు. ఈనెల 18వ తేదీన విడుదల చేయాలని చెప్పామని, లేకపోతే ఇంకా దీన్ని చెక్కుతూనే ఉండేవారని, అంత పర్ఫెక్ట్గా కలగ తలైవన్ చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దారని తెలిపారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో తనకంటే కథానాయకి నిధిఅగర్వాల్నే ఎక్కువగా శ్రమించారని, ఆమెకే ఎక్కువగా ఫైట్స్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, వాటి కోసం ఆమె దెబ్బలు తింటూ చాలానే కష్టపడ్డారని చెప్పారు. పాపం ఆమె మళ్లీ తమిళ చిత్రాల్లో నటిస్తుందో? లేదో అని సరదాగా వ్యాఖ్యానించారు. దీని తర్వాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న మా మన్నన్ చిత్రం విడుదల కానుందని తెలిపారు. కాగా అందరూ చిత్రాల నుంచి వైదొలగవద్దని చెబుతున్నారని తెలి పారు. తాను నటించడం మొదలెట్టిందే ఇప్పుడే అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. -
నిజానికి నేను డాన్ కావాల్సింది: యంగ్ హీరో
'డాన్' తానే అవ్వాల్సిందని నటుడు, నిర్మాత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ అన్నారు. నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించి లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి తన ఎస్కే ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం డాన్. ప్రియాంక మోహన్ నాయకిగా నటించిన ఇందులో ఎస్.జే. సూర్య, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రం (25 రోజుల క్రితం) విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ సోమవారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ కార్యక్రమంలోనే డాన్ రూ. 100 కోట్ల క్లబ్లో చేరుతుందని చెప్పానన్నారు. ఇది డాక్టర్ చిత్ర వసూళ్లను మూడు వారాల్లోనే అధిగమించి రూ.125 కోట్లను వసూలు చేసిందన్నారు. చదవండి: ఈవారం సినిమా జాతర.. ఏకంగా 22 చిత్రాలు, సిరీస్‌లు నిజానికి 'డాన్' చిత్రంలో తాను నటించాల్సిందని, అది జరగకపోవడంతో దర్శకుడు గ్రేట్ ఎస్కేప్ అయ్యారన్నారు. ఇందులోని కళాశాల క్లైమాక్స్ సన్నివేశాల్లో నటించడం కచ్చితంగా తన వల్ల అయ్యేది కాదన్నారు. ఈ చిత్రం కరెక్ట్ నటుడి చేతిలో పడిందని అభిప్రాయపడ్డారు. చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. -
చిత్ర విజయానికి ముఖ్య కారణం అతనే..: యంగ్ హీరో
Udhayanidhi Stalin About Nenjukku Needhi Success: ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం నెంజిక్కు నీతి. తాన్య నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో జీ స్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్స్, రోమియో పిక్చర్స్ సంస్థలు నిర్మించాయి. అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల హక్కులను పొందింది. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చెన్నైలో థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ మనసులను టచ్ చేసే చిత్రాన్ని అందించామని, అందుకు అభినందించిన మీ అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. హిందీ చిత్రం 'ఆర్టికల్ 15'ను తమిళ్‌కు తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసి తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ రాజా కామరాజ్‌నే ఈ చిత్ర విజయానికి ముఖ్య కారణమన్నారు. అందరూ చాలా బాగా నటించారని, నిర్మాతలకు థాంక్స్ అని, ఈ చిత్ర విజయాన్ని దర్శకుడు అరుణ్ రాజా కామరాజ్‌కు ఆయన సతీమణికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్ నీటి అలల మధ్య భర్తకు అనసూయ లిప్‌లాక్.. వీడియో వైరల్ -
అదే నా చివరి సినిమా: యంగ్ హీరో
Udhayanidhi Stalin Announces Maamannan Will Be His Last Film: తెలుగులో డబ్ అయిన 'ఓకే ఓకే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఉదయనిధి స్టాలిన్. తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి హిట్ సాధించాడు. ఇటీవల ఉదయనిధి స్టాలిన్ నటించిన తమిళ చిత్రం 'నెంజుకు నీధి'. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ఆర్టికల్ 15'కు రీమేక్‌గా తెరెకెక్కిన ఈ సినిమా మే 20న విడుదల కానుంది. ఇది కాకుండా మారి సెల్వరాజ్ డైరెక్షన్లో 'మామన్నన్' అనే మూవీ చేస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్. ఇందులో కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయం చెప్పాడు ఈ హీరో. ఉదయనిధి స్టాలిన్ నటించబోతున్న 'మామన్నన్' తన ఆఖరి సినిమా అని తెలిపాడు. ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను చెప్పినట్లు సమాచారం. కాగా ఉదయనిధి స్టాలిన్ తండ్రి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడని తెలిసిన విషయమే. తండ్రిలానే తాను కూడా రాజకీయాల్లో సెటిల్ అవ్వాలని ఉదయనిధి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో జరిగిన గత ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. అప్పుడే సినిమాలకు దూరం అవుతాడని టాక్ వచ్చినా అలా జరగలేదు. True power and strong Will -justice will be served! Bringing the action-packed story of #NenjukuNeedhi on the big screens on 20th May 🔥 #6DaysToGo@ZeeStudios_ @BoneyKapoor @BayViewProjOffl #RomeoPictures @mynameisraahul @RedGiantMovies_ @Arunrajakamaraj @actortanya pic.twitter.com/coh9iLNy0m — Udhay (@Udhaystalin) May 14, 2022 -
సీఎం స్టాలిన్ కుమారుడికి భారీ ఊరట
సాక్షి, చెన్నై: డీఎంకే యువజన విభాగం నేత, ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్‌కు హైకోర్టులో మరోమారు ఊరట లభించింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్ తోసి పుచ్చింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేపాక్కం – ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఉదయ నిధి స్టాలిన్ గెలిచారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వారసుడిగా, ఆ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శిగా ఉదయ నిధి చక్రం తిప్పుతున్నారు. అయితే, ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ తొలుత దేశీయ మక్కల్ కట్చి నేత ఎంఎల్ రవి కోర్టు తలుపులు తట్టారు. అయితే ఆరోపణలకు సంబంధించి.. ఎలాంటి ఆధారాలు సమర్పించక పోవడంతో ఆదిలోనే పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఆ నియోజకవర్గానికి చెందిన ఓటరు ప్రేమలత పిటిషన్ వేశారు. తన మీదున్న కేసుల వివరాల్ని నామినేషన్లో ఉదయ నిధి చూపించలేదని, నామినేషన్ పత్రాలలోనూ అనేక అనుమానాలు ఉన్నట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన గెలుపు రద్దుచేయాలని కోరారు. కాగా, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించవద్దు అని ఉదయ నిధి కోర్టులో మరో పిటిషన్ వేశారు. గురువారం న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్‌లో ఈ పిటిషన్లు విచారణకు వచ్చింది. ఉదయ నిధి తరపున సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇళంగో వాదనల్ని వినిపించారు. అయితే, పిటిషనర్ ప్రేమలత తన ఆరోపణలకు తగిన ఆధారాల్ని కోర్టులో సమర్పించలేదు. దీంతో ఉదయ నిధికి ఊరట కల్గిస్తూ, ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ విచారణార్హం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా వైరస్.. ఇది కచ్చితంగా ఊరట ఇచ్చే విషయమే! -
ఒక్క బుల్లెట్ సాంగ్‌కు మూడు కోట్లు ఖర్చు!
‘‘రామ్‌కు తమిళ భాష తెలియదనుకున్నాను. అయితే ఆయన ఇక్కడ పక్కా తమిళంలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాను. కొన్ని రోజుల క్రితం దర్శకుడు లింగుసామి ‘ది వారియర్’ ఆడియో ఫంక్షన్లో పాల్గొనాల్సిందిగా కోరారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నాను. అవి పూర్తయ్యాకే చేద్దాం అని చెప్పి, 21న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని 22కి మార్చారు’’ అని తమిళనాడు ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రామ్ హీరోగా నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం) ‘ది వారియర్’లోని ‘బుల్లెట్..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. లింగుసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 14న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ‘బుల్లెట్...’ అనే పాటను తమిళ హీరో శింబు తెలుగు, తమిళ భాషల్లో పాడటం విశేషం. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ ఆడియోను ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘లింగుసామి దర్శకత్వంలో ఇంతకు ముందు నేనో సినిమా చేయాల్సింది. త్వరలో చేయనున్నాను. ఇక రామ్ నటించిన ‘ది వారియర్’ ఆయన ఇంతకు ముందు నటించిన విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘లింగుసామి ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్ తీసుకుని రూపొందించారు. ఆయన ఈ కథ చెప్పినప్పుడే ఇందులో విలన్‌గా నటుడు ఆది పినిశెట్టి నటిస్తున్నట్లు చెప్పడంతో నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఒక్క ‘బుల్లెట్..’ పాట కోసమే నిర్మాత మూడు కోట్లు ఖర్చుపెట్టారు’’ అన్నారు లింగుసామి. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ– ‘‘లింగుసామితో సినిమా చేయాలనే ఆకాంక్ష ఈ ద్విభాషా చిత్రంతో నెరవేరింది. ‘బుల్లెట్..’ పాట పాడిన శింబుకు థ్యాంక్స్’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మరో గ్రీన్ సిగ్నల్!
తెలుగులో ‘బోళాశంకర్’, ‘సర్కారు వారి పాట’, తమిళంలో ‘సాని కాయిదమ్’, మలయాళంలో ‘వాషి’ .. ఇలా సౌత్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు హీరోయిన్ కీర్తీ సురేష్. తాజాగా ఈ మలయాళ బ్యూటీ మరో తమిళ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు కీర్తీ సురేష్‌ను సంప్రదించగా ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు.. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. -
నా ఊహలోని విజువల్‌కు తగ్గట్లుగా నటించే గొప్ప యాక్టర్ అతను: రాజమౌళి
RRR Movie Pre Release Event Chennai: ‘‘ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నా.. యూఎస్ ప్రీమియర్స్ 2 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయన్నా అందుకు కారణం నేను కాదు.. నా ముందున్న ఇద్దరు స్టార్సే(ఎన్టీఆర్, రామ్‌చరణ్)’’ అని రాజమౌళి అన్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’(ఆర్ఆర్ఆర్). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజమౌళి మాట్లాడుతూ–‘‘తారక్(ఎన్టీఆర్) ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. నేను షాట్ పెడితే చాలు నా ఊహలోని విజువల్‌కు తగ్గట్లుగా నటిస్తాడు. ఇలాంటి యాక్టర్ దొరకడం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు.. భారతీయ సినిమా చేసుకున్న అదృష్టం. పని గురించి ఎంతో ఆలోచించి నేను సెట్స్‌కు వస్తుంటాను. కానీ చరణ్ క్లియర్ మైండ్‌తో వచ్చి ‘నా నుంచి మీకు ఏం కావాలి?’ అని అడుగుతారు. ఇలాంటి మెంటాలిటీని నేను ఎక్కడా చూడలేదు. తన గురించి తను అంత సెక్యూర్‌గా ఫీలైన యాక్టర్‌ను నేను ఇంతవరకు చూడలేదు. అంత అద్భుతంగా యాక్ట్ చేస్తారు’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘‘ఒకప్పుడు కమల్, రజనీసార్లు కలిసి ఒకే సినిమాలో నటించారు. అలాంటి గ్లోరీని ‘ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి మళ్లీ తీసుకువస్తున్నారు. ఈ సినిమాలోని ప్రతి సీన్‌ను మళ్లీ చేయాలనుకుంటాను.. ఎందుకంటే చరణ్‌తో మళ్లీ టైమ్ స్పెండ్ చేయవచ్చు’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రామ్‌చరణ్ మాట్లాడుతూ–‘‘మా ఇద్దర్నీ(రామ్‌చరణ్, ఎన్టీఆర్) కలిపి ఓ సినిమా తీసినందుకు రాజమౌళిసర్కి థ్యాంక్స్. నాతో, తారక్‌తో తమిళ్లో బాగా డబ్బింగ్ చెప్పించిన మదన్సర్కి థ్యాంక్స్. నిజ జీవితంలో నాకు, తారక్‌కి ఒక ఏడాది తేడా. కానీ తనది సింహంలాంటి పర్సనాలిటీ.. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం.. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తారక్‌లాంటి నిజమైన బ్రదర్‌ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్. తారక్‌కి థ్యాంక్స్ చెబితే మా బంధం ఇక్కడితో ముగిసిపోద్ది అనేది నా భావన.. నేను చనిపోయేవరకు ఆ బ్రదర్ హుడ్‌ని నా మనసులో పెట్టుకుంటాను’’ అన్నారు. నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్ తగ్గినట్టేనా..?
చెన్నె: తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు. పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నో అంచనాలతో దూకుడుతో వచ్చిన సినీ నటీనటులకు మాత్రం ఈ ఎన్నికలు చుక్కలు చూపించాయి. ఒక్క ఉదయనిధి స్టాలిన్ తప్ప అందరూ పరాజయం మూటగట్టుకున్నారు. వారి చరిష్మా వెండితెర వరకే అని ఈ ఎన్నికల తీర్పు చెబుతోంది. తమిళ రాజకీయాలకు సినీ పరిశ్రమకు విడదీయరాని బంధం. కొన్ని దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను సినీ ప్రముఖులు ఏలారు. దాదాపు నలభై ఏళ్లకు పైగా సినీ రంగానికి చెందినవారే రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అప్పుడు వేరు.. ఇప్పుడు వేరనట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సినీతారలంతా పరాజయం పాలయ్యారు. గతంలో రాష్ట్రాన్ని శాసించిన సినీనటులు ఇప్పుడు గెలవడమే కష్టంగా మారింది. ఎంజీఆర్ మొదలుకుని జయలలిత, కరుణానిధి వరకు సినీ పరిశ్రమకు చెందిన వారే. రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించారు. ప్రస్తుతం రాజకీయాలకు సినీ పరిశ్రమ దూరం కానుందేమో. ముఖ్యంగా మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ స్థాపించి బరిలోకి దిగిన కమల్‌హాసన్‌కు ఈ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. పార్టీ అధినేత, స్టార్ నటుడిగా ఉన్న కమల్ హాసనే గెలవలేకపోయారు. దీంతోపాటు ఆయన పార్టీ అభ్యర్థులంతా కూడా ఓడిపోయారు. ఎంఎన్ఎం పార్టీ సత్తా చాటలేకపోయింది. ఇక ఖుష్బూను కూడా తమిళ ప్రజలు ఓడించారు. సినీనటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ తన సతీమణి ప్రేమలతను విరుదాచలం నుంచి పోటీ చేయించగా ఆమె పరాజయం పొందారు. సినీ నటుడు, దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఈ ఎన్నికల్లో తిరువొత్తియూరు నుంచి ఓడిపోయారు. నటి కుష్బు చెన్నై థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. చెపాక్ నుంచి పోటీచేసిన ఉదయనిధి స్టాలిన్ గెలుపొందాడు. ఈ విధంగా తమిళ ఓటర్లు సినీ పరిశ్రమకు చెందినవారిని విశ్వసించలేదు. ఇక రాజకీయాల్లోకి వస్తానని.. తర్వాత అనారోగ్యంతో దూరమైపోయిన రజనీకాంత్‌కు ఇదే పరిస్థితి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర
చెన్నె: తాత మాజీ ముఖ్యమంత్రి.. తండ్రి పార్టీ అధినేత.. కుమారుడు సినీ రంగంలో ప్రవేశించి ఇప్పుడు రాజకీయాల్లో ఎంటరయ్యాడు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తాతకు తగ్గ మనుమడు అని తాజా ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ నిరూపించుకున్నాడు. అయితే ఉదయనిధి చేసిన ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మధురై ప్రచారంలో ఉదయనిధి వ్యంగ్యంగా చేసిన విమర్శలు.. చర్యలను ఓటర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. డీఎంకే గెలుపులో కీలక పాత్ర పోషించింది ఏమిటంటే ఒక ‘ఇటుక’. ప్రచారంలో ఉదయనిధి వాడిన ఇటుక వైరల్‌గా మారింది. ఆ పార్టీ విజయంలో ఇటుక పాత్ర ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం మధురైకు ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను మంజూరు చేసింది. మంజూరు చేసి మూడేళ్లు దాటినా ఇంతవరకు పనులు పూర్తికాలేదు. శంకుస్థాపనకే పరిమితమైంది. దీన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ దూసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీరును ‘ఇటుక’ చూయిస్తూ ఇదిగోండి ఎయిమ్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్ అని రాసి ఉన్న ఇటుకను పార్టీ అధినేత, తన తండ్రి ఎంకే స్టాలిన్‌కు ఉదయనిధి ఆదివారం అప్పగించాడు. దానర్థం నాన్న మీరైనా ఎయిమ్స్‌ను పూర్తి చేయండి పరోక్షంగా చెప్పాడు. ఈ విధంగా తమిళనాడు ఎన్నికల్లో ఇటుక కీలక పాత్ర పోషించింది. ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ తొలిసారి చెపాక్కం- ట్రిప్లికేన్ నుంచి విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఏకంగా 68,880 ఓట్ల మెజార్టీ సాధించి తాత, తండ్రికి వారసుడిగా దూసుకొచ్చాడు. చదవండి: ఊహించని షాక్: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' తన తండ్రి స్టాలిన్‌కు ఎయిమ్స్ ఇటుక ఇస్తున్న ఉదయనిధి స్టాలిన్ #DMKwinsTN #AIIMS #TNwithDMK pic.twitter.com/da6aF5k6qW — Udhay (@Udhaystalin) May 2, 2021 -
Udhayanidhi Stalin: మరో వారసుడు రెడీ
సాక్షి, చెన్నై: కరుణానిధి వారసుడు స్టాలిన్ సీఎం పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. అదే సమయంలో తన వారసుడిని స్టాలిన్ ముందే రంగంలోకి దించారు. స్టాలిన్‌కు భార్య దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్, కుమార్తె సెంతామరై ఉన్నారు. సినీ నిర్మాతగా, నటుడిగా తన కంటూ ప్రత్కేక గుర్తింపు కలిగిన ఉదయనిధిని తాను స్థాపించిన డీఎంకే యువజన విభాగానికి ప్రధాన కార్యదర్శిగా స్టాలిన్ గతంలోనే నియమించారు. అలాగే, చేపాక్కం –ట్రిప్లికేన్ నుంచి విజయకేతనంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఉదయనిధి రెడీ అయ్యారు. ఈ నెల 6న సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేసే చాన్స్ ఉన్నట్లు భావిస్తున్నారు. -
తాతకు తగ్గ మనవడు.. డెబ్యూ అదరగొట్టాడు
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి మనవడు.. డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. డీఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గంనుంచి గెలుపొందారు. హీరోగా పలు చిత్రాల్లో నటించిన ఉదయనిధి.. స్టార్డమ్ సంపాదించుకోలేకపోయారు. ఒకరకంగా ఆయనకు సినిమాలు అచ్చిరాలేదని చెప్పాలి. హిట్లకంటే ఎక్కువ ప్లాపులే మూటకట్టుకున్నారు. ప్రస్తుతం డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న ఆయన మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. కుటుంబానికి అచ్చువచ్చిన స్థానం నుంచి పోటీ చేశారు. డెబ్యూనే అదరగొట్టారు. దాదాపు 60 వేల ఓట్ల ఆధిక్యాన్ని సాధించాడు. ఇదే నియోజకవర్గం నుంచి తాత కరుణానిధి మూడుసార్లు గెలిచారు. వరుసగా 1996, 2001, 2006లలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కరుణా నిధి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తారో లేదో చూడాలి మరి. -
‘ఉదయనిధిని అనర్హుడిగా ప్రకటించండి’
చెన్నై: బీజేపీ దివంగత నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నాయకుడు, పార్టీ చీఫ్ స్టాలిన్ కుమారుడు ఉదయనిధిపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరింది. ప్రధాని మోదీ ఒత్తిడి తట్టుకోలేక పోవడంతో సుష్మా, జైట్లీ చనిపోయారని ఎన్నికల సభలో ఉదయనిధి అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉదయనిధిని అనర్హుడిగా ప్రకటించాలని, డీఎంకే స్టార్ ప్రచార కర్తల జాబితా నుంచి ఆయన పేరును తొలగించాలంది. చెపాక్ – ట్రిప్లికేన్ స్థానం నుంచి ఉదయనిధి బరిలో ఉన్నారు. ‘ప్రధాని అవుతారనుకున్న అద్వానీని మోదీ పక్కనపెట్టారు. మోదీ టార్చర్ భరించలేక యశ్వంత్‌సిన్హా పార్టీ వీడారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక సుష్మ, జైట్లీ మరణించారు. సీనియర్ నేత వెంకయ్య నాయుడును మోదీ పక్కనపెట్టారు’ అని ఉదయనిధి అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుష్మ కూతురు బాన్సురీ,జైట్లీ కూతురు సొనాలీ స్పందించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తమ తల్లి పేరును వాడుకోవద్దని బాన్సురీ సూచించారు. ‘మా అమ్మ అంటే మోదీకి అమిత గౌరవమ’ని పేర్కొన్నారు. అలాగే, ప్రధాని మోదీతో అరుణ్‌జైట్లీకి ప్రత్యేక అనుబంధం ఉండేదని సొనాలీ జైట్లీ పేర్కొన్నారు. చదవండి: స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సంచలన ఆరోపణలు -
ఆ ఇద్దరు మహానేతల మృతికి మోదీనే కారణం..
చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా డీఎంకే నేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రాణాలు కోల్పోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను సుష్మా, జైట్లీ కుటుంబాలు తీవ్రంగా ఖండించాయి. సుష్మా స్వరాజ్ కుమార్తె భానుశ్రీ స్వరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఉదయనిధి గారూ, మీ ఎన్నికల ప్రచారం కోసం మా అమ్మ పేరును వాడకండి. మీ ఆరోపణలన్నీ అవాస్తవం. నా తల్లికి ప్రధాని మోదీ ఎంతో విలువ ఇచ్చారో మాకు తెలుసు. కష్ట సమయాల్లో ప్రధానితో పాటు పార్టీ కూడా మా కుటుంబానిక అండగా నిలిచింది. మీ వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధించాయి అంటూ పేర్కొన్నారు. మరోవైపు జైట్లీ కుమార్తె సొనాలీ జైట్లీ బక్షీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఉదయనిధి గారూ, మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారన్న విషయం మాకు తెలుసు. అయితే మా తండ్రిని అగౌరవపరిస్తే మాత్రం ఊరుకోను. ప్రధాని మోదీ, నా తండ్రి మధ్య ఎంతో గాఢమైన బంధం ఉంది. అది రాజకీయాలకు అతీతమైంది. అంతటి స్నేహాన్ని అర్థం చేసుకునే శక్తిని మీరు సంపాదించుకుంటారని విశ్వసిస్తున్నాను'' అంటూ సొనాలీ జైట్లీ ట్వీట్ చేశారు. -
‘మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు’
చెన్నె: బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రుల మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్చర్ కారణమని సినీ నటుడు, డీఎంకే యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి ఒత్తిడి తట్టుకోలేకనే సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ మృతి చెందారని ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై తాజాగా వారి వారసులు స్పందించారు. ఎన్నికల వేళ రాజకీయాల కోసం తమ తల్లి, తండ్రి పేర్ల ప్రస్తావన సరికాదని ఉదయనిధికి విజ్ఞప్తి చేశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్రంగా బాధపడింది. మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు. రాజకీయాల కోసం డీఎంకే ఇంత దిగజారింది’ అని సుష్మ స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ట్వీట్లో పేర్కొంది. ఉదయనిధి వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ భక్షి కూడా స్పందించింది. ‘ఉదయనిధి గారు మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారని నాకు తెలుసు. మీరు అబద్ధం చెప్పారు. మా నాన్నను అగౌరవపరుస్తున్నారు. అరుణ్‌జైట్లీ, నరేంద్ర మోదీ మధ్యం రాజకీయంగా కాకుండా గొప్ప బంధం ఉంది. ఆ స్నేహాన్ని తప్పుపట్టవద్దని కోరుతున్నా’ అని సోనాలీ ట్వీట్ చేసింది. సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ బీజేపీలో అగ్ర నాయకులు. వాజ్‌పేయి హయాంలో వీరిద్దరు కేంద్ర మంత్రులుగా పని చేయగా అనంతరం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కూడా ఉన్నారు. సుష్మ, జైట్లీ 2019 ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు వారి మరణం తమిళనాడు ఎన్నికల్లో ప్రస్తావనకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించకుండా వారి వారసులు స్పందించడం గమనార్హం. ఉదయనిధి స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఇటీవల ఎయిమ్స్ ఇటుక అంటూ ఇటుక చూయించి హాట్ టాపిక్‌గా మారాడు. అతడి ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా ఉండేలా కనిపిస్తోంది. @udhaystalin ji please do not use my Mother's memory for your poll propaganda! Your statements are false! PM @Narendramodi ji bestowed utmost respect and honour on my Mother. In our darkest hour PM and Party stood by us rock solid! Your statement has hurt us @mkstalin @BJP4India — Bansuri Swaraj (@BansuriSwaraj) April 1, 2021 .@Udhaystalin ji, I know there is election pressure - but I won't stay silent when you lie & disrespect my father's memory. Dad @arunjaitley & Shri @narendramodi ji shared a special bond that was beyond politics. I pray you are lucky enough to know such friendship...@BJP4India — Sonali Jaitley Bakhshi (@sonalijaitley) April 1, 2021 -
నయన తారపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. అభ్యర్థులంతా గెలిచేందుకు ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈ ఎన్నికల్లో హీరో కమల్ హాసన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కమల్‌కు మద్దతుగా నటి సుహాసిని ప్రచారం చేస్తోంది. బీజేపీకి మద్దతుగా ఖుష్బు, నమితతో పాటు పలువురు నటీనటులు ప్రచారం చేస్తుండగా, డిఎంకేలో స్టాలిన్ కుమారు ఉదయనిధి స్టాలిన్ ఊపు మీదున్నారు. సీని నటులు ఈ ప్రచారంలో ఒకరిపై ఒకరు వివాస్పద వ్యాఖ్యలు చేసుకుంటు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే, సీనీ నటుడు రాధా రవి హీరోయిన్ నయన తారపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్, నయన్‌తో సహజీవనం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు తమిళ నాట చర్చనీయాంశంగా మారాయి. కాగా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గతంలో నేను నయన తార గురించి చెడుగా మాట్లాడానని, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశానంటూ ఆరోపిస్తూ పార్టీలో ఉండడానికి అర్హత లేదన్నారు. నన్ను పార్టీ నుంచి పంపించాడానికి మీరేవరు’ అంటూ డీఎంకే పార్టీని ఉద్దేశిస్తూ ధ్వజమెత్తారు. ఇక మీ పార్టీలో నయన తార ఎవరని, ఉదయనిధితో ఆమె సహజీవనం చేస్తోందా.. అయినా అలాంటివి నేను పట్టించుకొను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాక కమల్ హాసన్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. భార్యలనే కాపాడుకోలేని కమల్ రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని, ప్రధాని మోదీకి, కమల్‌కు చాలా తేడా ఉందంటూ విమర్శించారు. కాగా గతంలో రాధా రవి నయన్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. దెయ్యం పాత్రలు పోషిస్తూ ఎంతో మందితో తిరిగిన ఆమె.. దేవత పాత్రలు చేయడానికి పనికిరాదు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నయ తారతో పాటు పలువురు సినీ పెద్దలు స్పందిస్తూ ఆయనపై దీరుపై మండిపడ్డారు. అయినా ఆయన తీరు మారలేదు. తాజాగా మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన రాధా రవిని బీజేపీ ప్రోత్సహిస్తోందంటూ ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. #RadhaRavi the star campaigner of B.J.P hasn't learned his lesson nor would never learn I suppose... He yet again shames #Nayanthara in a stage!! I wonder how can he get away with such disgusting, disgraceful, ill talks on one of South India's biggest actors...!! https://t.co/cwFsEFPuub pic.twitter.com/7hia5FfVDU — Visvesh ✨ (@PawPawVee) March 31, 2021 చదవండి: నిశ్చితార్థం చేసుకున్న నయనతార! ఆచార్య ఫస్ట్ సాంగ్: సీనియర్ నటి స్పెషల్ అట్రాక్షన్ -
నా కుమారుడి ప్రసంగాలు చూసి నేనే ఆశ్చర్యపోయా!
సాక్షి, చెన్నై: తన కుమారుడు ఉదయనిధి ఏ రంగంలోనైనా రాణించగలడని దుర్గా స్టాలిన్ వ్యాఖ్యానించారు. చేపాక్కం – ట్రిప్లికేన్ నియోజకవర్గంలో ఉదయనిధి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా తల్లి దుర్గా స్టాలిన్ ప్రచారానికి సిద్ధం అయ్యారు. స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరులో ఆమె పర్యటిస్తున్నారు. కొందరు మహిళతో కలిసి ఇంటింటా వెళ్లి కరపత్రాలు అందిస్తూ స్టాలిన్‌ను ఆదరించాలని, గెలిపించాలని విన్నవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆమెను మీడియా చుట్టుముట్టి ప్రశ్నల్ని అడగ్గా, సమాధానాలు ఇచ్చారు. అది పార్టీ నిర్ణయం.. ఉదయ నిధి రాజకీయాల్లోకి రావడమే కాదు, చేస్తున్న ప్రసంగాలను చూసి తానే ఆశ్చర్యానికి లోనయ్యానని పేర్కొన్నారు. తన కుమారుడికి సీటు ఇవ్వాలని స్టాలిన్‌ను తాను కోరలేదని, అది పార్టీ తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. తన బిడ్డ రాజకీయాల్లో రాణిస్తాడని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఉదయనిధికి మంత్రి పదవి గ్యారంటీ అన్నట్టుందే అని ప్రశ్నించగా, అది పార్టీ తీసుకునే నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. స్టాలిన్ గెలుపు కోసమే కాదు, డీఎంకే కూటమిలోని అందరు అభ్యర్థుల గెలుపు కోసం తాను పూజలు చేస్తున్నానని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చదవండి: ‘ఇటుక’ చుట్టూ తమిళ రాజకీయం.. ఉదయనిధిపై ఫిర్యాదు -
‘ఇటుక’ చుట్టూ తమిళ రాజకీయం
చెన్నె: కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని తమిళ యువ నాయకుడు, డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి వ్యంగ్యంగా విమర్శలు చేశాడు. అయితే ఆ విమర్శలు విన్న ప్రజలంతా నవ్వుకుంటుండగా బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ యువ నేత ‘ఇటుక’ దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులో జరిగింది. ఈ పరిణామంతో ఇటుక చుట్టూ తమిళ రాజకీయంగా తిరుగుతోంది. గత మంగళవారం ఉదయనిధి స్టాలిన్ సత్తూరులో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీని ప్రస్తావించి ఇరుకున పెట్టాడు. వాస్తవంగా మధురైకి ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి మధురైలోని తొప్పూర్లో 250 ఎకరాలు కేటాయించారు కూడా. ఆ పనులకు 2019 జనవరి 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆ పనులేవీ సాగలేదు. దీనిని విమర్శిస్తూ ‘ఇదిగో మధురై ఎయిమ్స్ తీసుకొచ్చా’ అని ప్రచార ర్యాలీలో ఉదయనిధి ఓ ఇటుకను చూయించాడు. దానిపై నిమ్స్ అని రాసి ఉంది. ఇది చూసిన ప్రజలంతా ఫక్కున నవ్వారు. ఇది బీజేపీ తీరు అంటూ ఎయిమ్స్ ఇంకా నిర్మించలేదని ఎద్దేవా చేస్తూ ఇటుకను చూయించాడు. ఈ ఇటుకనే ఎయిమ్స్ అని ఉదయనిధి చెప్పాడు. మూడేళ్లల్లో అన్నాడీఎంకే, బీజేపీ ఏమీ చేసిందని ప్రశ్నించారు. అయితే ఇక్కడితో వివాదం సమసిపోలేదు. ఆ ఇటుకను ఉదయనిధి దొంగతనం చేశాడని ఓ బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం మరో వింత. ఎయిమ్స్‌లోని ఓ ఇటుకను ఉదయనిధి దొంగతనం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ నిర్మాణాన్ని కాపాడాలని ఆ బీజేపీ నాయకుడు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ఆ ఇటుకను తిరిగి తీసుకోవాలని కోరాడు. ఈ ఫిర్యాదును చూసి పోలీసులు అవాక్కయ్యారు. -
డీఎంకేలో మూడో సూరీడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే అగ్రనేత దివంగత కరుణానిధి కుటుంబంలో మూడో వారసత్వం ఉదయించింది. కరుణానిధి మనవడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. కూటమి చర్చలు, నియోజకవర్గాల కేటాయింపు ముగియడంతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ 173 మందితో కూడిన పార్టీ అభ్యర్థుల జాబితాను శుక్రవారం ప్రకటించారు. మూడొంతుల మెజార్టీకి తగిన సంఖ్యలో సొంత అభ్యర్థులను పోటీకి దించారు. తొలిసారిగా ఉదయనిధి స్టాలిన్.. కరుణానిధి వంశంలో మూడో తరం తొలిసారిగా ఎన్నికల రంగంలోకి దిగింది. కరుణానిధి మనుమడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నై ట్రిప్లికేన్ నుంచి పోటీ చేస్తున్నారు. తమిళ సినీ రంగంలో తనదైన స్థానం సంపాదించుకున్న ఉదయనిధికి రెండేళ్ల క్రితమే డీఎంకే యువజన విభాగం కార్యదర్శి బాధ్యతలను స్టాలిన్ అప్పగించారు. తన తాత కరుణానిధికి కంచుకోటైన ట్రిప్లికేన్ నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు. యథాప్రకారం కొళత్తూరు నుంచి మూడోసారి స్టాలిన్ పోటీకి దిగుతున్నారు. ఇక పార్టీలోని ప్రముఖులందరికీ సీట్లు దక్కాయి. కూటమిలోని కొన్నిపార్టీలు డీఎంకే ఉదయసూర్యుని చిహ్నంపై పోటీ చేస్తున్నాయి. దీంతో ప్రత్యక్ష, పరోక్ష అభ్యర్థులను కలుపుకుంటే డీఎంకే 187 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లయింది. 178 చోట్ల అన్నాడీఎంకే.. అధికార అన్నాడీఎంకే 178 స్థానాల్లో సొంత పార్టీ అభ్యర్థులను బరిలోకి దించగా రెండాకుల చిహ్నంపై పోటీచేసే అభ్యర్థులను కలుపుకుంటే మొత్తం 191 స్థానాల్లో అన్నాడీఎంకే తలపడుతోంది. 2 జాతీయ పార్టీలతో కమల్ ఢీ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన రెండు జాతీయ పార్టీల అభ్యర్థులను ఢీకొట్టబోతున్నారు. కోయంబత్తూరు సౌత్ స్థానాన్ని పొత్తులో భాగంగా అధికార ఏఐఏడీఎంకే తన మిత్రంపక్షం బీజేపీకి, ప్రతిపక్ష డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్‌కు కేటాయించాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
200 సీట్లే లక్ష్యం!: డీఎంకే మిత్రుల్లో కలవరం
సాక్షి, చెన్నై: రానున్న ఎన్నికల్లో 200 సీట్లల్లో డీఎంకే అభ్యర్థులు పోటీ చేయాల్సిన అవశ్యం ఉందని, ఇందుకు అధ్యక్షుడి మీద ఒత్తిడి తెద్దామన్న యువజన సమావేశ నినాదం ఆ పార్టీ మిత్ర పక్షాల్లో కలవరాన్ని రేపింది. పార్టీ కోశాధికారి టీఆర్ బాలు, యువజన నేత ఉదయనిధి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడాన్ని మిత్రపక్షాలు తీవ్రంగానే పరిగణించాయి. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, మనిదనేయమక్కల్ కట్చి అంటూ చిన్నా, చితకా పార్టీలో డీఎంకే మెగా కూటమి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, రానున్న ఎన్నికల ద్వారా అధికారం కైవసం లక్ష్యంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే 2021 ఎన్నికల్లో డీఎంకే అధికారం చేజిక్కించుకోవాలంటే, అధిక స్థానాల్లో పోటీ అనివార్యం అని సర్వేల్లో తేలింది. ఈ పరిస్థితుల్లో డీఎంకే మిత్ర పక్షాల్లో కలవరాన్ని రేపుతూ, స్టాలిన్ వారసుడు, యువజన నేత ఉదయనిధి, పార్టీ కోశాధికారి టీఆర్ బాలు వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన విషయమే. 200 సీట్లలో పోటీ తప్పనిసరి.. డీఎంకే యువజన సమావేశం బుధవారం చెన్నైలో జరగ్గా, టీఆర్ బాలు, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, 2021 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టాలంటే, డీఎంకే అభ్యర్థులు 200 స్థానాల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. మిత్ర పక్షాలకు కావాల్సినన్ని సీట్లు లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన దృష్ట్యా, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 200 స్థానాల్లో డీఎంకే అభ్యర్థులే పోటీ చేయాల్సిన అవశ్యం ఉందని, ఇందుకోసం అధ్యక్షుడిపై ఒత్తిడి తెద్దామని ఆ సమావేశం వేదికగా టీఆర్‌తో పాటు యువజన నేతలు నినదించడం గమనార్హం. ఇది కాస్త డీఎంకే మిత్రుల్లో కలవరాన్ని రేపుతోంది. ప్రధానంగా అధిక సీట్లను ఆశిస్తున్న కాంగ్రెస్‌కు బెంగతప్పడం లేదు. 200 స్థానాల్లో డీఎంకే పోటీ చేయాల్సి వస్తే, ఆపార్టీకి ఈ సారి మరీ తక్కువగా, మిగిలిన మిత్ర పక్షాలకు సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితం చేయక తప్పదేమో అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. 45 రోజులు 25 లక్షలు.. బలోపేతం లక్ష్యంగా 45రోజుల్లో 25 లక్షల మంది కొత్త సభ్యుల్ని చేర్చడం లక్ష్యంగా అందరూ మనతో కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ సాగనుంది. ఈ కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆన్లైన్ ద్వారా శ్రీకారం చుట్టారు. -
ఉదయ్‌తో ఆర్టికల్ 15
అజిత్‌తో హిందీ ‘పింక్’ని తమిళంలో రీమేక్ చేశారు బోనీ కపూర్. ఇప్పుడు మరో రీమేక్‌ను ప్రకటించారు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించి, మెప్పించిన ‘ఆర్టికల్ 15’ని తమిళంలో రీమేక్ చేయనున్నారు బోనీ. ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ కులవివక్ష ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి చట్టం, న్యాయం అందరికీ సమానమే అని చాటిచెప్పిన చిత్రమిది. హిందీలో ఆయుష్మాన్ పోషించిన పాత్రను తమిళంలో ఉదయ్‌నిధి స్టాలిన్ చేయనున్నారు. అరుణ్రాజా కామరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. జీ స్టూడియోస్, రోమియో పిక్చర్స్‌తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రొడక్షన్ హౌస్‌పై తమిళ రీమేక్‌ను నిర్మించనున్నట్లు బోనీ కపూర్ తెలిపారు. ‘పింక్’ తర్వాత అజిత్‌తో తమిళంలో ‘వలిౖమై’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు బోనీ. ‘ఆర్టికల్ 15’ రీమేక్ షూటింగ్‌ని ఈ ఏడాది చివరలో ప్రారంభిస్తారట. -
పార్టీ ఆదేశిస్తే మేయర్ పదవికి పోటీ :హీరో
చెన్నై,టీ.నగర్: పార్టీ ఆదేశిస్తే చెన్నై మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, నటుడు ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్న చిత్రం సైకో. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో అరుళ్‌మొళి మాణిక్కం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ విలేకరులతో మాట్లాడుతూ.. సైకో చిత్రనిర్మాణ సమయంలో పగటిపూట పార్లమెంటు ఎన్నికల ప్రచారం, రాత్రి చిత్రం షూటింగ్స్ జరిగాయన్నారు. పెరియార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో రజనీ క్షమాపణ చెప్పేది లేదని వెల్లడించినట్లు విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ..అది ఆయన అభిప్రాయమని, దీన్ని డీఎంకే అధ్యక్షుడు ఖండించినట్లు తెలిపారు. చెన్నై మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా పార్టీ అదేశిస్తే చేస్తానన్నారు. -
ఉదయనిధి స్టాలిన్ సంచలన ట్వీట్..
చెన్నై, పెరంబూరు : నటుడు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రానీయండి అప్పుడు ఆయన వ్యాఖ్యలకు బదులిస్తానని నటుడు, డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. నటుడు రజనీకాంత్ ఇటీవల తుగ్లక్ పత్రిక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆ వేదికపై పెరియర్ గురించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలు చోట్ల రజనీకాంత్‌పై కేసులు నమోదయ్యాయి. కాగా అదే వేదికపై మురసోలి పత్రిక పట్టుకుంటే డీఎంకే వారని, తుగ్లక్ పత్రిక పట్టుకుంటే తెలివైన వారని రజనీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మురసోలి పత్రిక చదివే వారు తెలివైన వారు కాదా? అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై డీఎంకే పెద్దలెవరూ స్పందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే యువ నేత స్పందించిన తీరును రజనీకాంత్ అభిమానులు ఖండిస్తున్నారు. అసలు ఉదయనిధిస్టాలిన్ ఏమన్నారు? రజనీకాంత్ అభిమానుల ఆగ్రహానికి కారణం ఏమిటి? ఈ వివరాలు చూస్తే నటుడు ఉదయనిధిస్టాలిన్ నటుడు రజనీకాంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. అందులో ముఖ్యమంత్రి అంటే అన్నాదురై, కళాకారుడంటూ విప్లవ నాయకుడు(ఎంజీఆర్) ధైర్యలక్ష్మి అంటే అమ్మ (జయలలిత) ఇలా శతాబ్దాల కాలంగా కాల్ పట్టుకుని కార్యాలను సాధించుకోవడానికి తలపట్టుకుంటున్న వారి మధ్యలో మురసోలిని చేతబట్టి ఆత్మవిశ్వాసం కలిగిన వారే డీఎంకే వారు అని పేర్కొన్నారు. ఆయన ట్వీట్ సంచలనంగా మారింది. ఉదయనిధిస్టాలిన్ వ్యాఖ్యలు రజనీకాంత్ గురించేనని ఆయన అభిమానులు ఆగ్రహిస్తున్నారు. కాగా నటుడు ఉదయనిధిస్టాలిన్, నటించిన సైకో చిత్రం ఈ నెల 24వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆయన ఒక భేటీలో రజనీకాంత్ అభిమానుల ఆగ్రహం గురించి అడిగిన ప్రశ్నకు తాను రజనీకాంత్ గురించి మాట్లాడానని ఎవరు చెప్పారు? అని ప్రశ్నంచారు. సరే రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల గురించి అడగ్గా, ఆయన ఇంకా రాజకీయాల్లోకి రాలేదని, వచ్చిన తరువాత బదులు ఇస్తానని ఉదయనిధిస్టాలిన్ పేర్కొన్నారు. -
వారసులొచ్చారు..
సాక్షి బెంగళూరు/చెన్నై: రాజకీయ పార్టీల్లో ఒకే కుటుంబం పెత్తనం తరాలపాటు కొనసాగుతుందనడానికి తాజా సాక్ష్యాలివి. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్..తమిళనాట మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తనయుడు ఉదయనిధి తమ పార్టీల యువజన విభాగం బాధ్యతలు స్వీకరించారు. తద్వారా వీరు భవిష్యత్ పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రుల జాబితాలో చేరిపోయారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జేడీఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే హెచ్‌కే కుమారస్వామిని నియమించిన అధిష్టానం, యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలను సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను అప్పగించింది. నిఖిల్ ఇటీవలి ఎన్నికల్లో మాండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగి సినీనటి సుమలత చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మేరకు జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కాంగ్రెస్‌పైనే ఆధారపడి ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని తెలిపారు. తమిళనాడులో.. డీఎంకే చీఫ్ స్టాలిన్ తనయుడు, సినీ నటుడు ఉదయనిధి(42)ని పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియమిస్తూ స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. దాదాపు 35 ఏళ్లపాటు ఈ పదవిలో స్టాలిన్ పనిచేశారు. ప్రస్తుతం మురసోలి ట్రస్ట్‌కు ఉదయనిధి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే కరుణానిధి స్థాపించిన మురసోలి పత్రిక నడుస్తోంది. ఉదయనిధి ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. తాజా నియామకంతో కరుణకుటుంబంలోని నాల్గోవ్యక్తికి పార్టీలో కీలక పదవి దక్కినట్లయింది. -
వారసుడి ప్రజాయాత్ర
వారసుడు ఉదయనిధి స్టాలిన్ రాజకీయాలపై అధిక దృష్టి పెట్టేందుకు నిర్ణయించారు. తండ్రిబాటలో ఒక్కో మెట్టు ఎక్కడం లక్ష్యంగా రాజకీయ పయానానికి తగ్గ కార్యా చరణలో నిమగ్నమయ్యారు. మనకు మనమే..అంటూ స్టాలిన్ గతంలో ప్రజల్లోకి వెళ్లగా... స్టాలిన్‌ను సీఎం చేద్దాం...అన్న నినాదంతో ఈ వారసుడు ప్రజాపయానికి కసరత్తులు చేపట్టారు. సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత దివంగత కరుణానిధి వారసుడిగా ఎంకే స్టాలిన్ మొదటి నుంచి సాగించిన రాజకీయ పయనం గురించి తెలిసిందే. పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఆయన ఎదిగి ఇప్పుడు పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఉన్నారు. ప్రజల్లో మమేకం అయ్యే విధంగా గతంలో ఆయన రచ్చబండ , వీధి సభలు అంటూ ముందుకు సాగడమే కాదు...మనకు..మనమే నినాదంలో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన కూడా చేశారు. గ్రామాల్ని అనుసంధానిస్తూ పాదయాత్ర రూపంలో కొందరు దూరం, రోడ్ షోల రూపంలో మరి కొంత దూరం, సైకిల్ తొక్కుతూ ఇంకొంత దూరం అన్నట్టుగా పర్యటనల్ని సాగించి ప్రజల దృష్టిలో పడ్డారు. కరుణానిధి మరణం తదుపరి డీఎంకే అధ్యక్ష పగ్గాలు చేపట్టిన స్టాలిన్ సీఎం కుర్చీని అధిరోహించాలన్న కాంక్షతో ముందుకు సాగుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్సాల్చి వచ్చిందంటే..!. ఇదే తరహాలో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ఆయన వారసుడు ఉదయనిధి సిద్ధం అవుతుండడమే. వారసుడి రాజకీయ పయనం.. ఉదయనిధి స్టాలిన్ తొలుత ఓ నిర్మాతగా రాష్ట్ర ప్రజలకు పరిచయం. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లో అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్ని తెరకెక్కించారు. అనంతరం తానే స్టార్ అవతారం ఎత్తారు. హీరోగా పలు చిత్రాల్లో మెప్పించారు. తన కంటూ అభిమాన సమూహాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తన మిత్రులకు పార్టీ సీట్లు ఇప్పించుకుని, వారి గెలుపు కోసం ఆ నియోజకవర్గాల్లో శ్రమించి మెప్పు పొందారు. స్టాలిన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం డీఎంకే బలోపేతానికి తన వంతు కృషి చేయడం మొదలెట్టారు. డీఎంకే పత్రిక మురసోలిలో క్రియా శీలక పాత్ర పోషించడమే కాదు, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఉదయ నిధి ఆకర్షించారు. స్టాలిన్ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం సాగిస్తే, తాను సైతం అంటూ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయ నిధి ప్రసంగాలు, ఆయన వాక్ చాతుర్యం, సమయానుగుణంగా, సందర్భానుగుణంగా చేసిన వ్యాఖ్యలు తూటాలే ప్రజల్ని ఆకర్షించాయి. లోక్ సభ ఎన్నికల డీఎంకే క్లీన్ స్వీప్ అన్నట్టుగా ముందుకు సాగడంతో పార్టీలో ఉదయనిధికి ఏదేని పదవి కట్టబెట్ట వచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా యువజన విభాగం కార్యదర్శి పదవి ఆయన్ను వరించడం ఖాయం అన్నట్టుగా మీడియాల్లో కథనాలు హోరెత్తాయి.అయితే, వారసుడ్ని అభినందించిన స్టాలిన్, ఎలాంటి పదవి అన్నది మాత్రం కట్ట బెట్ట లేదు. తన వారసుడిగా పదవి కట్టబెట్టిన పక్షంలో కుటుంబ రాజకీయాలూ అంటూ విమర్శలు రావడమే కాదు, పార్టీలోని సీనియర్ల తమ వారసులకు అంటే తమ వారసులకు పదవులు అన్న నినాదం అందుకోవచ్చన్న భావనతో ఉదయ నిధిని స్టాలిన్ పక్కన పెట్టినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. అదే సమయంలో తాను పార్టీకి కార్యకర్తను మాత్రమేనని, పార్టీ కోసం నిరంతరం సేవల్ని అందిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతానన్నట్టుగా ఇటీవల ఓ వేదిక మీద ఉదయ నిధి ప్రకటించడం అందర్నీ ఆలోచనలో పడేశాయి.అంతే కాదు, కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చే రీతిలో డీఎంకే బలం ఏమిటో, స్టాలిన్ ప్రభజనం అంటే ఎలా ఉండబోతుందో ముందుగానే చాటే దిశలో ఉదయ నిధి ప్రసంగాలు హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో తండ్రి బాటలో ముందుగా ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు ఉదయ నిధి కూడా సిద్ధం కావడం గమనార్హం. గతంలో తన తండ్రి స్టాలిన్ మనకు..మనమే అన్న నినాదాన్ని అందుకుంటే, తాజాగా స్టాలిన్‌ను సీఎం చేద్దాం..తరలిరండి...అన్న నినాదంతో ఈ వారసుడు ప్రజాయాత్రకు సిద్ధం అవుతుండడం విశేషం. పాదయాత్ర రూపంలో సాగే ఈ ప్రజా పయనం రూట్ మ్యాప్, షెడ్యూల్ త్వరలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, డీఎంకేకు పట్టుకొమ్మగా ఉన్న యువజన విభాగాన్ని మరింత పటిష్టవంతం చేయడం లక్ష్యంగానే కాదు, తన భవిష్యత్తుకు బాట వేసుకునే రీతిలో సినిమాల్ని కాస్త పక్కన పెట్టి, ప్రజాయాత్రకు ఉదయ నిధి కసరత్తులు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చజోరందుకుంది. ఆనాడు కరుణానిధికి పక్కబలంగా స్టాలిన్ ఏవిధంగా ముందుకు సాగారో, అదే తరహాలో తన తండ్రి స్టాలిన్‌కు ప్రజాబలాన్ని మరింతగా సమకూర్చేందుకు, సీఎం కుర్చీలో కూర్చొబెట్టేందుకు తాను సైతం అన్నట్టుగా ఈ వారసుడు ముందుకు పరుగులు తీస్తుండడం విశేషం. -
తాత జయంతి రోజున నాన్న సీఎం కావడం ఖాయం
పళ్లిపట్టు: తాత (కరుణానిధి) జయంతి రోజున నాన్న (స్టాలిన్) కావడం ఖాయమని నటుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు సోమవారం సుడిగాలి ప్రచారం నిర్వహించారు. అరక్కోణం డీఎంకే అభ్యర్థి జగద్రక్షగన్‌కు మద్దతుగా తిరుత్తణి నియోజకవర్గంలోని ఆర్కేపేట, అమ్మయార్‌కుప్పం, అత్తిమాంజేరిపేట, పొదటూరుపేట, తిరుత్తణి ప్రాంతాల్లో స్టాలిన్ తనయుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ రోడ్‌షో చేపట్టారు. డీఎంకే క్యాడర్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు యువత పాల్గొన్నారు. రోడ్‌షోలో ఉదయనిధి మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ప్రభుత్వం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పీఎంకేకు ఎన్నికల సమయం వచ్చేసరికి విమర్శలన్నీ కనుమరుగయ్యాయని, అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తున్నట్లు మాటమార్చడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని అన్నాడీఎంకే కూటమిని బహిష్కరించాలన్నారు. నరేంద్రమోదీతో దేశం పాతికేళ్లు వెనుబడిందని ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు జీవనోపాధి కొరవడి ఇబ్బందులు మధ్య అగమ్యగోచరంగా బతుకీడుస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని అవినీతి సొమ్మును వెలికితీసి ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు రూ.ఆరువేలు చొప్పున ఏడాదికి రూ.72 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు కాంగ్రెస్ ఎన్నికల హామీ ద్వారా లబ్ధి పొందేందుకు పేద విద్యార్థులు సైతం వైద్య విధ్య అభ్యసించేందుకు వీలుగా నీట్ రద్దుకు డీఎంకే కూటమిని ఆదరించాలన్నారు. ప్రజల మద్దతుతో ఉప ఎన్నికల్లో 22 నియోజకవర్గాల్లో డీఎంకే అభ్యర్థులు విజయం సాధించడం ద్వారా జూన్ 3న తాత జయంతి రోజునే నాన్న సీఎం పదవీ ప్రమాణం చేయడం ఖాయమన్నారు. మండల కన్వీనర్ జీ.రవీంద్ర సహా కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. డీఎంకే కూటమితోనే నీట్ రద్దు– ఉదయనిధి స్టాలిన్వేలూరు: రాష్ట్రంలో డీఎంకే అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో పాటూ కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితేనే నీట్ పరీక్షల రద్దు, విద్యారుణాల మాఫీ అవుతాయని సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. వేలూరు జిల్లా అరక్కోణం పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న డీఎంకే కూటమి అభ్యర్థి జగద్రక్షగన్‌కు మద్దతుగా ఉదయనిధి స్టాలిన్ సోమవారం ఉదయం ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే గెలుపు ఖాయమన్నారు. అన్నాడీఎంకే మెగా కూటమి కాదని మానం చెడిన కూటమి అన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే జయలలిత మృతిపై విచారణ జరిపిస్తామన్నారు. గతంలో రాత్రికి రాత్రే కరెన్సీ నోట్లను రద్దుచేసి ప్రజలను బ్యాంకుల వద్ద పడిగాపులు కాచే విధంగా చేసిన నరేంద్రమోదీ ప్రభుత్వానికి స్వస్తి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజలు అన్నింటికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. నీట్ పరీక్షలను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేసిన సమయంలో ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రస్తుతం ఉచిత హామీలు చేస్తూ ప్రజల వద్దకు వస్తున్న వారికి ఈనెల 18న జరిగే పోలింగ్‌లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం కాట్పాడి చిత్తూరు బస్టాండ్, వళ్లిమలై రోడ్డు, తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి డీఎంకే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయనతో పాటు పార్లమెంట్ అభ్యర్థి జగద్రక్షగన్, ఎమ్మెల్యేలు నందకుమార్, గాంధీ పాల్గొన్నారు. -
కోడ్ ఉల్లంఘించిన నటుడిపై కేసులు
టీ.నగర్: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలతో డీఎంకే నేతలపై శుక్రవారం కేసులు నమోదయ్యాయి. కనిమొళిపై కేసు: హారతి పట్టిన వారికి నగదు అందజేయడంతో కనిమొళిపై శుక్రవారం కేసు నమోదైంది. తూత్తుకుడి నియోజకవర్గంలో డీఎం కే అభ్యర్థి కనిమొళి ప్రచారం చేపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం తిరుచెందూర్ అసెంబ్లీ పరిధి ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్‌తో కని మొళి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హారతి పడుతూ కనిమొళికి స్వాగతం పలికిన మహిళలకు అనితా రాధాకృష్ణన్ నగదు అందజేసి న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీంతో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి నట్లు ఏరల్ తహసీల్దార్ ముత్తురామలింగంకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కనిమొళి, అనితా రాధాకృష్ణన్ సహా ఏడుగురిపై తిరుచెందూర్ తాలూకా పోలీసు స్టేషన్లో మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఉదయనిధి స్టాలిన్‌పై కేసు: కల్లకురిచ్చిలో ఉదయనిధి స్టాలిన్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. పార్లమెంటు ఎన్నికల్లో కల్లకురిచ్చి నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి పొన్ గౌతమ్ సిఖామణి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ గత 23వ తేది కల్లకురిచ్చి కూడలిలో ఓపెన్‌టాప్ వ్యాన్‌లో ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ సమయంలో ఉదయసూర్యుడి చిహ్నా నికి ఓట్లను అభ్యర్థించారు. ఆయన వెంట శంకరాపురం అసెంబ్లీ సభ్యుడు ఉదయసూర్యన్, ఇతరులు ఉన్నారు. ఇదిలాఉండగా ఎన్నికల స్క్వాడ్ అధికారి ముఖిలన్ కల్లకురిచ్చి పోలీసు స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశాడు.అందులో ఉదయనిధి స్టాలిన్, ఉదయసూర్యన్ ఇతర నిర్వాహకులు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను మీరి ఒకే చోట గుంపుగా ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఉదయనిధి స్టాలిన్, ఎమ్మెల్యే ఉదయసూర్యన్లపై పోలీసులు మూడు సెక్షన్ల కింద గురువారం కేసు నమోదు చేశారు. -
జయలలిత స్ఫూర్తితోనే..!
తమిళసినిమా: ప్రతి విషయానికి ఎవరో ఒకరు, ఏదో ఒకటి స్ఫూర్తిగా నిలుస్తుంది. అలా ఒక చిత్ర హీరోయిన్ పాత్రకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్ఫూర్తి అయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు శీనూ రామస్వామి స్వయంగా వెల్లడించారు. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం కన్నె కలైమానే. ఉదయనిధిస్టాలిన్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 22వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శీనూరామస్వామి మాట్లాడుతూ ధర్మదురై చిత్రాన్ని పూర్తి చేసి విజయ్‌సేతుపతి హీరోగా మామనిదన్ చిత్రాన్ని చేయాలని భావించగా, విజయ్‌సేతుపతి వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారని తెలిపారు. అలాంటి సమయంలో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నుంచి షణ్ముగమూర్తి తనను కలిశారన్నారు. దాని ఫలితమే కన్నె కలైమానే అని చెప్పారు. ఆ సమయంలో ఆయన పెట్టిన ఒకే ఒక్క కడింషన్ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ ఉండాలన్నారు. అయితే అందుకు ఈ చిత్రంలో అవకాశం లేదని చెప్పానన్నారు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్ కలిసి ఫర్వాలేదు తాను చూసుకుం టాను అని చెప్పారన్నారు. అలా ఆయన హీరో యిన్‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటించడానికి ముందుకొచ్చిన ధైర్యానికి ధన్యవాదాలన్నారు. ఇందులో నటి తమన్నాది చాలా «దైర్యం కలిగిన అమ్మాయి పాత్ర అని చెప్పారు. ధైర్యవంతురాలంటే ఎలా ఉండాలన్నదానికి తన మనసులో మెదిలింది దివంగత ముఖ్యమంత్రి జయలలిత రూపమేనన్నారు. ఆమె నడక, చీర కట్టు, బొట్టు ఎలా ఉండాలన్నది జయలలిత పాత ఫొటోల ను ఇంటర్నెట్లో చూసి, ఆమెను స్ఫూర్తిగా తీ సుకుని తమన్న పాత్రను తీర్చిదిద్దానని చెప్పా ý‡ు. కార్యక్రమానికి నటుడు విజయ్ సేతుపతి అతిథిగా విచ్చేయగా ఉదయనిధిస్టాలిన్, తమ న్నా తదితర చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
తాత టీవీ ఇచ్చారు.. నాన్న సెటాప్ బాక్స్ ఇస్తారు
తమిళనాడు, పెరంబూరు: ఇంతకు ముందు తాత కరుణానిధి ఉచితంగా టీవీలు ఇచ్చారని, ఈ సారి నాన్న స్టాలిన్ ఎన్నికల్లో గెలిస్తే సెటాప్ బాక్స్‌లు ప్రజలకు ఉచితంగా అందిస్తారని నటుడు, డీఎంకే నేత స్టాలిన్ కొడుకు ఉదయనిధిస్టాలిన్ వాగ్దానం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్లడం మొదలెట్టారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, కనిమొళి, ఉదయనిధిస్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ గ్రామసభలను నిర్వహిస్తున్నారు. అలా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మరి కొందరి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు కూడా. కాగా మంగళవారం నటుడు ఉదయనిధిస్టాలిన్ తూత్తుక్కుడి జిల్లాలో పర్యటించారు. అక్కడు ఒక యువతి ఇం తకు ముందు కరుణానిధి ఉచితంగా టీవీలు పంచి పెట్టారని, అప్పట్లో కేబుల్ ప్రసారాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉన్నా తక్కువ ధరకే చానళ్లలో కార్యక్రమాలు చూసే వారమని, ఇప్పుడు కేబుల్ ప్రసారాలను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడంతో ఎక్కువ చానళ్లు రావడం లేదని చెప్పిం ది. అందుకు సెటాప్ బాక్స్ తీసుకోవాలని, అందుకు అధిక డబ్బును వసూలు చేస్తున్నారని చెప్పింది. దీంతో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ అప్పుట్లో తాత టీవీలను ఉచితంగా ఇచ్చారని, నాన్న స్టాలిన్ అధికారంలోకి వస్తే ఉచితంగా సెటాప్ బాక్స్‌లను పంచుతారని హామీ ఇచ్చారు. -
విదేశాలకు ఏంజిల్
నెల రోజులు పాయల్ రాజ్‌పుత్ ఇండియాలో కనిపించరు. అరే.. చేతిలో సినిమాలు ఉన్నాయి. అన్ని రోజులు హాలీడే తీసుకుంటే ఎలా? అనే సందేహం మీకు అక్కర్లేదు. ఎందుకంటే ఆమె విదేశాలకు వెళ్లింది ఓ తమిళ సినిమా షూటింగ్ కోసమే. ఉదయనిధి స్టాలిన్ హీరోగా కేఎస్ అదియమాన్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘ఏంజిల్’. ఈ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు పాయల్. మరో కథానాయికగా ఆనంది కనిపిస్తారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ చెన్నైలోని ఓ యూనివర్శిటీలో జరిగింది. సెకండ్ షెడ్యూల్ కోసం ఫిజీ వెళ్లారు. ‘‘ఏంజిల్’ సెకండ్ షెడ్యూల్ కోసం ఫిజీ వెళ్తున్నాను. నెల రోజులు అక్కడే ఉంటాను’’ అన్నారు పాయల్. అంటే పాయల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే అన్నమాట. ఈ పంజాబీ బ్యూటీ తెలుగులో చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ‘డిస్కో రాజా’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారట ఈ బ్యూటీ. -
అనుకున్నవన్నీ జరగవు
సాక్షి, సినిమా: అనుకున్నవి జరగవు, ఊహించనివి జరుగుతాయి ఇది జీవితానికే కాదు, సినీరంగానికి వర్తిస్తుంది అంటోంది మిల్కీబ్యూటి తమన్న. ఈమె సినీ జీవితం బాహుబలికి ముందు, ఆ తరువాత అన్నట్లుగా విభజించవచ్చు. అగ్రనటిగా రాణిస్తున్న ఈ బ్యూటీకి ఇటీవల కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇంకో విషయం ఏమిటంటే ఆమె ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన కన్నె కలమానే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా, విడుదలలో జాప్యం జరుగుతోంది. ఆ చిత్రం మినహా చేతిలో మరో చిత్రం లేదు. ఈ సందర్భంగా తమన్న ఏమంటుందో చూద్దాం. ‘‘నేను సినీరంగప్రవేశం చేసి 12 ఏళ్లు అయ్యింది. ఆరంభంలో సినిమా గురించి పెద్దగా అర్థం కాకపోయినా ఇప్పుడు చాలా అనుభవం పొందా. చిత్ర పరిశ్రమ గురించి అర్థం అయ్యింది. ఇంకా చెప్పాలంటే నా నిజజీవితానికి, సినీ జీవితానికి అనుబంధం ఉందనిపిస్తోంది. ఆదిలో వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి నటించాను. అందులో కొన్ని చిత్రాలు అనూహ్యంగా విజయం సాధించి నా కెరీర్‌కు ఉపయోగ పడ్డాయి. బాహుబలి చిత్రం తరువాతే ఉత్తమ నటి అనిపించుకున్నాను. అంతకు ముందు హిందీలో కొన్ని చిత్రాల్లో నటించినా, అక్కడా నాకు గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం బాహుబలినే. హిందీలో డబ్బింగ్ చేసిన బాహుబలి చిత్రం అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఓ చిత్రంలో నటిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందీ? విజయం సాధిస్తుందా. అపజయం చెందుతుందా? అన్నది ఎవరూ చెప్పలేరు. ప్రతి చిత్రాన్ని ముఖ్యంగానే భావించి నటిస్తాం. కొన్ని చిత్రాలే సంతృప్తిని కలిగిస్తాయి. కొన్ని చిత్రాలు విజయం సాధిస్తాయని భావించినా ప్లాప్ అవుతుంటాయి. నిజం చెప్పాలంటే కొన్ని చిత్రాల్లో ఎలాంటి నమ్మకం లేకుండా నటిస్తాం. అవి అనుకోకుండా సక్సెస్ అవుతుంటాయి. ఇక్కడ ఊహించినవి జరగవు, అనుకోనివీ జరుగుతుంటాయి. సినిమా పేరు, డబ్బు అన్నీ ఇస్తుంది. అద్భుత చిత్రాలు ఎప్పుడు వస్తాయన్నది ఎవరూ చెప్పలేరు. అనూహ్యంగా వస్తాయి. ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాయి’’ అని తమన్న పేర్కొంది. -
మానసిక వేదనకు మందు అదే!
తమిళసినిమా: మానసిక వేదనకు మందిదే అంటోంది నటి తమన్నా. నటిగా పుష్కరం దాటినా నేటికీ నవనవలాడే అందాలతో మెరిసిపోతోంది మిల్కీబ్యూటీ. మొదట్లో అందాలారబోతకే పరిమితం అయిన ఈ గుజరాతీ భామ తరువాత నటనకు కూడా ప్రాధాన్యత ఉండే పాత్రల్లోనూ తన సత్తా చాటుకుంటోంది. తెలుగు, తమిళం అంటూ మారి మారి నటించేస్తున్న తమన్నా కోలీవుడ్‌లో ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన కన్నెకలైమానే చిత్రం విడుదల కావలసి ఉంది.ఈ చిత్రంలో తమన్నా నటన గురించి దర్శక, హీరోలు కాస్త ఎక్కువగానే పొగిడేస్తున్నారు. ఇక మీ సౌందర్య రహస్యం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ అందం, ప్రశాంతత, మానసికవేదన లేకుండడం అన్నది ప్రతి మనిషికీ చాలా ముఖ్యం అని చెప్పింది. అందుకు తాను నమ్మేది మోగానేనని పేర్కొంది. తన దినచర్య ప్రతిరోజూ యోగాతో ముడిపడి ఉంటుందంది. గోరు వెచ్చని నీటిలో బాదంను నానబెట్టి తిన్న తరువాతే ఇతర కార్యక్రమాలకు ఉపక్రమిస్తానని చెప్పింది. రోజూ గంట సేపు వ్యాయామం చేస్తానని, అందులో అరగంట కసరత్తులు చేసి మరో అరగంట యోగాకు కేటాయిస్తానని తెలిపింది. ఇవన్నీ జిమ్‌లోనే జరిగిపోతాయని అంది. మానసిక వేదనకు ఇదే మందు అని పేర్కొంది. ఎవరన్నా యోగా గురించి ప్రస్తావిస్తే వారితో గంటల తరబడి మాట్లాడతానని చెప్పింది.యోగాతో శరీరంలోని విష క్రిములు బయటకు పోతాయని అంది. శ్రమకు ఉపశమనం కలుగుతుందని, ఆశాంతి, మానసిక వేదన సమసిపోతాయని చెప్పింది. మనసులో నెగిటివ్ ఆలోచనలు కలగవని అంది. సినిమా అన్నది సమస్యలు, సవాళ్లతో కూడుకున్న రంగం అని సరిగ్గా నిద్ర ఉండదు, ఆహార నియమాలను ఆటంకం అన్నది తరచూ జరుగుతుంటుందని చెప్పింది. శారీరకంగానూ, మానసికంగానూ నలిగిపోతుంటామని తెలిపింది. ఇలాంటి వాటి నుంచి బయట పడడానికి ఒకే మార్గం యోగా అని పేర్కొంది. తాను ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని, మేను సున్నితంగా ఉండడానికి పెరుగు, మంచినీళ్లు, కొబ్బరినీరు తీసుకుంటానని చెప్పింది. చెడు కలిగించే వాటిని ముట్టుకోనని, తీపిని విరోధిగా చూస్తానని తమన్నా చెప్పింది. -
వారు నాకు బలం కాదు!
పెరంబూరు: తాత కరుణానిధి, నాన్న స్టాలిన్ నాకు బలం కాదని, బలహీనతని వారి వారసుడు, నటుడు, నిర్మాత ఉదయనిధిస్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి మనవడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ కొడుకు ఉదయనిధిస్టాలిన్. ఈయన మంగళవారం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తాను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నానన్నారు. తాతకు, తండ్రికి ఎన్నికల్లో ప్రచారం చేశానన్నారు. సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన తాను రాజకీయాల్లోకి రావడం తప్పెలా అవుతుందని ప్రశ్నిం చారు. తక్కువ సమయంలోనే ప్రజల్లో పేరు సంపాదించుకోవడం ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్నారు. తాత కరుణానిధి, నాన్న స్టాలిన్ మీకు బలమా..? అన్న ప్రశ్నకు కచ్చితంగా బలహీనతే అన్నారు. ఒకరు పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం పాటు పడుతుంటే ప్రశంసలు లభిస్తాయన్నారు. తన విషయంలో అలా జరగడంలేదన్నారు. డీఎంకే అంటేనే కుటుంబ పాలన అనే విమర్శ ఉందే? అన్న ప్రశ్నకు దీనికి నాన్న విషయంలోనే సమాధానం ఉందన్నారు. నిరంతర శ్రమతో ఒక్కో మెట్టు ఎదుగుతూ.. కఠిన శ్రమతోనే నాన్నకు అధ్యక్షుడి అర్హత వచ్చిందని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. -
లెక్క చెప్పాల్సిందే!
కథానాయిక తమన్నా చేతి నిండా క్యాష్ ఉంది. కానీ ఆ క్యాష్ ఆమెది కాదు. ఓన్లీ కౌంట్ చేయడమే ఆమె పని. పైగా పైవాళ్లకు లెక్క చెప్పాలి. ఇదేం జిమ్మిక్కు అంటే.. అవును బ్యాంక్ ఉద్యోగి అంటే అంతేగా మరి. శీను రామస్వామి దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్, తమన్నా జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘కన్నే కలైమానే’. షూటింగ్ పూరై్తంది. ఈ సినిమాలో తమన్నా బ్యాంక్ ఉద్యోగి పాత్ర చేశారని కోలీవుడ్ టాక్. ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. హీరో ఉదయ్‌ను స్కూటర్‌పై ఎక్కడికో తీసుకెళ్తున్నారు తమన్నా. వీళ్ల ప్రయాణం ఎక్కడికి అనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ‘‘శీను రామసామి దర్శకత్వంలో నటించినందుకు ఆనందంగా ఉంది. నాలోని యాక్టింగ్ స్కిల్స్‌ను ఎక్స్ప్లోర్ చేయగలిగే క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. ఉదయనిధి స్టాలిన్ చాలా సెన్సిటివ్ యాక్టర్. కెమెరామేన్ జలంధర సార్ ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆయన తీసిన విజువల్స్ సినిమాకు హైలైట్’’ అని ఈ సినిమా జర్నీ గురించి పేర్కొన్నారు తమన్నా. -
నా బెస్ట్ చిత్రాలలో ఒకటిగా నిమిర్: ప్రియదర్శన్
తన ది బెస్ట్ చిత్రాలలో నిమిర్ చిత్రం ఒకటిగా నిలిచిపోతుందని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్. ఈయన తెరకెక్కించిన తాజా చిత్రం నిమిర్. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన మహేషింటే ప్రతీకారం చిత్రానికిది రీమేక్. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ఇందులో నమిత ప్రమోద్, పార్వతి నాయర్ నాయికలుగా నటించారు. మూన్‌షాట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సంతోష్ టి.కురువిల్లా నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ తానింతకు ముందు మలయాళంలో నాలుగు చిత్రాలు నిర్మాంచాననీ, తమిళంలో చేస్తున్న తొలి చిత్రం నిమిర్ అని చెప్పారు. వివిధ భాషల్లో 93 చిత్రాలు చేసిన లెజెండ్రీ దర్శకుడు ప్రియదర్శన్‌తో చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తన సినీ కేరీర్‌లోనే నిమిర్ చాలా ముఖ్యమైన చిత్రంగా పేర్కొన్నారు. ఒక రోజు ప్రియదర్శన్ పిలిచి తన చిత్రంలో నటించమని అడిగారన్నారు. దీంతో తాను సార్ నిజంగానే అంటున్నారా? దర్శకుడెవరు? అని అడగ్గా నేనే దర్శకుడిని అని ఆయన చెప్పడంతో చెప్పలేనంత ఆనందం కలిగిందన్నారు. ఇందులో ముఖ్య పాత్రను పోషించిన దర్శకుడు మహేంద్రన్ తెరి చిత్రం తరువాత విలన్‌గా నటించమని చాలా అవకాశాలు వచ్చినా అంగీకరించలేదనీ, ప్రియదర్శన్ కోసమే ఈ చిత్రంలో నటించానని చెప్పారు. ఈ చిత్రం ప్రివ్యూ చూసి మనిదన్ చిత్రం తరువాత అంతకంటే మంచి చిత్రం చేశారని తన భార్య ప్రశంసించిందన్నారు. అయితే పాహద్ ఫాజిల్ నటనలో సగమే మీరు చేశారని అందనీ, అదీ ప్రశంస గానే తాను తీసుకున్నానని చెప్పారు. చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోందని, జనవరి 26న విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని స్టాలిన్ వెల్లడించారు. ప్రియదర్శన్ మాట్లాడుతూ ఈ చిత్ర కథకు ఒక సాధారణ నటుడు అవసరం అవ్వడంతో ఉదయనిధిని ఎంపిక చేశామన్నారు. ఆయన ఇంతకుముందు చేసిన చిత్రాలేవీ తాను చూడలేదన్నారు. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక ఫోటోగ్రాఫర్ ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం అని చెప్పారు. మలయాళంలో షాహద్ పాజిల్ కంటే తమిళ వెర్షన్లో ఉదయనిధి స్టాలిన్ చాలా బాగా నటించారని దర్శకుడు మహేంద్రన్ తనతో అన్నారని ప్రియదర్శన్ చెప్పారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తన పని తాను చేసుకుపోయే ఒక యువకుడిని అవమాన పరుస్తారన్నారు. వారిపై ప్రతీకారం తీర్చుకునే వరకు తాను కాళ్లకు చెప్పులు కూడా తొడగనని ఆ యువకుడు శపథం చేస్తాడన్నారు. దాన్ని ఎలా నెరవేర్చుకున్నాడన్నదే నిమిర్ ఇతివృత్తం అని వివరించారు. మలయాళం చిత్ర కథను మాత్రమే తీసుకుని మరిన్ని కమర్షియల్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. ఇది తన సినీ కేరీర్‌లోనే ముఖ్య చిత్రంగా నిలిచిపోతుందని నటి పార్వతీనాయర్ అన్నారు. -
ఉదయనిధి స్వీయ నిర్మాణంలో కొత్త సినిమా
తమిళ సినిమా: శీనురామస్వామి దర్శకత్వం వహించనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించి నిర్మించడానికి యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ రెడీ అవుతున్నారన్నది తాజా న్యూస్. మంచి కథావస్తువుతో కూడిన సెలెక్టెడ్ చిత్రాలను చేస్తూ విజయాలను అందుకుంటున్న ఉదయనిధి స్టాలిన్ తాజాగా ప్రియదర్శన్ దర్శకత్వంలో నటిస్తున్న నిమిర్ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఈ నటుడు నూతన చిత్రాన్ని కమిట్ అయ్యారు. ధర్మదురై వంటి మంచి విలువలతో కూడిన చిత్రాల దర్శకుడు శీనురామస్వామితో చేతులు కలిపారు. వీరి కాంబనేషన్లో తెరకెక్కనున్న చిత్రం జనవరి 19వ తేదీన ప్రారంభం కానుంది. దీని గురించి ఉదయనిధి స్టాలిన్ తెలుపుతూ దర్శకుడు శీనురామస్వామి చిత్రాలంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఆయన చిత్రాల్లో మావనతా విలువలతో పాటు కుటుంబ సమేతంగా చూసి ఆనందించే జనరంజక అంశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఆయనతో జాతీయ అవార్డును గెలుచుకున్న నీర్ప్పరవై వంటి చిత్రాన్ని నిర్మించిన అనుభవంతో చెబుతున్నానని, అలాంటి దర్శకుడితో చిత్రాన్ని నిర్మించి, కథానాయకుడిగా నటించడం తన బాధ్యతను, ఇష్టాన్ని పెంచుతాయని అన్నారు.శీనూరామస్వామి దర్శకత్వంలో నటించనుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఉదయనిధిస్టాలిన్ తెలిపారు.