
ఉదయనిధి స్టాలిన్, తమన్నా
కథానాయిక తమన్నా చేతి నిండా క్యాష్ ఉంది. కానీ ఆ క్యాష్ ఆమెది కాదు. ఓన్లీ కౌంట్ చేయడమే ఆమె పని. పైగా పైవాళ్లకు లెక్క చెప్పాలి. ఇదేం జిమ్మిక్కు అంటే.. అవును బ్యాంక్ ఉద్యోగి అంటే అంతేగా మరి. శీను రామస్వామి దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్, తమన్నా జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘కన్నే కలైమానే’. షూటింగ్ పూరై్తంది. ఈ సినిమాలో తమన్నా బ్యాంక్ ఉద్యోగి పాత్ర చేశారని కోలీవుడ్ టాక్. ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు.
హీరో ఉదయ్‌ను స్కూటర్‌పై ఎక్కడికో తీసుకెళ్తున్నారు తమన్నా. వీళ్ల ప్రయాణం ఎక్కడికి అనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ‘‘శీను రామసామి దర్శకత్వంలో నటించినందుకు ఆనందంగా ఉంది. నాలోని యాక్టింగ్ స్కిల్స్‌ను ఎక్స్‌ప్లోర్ చేయగలిగే క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. ఉదయనిధి స్టాలిన్ చాలా సెన్సిటివ్ యాక్టర్. కెమెరామేన్ జలంధర సార్ ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆయన తీసిన విజువల్స్ సినిమాకు హైలైట్’’ అని ఈ సినిమా జర్నీ గురించి పేర్కొన్నారు తమన్నా.