
చెవిటి యువతిగా నయనతార
మార్పు అనేది చాలా అవసరం. ఎప్పుడు ఒకేలా చేస్తే ఎవరైనా మోనోటమీ ఫీలవుతారు. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించింది నటి నయనతార. నాయకిగా దశాబ్దం దాటిన ఈ భామ కెరీర్‌లో తెలుగు చిత్రం శ్రీరామ రాజ్యం లాంటి ఒకటి అరా చిత్రాలు మినహా గొప్ప పాత్రలేమీ లేవు. ఇప్పటి వరకు గ్లామర్‌తోనే కొట్టుకొచ్చింది. రకరకాల భంగిమల్లో సొగసులు గుప్పించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార ఇంకా యువళగీతాలు, ప్రేమ సన్నివేశాలతో అభిమానులను బోర్ కొట్టించడం ఇష్టం లేదనుకుందో? లేక తనకే అలాంటి వాటిలో నటించడం ఇష్టం లేదో గానీ తాజాగా తన రూటే మార్చింది.
ఇకపై కొంచెం అయినా అభినయానికి పదును పెట్టాలని భావించింది. ప్రస్తుతం నటనకు అవకాశం వున్న పాత్రలతో కూడిన రెండు చిత్రాలు చేస్తోంది. అందులో ఒకటి మాయ. ఇది హారర్ కథా చిత్రం. ఈ కథ నయనతార చుట్టూనే తిరుగుతుందట. ఈ తరహా చిత్రంలో నటించడం నయనకు సరికొత్త అనుభవమే. అదేవిధంగా అభినయానికి అవకాశం ఉన్న పాత్రను నానుమ్ రౌడీదాన్ చిత్రంలో పోషిస్తున్నారు. ఇందులో యువ నటుడు విజయ్ సేతుపతితో జోడిగడుతోంది. ఈ చిత్రంలో నటించడానికి ఆమె పాత్రే కారణం అట.
అంతగా ఆ పాత్ర విశేషం ఏమిటంటారా? నయనతార బధిర (చెవిటి) యువతిగా నటిస్తున్నారు. ఈ పాత్ర నానుమ్ రౌడీదాన్ చిత్రానికి చాలా కీలకం అట. ఆమె కూడా చాలా గొప్పగా నటిస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదలకు వరుస కడుతున్న ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన నన్భేండా, శింబు సరసన నటించిన ఇదు నమ్మ ఆళు, సూర్యతో జత కట్టిన మాస్, జయంరవితో రొమాన్స్ చేస్తున్న తనీ ఒరువన్ చిత్రాల్లో ఆమె కమర్షియల్ హీరోగానే ప్రేక్షకుల ముందుకు రానుంది.