TN Polls 2021 BJP Leader Radha Ravi Sensational Comments On Nayantara Affair With Stalin Son Udhayanidhi - Sakshi
Sakshi News home page

పెళ్లైన హీరోతో నయన తార సహజీవనం: బీజేపి ఎమ్మెల్యే

Published Wed, Mar 31 2021 7:44 PM | Last Updated on Thu, Apr 1 2021 4:44 PM

TN Polls 2021 BJP Leader Radha Ravi Sensational Comments On Nayantara Affair With Stalin Son - Sakshi

త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. అభ్యర్థులంతా గెలిచేందుకు ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు.  ఈ ఎన్నికల్లో హీరో కమల్‌ హాసన్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కమల్‌కు మద్దతుగా నటి సుహాసిని ప్రచారం చేస్తోంది. బీజేపీకి మద్దతుగా ఖుష్బు, నమితతో పాటు పలువురు నటీనటులు ప్రచారం చేస్తుండగా, డిఎంకేలో స్టాలిన్‌ కుమారు ఉదయనిధి స్టాలిన్‌ ఊపు మీదున్నారు. సీని నటులు ఈ ప్రచారంలో ఒకరిపై ఒకరు వివాస్పద వ్యాఖ్యలు చేసుకుంటు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే, సీనీ నటుడు రాధా రవి హీరోయిన్‌ నయన తారపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

డీఎంకే అధినేత స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌, నయన్‌తో సహజీవనం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు తమిళ నాట చర్చనీయాంశంగా మారాయి. కాగా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గతంలో నేను నయన తార గురించి చెడుగా మాట్లాడానని, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశానంటూ ఆరోపిస్తూ పార్టీలో ఉండడానికి అర్హత లేదన్నారు. నన్ను పార్టీ నుంచి పంపించాడానికి మీరేవరు’ అంటూ డీఎంకే పార్టీని ఉద్దేశిస్తూ ధ్వజమెత్తారు. ఇక మీ పార్టీలో నయన తార ఎవరని, ఉదయనిధితో ఆమె సహజీవనం చేస్తోందా.. అయినా అలాంటివి నేను పట్టించుకొను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అంతేగాక కమల్‌ హాసన్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. భార్యలనే కాపాడుకోలేని కమల్‌ రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని, ప్రధాని మోదీకి, కమల్‌కు చాలా తేడా ఉందంటూ విమర్శించారు. కాగా గతంలో రాధా రవి నయన్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. దెయ్యం పాత్రలు పోషిస్తూ ఎంతో మందితో తిరిగిన ఆమె.. దేవత పాత్రలు చేయడానికి పనికిరాదు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నయ తారతో పాటు పలువురు సినీ పెద్దలు స్పందిస్తూ ఆయనపై దీరుపై మండిపడ్డారు. అయినా ఆయన తీరు మారలేదు. తాజాగా మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన రాధా రవిని బీజేపీ ప్రోత్సహిస్తోందంటూ ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

చదవండి: 
నిశ్చితార్థం‌ చేసుకున్న నయనతార! 
ఆచార్య ఫస్ట్‌ సాంగ్: సీనియర్‌ నటి స్పెషల్‌‌‌ అట్రాక్షన్‌‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement