tamilanadu assembly elections
-
పోలింగ్ బూత్‌లోకి శృతి.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
నిన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌లో హీరోయిన్ శృతి హాసన్ చేసిన పొరపాటు ఆమెను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. మంగళవారం తమిళనాడుతో పాటు కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోలు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు హీరోయిన్స్ శృతి హాసన్, అక్షరా హాసస్‌లు కూడా తండ్రి కమల్ హాసన్‌తో కలిసి చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కమల్ హాసన్ ఈ ఎన్నికల్లో కోమంబత్తూర్ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒటు వేసిన అనంతరం కమల్ ఆయన పోటీ చేస్తున్న కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గంలోని పోలీంగ్ బూతులోకి వెళ్లాడు. అయితే ఆయనతో పాటు శృతి హాసన్ కూడా లోపలికి వెళ్లింది. ఈ సంఘటన ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్నికల నియమావళికి విరుద్దంగా ప్రవర్తించిన శృతి తీరుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. శృతి హాసన్.. తన తండ్రి పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేదు. పైగా ఆమె పోలింగ్ ఏజెంట్ కూడా కాదు. మీడియా పర్సన్ అంతకన్న కాదు. మరెందుకు పోలీంగ్ బూతులోకి అనమతించారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ బూతులోకి ఆమెను ఎలా అనుమతించారంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. అంతేగాక శృతి పోలింగ్ తర్వాత ఓటు వేసినట్టు చెప్పడమే కాకుండ.. ట్విట్టర్లో తన తండ్రి పార్టీ అయిన ‘మక్కల్ నీది మయ్యంకు(ఎమ్ఎన్ఎమ్) ఓటు వేయమని చెప్పడం కూడా కమిషన్ నిబంధనలకు విరుద్దమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నందకుమార్‌తో పాటు బీజేపీ జాతీయ మహిళ నేత వానతి శ్రీనివాస్ కూడా శృతిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటికి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ స్పందించడం కానీ చేయలేదు. మరి ఎన్నికల కమిషన్ శృతిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు.. -
నయన తారపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. అభ్యర్థులంతా గెలిచేందుకు ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈ ఎన్నికల్లో హీరో కమల్ హాసన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కమల్‌కు మద్దతుగా నటి సుహాసిని ప్రచారం చేస్తోంది. బీజేపీకి మద్దతుగా ఖుష్బు, నమితతో పాటు పలువురు నటీనటులు ప్రచారం చేస్తుండగా, డిఎంకేలో స్టాలిన్ కుమారు ఉదయనిధి స్టాలిన్ ఊపు మీదున్నారు. సీని నటులు ఈ ప్రచారంలో ఒకరిపై ఒకరు వివాస్పద వ్యాఖ్యలు చేసుకుంటు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే, సీనీ నటుడు రాధా రవి హీరోయిన్ నయన తారపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్, నయన్‌తో సహజీవనం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు తమిళ నాట చర్చనీయాంశంగా మారాయి. కాగా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గతంలో నేను నయన తార గురించి చెడుగా మాట్లాడానని, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశానంటూ ఆరోపిస్తూ పార్టీలో ఉండడానికి అర్హత లేదన్నారు. నన్ను పార్టీ నుంచి పంపించాడానికి మీరేవరు’ అంటూ డీఎంకే పార్టీని ఉద్దేశిస్తూ ధ్వజమెత్తారు. ఇక మీ పార్టీలో నయన తార ఎవరని, ఉదయనిధితో ఆమె సహజీవనం చేస్తోందా.. అయినా అలాంటివి నేను పట్టించుకొను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాక కమల్ హాసన్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. భార్యలనే కాపాడుకోలేని కమల్ రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని, ప్రధాని మోదీకి, కమల్‌కు చాలా తేడా ఉందంటూ విమర్శించారు. కాగా గతంలో రాధా రవి నయన్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. దెయ్యం పాత్రలు పోషిస్తూ ఎంతో మందితో తిరిగిన ఆమె.. దేవత పాత్రలు చేయడానికి పనికిరాదు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నయ తారతో పాటు పలువురు సినీ పెద్దలు స్పందిస్తూ ఆయనపై దీరుపై మండిపడ్డారు. అయినా ఆయన తీరు మారలేదు. తాజాగా మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన రాధా రవిని బీజేపీ ప్రోత్సహిస్తోందంటూ ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. #RadhaRavi the star campaigner of B.J.P hasn't learned his lesson nor would never learn I suppose... He yet again shames #Nayanthara in a stage!! I wonder how can he get away with such disgusting, disgraceful, ill talks on one of South India's biggest actors...!! https://t.co/cwFsEFPuub pic.twitter.com/7hia5FfVDU — Visvesh ✨ (@PawPawVee) March 31, 2021 చదవండి: నిశ్చితార్థం చేసుకున్న నయనతార! ఆచార్య ఫస్ట్ సాంగ్: సీనియర్ నటి స్పెషల్ అట్రాక్షన్ -
వీరాభిమానంతో వేలు కోసుకున్నాడు!
టీనగర్ (చెన్నై): మితిమీరిన వ్యక్తి ఆరాధనకు కేరాఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో చేతి వేలు కోసుకున్న మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ జయలలిత ఘనవిజయానికి పొంగిపోయిన ఓ అభిమాని తన చిటికెనవేలును కోసుకుని ఉప్పొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. నామక్కల్ జిల్లా రాశిపురానికి చెందిన తంగరాజు చెక్క మంచాల వ్యాపారి. ఆయనకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అంటే చచ్చేంత అభిమానం. ఓటుకూడా రెండు ఆకుల గుర్తుకే వేశాడు. ఫలితంపై ధీమాగాఉన్న తంగరాజు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో కంగారుపడ్డాడు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు అమ్మ ఓడిపోతుందని చెప్పడంతో తట్టుకోలేకపోయాడు. దీంతో రాశిపురంలోని మునియప్పన్ ఆలయానికి వెళ్లి మొక్కుకున్నాడు.. 'దేవుడా.. అమ్మ గెలిస్తే నీకు నా వేలిని సమర్పించుకుంటా' అని! గురువారం ఫలితాలు వెల్లడికావడం, జయలలిత తిరిగి అధికారపీఠం చెపట్టడం ఖరారుకావడంతో తంగరాజు ఆనందానికి అవధులు లేకుండాపోయింది. వెంటనే మునియప్ప ఆలయానికి వెళ్లి, కత్తితో తన ఎడమచేతి చిటికెనవేలును కోసి హుండీలో వేసు ప్రయత్నం చేశాడు. దీన్ని గమనించిన అతని స్నేహితుడు తంగరాజును హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తంగరాజును సేలం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. -
'అమ్మ' పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరింది...
చెన్నై: దేవుడు అన్నిచోట్ల ఉండడు కాబట్టే ప్రతిగా 'అమ్మ'ను సృష్టించాడని చెప్తారు. అయితే, కన్నతల్లినయినా అంతగా ఆరాదీస్తారో లేదో తెలియదుగానీ తమిళనాడు మాత్రం అమ్మకానీ అమ్మ జయమ్మకు మాత్రం ప్రతి రోజు పూజలే.. అడుగడుగునా ఆమె అంటే అభిమానం తమిళనాడులో ఏ వీధిలో చూసిన పొంగిపొర్లుతుంది. ఇప్పుడసలే ఓట్లకాలం కాబట్టి ఇక జయమ్మ లేని చోటే తమిళనాడులో కనిపించదంటే నమ్మండి. అభిమానం చాటుకునేందుకు కాదేదీ అనర్హం అన్నట్లు ఏ తీరుగా చూసిన ఇప్పుడు 'అమ్మ' దర్శనమిస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి, పురచ్చి తలైవి జయలలితపై తమ అభిమానాన్ని అక్కడ ఎంతోమంది తమ శక్తికొద్ది చాటుకునే విషయం తెలిసిందే. తాజాగా ఆ అభిమానం పిచ్చి కాస్త పీక్ స్టేజ్‌కు చేరినట్లు ఓ పార్టీ కార్యకర్త ఏకంగా అన్నాడీఎంకే గుర్తుతోపాటు అమ్మ ఫోటోను కూడా బంగారంతో లోలాకులు చేయించుకుని చెవులకు అలకరించుకుని మరీ తన అభిమానం చాటుకుంది. ఇది చూడగానే.. అభిమానుల్లో 'అమ్మ' అభిమానులు వేరయ్యా అని అనిపించక మానదు. ఆమె కోసం తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి వెనుకాడని ఈ తమిళ తంబీలు ఎన్నికల సమయంలో అమ్మపై అబ్బురపడే ప్రేమను చూపిస్తూ అడుగడుగునా దర్శనమిస్తున్నారు. గతంలో జయమ్మ పుట్టిన రోజు సందర్భంగా చిరకాలం గుర్తుండిపోవాలని వెయ్యిమంది తమ చేతులపై జయలలిత ఫోటోతో పాటు, 'అమ్మ' అనే పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అయితే ఇందుకు నాలుగాకులు ఎక్కువే చదవిన అమ్మ వీరాభిమాని షిహాన్ హుస్సేని శిలువ వేసుకున్నాడు. జయలలిత మళ్లీ సీఎం కావాలంటూ చేతులు, కాళ్లకు ఆరు అంగుళాల పొడవున్న మేకులు కొట్టించుకుని, శిలువ వేయించుకున్నాడు. ఈ చేష్టలు చూసేవారికి నవ్వు తెప్పించినా...వారు మాత్రం డోంట్ కేర్ అంటూ అవకాశం దొరికినప్పుడల్లా తమ అమ్మ భక్తిని చాటుకుంటుంటారు. మరి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అయ్యేలోపు ఇలాంటి సిత్రాలు ఇంకా ఎన్ని చూడాలో. -
పోటాపోటీగా పరభాషలో ప్రచారం
వాళ్లని 'భాషాదురాభిమానులు' అని కొందరు వెక్కిరిస్తారు. కానీ వాళ్లు మాత్రం తమని తాము భాషాభిమానులుగా చెప్పుకుంటారు. అవును. మనం మాట్లాడుకునేది తమిళుల గురించే. వారు మాతృభాషను అమ్మకన్నా ఎక్కువగా ఆరాధిస్తారని, దాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తారని తెలిసిందే. ఆఖరికి సినిమాలకు కూడా పరాయి భాషల పేర్లు పెట్టరు. అలాంటి తమిళనాడులో ఇప్పుడు పరభాషా ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. హిందీని ఈసడించుకునే ముఖ్యపార్టీలన్నీ (ఆయా పార్టీల నేతలు గతంలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా) జాతీయ భాషలో ఓట్లు అడుక్కుంటున్నాయి. చెన్నై శివారులోని ఎగ్మూర్ స్థానం నుంచి డీఎంకే తరఫున పోటీచేస్తోన్న అభ్యర్థి కేఎస్ రవిచంద్రన్ అయితే మరో అడుగు ముందుకువేసి హిందీలో ఎస్ఎంఎస్ లు పంపుతున్నారు. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.. ఆ నియోజకవర్గంలో హిందీ మాట్లాడే ఉత్తర భారతీయుల ఓట్లే కీలకమని. తరాల కిందటే ఉత్తరం నుంచి వచ్చి ఎగ్మూర్ లో స్థిరపడ్డ మార్వాడీలు, ఇతరులను ప్రసన్నం చేసుకునేందుకు అన్నిపార్టీలు ఓటర్ల భాషలోనే ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎగ్మూర్ లో హిందీలో సాగుతున్నట్లే ఆవడి నియోజకవర్గంలో అభ్యర్థులందరూ తెలుగులో ప్రచారం చేస్తున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆవడి కూడా ఒకటి. హోసూర్, గుమ్మిడిపూండి, తిరుత్తణిల్లోనూ తెలుగు ఓటర్లు అభ్యర్థి జయాపజయాలను నిర్దేశించే స్థాయిలో ఉండటంతో ప్రచారమంతా తేట 'తెనుంగు'లో జరుగుతోంది. ఇక ఈరోడ్, ధర్మపురి, కృష్ణగిరి నియోజకవర్గాల్లో తెలుగుతోపాటు కన్నడ పలుకులూ హోరెత్తుతున్నాయి. అన్నింటికీ భిన్నంగా అటు కన్యాకుమారి, కోయంబత్తూరు జిల్లాలో అయితే మలయాళ మంత్రాలు జపిస్తున్నారు తమిళ రాజకీయ నేతలు. కారణం ఆ జిల్లాల్లో కేరళ నుంచి వచ్చి స్థిరపడ్డ మలయాళీలు ఎక్కువగా ఉండటమే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్నట్లు.. ఎన్నికల సమయంలో అన్ని భాషలను గౌరవిస్తున్న తమిళులను తెలివైనవారు కాదనగలమా! -
కమ్యూనిజం, సోషలిజం, లెనినిజంల పోరాటం
రాముడు, కృష్ణుడు, శివుడు, బ్రహ్మ తదితరులు ఒకరిపై మరొకరు పోటీకి దిగారు గతంలో. ఇప్పుడు కమ్యూనిజయం, సోషలిజం, లెనినిజంలు ఒకే లక్ష్యంతో మూకుమ్మడిగా పోరాటం చేస్తున్నారు. మొదటి సంఘటన గతేడాది జరిగిన బిహార్ ఎన్నికల్లో చోటుచేసుకున్నదైతే, తాజాగా 'ఇజాల' పోరాటం తమిళనాడులో జరుగుతోంది. అసలింతకీ ఏమిటీ ఇజమ్స్..? సేలం జిల్లాకు చెందిన 48 ఏళ్ల మోహన్ కరడుగట్టిన వామపక్షవాది. ఆయన రక్తమేకాదు, మాట, చూపు, పని.. అన్నీ ఎరుపే. ఎరుపు కండువా లేనిదే ఇల్లు కదలడు. తన ముగ్గురు కొడుకులకు కూడా కమ్యూనిజం, సోషలిజం, లెనినిజం అని పేర్లు పెట్టుకున్నాడు. ఏళ్లుగా పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఆయనకు వీరపాండి అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. తండ్రి విజయం కోసం ఆ ముగ్గురు కొడుకులూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పేరులోని వైవిధ్యత ఆ ముగ్గురికీ ఇప్పటికే విస్తృతమైన పరిచయాలున్నాయి. అలా తెలిసిన వాళ్లందరినీ కలిసి, 'కంకి కొడవలి' గుర్తుకు ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తూ తండ్రి విజయానికి కృషిచేస్తున్నారు కమ్యూనిజం, సోషలిజం, లెనినిజంలు. స్థానికంగా ఉంటూ గడిచిన ఏడాది కాలంగా లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు మోహన్ పెద్దకొడుకు కమ్యూనిజం. 'వెరైటీగా ఉండే నా పేరంటే నాకు చాలా గర్వం. పేరు చెప్పగానే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఎందుకీ పేరు పెట్టారని ఆరాతీస్తారు. మా సీనియర్ లాయర్ నన్ను జూనియర్ గా చేర్చుకున్నది కూడా నా పేరు వల్లే'అని పేరు బలాన్ని మాటల్లో ప్రదర్శిస్తాడు కమ్యూనిజం. ఇక సోషలిజం, లెనినిజంలు ఆభరణాల తయారుచేసే వృత్తిలో కొనసాగుతున్నారు. తండ్రి గెలుపుకోసం ఇజాలు చేస్తున్న పోరాటం తమిళనాడు ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. -
సీఎం సిట్టింగ్ స్థానంలో హిజ్రా పోటీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరంగా అనేక సంచలనాలకు నిలయంగా మారిన తమిళనాడులో మరో విశేషం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి 'పురచ్చితలైవి' జయలలిత ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి ఓ హిజ్రా పోటీకి దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. సేలం దేవీ అనే హిజ్రాను ఆర్కే నగర్ నుంచి పోటీకి దింపుతున్నట్లు తమిళనాడుకు చెందిన 12 స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు మంగళవారం ప్రకటించాయి. నామ్‌తమిళర్ కట్చి(ఎన్టీకే) తరఫున పోటీకి దిగుతోన్న సేలం.. గడిచిన కొన్నేళ్లుగా హిజ్రాల హక్కుల కోసం పోరాడుతున్నారు. కుల, మత భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు ప్రభుత్వం అనేక రాయితీలు, పథకాలు అమలు చేస్తుండగా హిజ్రాలు మాత్రం వివక్షకు గురవుతున్నారని, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించేందుకు ఇకపై జరుగనున్న ఎన్నికల్లో హిజ్రాలకు రాజకీయ రిజర్వేషన్లు, పోటీచేసే అవకాశం కల్పించాలని ఎన్ టీకే డిమాండ్ చేస్తోంది. -
చెన్నై ఆర్కేనగర్ నుంచి హిజ్రా పోటీ
- ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం హిజ్రాల పట్టు చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి నామ్‌తమిళర్ కట్చి(ఎన్టీకే) అభ్యర్థిగా సేలం దేవి అనే హిజ్రా పోటీ చేయనున్నారు. తమిళనాడుకు చెందిన 12 స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు చెన్నై ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుల, మత భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు ప్రభుత్వం అనేక రాయితీలు, పథకాలు అమలు చేస్తుండగా హిజ్రాలు మాత్రం వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించేందుకు ఇకపై జరుగనున్న ఎన్నికల్లో హిజ్రాలకు రాజకీయ రిజర్వేషన్లు, పోటీచేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రతి పార్టీ ఒక టికెట్‌ను హిజ్రాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. చెన్నై ఆర్కేనగర్ నుంచి సేలం దేవి (హిజ్రా) నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా ఖరారైనట్లు వారు తెలిపారు.