'అమ్మ' పిచ్చి పీక్ స్టేజ్కు చేరింది... Jayalalithaa fan waring her photo with gold Jewellery | Sakshi
Sakshi News home page

'అమ్మ' పిచ్చి పీక్ స్టేజ్కు చేరింది...

Published Fri, May 13 2016 1:17 PM

Jayalalithaa fan waring her photo with gold Jewellery

చెన్నై: దేవుడు అన్నిచోట్ల ఉండడు కాబట్టే ప్రతిగా 'అమ్మ'ను సృష్టించాడని చెప్తారు. అయితే, కన్నతల్లినయినా అంతగా ఆరాదీస్తారో లేదో తెలియదుగానీ తమిళనాడు మాత్రం అమ్మకానీ అమ్మ జయమ్మకు మాత్రం ప్రతి రోజు పూజలే.. అడుగడుగునా ఆమె అంటే అభిమానం తమిళనాడులో ఏ వీధిలో చూసిన పొంగిపొర్లుతుంది. ఇప్పుడసలే ఓట్లకాలం కాబట్టి ఇక జయమ్మ లేని చోటే తమిళనాడులో కనిపించదంటే నమ్మండి. అభిమానం చాటుకునేందుకు కాదేదీ అనర్హం అన్నట్లు ఏ తీరుగా చూసిన ఇప్పుడు 'అమ్మ' దర్శనమిస్తోంది.

అన్నాడీఎంకే అధినేత్రి, పురచ్చి తలైవి జయలలితపై తమ అభిమానాన్ని అక్కడ ఎంతోమంది తమ శక్తికొద్ది చాటుకునే విషయం తెలిసిందే. తాజాగా ఆ అభిమానం పిచ్చి కాస్త పీక్ స్టేజ్కు చేరినట్లు ఓ పార్టీ కార్యకర్త ఏకంగా అన్నాడీఎంకే గుర్తుతోపాటు అమ్మ ఫోటోను కూడా బంగారంతో లోలాకులు చేయించుకుని చెవులకు అలకరించుకుని మరీ తన అభిమానం చాటుకుంది. ఇది చూడగానే.. అభిమానుల్లో 'అమ్మ' అభిమానులు వేరయ్యా అని అనిపించక మానదు. ఆమె కోసం తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి వెనుకాడని ఈ తమిళ తంబీలు ఎన్నికల సమయంలో అమ్మపై అబ్బురపడే ప్రేమను చూపిస్తూ అడుగడుగునా దర్శనమిస్తున్నారు.

గతంలో జయమ్మ పుట్టిన రోజు సందర్భంగా చిరకాలం గుర్తుండిపోవాలని  వెయ్యిమంది తమ చేతులపై జయలలిత ఫోటోతో పాటు, 'అమ్మ' అనే పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అయితే ఇందుకు నాలుగాకులు ఎక్కువే చదవిన  అమ్మ వీరాభిమాని షిహాన్‌ హుస్సేని శిలువ వేసుకున్నాడు. జయలలిత మళ్లీ సీఎం కావాలంటూ చేతులు, కాళ్లకు ఆరు అంగుళాల పొడవున్న మేకులు కొట్టించుకుని, శిలువ వేయించుకున్నాడు. ఈ చేష్టలు చూసేవారికి నవ్వు తెప్పించినా...వారు మాత్రం డోంట్ కేర్ అంటూ అవకాశం దొరికినప్పుడల్లా తమ అమ్మ భక్తిని చాటుకుంటుంటారు. మరి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అయ్యేలోపు ఇలాంటి సిత్రాలు ఇంకా ఎన్ని  చూడాలో.

Advertisement
 
Advertisement
 
Advertisement