jayalalithaa fan
-
జయ వీరాభిమాని
ప్రమాణ స్వీకారం రోజున ఆటో చార్జి రూపాయి మాత్రమే కేకే.నగర్: ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రయాణికుల నుంచి ఒక్క రూపాయి మాత్రమే ఆటోచార్జ్ కింద వసూలు చేసి ఓ ఆటోడ్రైవర్ తన అమ్మ భక్తిని నిరూపించుకున్నాడు. కోయంబత్తూరు సింగార నల్లూర్కు చెందిన మదావానన్ (61) ఆటోడ్రైవర్. అన్నాడీఎంకే సభ్యుడు అయిన ఇతడు సోమవారం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని తన ఆటోలో ప్రయాణించిన వారు ఎంత దూరం సవారికి వెళ్లినా ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేశారు. ‘ఒక్క రూపాయి చాలు’ అనే స్లోగన్ గల స్టిక్కర్‌ను ఆటోపైన అతికించారు. సోమవారం ఒకరోజు రాత్రి వరకు 200లకు పైగా ప్రయాణికులు మదివానన్ ఆటోలో ప్రయాణించారు. దీనిపై మదివానన్ మాట్లాడుతూ ‘అన్నాడీఎంకే అభ్యర్థి అయిన నేను గత 1975 నుంచి ఆటో నడుపుతున్నాను. నిజాయితీ, న్యాయమైన చార్జ్ అనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. నా పిల్లలకు వివాహాలు జరిపి వారు స్వతంత్రంగా జీవిస్తున్నారు. అందువలన నాకు ఎలాంటి బాధ్యతలు కాని ఖర్చులు కాని లేవు. అందువలన ప్రతిరోజూ సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని ప్రజా సంక్షేమాలకు ఖర్చు చేస్తున్నాను. నా సహ డ్రైవర్లు కుటుంబాల్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కలిగితే వారికి సహాయం చేస్తాను. ముఖ్యమంత్రి జయలలిత ప్రమాణ స్వీకారం చేసిన సంతోషంతో ప్రయాణికుల వద్ద చార్జీ కింద రూపాయి వసూలు చేసి తృప్తి పడ్డాన’ని మదివానన్ తెలిపారు. తమిళనాడులో వీరాభిమానుల జాబితాలో అమ్మ మదిలో మదివానన్ చోటు సంపాదించుకున్నాడు. -
ఒక్క రూపాయికే ఆటో ప్రయాణం!
అమ్మ పేరు చెబితే చాలు.. అక్కడ పూనకాలు వచ్చేస్తాయి. అందుకే 32 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టి మరీ వరుసగా రెండోసారి ఆమెను గెలిపించారు. ఇప్పుడు జయలలిత విజయాన్ని పండగలా చేసుకుంటున్నారు ఆమె అభిమానులు. అందులో భాగంగానే.. కోయంబత్తూరుకు చెందిన జయ అభిమాని అయిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ఎక్కే ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లినా వాళ్ల దగ్గర నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే చార్జీ తీసుకుంటున్నారు. ఒక రోజులో మొత్తం 102 మందిని తాను గమ్యాలకు చేర్చి 102 రూపాయలు సంపాదించానని, ఇందుకోసం తాను ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మానేశానని ఆటోడ్రైవర్ ఆర్ఎం మత్తివనన్ చెప్పారు. ఉదయం 6 గంటలకు ఆటో రోడ్డుమీదకు ఎక్కితే సాయంత్రం 6 గంటలకే ఆగుతుంది. జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా తాను ఆమె విజయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నానని తెలిపారు. మత్తివనన్ 1975 నుంచి అన్నాడీఎంకే కార్యకర్తగా ఉన్నారు. గత 41 ఏళ్లుగా కోయంబత్తూరులో ఆటో నడుపుతున్నానని, ఎంజీఆర్ హయాం నుంచి పార్టీలో సభ్యుడినని అన్నారు. జయలలిత తమిళనాడు ప్రజలకు చాలా మంచి చేశారని, అందుకే ఆమెను ప్రజలు మరోసారి గెలిపించారని చెప్పారు. ఆమె అన్నా క్యాంటీన్లలో రూపాయికే ఇడ్లీలు పెడుతున్నారని, అందుకే చాలామంది పేదలు ఉదయం టిఫిన్ చేయగలుగుతున్నారని చెప్పారు. అమ్మ అంతమందికి సాయం చేస్తున్నారు కాబట్టి.. తాను తనకు తోచిన సాయం చేస్తున్నట్లు మత్తివనన్ తెలిపారు. -
'అమ్మ' పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరింది...
చెన్నై: దేవుడు అన్నిచోట్ల ఉండడు కాబట్టే ప్రతిగా 'అమ్మ'ను సృష్టించాడని చెప్తారు. అయితే, కన్నతల్లినయినా అంతగా ఆరాదీస్తారో లేదో తెలియదుగానీ తమిళనాడు మాత్రం అమ్మకానీ అమ్మ జయమ్మకు మాత్రం ప్రతి రోజు పూజలే.. అడుగడుగునా ఆమె అంటే అభిమానం తమిళనాడులో ఏ వీధిలో చూసిన పొంగిపొర్లుతుంది. ఇప్పుడసలే ఓట్లకాలం కాబట్టి ఇక జయమ్మ లేని చోటే తమిళనాడులో కనిపించదంటే నమ్మండి. అభిమానం చాటుకునేందుకు కాదేదీ అనర్హం అన్నట్లు ఏ తీరుగా చూసిన ఇప్పుడు 'అమ్మ' దర్శనమిస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి, పురచ్చి తలైవి జయలలితపై తమ అభిమానాన్ని అక్కడ ఎంతోమంది తమ శక్తికొద్ది చాటుకునే విషయం తెలిసిందే. తాజాగా ఆ అభిమానం పిచ్చి కాస్త పీక్ స్టేజ్‌కు చేరినట్లు ఓ పార్టీ కార్యకర్త ఏకంగా అన్నాడీఎంకే గుర్తుతోపాటు అమ్మ ఫోటోను కూడా బంగారంతో లోలాకులు చేయించుకుని చెవులకు అలకరించుకుని మరీ తన అభిమానం చాటుకుంది. ఇది చూడగానే.. అభిమానుల్లో 'అమ్మ' అభిమానులు వేరయ్యా అని అనిపించక మానదు. ఆమె కోసం తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి వెనుకాడని ఈ తమిళ తంబీలు ఎన్నికల సమయంలో అమ్మపై అబ్బురపడే ప్రేమను చూపిస్తూ అడుగడుగునా దర్శనమిస్తున్నారు. గతంలో జయమ్మ పుట్టిన రోజు సందర్భంగా చిరకాలం గుర్తుండిపోవాలని వెయ్యిమంది తమ చేతులపై జయలలిత ఫోటోతో పాటు, 'అమ్మ' అనే పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అయితే ఇందుకు నాలుగాకులు ఎక్కువే చదవిన అమ్మ వీరాభిమాని షిహాన్ హుస్సేని శిలువ వేసుకున్నాడు. జయలలిత మళ్లీ సీఎం కావాలంటూ చేతులు, కాళ్లకు ఆరు అంగుళాల పొడవున్న మేకులు కొట్టించుకుని, శిలువ వేయించుకున్నాడు. ఈ చేష్టలు చూసేవారికి నవ్వు తెప్పించినా...వారు మాత్రం డోంట్ కేర్ అంటూ అవకాశం దొరికినప్పుడల్లా తమ అమ్మ భక్తిని చాటుకుంటుంటారు. మరి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అయ్యేలోపు ఇలాంటి సిత్రాలు ఇంకా ఎన్ని చూడాలో.