చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి సంబంధించి మద్రాసు హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌ని స్మారక మందిరంగా మార్చడానికి వీలులేదని కోర్టు తెలిపింది. దీనిపై అన్నాడీఎంకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం కొట్టేసింది. జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని స్పష్టం చేసిన కోర్టు.. మూడు వారాల్లో పోయెస్ గార్డెన్‌ని జయలలిత మేన కోడలి దీపకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
(చదవండి: పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే..)
జయలలిత 2016లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి ఏడాదే ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చాలని పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
(చదవండి: CJ Sanjib Banerjee: బరువెక్కిన హృదయంతో లేఖ.. నన్ను క్షమించండి..!)
తమని జయలలిత వారసులుగా కోర్టు గుర్తించిందని.. అలాంటిది ఆమె నివాసాన్ని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందంటూ దీప, దీపక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ విషయంపై చాలా రోజుల నుంచి కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తాజాగా పోయెస్ గార్డెన్ ఆమె మేనకోడలు దీపకే చెందుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది.
చదవండి: ద్విసభ్య కమిషన్.. జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేనా?
Comments
Please login to add a commentAdd a comment