poyes Garden
-
జయలలిత నివాసం.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి సంబంధించి మద్రాసు హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌ని స్మారక మందిరంగా మార్చడానికి వీలులేదని కోర్టు తెలిపింది. దీనిపై అన్నాడీఎంకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం కొట్టేసింది. జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని స్పష్టం చేసిన కోర్టు.. మూడు వారాల్లో పోయెస్ గార్డెన్‌ని జయలలిత మేన కోడలి దీపకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే..) జయలలిత 2016లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి ఏడాదే ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చాలని పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. (చదవండి: CJ Sanjib Banerjee: బరువెక్కిన హృదయంతో లేఖ.. నన్ను క్షమించండి..!) తమని జయలలిత వారసులుగా కోర్టు గుర్తించిందని.. అలాంటిది ఆమె నివాసాన్ని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందంటూ దీప, దీపక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ విషయంపై చాలా రోజుల నుంచి కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తాజాగా పోయెస్ గార్డెన్ ఆమె మేనకోడలు దీపకే చెందుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. చదవండి: ద్విసభ్య కమిషన్.. జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేనా? -
సీఎం నివాసంగా వేద నిలయం..
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా మార్చేందకు పరిశీలిస్తున్నట్లు బుధవారం తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. జయలలిత నివాసాన్ని స్మారక చిహ్నంగా మారుస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై నివాసితుల సంఘం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ వేద నిలయాన్ని సీఎం నివాసంగా మార్చనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్‌కు తెలిపారు. వేదనిలయంలో ఎక్కువ భాగం స్మారకంగా కాకుండా రాష్ట్ర సీఎం అధికారిక నివాసంగా మార్చాలని హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన సూచనను పరిశీలిస్తున్నట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. (వేదనిలయంలోకి దీపక్) అదే విధంగా సోయెస్ గార్డెన్, కస్తూరి ఎస్టేట్ హౌజ్ ఓనర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏజీ వ్యతిరేకించారు. వేద నిలయాన్ని స్మారకంగా మార్చడనికి అనుమతిస్తే వేల మంది సందర్శన వల్ల చుట్టూ ఉన్న ప్రజల ప్రశాంతతపై ప్రభావం పడుతుందని నివాసితుల సంఘం పేర్కొంది. పోయస్ గార్డెన్‌ను తాత్కలికంగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం మేలో ఆర్డినెన్స్‌ని జారీ చేసిన విషయం తెలిసిందే. (జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే: మద్రాసు హైకోర్టు) -
‘చిన్నమ్మ’కు ఇక నో ఎంట్రీ
సాక్షి, చెన్నై: వేదనిలయంతో చిన్నమ్మ శశికళకు ఇక, బంధం తెగినట్టే. ఆ గృహాన్ని ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవడంతో, అటువైపు వెళ్ల లేని పరిస్థితి. ఈ దృష్ట్యా, చిన్నమ్మ కోసం మరో షెల్టర్ సిద్ధం చేయడానికి తగ్గ కసరత్తులపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు దృష్టి పెట్టారు. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం, అమ్మ జయలలితకు చెందిన వేదనిలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల చర్చలకు, ఎందరో ప్రతినిధులతో సంప్రదింపులు, భేటీలకు వేదికగా ఒకప్పుడు ఈ భవనం నిలిచింది. అమ్మ జయలలిత ఆశీర్వచనాల కోసం బారులు తీరిన వాళ్లు ఎందరో. (షూటింగ్‌లకు త్వరలోనే అనుమతి) అయితే, ఇప్పుడు అమ్మ లేని దృష్ట్యా, ఆ పరిసరాలే నిర్మానుష్యం అయ్యాయి. అయితే, ఈ భవనంతో చిన్నమ్మ శశికళకు ప్రత్యేక అనుబంధమే ఉంది. జయలలిత నెచ్చెలిగా రెండున్నర దశాబ్దాలకు పైగా చిన్నమ్మ శశికళ ఈ భవనంలో ఉన్నారు. జయలలిత తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక చిన్నమ్మ హస్తం ఉండేది. ఈ ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చిన్నమ్మకే ఎరుక. అమ్మ మరణం తర్వాత పరిణామాలతో చిన్నమ్మ శశికళ ఈ నివాసానికి నాయకిగా అవతరించినా, అమ్మకు దక్కిన గౌరవాన్ని ఈ నివాసం వేదికగా తనకు దక్కించుకున్నా, చివరకు అక్రమాస్తుల కేసు రూపంలో పరప్పన అగ్రహార చెరలో ఊచలు లెక్కించక తప్పలేదు. (ఆగస్టులోగా అంతర్జాతీయ విమానాలు!) ఇక అనుమతి లేనట్టే.. చిన్నమ్మ జైలు జీవితం తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకు కొనసాగింపుగా ప్రస్తుతం వేదనిలయంలోకి చిన్నమ్మ అడుగు పెట్ట లేని పరిస్థితి. ఈ నివాసాన్ని అమ్మ స్మారక మందిరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించినా, న్యాయ చిక్కులతో జాప్యం తప్పలేదు. ఎట్టకేలకు ప్రత్యేక చట్టం ద్వారా ఆ భవనాన్ని తన గుప్పెట్లోకి ప్రభుత్వం తీసుకుంది. ఈ దృష్ట్యా, ఇక, చిన్నమ్మ ఆ ఇంటి వైపుగా కన్నెత్తి చూడలేని పరిస్థితి. గతంలో ఓమారు పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో న్యాయ వివాదాల కారణంగా పోయెస్‌గార్డెన్‌కు చిన్నమ్మ వెళ్ల లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చెన్నైలోని తన బంధువు ఇంట్లో ఉండక తప్పలేదు. ఆమె జైలు జీవింతం ముగించి బయటకు రాగానే, పోయెస్‌గార్డెన్ మీదే గురి పెట్ట వచ్చన్న సంకేతాలు మొదటి నుంచి ఉంటున్నాయి. మరికొన్ని నెలల్లో చిన్నమ్మ జైలు జీవితం ముగిసే అవకాశాలు ఉన్నాయి. 2021లో జైలు జీవితం ముగించి బయటకు వచ్చే చిన్నమ్మ గార్డెన్‌లోకి అడుగు పెట్టలేని రీతిలో నో ఎంట్రీ బోర్డుగా ఈ ప్రత్యేక చట్టానికి సంబంధించిన బోర్డును అక్కడ పెట్టడం గమనార్హం. ఈ చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగానే, ఆ ఇంట్లో ఉన్న అన్ని రకాల వస్తువులు, స్థిర, చర ఆస్తుల్ని గుప్పెట్లోకి తీసుకుని వేద నిలయాన్ని అమ్మ స్మారకంగా మార్చేందుకు సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ట్రస్టు పరుగులు తీస్తుండడం గమనార్హం. ఈ పరిణామాల దృష్ట్యా, చిన్నమ్మ కోసం కొత్త షెల్టర్‌పై అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దృష్టి పెట్టింది. ఇప్పటికే చిన్నమ్మ ప్రతినిధిగా ఉన్న దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకోసం రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయానికి కూత వేటు దూరంలో బ్రహ్మాండంగా భవనం తీర్చిదిద్దారు. ఈ దృష్ట్యా, చిన్నమ్మ కోసం పోయెస్‌గార్డెన్ పరిసరాల్లోనే మరో భవనం షెల్టర్ కోసం ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. -
నేను ఏ తప్పూ చేయలేదు
న్యూఢిల్లీ/చెన్నై: కర్ణాటకలో ‘కాలా’ సినిమా విడుదలకు సహకరించాలనీ కన్నడిగులకు రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. సినిమా చూడాలనుకునే వారిని దయచేసి అడ్డుకోవద్దు. మీ సహకారం కోరుతున్నా’ అని చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని నివాసం వద్ద మీడియా సమావేశంలో కన్నడలో అర్థించారు. ‘నా సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే వారికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరి యాజమాన్య బోర్డు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని మాత్రమే నేను కర్ణాటక ప్రభుత్వాన్ని కోరా. అందులో తప్పేమిటో నాకు తెలియదు. కన్నడిగుల ప్రయోజనాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కానేకాదు. కాలా గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతుండగా ఒక్క కర్ణాటకలోనే ఆపివేయటం మంచిదికాదు. హైకోర్టు ఆదేశాల మేరకు సినిమా విడుదల ప్రశాంతంగా జరిగేలా సీఎం కుమారస్వామి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’అని అన్నారు. రజనీకాంత్ హీరో, ఆయన అల్లుడు ధనుష్ నిర్మాతగా ఉన్న ‘కాలా’ గురువారం విడుదలకానున్న విషయం తెలిసిందే. కొనసాగుతున్న అనిశ్చితి సుప్రీంకోర్టుతోపాటు కర్ణాటక, మద్రాస్ హైకోర్టులు కాలా విడుదలకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ వివిధ కన్నడ సంఘాలు ఇందుకు ముందే ప్రకటించాయి. కాలా సినిమా పోస్టర్లను చించి వేయడంతోపాటు రజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. బెంగళూరులోని టౌన్‌హాల్ నుంచి ‘కాలా’ సినిమా ప్రదర్శించే థియేటర్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు కన్నడ సంఘాల కన్వీనర్ వాటాల్ నాగరాజ్ తెలిపారు. -
అక్క చెప్పినట్టే అన్నీ ఆచరించా: శశికళ
దివంగత నటుడు, పత్రికా సంపాదకులు చో రామస్వామి కారణంగా తాను పోయెస్ గార్డెన్‌కు దూరంగా కొంత కాలం గడపాల్సి వచ్చిందని ప్రమాణ పత్రంలో చిన్నమ్మ శశికళ వివరించారు. అక్క జయలలిత చెప్పినట్టే నడుచుకున్నానని, తానెప్పుడూ ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు. విచారణ కమిషన్‌కు సమర్పించిన ప్రమాణ పత్రంలోని కొన్ని వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ విచారణకు శశికళ స్వయంగా రాలేని పరిస్థితి. ఆమె పరప్పన అగ్రహార చెరలో అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండడమే ఇందుకు కారణం. తన న్యాయమూర్తి రాజ చెందూర్ పాండియన్ ద్వారా వాంగ్మూలాన్ని ప్రమాణ పత్రం రూపంలో ఆమె కమిషన్‌కు సమర్పించి ఉన్నారు. ఆమె నివేదించిన అంశాలు ఇప్పటికే అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మంత్రుల్లో గుబులు రేకెత్తించాయి. జయలలితకు జ్వరం వచ్చిన రోజు నుంచి ఆస్పత్రిలో సాగిన చికిత్స, మరణం వరకు శశికళ ప్రమాణ పత్రంలో వివరించారు. అలాగే, ఎవరెవరు జయలలితను పరామర్శించారో తదితర వివరాలను కమిషన్ ముందుంచారు. ప్రస్తుతం శశికళ తరఫున న్యాయవాది రాజ చెందూర్ పాండియన్ విచారణకు హాజరయ్యే వారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శశికళను పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత గతంలో గెంటి వేయడానికి గల కారణాలు సైతం ప్రమాణ పత్రంలో పొందుపరిచి ఉండడం వెలుగులోకి వచ్చింది. 2011లో ప్రకంపనలు 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో జయలలిత సీఎం పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లో పోయెస్ గార్డెన్లో ప్రకంపన బయలు దేరింది. శశికళను గార్డెన్ నుంచి బయటకు సాగనంపడమే కాదు, ఆమె కుటుంబీకుల మీద కేసుల మోత మోగడం అప్పట్లో చర్చకు దారి తీసింది. జయలలితకు వ్యతిరేకంగా శశికళ కుటుంబం వ్యవహరించడంతోనే ఈ గెంటివేత అన్న చర్చ సాగింది. కొన్నాళ్లకు మళ్లీ శశికళ గార్డెన్ మెట్లు ఎక్కడం ట్విస్టుగా మారింది. అయితే, ఈ తతంగం వెనుక కారణాలేమిటో అనేది ప్రశ్నగానే మిగిలింది. దీనికి సమాధానం ఇచ్చే రీతిలో శశికళ తన ప్రమాణ పత్రంలో పేర్కొని ఉండడం గమనార్హం. 2011లో మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే, ఓ రోజున అక్క జయలలిత తనను పిలిచి ఇక్కడ ఉండొద్దు.. టీ నగర్‌లోని ఇంటికి వెళ్లి పో.. అని సూచించారని తెలిపారు. అక్క ఆజ్ఞను శిరసా వహించి గార్డెన్ నుంచి బయటకు వచ్చామన్నారు. ఈ హఠాత్ నిర్ణయంతో తొలుత తాను అయోమయంలో పడ్డానని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, అక్క భరోసా ఇచ్చి మరీ పంపినట్టు పేర్కొన్నారు. తాను గార్డెన్ నుంచి బయటకు రావడంలో తుగ్లక్ పత్రిక సంపాదకులుగా ఉన్న నటుడు చో రామస్వామి కీలక భూమిక పోషించినట్టు వివరించారు. తనకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనే సమాచారం ఆ సమయంలో జయలలితను షాక్‌కు గురి చేసిందన్నారు. ఈ విషయంపై సమగ్రంగా ఆరా తీసిన చో రామస్వామి అన్ని వివరాలను అక్క దృష్టికి తీసుకు వచ్చినట్టు తెలిపారు. దానిపై రహస్య విచారణ సైతం సాగినట్టు పేర్కొన్నారు. . అక్క చెప్పినట్టే.. ఆ సమయంలో అక్క(జయలలిత) చెప్పినట్టే తాను విన్నానని పేర్కొన్నారు. తన కుటుంబీకులందరినీ సాగనంపిన అనంతరం ఓ రోజున అక్కే తనకు సమాచారం పంపించారని పేర్కొన్నారు. ‘నీ మీద ఏ తప్పు లేదు.. ఇక, వచ్చేయి..’ అని అక్క పిలవడంతో గార్డెన్‌లోకి మళ్లీ వచ్చానన్నారు. ఈ సమయంలో చో రామస్వామి మరో ఆలోచన ఇచ్చారన్నారు. ఆయన ఆలోచన మేరకు తాను జయలలితకు ఓ లేఖను రాశానని తెలిపారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు, రాజకీయం వ్యవహారాల్లో జోక్యం చేసుకోను, నా కుటుంబంతో సంబంధాలు కల్గి ఉండను.. నీ (జయలలిత)సంక్షేమమే ముఖ్యం’ అని ఆ లేఖలో వివరించి గార్డెన్లో చేరినట్టు పేర్కొన్నారు. తాను ఎప్పుడూ అన్నాడీఎంకే వ్యవహారాల్లో గానీ, అధికార విషయాల్లో గానీ జోక్యం చేసుకోవడం లేదన్న విషయం అక్కకు తెలుసు అని తెలిపారు. అయితే, కొన్ని సందర్భాల్లో అక్క ఆజ్ఞ మేరకు అనేక వివరాలను , ఇచ్చే సూచనల్ని, ఆదేశాలను ద్వితీయ శ్రేణి నేతల దృష్టికి తాను తీసుకెళ్లాని తెలిపారు. ఆ పయనం సాగిస్తూ ఉన్న సమయంలో సెప్టెంబరు 19న జయలలిత జ్వరం బారిన పడటం, ఆ తదుపరి వివరాలను ఆమె ప్రమాణ పత్రంలో వివరించి ఉండడం గమనార్హం. -
సీల్ వేసిన రెండు గదులు తెరిచి సోదాలు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయస్ గార్డెన్లో మరోసారి ఐటీ దాడులు జరిగాయి. అలాగే జయ టీవీ కార్యాలయంలో సైతం ఐటీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. బోగస్ సంస్థలను స్థాపించి కోట్లాది రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలపై జయ నెచ్చెలి శశికళ, ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కుటుంబీకులే లక్ష్యంగా ఐటీ దృష్టి సారించింది. శశికళ బంధుమిత్రుల ఇళ్లు, కార్యాలయాల్లో గత ఏడాది నవంబరు 10వ తేదీన 187 చోట్ల ఏకకాలంతో 1600 మంది అధికారులు దాడులు జరిపి ఐదురోజులపాటూ తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రూ.1,480 కోట్ల పన్నుఎగవేతను గుర్తించారు. అంతేగాక లెక్కల్లో చూపని బంగారు, వజ్రాలు, కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నవంబర్17వ తేదీన శశికళ బంధువుల ఇళ్లతోపాటూ జయలలిత వ్యక్తిగత కార్యదర్శి పూంగున్రన్ ఇంటిపైనా, అదే రోజు రాత్రి పోయస్‌గార్డెన్‌లోని జయ నివాసంలో మళ్లీ దాడులు జరిపారు. జయ నివాసంలోని రెండు గదులకు ఐటీ అధికారులు ఆరోజు సీలు వేశారు. ఇదిలా ఉండగా, గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఐదుగురు అధికారులు అకస్మాత్తుగా జయ నివాసంలోకి ప్రవేశించారు. గతంలో సీలు వేసిన రెండు గదులను తెరిచి సోదాలు జరిపారు. అలాగే జయ నివాసం పక్కనే ఉన్న జయ టీవీ పాత కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. కాగా, జయ నివాసాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు ప్రభుత్వం 20 మందితో కూడిన బృందాన్ని నియమించింది. నాలుగు నెలల్లోగా మందిరం పనులు పూర్తి చేయాలని గడువు విధించింది. -
తలైవాకి ఆశ ఉంది.. కానీ ఓపిక పట్టాల్సిందే..!
సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ మంగళవారం 68వ వసంతంలోకి అడుగు పెట్టారు. తలైవాకు శుభాకాంక్షలు తెలుపుకునేందుకు పోయెస్ గార్డెన్ వైపుగా అభిమాన లోకం పోటెత్తింది. అక్కడ ఆయన లేకపోవడం నిరాశను మిగిల్చినా, అభిమానం ఏమాత్రం తగ్గలేదు. తమకు కథానాయకుడు దూరంగా ఉన్నా, సంబరాల్లో అభిమాన లోకం తగ్గలేదు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి లాగేందుకు ఆయన అభిమాన లోకం తీవ్రంగానే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బర్త్‌డే సందర్భంగా ఏదేని ప్రకటన చేస్తారా అన్న ఆశతో ప్రతి ఏటా బర్త్‌డే వేళ అభిమానులు ఎదురు చూడడం పరిపాటే. అయితే, ఈ ఏడాది బర్త్‌డేకు రాజకీయ ప్రాధాన్యతను అభిమాన లోకం పెంచింది. ఇందుకు కారణం అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలే. దీంతో తలై‘వా’ అన్న పిలుపు మిన్నంటుతోంది. కథానాయకుడు రాజకీయాల్లో వచ్చేసినట్టే అన్న ప్రచారాలు సైతం ఈ సమయంలో ఊపందుకున్నాయి. అయితే, ఎక్కడా రజనీ చిక్కలేదు. ఈ నేపథ్యంలో బర్త్‌డే వేళ తమ హీరో, రాజకీయ నేతగా అవతరించేనా అన్న ఆత్రుతతో అభిమాన లోకం మంగళవారం చెన్నైకు పోటెత్తింది. అభిమానులకు దూరంగా : ప్రతి ఏటా రజనీ బర్త్‌డే సందర్భంగా అభిమానులు పోయెస్ గార్డెన్‌లోని ఆయన నివాసం వద్దకు తరలి రావడం జరుగుతూ వస్తున్నది. ఈ సమయంలో అభిమానుల్ని పలకరించే వారు. అయితే, గత ఏడాది అమ్మ జయలలిత మరణంతో బర్త్‌డేకు రజనీ దూరంగానే ఉన్నారు. ఈ సారి మాత్రం ఆయన్ను రాజకీయాల్లోకి లాగడం లక్ష్యం అన్న నినాదంతో అభిమానులు తరలి వచ్చేందుకు సిద్ధ పడ్డారు. దీనిని పసిగట్టినట్టుంది...అందుకే కాబోలు ఈ సారి పోయెస్ గార్డెన్లో అభిమానులకు రజనీ దర్శనం ఇవ్వలేదు. అçసలు ఆయన ఇంట్లోనే లేదన్న సమాచారం అభిమానులకు నిరాశే. తగ్గని అభిమానం : రజనీకాంత్‌ను చూడడానికి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు రాష్ట్రం నలు మూలల నుంచి తండోప తండాలుగా పోయెస్ గార్డెన్‌కు ఉదయాన్నే పోటెత్తారు. గతంలో జయలలిత బతికి ఉన్నప్పుడు పోయెస్ గార్డెన్‌లోని రోడ్లన్నీ పోలీసు నిఘా వలయంలో ఉండేది. ఈ దృష్ట్యా, అటు వైపుగా ఎవ్వరు వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం అమ్మ లేని దృష్ట్యా, భద్రత కూడా లేదు. దీంతో తండోప తండాలుగా తరలి వచ్చిన వారితో ఆ పరిసరాలు కిటకిట లాడాయి. ఎక్కడికక్కడ అభిమానులు రజనీ ఫొటోలను, నీలం, తెలుపు, ఎరుపు రంగుతో కూడిన జెండాల్ని చేత బట్టి తలైవా నినాదాన్ని మిన్నంటేలా చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానుల్ని అడ్డుకున్నారు. రజనీ ఇక్కడ లేదని, ప్రజలకు ఇబ్బంది కల్గించ వద్దని హెచ్చరించారు. దీంతో కొందరు అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. మరి కొందరు తాము తీసుకొచ్చిన కేక్‌లను అక్కడే కత్తిరించి సంబరాలు చేసుకుని ముందుకు సాగారు. ఆ తదుపరి అభిమానులు మళ్లీ తరలి రాకుండా పోయెస్‌గార్డెన్‌లోని అన్ని మార్గాల్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక, రజనీకాంత్ ఎక్కడ అన్న ప్రశ్న బయలు దేరింది. ఆయన బెంగళూరులో ఉన్నట్టు కొందరు, కాదు..కాదు చెన్నై శివార్లలోని కేలంబాక్కంలోని ఓ రిసార్ట్‌లో ఉన్నట్టు మరికొందరు వ్యాఖ్యానించారు. పోస్టర్ల హోరు...సేవల జోరు : రజనీ అభిమాన సంఘాల నేతృత్వంలో రాష్ట్రంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు జరిగాయి. రక్తదానం, అన్నదానం , వైద్య శిబిరాలతో ముందుకు సాగారు. రజనీ బ్యానర్లు, ఫ్లెక్సీలను తమ తమ ప్రాంతాల్లో హోరెత్తించారు. అలాగే, దివంగత సీఎంలు కామరాజర్, అన్నాదురై చిత్ర పటాల మధ్యలో రజనీ ఫొటోతో పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇందులో మూడో కరుప్పు తమిళన్(నలుపు తమిళుడు), ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, నీతోనే ఈ తమిళనాడుకు న్యాయం అన్న నినాదాల్సి అభిమాన లోకం పొందుపరిచారు. ఇక, రజనీ కాంత్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తిన అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఎక్కువే. ఇందులో డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా ఉన్నారు. ఆశ ఉంది...ఓపిక పట్టాల్సిందే : రజనీ రాజకీయాల్లోకి రావాలన్న ఆశ అందరిలోనూ ఉందని, అయితే, ఇందుకు మరింతగా ఓపిక పట్టాల్సి ఉందని ఆయన సోదరుడు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కృష్ణగిరిలో జరిగిన రజని బర్త్‌డే వేడుకలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సహాయకాలను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలనే ఆశ రజనీకి ఉందన్నారు. అయితే, ఆ సమయం ఇంకా రాలేదన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావడం సంతోషకరమని, అది ఎప్పుడు అనేది ఆయనే ప్రకటిస్తారన్నారు. అంత వరకు ఓపికగా ఉండాలని అభిమానులకు సూచించారు. తమ తల్లిదండ్రుల పూర్వికం కృష్ణగిరిలోని నాచ్చికుప్పం గ్రామం అని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు. కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపం వద్దకు సైతం రజనీ కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన అక్కడ కూడా లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అయితే టీనగర్‌లోని రాఘవేంద్రస్వామి ఆలయాన్ని దర్శించి రజనీ ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం పళని స్వామి రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. -
దాడులపై ‘అమ్మ’ అభిమానుల ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇంట్లో ఆదాయపు పన్నుల శాఖ నిర్వహించిన సోదాలతో ఆమె అభిమానులు భగ్గుమన్నారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ లక్ష్యంగా ఆమె బంధుమిత్రుల ఇళ్లపై దాడులు చేస్తున్న ఐటీ అధికారులు... శుక్రవారం వేద నిలయంలో సైతం సోదాలు నిర్వహించారు. సోదాలను నిరసించిన జయ అభిమానులు... బీజేపీ నశించాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తీవ్ర నిరసన తెలిపారు. వేద నిలయాన్ని ‘అమ్మ’ స్మారక మందిరంగా ఏర్పాటు చేయనున్న తరుణంలో ఈ దాడులేంటని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంపై మండిపడ్డారు. ఆందోళనకు దిగిన సుమారు 650 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని సీఎం చెప్పారు. శశికళ కుటుంబం పన్నిన కుట్రతోనే ఈ దాడులు జరిగాయనీ, జయలలిత మరణంలో వారి పాత్రపై సీబీఐ విచారణ జరపాలని జయ మేనకోడలు దీప డిమాండ్ చేశారు. వేద నిలయంలో తాజా ఐటీ సోదాలకు శశికళ కుటుంబమే కారణమని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. జయలలితకు చికిత్సపై తన వద్ద వీడియో ఉందని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ప్రకటించడం, ‘అమ్మ’ మరణం వెనుక మర్మంపై ప్రభుత్వం విచారణ కమిషన్ వేసిన నేపథ్యంలో తగు ఆధారాల కోసం ఐటీ శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలి ఐటీ దాడుల నేపథ్యంలో కొన్ని సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉన్నందునే జయ నివాసంలో తనిఖీలు చేశామని ఓ అధికారి తెలిపారు. -
ఇక.. చొరబాటే
► చట్టపరంగా కసరత్తులు ► మేనత్త స్థానం నాతోనే భర్తీ : దీప ► ఆస్తులన్నీ మావే : దీపక్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు, మేనల్లుడు మేనత్త ఆస్తుల కోసం మళ్లీ తెర ముందుకు వచ్చారు. పోయెస్ గార్డెన్‌లోకి చొరబడేందుకు సిద్ధమైనట్టు, పార్టీని కైవసం చేసుకునేందుకు చట్టపరంగా కసరత్తులు మొదలెట్టినట్టుగా దీప ప్రకటించారు. మేనత్తకు చెందిన ఆస్తులన్నింటికీ తామే వారసులం అని, చిన్న అత్త శశికళ కుటుంబీకులు తప్పుకుంటే మంచిదని దీపక్ హెచ్చరించారు. సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత ఆస్తులకు తామే వారసులం అని ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్, కుమార్తె దీప పేర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ఐక్యత లేని దృష్ట్యా, తరచూ వివాదం బయలుదేరుతోంది. గత ఆదివారం పోయెస్ గార్డెన్ వేదికగా, అక్క, తమ్ముడు కయ్యానికి కాలు దువ్వుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం దీప మీడియా ముందుకు వచ్చారు. అలాగే, దీపక్ మరో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఆస్తులన్నీ తమదేనని, తామిద్దరికీ అన్ని హక్కులు అంటూ వ్యాఖ్యానించారు. అయితే, దీపక్ వ్యాఖ్యలు ఓ రకంగా సాగితే, దీప వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. గార్డెన్‌ను కైవసం చేసుకుంటా: టీ.నగర్‌లోని తన నివాసంలో దీప మీడియాతో మాట్లాడుతూ ఇక, ఎవర్నీవదలి పెట్టే ప్రసక్తే లేదని మాటల తూటాల్ని అందుకున్నారు. పోయేస్ గార్డెన్‌ను కైవశం చేసుకుంటానని, ఎవరు అడ్డు వచ్చినా, ఎదురించి చొరబడటమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఆస్తుల కైవశం లక్ష్యంగా చట్ట నిపుణులతో చర్చిస్తున్నానని, చట్టపరంగా అన్నీ సొంతం చేసుకుంటానని ధీమా వ్యక్తంచేశారు. పోయేస్ గార్డెన్లో ఏదో జరుగుతోందన్న అనుమానం కల్గుతోందన్నారు. తాను వేద నిలయంలోకి వెళ్లిన సమయంలో ఎవ్వరూ లేరనీ, వివాదం సాగగానే, లోపలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు చొచ్చుకు రావడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ఆరోపించారు. శశికళ ఫోటోను తాను బయటపడేయడానికి ప్రయత్నించిన సమయంలో ఆ వ్యక్తులు చొచ్చుకు వచ్చారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు అపాయింట్మెంట్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నట్టు తెలిపారు. ఆయన దృష్టికి అన్ని వివరాలను తీసుకెళ్తానని పోయేస్ గార్డెన్ ఇంటినే కాదు, పార్టీని కూడా దక్కించుకుంటానని దీప ధీమా వ్యక్తంచేశారు. మేనత్త స్థానాన్ని తన ద్వారా భర్తీ చేయడానికి అన్నాడీఎంకే కేడర్ ఎదురుచూస్తున్నదని, వారి అభీష్టం మేరకు రెండాకుల చిహ్నం రక్షిస్తానని, పార్టీలోకి అడుగుపెట్టి, మేనత్త స్థానాన్ని భర్తీ చేస్తానని వ్యాఖ్యానించారు. పదవులు ఉన్నంత వరకే సీఎం, మాజీ సీఎంల చుట్టూ కేడర్ ఉంటుందని, ఆ పదవులు దూరం కాగానే, తన వైపునకు నేతలు వచ్చి తీరుతారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఎన్నికల కమిషన్ తనకు మరింత సమయాన్ని కేటాయిస్తూ మరో రెండు లక్షల అంశాలతో కూడిన ప్రమాణ పత్రం దాఖలుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. జయ పేరవై తరహాలో అన్నాడీఎంకేకు అనుబంధంగా ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై ఉంటుందని పేర్కొన్నారు. ఆస్తులన్నీ మావే ఓ మీడియాతో ప్రత్యేకంగా దీపక్ మాట్లాడుతూ తమ అవ్వ గతంలో మేనత్త పేరిట ఆస్తుల వీలునామా రాసినట్టు, అవన్నీ మేనత్త పేరుతోనే ఉన్నాయని వివరించారు. గతంలో రాసిన వీలునామా మేరకు, మేనత్త కోర్టుకు సమర్పించిన జాబితాలోని ఆస్తుల మేరకు ప్రస్తుతం తాను తన సోదరి మాత్రమే వారసులం అని వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవనీ, చిన్నత్త శశికళ ఫోటోను బయటకుపడేయడాన్ని తాను వ్యతిరేకించడంతో దీప ఆగ్రహించినట్టు తెలిపారు. అంతకు ముందు తామిద్దరం అక్కడే అల్పాహారం కూడా తీసుకున్నట్టు, అయితే, చిన్నత్త సెక్యూరిటీ అడ్డుకుంటే, తాను ఏం చేయగలనని ప్రశ్నించారు. తాను ఇప్పుడూ.. ఎప్పుడూ ఒక్కటే చెబుతానని, మేనత్తకు చెందిన అన్ని ఆస్తులకు తామిద్దరం మాత్రమే వారసులం అని, మరెవ్వరూ లేదని స్పష్టంచేశారు. కొన్ని ఆస్తులు వేరే వ్యక్తులు గుప్పెట్లో ఉన్నాయని, వారు తప్పుకుంటే మంచిదని హెచ్చరించారు. గార్డెన్‌లోని ఇంటికి తాను తరచూ వెళ్లి వస్తున్నాననీ.. అక్కడ ఎలాంటి అనుమానాస్పద విషయాలు, దాడులు తనకు ఎదురుకాలేదని స్పష్టంచేశారు. ఈ ఆస్తులన్నీ చిన్నత్త శశికళ కుటుంబీకుల చేతిలో ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయని, దయచేసి వారుగా ముందుకు వచ్చి తమకు అప్పగించాలని కోరారు. -
పన్నీర్ గృహప్రవేశం
► పోయెస్‌గార్డెన్ లోకి మారిన మాజీ సీఎం ► కొత్త ఇంటి నుంచే రాజకీయాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పోయెస్గార్డెస్ లోని తన కొత్త నివాసంలో గురువారం గృహప్రవేశం చేశారు. సంప్రదాయబద్ధంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిలోకి వెళ్లి పాలుపొంగించి కాపురం పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటి వెనుకనున్న వీనస్ కాలనీలోనే పన్నీర్ గృహప్రవేశం చేసిన ఇల్లు ఉండడం విశేషం. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో జయలలిత తరువాత అంతటి ప్రాధాన్యతను కలిగి ఉన్న పన్నీర్‌సెల్వం అమ్మ మరణంతో అవస్థలపాలయ్యారు. జయ జైలుకెళ్లిన రెండుసార్లు తాత్కాలిక ముఖ్యమంత్రి వ్యవహరించిన పన్నీర్‌సెల్వం ఆమె మరణించిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ కనుసన్నల్లో ఉంటూనే స్వంత నిర్ణయాలతో పాలన సాగించారు. ముఖ్యంగా తీవ్రస్తాయిలో సాగుతున్న జల్లికట్టు ఉద్యమాన్ని చల్లార్చేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడం, సదరు ఆర్డినెన్స పై కేంద్రం సహాయంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించడంలోనూ విజయం సా«ధించారు. సీఎంగా తనదైన ముద్రలో దూసుకుపోవడం ద్వారా ప్రతిపక్షాల ఆదరాభిమానాలను సైతం చూరగొన్నారు. జయ మరణించగానే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితోపాటూ సీఎం కుర్చీపై సైతం కన్నేసిన శశికళ పన్నీర్ దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించుకున్నారు. గత నెల 5వ తేదీన పోయెస్‌గార్డెన్ లో సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా చేశారు. ఆదే రోజున అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా (సీఎంగా) శశికళను ఎన్నుకున్నారు. అకస్మాతుగా తనను ఇంటికి పిలిపించుకుని తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని శశికళపై పన్నీర్‌సెల్వం ఆరోపణలు చేయడం ద్వారా తిరుగుబాటు జెండా ఎగరవేశారు. దీంతో అన్నాడీఎంకే పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్‌సెల్వం అతని మద్దతుదారులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు శశికళ ప్రకటించారు. అయితే సీఎం బాధ్యతలు చేపట్టేలోగా ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టు తీర్పుతో జైలుపాలయ్యారు. శశికళ స్థానంలో ఎడపాడి పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పన్నీర్ క్వార్టర్‌పై కన్ను: పన్నీర్, శశికళ వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే తీరులో విధ్వేషాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ క్వార్టర్లో ఉన్న పన్నీర్‌ను బైటకు పంపివేయడం ద్వారా పగ తీర్చుకోవాలని శశికళ వర్గం నిర్ణయించుకుంది. 2011లో జయ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆమె కేబినెట్లో ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీర్‌సెల్వం చెన్నై అడయారు గ్రీన్ వేస్ రోడ్డులోని ప్రభుత్వ క్వార్టరులో నివాసం ఉంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత సైతం అక్కడే కొనసాగారు. ప్రభుత్వ క్వార్టర్స్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ సీఎం ఎడపాడి ప్రజాపనుల శాఖ ద్వారా పన్నీర్‌సెల్వంకు నోటీసులు పంపారు. అంతకు రెండు రోజుల ముందు శశికళ వర్గీయలు పన్నీర్‌సెల్వం ఇంటి వద్దకు చేరుకుని అక్కడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. మంత్రులు, ముఖ్యమంత్రులు తమ పదవిని కోల్పోయినట్లయితే మరో ఆరునెలలపాటు అదే క్వార్టర్స్‌లో కొనసాగవచ్చనే నిబంధనలను ఖాతరుచేయకుండా పన్నీర్‌సెల్వంకు నోటీసులు జారీచేశారు. ఎడపాడి ప్రభుత్వం వల్ల మరిన్ని అవమానాలకు గురయ్యేలోగా ప్రభుత్వ క్వారును ఖాళీ చేయాలని, అంతేగాక పన్నీర్‌సెల్వం పోయెస్‌గార్డెన్ లో మకాం వేయాలని నిర్ణయించుకున్నారు. జయ ఇంటికి వెనుకవైపున ఉన్న వీనస్ కాలనీలో ఒక ఇల్లును ఎంచుకున్నారు. ఈ ఇంట్లో గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పాలు పొంగించి గృహప్రవేశం చేశారు. ఇకపై తన రాజకీయ కార్యకలాపాలు కొత్త ఇంటి నుంచి కొనసాగించనున్నారు. -
అన్నాడీఎంకేలో దీపక్ రచ్చ
-
అన్నాడీఎంకేలో దీపక్ రచ్చ
► జయకు నేను, నా సోదరి మాత్రమే వారసులం ► జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ సాక్షి, చెన్నై: తమిళనాట అధికార అన్నాడీఎంకేలో జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ గురువారం చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా దీపక్ గళం విప్పారు. తాను, తన సోదరి దీపా జయకుమార్ మాత్రమే జయలలితకు వారసులమని, పోయెస్ గార్డెన్ ఇంటిపై తామిద్దరికి అన్ని హక్కులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ అంత్యక్రియల సమయంలో ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. శశికళతో కలసి జయలలిత అంత్యక్రియలు పూర్తిచేశారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. దీపక్ మాత్రం శశికళ వెన్నంటే ఉన్నారు. అన్ని విషయాల్లో చిన్నమ్మకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చిన ఆయన గురువారం ఒక్కసారిగా ఆక్రోశం వెళ్లగక్కారు. శశికళ సోదరి వనిత మణి కుమారుడు టీటీవీ దినకరన్ డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడం ఇందుకు కారణం. ఓ మీడియా సంస్థతో దీపక్ ఫోన్ లో మాట్లాడారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వంకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. తన మేనత్త మరణంపై న్యాయ విచారణకు జరిపించాలని డిమాండ్ చేశారు. ‘పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ,, సీఎంగా పళనిస్వామి కొనసాగాలి. ఉప ప్రధాన కార్యదర్శి పదవిని పన్నీర్‌సెల్వంకు అప్పగించాలి’’ అని దీపక్ అన్నారు. జయ లేక ఒంటరిగా..: శశికళ జయలలిత లేని లోటుతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. శుక్రవారం జయలలిత 69వ జయంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శశికళ ఓ సందేశం పంపించారు. ప్రతి ఏడాదీ జయలలిత జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకునేవారమని, కానీ ఈ ఏడాది ఇలాంటి పరిస్థితి వస్తుందని భావించలేదన్నారు. అమ్మ మన మధ్య లేకపోవడం తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోందన్నారు. గత 33 ఏళ్లుగా అమ్మతో పాటు పుట్టినరోజు వేడుకల్లో తానూ పాల్గొన్నానని చెప్పారు. ఆమె జ్ఞాపకాలతో ఈ ఏడాది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని పేర్కొన్నారు. తన ఆలోచనలు జయ చుట్టూనే తిరుగుతున్నాయన్నారు. అమ్మ జయంతి సందర్భంగా జరిపే కార్యక్రమాలు ఆమె పేరు నిలబెట్టేలా ఉండాలని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. -
కోలాహలం
► పన్నీరు ఇంట అభిమాన కెరటం ► తండోపతండాలుగా రాక ► ఆనందోత్సాహాల రెట్టింపు ► కువత్తూరుకు చిన్నమ్మ పరుగు ► పోయెస్‌గార్డెన్ వద్ద హడావుడి ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం ఇంటి పరిసరాల్లో ఆదివారం కోలాహల వాతావరణం నెలకొంది. అభిమాన కెరటం ఉప్పొంగింది. తండోపతండాలుగా రాష్ట్రం నలుమూలల నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు తరలివచ్చి మద్దతు పలికారు. ఐదుగురు ఎంపీలు, పదిమంది మాజీ ఎమ్మెల్యేలు పన్నీరు శిబిరంలో చేరారు. పన్నీరు శిబిరంలో ఆనందోత్సాహాలు రెట్టింపు అయితే, చిన్నమ్మ శిబిరంలో ఉత్కంఠ తప్పడం లేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు క్యాంప్‌లోనే ఉండడం వారికి ఊరట. పోయెస్ గార్డెన్ వద్ద హడావుడి సాగినా, చిన్నమ్మ క్యాంప్‌నకు పరుగులు తీయడంతో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న ఎదురు చూపులు పెరిగాయి. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ, ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం మధ్య సమరం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యేలు చిన్నమ్మ ఏర్పాటు చేసిన శిబిరంలోనే ఉన్నా, ఆ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా పన్నీరు శిబిరంలో చేరుతున్నారు. రెండు మూడు రోజులుగా గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు ఇంట సందడి వాతావరణం నెలకొన్నా, ఆదివారం వాతావరణం కోలాహలంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాన్లు, బస్సుల్లో అన్నాడీఎంకే కింది స్థాయి కార్యకర్తలు సైతం పోటెత్తుతున్నారు. డప్పులు వాయిస్తూ, అన్నాడీఎంకే పతకాలను చేతబట్టి, పన్నీరుకు మద్దతుగా నినదిస్తూ తండోపతండాలుగా తరలి వచ్చి మద్దతు పలుకుతుండడం విశేషం. పన్నీరుకు మద్దతు పలికేందుకు అభిమాన కెరటం తరలి వస్తుండడంతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు తీవ్రంగా కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ఇక, ఆ పరిసరాల్లోని దుకాణాల్లో వ్యాపారం మరింతగా పుంజు కుంది. అలాగే, అన్నాడీఎంకే పతాకాలు, అమ్మ, పన్నీరు ఫొటోలు, శాలువాలతో కూడిన రోడ్డు సైడ్ దుకాణాలు పుట్టుకు రావడం గమనార్హం. ఆనందోత్సాహాలు రెట్టింపు : అభిమాన కెరటం పన్నీరుకు మద్దతు ప్రకటించినానంతరం, అక్కడ ఏర్పాటు చేసిన హోర్డింగ్, బ్యానర్లలో తమ సంతకాలు పెట్టారు. పోయెస్‌గార్డెన్ లోని అమ్మ జయలలిత ఇంటిని స్మారక మందిరంగా ప్రకటించాల్సిందేనని నినదిస్తూ, తమ సంతకాలు చేశారు. తూత్తుకుడి ఎంపీ జయసింగ్ త్యాగరాజ్ నటర్జీ, వేలూరు ఎంపీ సెంగుట్టువన్, పెరంబలూరు ఎంపీ మారుతీ రాజా, విల్లుపురం ఎంపీ రాజేంద్రన్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్ లతో పాటు పది మంది మాజీ ఎమ్మెల్యేలు పన్నీరుకు మద్దతు ప్రకటించారు. దీంతో పన్నీరు శిబిరంలో ఎంపీల సంఖ్య మొత్తం పదికి చేరింది. అలాగే, సినీనటులు, అరుణ్ పాండియన్, రామరాజన్, విఘ్నేష్, త్యాగు, మనోబాల సైతం పన్నీరుకు జై కొట్టారు. రామరాజన్ మీడియాతో మాట్లాడుతూ పన్నీరు సెల్వం నిజమైన హీరో అని కొనియాడారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందాన్ని కల్గించిందన్నారు. ఇక, పన్నీరుకు మద్దతుగా మిస్డ్ కాల్ కొట్టు నినాదానికి విశేష స్పందన రావడం గమనార్హం. పన్నీరు శిబిరంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్ చేరిన సమాచారంతో ఆయన చేతిలో ఉన్న విల్లుపురం ఉత్తర జిల్లా పార్టీ కార్యదర్శి పదవిని తొలగిస్తు చిన్నమ్మ శశికళ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదుల హోరు : ఆదివారం కూడా ఆయా నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ ఓటర్లు పోలీసుస్టేçÙన్లలో ఫిర్యాదు చేశారు. మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ కార్యాలయం వద్ద పలువురు ఆందోళనకు సైతం దిగారు. పన్నీరుకు మద్దతుగా నిర్ణయం తీసుకోవాలని చిన్నమ్మ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పలు చోట్ల అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగడం గమనార్హం. అలాగే, మంత్రులు ఓఎస్ మణియన్, వలర్మతి, దురైకన్ను కన్పించడం లేదని వారి నియోజకవర్గ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూవత్తూరుకు చిన్నమ్మ : పోయెస్‌గార్డెన్ వద్ద పార్టీ వర్గాలతో చిన్నమ్మ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమావేశం అయ్యారు. పార్టీ ముఖ్యులతోనూ, పార్టీలో వ్యాఖ్యాతలుగా ఉన్న సినీ నటులు పలువురితోనూ చిన్నమ్మ భేటీ అయ్యారు. ఈసందర్భంగా తమకు బెదిరింపులు వస్తున్నట్టుగా చిన్నమ్మ దృష్టికి సీఆర్ సరస్వతి, గుండు కల్యాణం తదితర నటులు తీసుకెళ్లారు. ఇక, నాలుగున్నర గంటల సమయంలో చిన్నమ్మ కువత్తూరుకు వెళ్తూ మీడియాతో మాట్లాడడం ఆ శిబిరంలో కాస్త జోష్‌ను నింపింది. ఆందోళన వద్దు అని, అధికారం మనదేనని ఆమె చేసిన వ్యాఖ్యలతో శ్రేణులు ఆనందంలో మునిగారు. ఇక, ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల మరింత ఆనందమే. ఎమ్మెల్యేలు అందరూ తన వెంటేనని, పార్టీ పరిరక్షణ, ప్రభుత్వానికి భంగపాటు రానివ్వకుండా స్వతంత్రంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉన్నారని ఆమె వ్యాఖ్యానించడం ఆ శిబిరంలో కాస్త టెన్షన్ తగ్గినట్టు అయింది. -
రసవత్తరంగా..
► వేడెక్కిన రాజకీయం ► శశి వర్సెస్ పన్నీరు ► అధికారంలో చిక్కేదెవ్వరికో ► గవర్నర్ నిర్ణయం ఎటో అన్నాడీఎంకేలో అధికార వార్ రసవత్తరంగా మారింది. రాజకీయం వేడెక్కడంతో శశి వర్సెస్ పన్నీరు మధ్య సమరంలో గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఎదురుచూపులు పెరిగాయి. ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు నిర్ణయం ఎలా ఉంటుందో, అధికార పగ్గాలు ఎవరి చేతికి చిక్కుతాయోనన్న ఉత్కంఠ రెట్టింపు అయింది. సాక్షి, చెన్నై : అన్నాడిఎంకేలో అపద్దర్మ సీఎం పన్నీరు సెల్వం సృష్టించిన అలజడి తాత్కాళిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పోయేస్ గార్డెన్ వేదికగా చిన్నమ్మ రాజకీయ చక్రం తిప్పుతున్నా, గ్రీన్ వేస్రోడ్డు వేదికగా ఊహించని రీతిలో పన్నీరు ట్విస్టులు ఇస్తుండటం రాజకీయ సమరాన్ని వేడెక్కించి ఉన్నది. మెజారిటీ శాతం ఎమ్మెల్యేలను చిన్నమ్మ సేన బలవంతంగా తమ క్యాంప్‌లో ఉంచితే, పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న ప్రిసీడియం చైర్మన్ మదుసూదనన్ ను తన వైపుకు తిప్పుకుని రాజకీయ ఎత్తుగడలో ఓ మెట్టు పైకి పన్నీరు చేరడం గమనార్హం. ఇక, రెండో రోజు గురువారం అన్నాడిఎంకేలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా సాగాయి. అన్నాడిఎంకేలో వేడెక్కిన శశి వర్సెస్ పన్నీరు సమరంలో రేసు గుర్రంగా అవతరించే వారెవ్వరో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. పన్నీరు ఇంటా మద్దతు జోరు...: తొలి రోజు బుధవారం పన్నీరుకు మద్దతుగా సింగిల్ డిజిట్లో ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినా, రెండో రోజు ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉండొచ్చన్నభావన సర్వత్రా నెలకొంది. మన్నార్గుడి సేనల నిఘా నీడ నుంచి తప్పించుకుని పలువురు ఎమ్మెల్యేలు గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు నివాశంకు వచ్చే అవకాశాలతో అందరి దృష్టి అటు వైపుగా మరలింది. గ్రీన్ సే రోడ్డులో ఉదయాన్నే హడావుడి పెరిగింది. ఎక్కడికక్కడ భద్రతను సైతం పోలీసులు పెంచారు. పన్నీరుకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో నేతలు దూసుకొచ్చారు. వస్తున్న నేతలు ఎ వరోనని ఆత్రూతతో కెమెరాల్లో బంధించేందుకు మీడియా సైతం ఎగబడింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పలువురు పన్నీరుతో భేటీ అవుతూ వచ్చారు. అయితే, చిన్నమ్మ శిబిరానికి గట్టి షాక్ ఇచ్చే రీతిలో పన్నీరు వేసిన ఎత్తుగడం పోయేస్ గార్డెన్ లో టెన్షన్ వరణాన్ని నింపింది. పార్టీలో కీలక నేతగా ఉన్న ప్రిసీడియం చైర్మన్ మదు సూదనన్ పన్నీరు ఇంటి మెట్లు ఎక్కడంతో రాజకీయం వేడెక్కింది. పార్టీ వర్గాలకు నిత్యం అందుబాటులో ఉండే మదుసూదనన్ రాక పన్నీరు శిబిరంలో బలాన్ని కల్గించినట్టు అయింది. కాగా, పన్నీరుకు మద్దతుగా నిలిచిన గౌండంపాళయం ఎమ్మెల్యే ఆరు కుట్టిని అభినందిస్తూ ఆయన నియోజకవర్గ ప్రజలు పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఊత్తంకరై మహిళా ఎమ్మెల్యే మనోరంజితం నాగరాజ్‌ను అక్కడి మహిళా లోకం అభినందనలతో ముంచెత్తుతున్నాయి. ఇక, పన్నీరు , మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్ ల తనయులు సైతం రంగంలోకి దిగి మద్దతు సేకరణలో నిమగ్నం కావడం ఆహ్వానించ దగ్గ విషయం. పన్నీరుకు మద్దతుగా యువ శక్తి జల్లికట్టు తరహా ఉద్యమాన్ని సాగించే అవకాశాల ప్రచార నేపథ్యంలో మెరీనా తీరం మళ్లీ పోలీసుల భద్రతా వలయంలోకి చేరింది. పోయేస్ గార్డెన్ లోనూ తగ్గని జోరు : పన్నీరు ఇంట మద్దతు జోరు పెరిగినా, పోయేస్ గార్డెన్ కు అదే స్థాయిలో మద్దతు హోరెత్తడం గమనార్హం. చిన్నమ్మకు మద్దతుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చే నాయకులు పన్నీరుకు వ్యతిరేకంగా దుమ్మెత్తి పోశారు. చిన్నమ్మ ఫోటోలను చేతబట్టి మద్దతు నినాదాల్ని హోరెత్తించారు. మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతిలు పోయేస్ గార్డెన్ ప్రవేశ మార్గం వద్ద మీడియాకు ఎప్పటికప్పుడుసమాచారాల్ని అందిస్తూ వచ్చారు. తమ చిన్నమ్మ సీఎం పగ్గాలుచేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ రాకతో రెట్టింపు ఉత్కంఠ : పన్నీరుకు ప్రజా మద్దతు, మాజీల మద్దతు హోరెత్తుతున్నా, మెజారిటీ ఎమ్మెల్యేలు చిన్నమ్మ చేతిలో ఉండటంతో అధికారం చిక్కేదెవ్వరికో అన్న చర్చ రెట్టింపు అయింది. గవర్నర్ (ఇన్ ) సీహెచ్ విద్యా సాగర్ రావు ముంబై నుంచి చెన్నైలో అడుగు పెట్టడంతో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కింది. రాజ్ భవన్ వద్ద హడావుడి పెరిగింది. అపద్దర్మ సీఎం పన్నీరు సెల్వం ఇన్ చార్జ్ గవర్నర్‌తో భేటీ కావడం, అంతా మంచే జరుగుతుందని మద్దతు దారులకు భరోసా ఇచ్చే ప్రకటన చేయడంతో ఆ శిబిరంలో మరింతగా జోష్...పెరిగి ఉన్నది. ఇక, పన్నీరు తదుపరి చిన్నమ్మ శశికళ గవర్నర్‌తో భేటీ కావడం ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలతో ఇక, గవర్నర్ సిహెచ్ విద్యా సాగర్‌రావు మున్ముందు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారోనన్న ఉత్కంఠ నెలకొని ఉన్నది. శుక్ర లేదా, శనివారాల్లో అధికారం లక్ష్యంగా సాగుతున్న సమరంలో ఏదేని స్పష్టత వచ్చేనా అన్న ఎదురు చూపుల్లో సర్వత్రా ఉన్నారు. -
ఊరటా... శిక్షా?
► ఆస్తుల కేసులో వారంలో తీర్పు ► పోయెస్‌గార్డెన్ లో కలకలం ► శిక్షపడితే ఆపద్ధర్మ సీఎం ఎవరో? మరో రెండు రోజుల్లో సీఎం కుర్చీ ఎక్కబోతున్న శశికళను ఆదాయానికి మించిన ఆస్తుల కేసు భయపెడుతోంది. మరో వారం రోజుల్లో తీర్పు వెలువడనుంది. ఆస్తుల కేసు నుంచి శశికళకు ఊరట లభించేనా లేక శిక్ష పడేనా, శిక్షే ఖాయమైన నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరని రాష్ట్రంలో రసవత్తరమైన చర్చ సాగుతోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ ఆదాయానికి మించి రూ.66 కోట్ల ఆస్తులను కూడబెట్టారని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్యస్వామి, డీఎంకే పెట్టిన కేసుపై చెన్నై, బెంగళూరు కోర్టుల్లో 18 ఏళ్లపాటూ విచారణ సాగింది. ఈ కేసుపై 2014 సెప్టెంబరు 27న తీర్పు చెప్పిన బెంగళూరు ప్రత్యే క కోర్టు జయ సహా నలుగురికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక జయలలిత రూ.100 కో ట్లు, మిగిలిన ముగ్గురు రూ.10 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు మేరకు జయ సహా నలుగురూ కొన్ని రోజులు బెంగళూరు అగ్రహార జైలులో శిక్షను అనుభవించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేయగా, నలుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి కుమారస్వామి 2015 మే 11వ తేదీన తీర్పు చెప్పా రు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం, డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. తీర్పు ఇచ్చే సమయంలో జయ తదితరులు పాల్పడిన కొన్ని అక్రమాలను న్యాయమూర్తి విస్మరించారని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. జయ సహా నలుగురికి శిక్ష పడాల్సిన అంశాలను కర్ణాటక హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని అన్బగళన్ తన వాదనను వినిపించారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేసి నిందితులకు శిక్ష విధించాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదోపవాదాలు ముగిసిన దశలో తేదీని ప్రకటించకుండా సుప్రీంకోర్టు గత ఏడాది జూన్ 7వ తేదీన వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు చెప్పనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. శశికళ శిబిరంలో కలకలం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ శాసనసభా పక్ష నేతగా ఎన్నికై 24 గంటలు కాక మునుపే సుప్రీంకోర్టు తీర్పు గంట కొట్టడం కలకలం రేపింది. శశికళ నేడో రేపో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. అలాగే ఈ నెల 9వ తేదీన సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తీర్పు వెలువడుతున్న పరిస్థితులు సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అవరోధం అవుతుందేమోనని అన్నాడీఎంకేలో భయాందోళనలు నెలకొన్నాయి. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ నెల 13వ తేదీన తీర్పు వెలువడాలి. అంటే శశికళ సీఎం అయిన నాలుగో రోజునే తీర్పు వస్తుంది. అనుకూలమైతే ఇబ్బందే లేదు, ప్రతికూలమైతే జైలు కెళ్లక తప్పదు. ఈ పరిస్థితుల్లో పదవీ ప్రమాణం వాయిదా వేసుకుంటారనే అనుమానాలు నెలకొన్నాయి. ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లడం ఖాయమని అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎస్ కరుప్పయ్య వ్యాఖ్యానించారు. సీఎం హోదాలో శశికళ జైలు కెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆపద్ధర్మ సీఎంగా ఎవరిని నియమిస్తారని కూడా గార్డెన్ లో అప్పుడే చర్చ మొదలైంది. కొందరు పన్నీర్‌సెల్వం, మరికొందరు మంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్లు చెబుతున్నారు. శశికళ మనస్తత్వాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నీర్‌సెల్వంకు అవకాశం ఇవ్వనున్నట్టు అంచనా వేస్తున్నారు. వీరెవరూ కాదు శశికళ తన భర్త నటరాజన్ ను సీఎం కుర్చీలో కూర్చోబెడతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
చిన్నమ్మే అమ్మ
► 9న ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం ► అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు ► అమ్మ భక్తులపై వేటు రెండు దశాబ్దాలుగా చిన్నమ్మగా పిలిపించుకున్న శశికళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనెల 9వ తేదీన బాధ్యతలు చేపట్టడం ద్వారా అమ్మగా మారిపోనున్నారు. జయలలిత మరణించిన తరుణంలో ఆ స్థానంలో కూర్చొనడం ద్వారా ఇక చిన్నమ్మను కాదు అమ్మ ... అని చెప్పకనే చెబుతున్నారు. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా, మూడవ మహిళా ముఖ్యమంత్రిగా రాజకీయచరిత్ర పుటల్లో నిలవబోతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ హయాంలో పార్టీలో నంబర్ 2గా వెలుగొందిన జయలలిత ఆయన మరణం తరువాత నంబర్ ఒన్ గా ఎదిగారు. పార్టీ అధినేత్రిగా, ముఖ్యమంత్రిగా విజయపథంలో పయనించారు. అయితే జయ తన హయాంలో ఎవ్వరినీ నంబర్ 2గా పరిగణించలేదు. పార్టీ, ప్రభుత్వ విషయాల్లో అన్నీతానై వ్యవహరించిన జయలలిత తన నెచ్చెలి శశికళకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపులు, అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినపుడు మంత్రి పదవుల పందేరం శశికళ సలహాలు తీసుకున్నట్లు చెబుతారు. పార్టీ, ప్రభుత్వాల్లో శశికళకు జయలలిత అధికారికంగా ఏమాత్రం ప్రాధాన్యతనివ్వకున్నా నేతలు కూడా శశికళకు అనుగుణంగా నడవడం అలవాటు చేసుకున్నారు. జయ వద్ద శశికళ ఎంత చెబితే అంత అని పోయెస్‌గార్డెన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అన్నాడీఎంకేలో అనధికార నంబర్‌టూగా ఎదిగారు. జయ మరణం తరువాత ఈ అనధికార నంబర్టూనే శశికళకు కలిసొచ్చే అంశంగా మారింది. జయలలిత వద్ద మోకరిల్లే పార్టీ శ్రేణులంతా శశికళకు పాదాభివందనం చేయడం ప్రారంభించారు. గత నెలాఖరులో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఈ నెలారంభంలో శాసనసభా పక్ష నేతగా శశికళను అందలం ఎక్కించారు. ఇటీవలి వరకు జయలలితే పార్టీకి దైవం అని కీర్తించిన వారంతా నేడు శశికళను అదే స్థాయిలో పొగుడుతున్నారు. జయకు దీటుగా పార్టీని, ప్రభుత్వాని నడిపించే సత్తా శశికళకు మాత్రమే ఉందని చెబుతున్నారు. జయ అనుచరులకు చెక్ : ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలోనూ జయలలిత అంటే అలవిమాలిన భక్తిని చాటేవారికి శశికళ చెక్‌పెట్టడం చర్చ నీయాంశమైంది. ప్రభుత్వ గౌరవసలహాదారు షీలాబాలకృష్ణన్ తో ప్రారంభమై, ముఖ్యమంత్రి కార్యదర్శులు వెంకట్రామన్, రామలింగంలను బాధ్యతలను తప్పించడం వంటి సంఘటనలు ఇప్పటికే చోటుచేసుకున్నాయి. తరువాత దశగా జయకు ఎంతో ప్రీతిపాత్రుడైన పన్నీర్‌సెల్వం సీఎం పదవికే శశికళ ఉద్వాసన పలికారు. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే భారీస్థాయిలో మంత్రి వర్గంలో మార్పులు జరగడం, జయలలిత అనుచరులపె వేటు ఖాయమని అంటున్నారు. తాను సీఎం అయ్యేందుకు సహకరించిన వారిని అందలం ఎక్కించి మిన్నకుండిపోయిన మంత్రులను ఇంటిబాట పట్టించడమే శశికళ తరువాత వ్యూహంగా చెప్పుకుంటున్నారు. అలాగే సచివాలయం, పోలీస్‌శాఖలోని సీనియర్ అధికారులకు సైతం స్థానభ్రంశం తప్పదని తెలుస్తోంది. -
చిన్నమ్మా శరణు..
► అన్నాడీఎంకే నేత నాంజిల్ సంపత్ యూటర్న్ ►శశికళను కలిసి మద్దతు ►పాత బాధ్యతల్లోనే మళ్లీ నాంజిల్ నియామకం సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో జయలలిత స్థానంలో మరెవ్వరినీ తాను జీర్ణించుకోలేనని అంటూ పరోక్షంగా శశికళ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన నాంజిల్ సంపత్ అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకున్నారు. పోయెస్‌గార్డెన్ కు వెళ్లి చిన్నమ్మా అంటూ శరణు కోరారు. అన్నాడీఎంకే అవసరాలకు తగినట్లుగా పనిచేస్తానని విజ్ఞప్తి చేశారు. ఎండీఎంకే ప్రచార కార్యదర్శిగా ఉన్న నాంజిల్ సంపత్ ఆ పార్టీ ప్రధాన వైగోతో అభిప్రాయబేధాలతో పార్టీ నుంచి వైదొలిగారు. 2012 డిసెంబర్ 4వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ప్రచార ఉప కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడంతోపాటు ఒక ఇన్నోవా కారును సైతం జయలలిత ఆయనకు బహూకరించారు. ఈ కారులోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. ఇదిలా ఉండగా, 2016 డిసెంబర్లో భారీ వర్షాలు, చెన్నైని వరదనీరు ముంచెత్తినప్పుడు తిరువన్మియూరులో అన్నాడీఎంకే బహిరంగ సభను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రజలు కష్టపడుతున్నప్పుడు ఇంతటి ఘనమైన బహిరంగ సభలు అవసరమా అని ఒక టీవీ చానల్ ఆయన్ను ప్రశ్నించగా ‘పక్కింట్లో చావుకు మనింట్లో పెళ్లిని నిలిపివేయలేం కదా’ అంటూ నాంజిల్ సంపత్ చేసిన వ్యాఖ్యానాలు వివాదాస్పదమయ్యాయి. జయలలిత సైతం ఆగ్రహించి ప్రచార బాధ్యతల నుంచి ఆయన్ను తొలగించారు. పార్టీ సమావేశాల్లో సైతం ఆయన హాజరుకాకుండా చేశారు. ఇదిలా ఉండగా, జయలలిత మరణించడంతో ప్రచార ఉప కార్యదర్శి బాధ్యతల కోసం ఆమె తనకు బహూకరించిన ఇన్నోవా కారును పార్టీ ప్రధాన కార్యాలయంలో గత వారం అప్పగించేశారు. జయలలిత ఉన్న స్థానంలో మరెవ్వరినీ జీర్ణించుకోలేను, అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మూడు రోజుల క్రితం ప్రకటించారు. సాహితీవేత్తగా తన జీవనాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవడం లేదు, డీఎంకేలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ముచ్చటగా మూడురోజులు కూడా పూర్తికాక ముందే ఆయన మనస్సు మార్చుకున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు పోయెస్‌గార్డెన్ వెళ్లి శశికళను కలుసుకున్నారు. అన్నాడీఎంకేలో కొనసాగుతానని ఆమెకు మాటిచ్చారు. పార్టీకి సంబంధించి ఎటువంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ఆమెకు తెలిపారు. పార్టీ కార్యాలయంలో అప్పగించిన ఇన్నోవా కారును సైతం తిరిగి తీసుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శి చిన్నమ్మను కలుసుకోవడం తన మనస్సుకు ఎంతో ప్రశాంతతను చేకూర్చిందని చెప్పారు. పార్టీ కోసం, ప్రభుత్వ ప«థకాలను ప్రచారం చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతానని తెలిపారు. చిన్నమ్మ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రసంగాలు చేస్తానని అన్నారు. అప్పగించిన కారును తిరిగి స్వీకరిస్తారా అని మీడియా ప్రశ్నించగా, చిన్నమ్మ సైతం కారు గురించి ప్రస్తావించారని తెలిపారు. అమ్మ మీకు ఇచ్చిన కారును ఎందుకు అప్పగించేశారు, నేనే తిరిగి మీ ఇంటికి పంపాలని అనుకుంటున్నానని ఆమె అన్నట్లు తెలిపారు. మరి ఇంతకాలం పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించగా, అమ్మ మరణంతో ఒంటరైన భావన కలగడంతో ప్రజాజీవితం ఇక చాలు అని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే చిన్నమ్మ తనకు కబురు పెట్టడంతో మళ్లీ ఉత్సాహంగా ముందుకు వచ్చానని అన్నారు. గతంలోని ప్రచార ఉప కార్యదర్శి పదవినే నిర్వíßస్తూ పార్టీ, ప్రభుత్వం కోసం పాటుపడాలని ఆమె సూచించినట్లు నాంజిల్ సంపత్ వివరించారు. కొనసాగుతున్న శశికళ సమావేశాలు: అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఈనెల 4వ తేదీన ప్రారంభమైన జిల్లాల వారీగా శశికళ సమావేశాలు శనివారం కూడా కొనసాగాయి. ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న శశికళకు సీఎం పన్నీర్‌సెల్వం, పలువురు మంత్రులు స్వాగతం పలికారు. తిరువారూరు, పుదుక్కోట్టై, మదురై, కడలూరు, విళుపురం, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల నుంచి వచ్చిన నేతలతో శశికళ సమావేశం నిర్వహించారు. -
అసంతృప్తి సెగ
► అన్నాడీఎంకేలో మాజీల వేరుబాట ► దుష్టశక్తులను తరిమికొట్టాలని శశికళ పిలుపు ► శశికళ కోసం సీఎం పడిగాపులు సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే పార్టీ అసంతృప్తితో రగిలిపోతోంది. శశికళ సారథ్యాన్ని సహించలేని సీనియర్ నేతలు నిరసన వ్యక్తం చేసేందుకు వేరుబాట లేక పోరుబాటగా లోలోన సన్నాహాలు చేస్తున్నారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిపై చర్చోపచర్చలు సాగాయి. పశ్చిమ మండలాల్లో ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉన్నందున తమ ప్రాంతానికి చెందిన వ్యక్తినే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలని నేతలు పట్టుబట్టారు. ఇంతలో పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్, సెంగొట్టయ్యన్, పొన్నయ్యన్, చెన్నై కార్పొరేషన్ మాజీ మేయర్ సైదై దొరైస్వామి పోయెస్‌గార్డెన్ కు వెళ్లి శశికళను కలిశారు. ఈ సందర్భంలో మిగిలిన వారంతా చిన్నమ్మ అనగా సైదై దొరస్వామి మాత్రం శశికళ ముఖ్యమంత్రి కావాలని పేరుపెట్టి తన అభిష్టాన్ని వ్యక్తం చేశారు. శశికళ అని పేరుతో చెప్పడం ఆమెకు, ఆమె కుటుంబీకులకు రుచించలేదని తెలుస్తోంది. దీంతో ఇకపై సైదై దొరస్వామి గార్డెన్ వైపు రావడానికి వీల్లేదని పొన్నయ్యన్ ద్వారా హెచ్చరించారు. ఆనాటి నుంచి పోయెస్‌గార్డెన్ కు సైదై రావడం మానివేశారు. గత నెల 29వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. చెన్నై మండల ముఖ్యనేతలతో ఈనెల 5వ తేదీన శశికళ సమావేశమైనపుడు సైదైకి పిలుపులేదు. సైదై రావడానికి వీల్లేదని సీనియర్‌నేతలతో శశికళ చెప్పారు. శశికళ తన పట్ల పక్షపాతధోరణిని అవలంభిస్తున్నట్లు తెలుసుకున్న సైదై తానుగానే దూరంగా ఉండిపోయారు. పార్టీలో తనకు నష్టం జరిగినపుడు ప్రతీకారంగా ఏదైనా చేయడం సైదైకి అలవాటు. అన్నాడీఎంకే రెండుగా చీలినపుడు జానకిరామచంద్రన్ వైపు ఉన్నారు. నటుడు భాగ్యరాజ్ పార్టీ పెట్టినపుడు సహకరించారు. అలాగే శివాజీ గణేషన్ పార్టీని స్థాపించినపుడు సైదై అండగా నిలిచిన చరిత్ర ఉంది. జయలలితను ధిక్కరిస్తూ 1996లో రజనీకాంత్ మాట్లాడినపుడు పార్టీ పెడతాడని ఆశించి కోడంబాక్కంలో పార్టీ కార్యాలయం సిద్ధం చేసుకున్నాడు. అయితే రజనీ పార్టీ పెట్టలేదు. మేయర్‌గా తన చివరి రోజుల్లో జయలలిత సైదైని దూరం పెట్టింది. ఇందుకు శశికళే కారణమని సైదై భావిస్తున్నారు. జయలలిత మృతి తరువాత సైతం శశికళ తనను దూరం పెట్టడాన్ని సహించలేని సైదై మరోసారి తన ప్రతిఘటనను చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. జయలలిత అన్న కుమార్తె దీపతో రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. అన్నాడీఎంకేలోని అసంతృప్తివాదులను ఏకతాటిపైకి తెచ్చి దీపవైపు నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో సైదై పార్టీ బహిష్కరణ వేటుకు గురికావడం లేదా వేరే పార్టీ పెట్టడం జరగవచ్చని గుసగుస లాడుతున్నారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ సైతం జయ మరణం తరువాత శశికళను కలవకపోవడమేగాక పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఇతన్ని కూడా పార్టీ దూరంగా పెట్టింది. 1991–96లో జయలలితకు వ్యతిరేకంగా సుబ్రహ్మణ్యస్వామి నేతృత్వంలో సైదై, పీహెచ్ పాండియన్, తిరునావుక్కరసర్ కూటమిగా ఏర్పడిన సంగతిని పార్టీనేతలు గుర్తు చేసుకుంటున్నారు. దుష్టశక్తులను తరిమికొట్టండి: శశికళ ఇదిలా ఉండగా, పార్టీలో తనపై ఉన్న వ్యతిరేకతను చల్లార్చేందుకు ఈనెల 4వ తేదీ నుంచి మండలాల వారీగా నేతలతో శశికళ సమావేశం అవుతున్నారు. అన్నాడీఎంకేను ప్రతిష్టను దెబ్బతీసేందుకు సిద్ధమవుతున్న దుష్టశక్తులను తరిమికొట్టాలని శుక్రవారం నాటి సమావేశంలో శశికళ కార్యకర్తలకు పిలుపు నివ్వడం ప్రత్యేకంగా పేర్కొనదగింది. సీఎం పడిగాపులు: అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో మూడురోజులుగా జరుగుతున్న పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం పన్నీర్‌సెల్వం, కొందరు మంత్రులు హాజరవుతున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు శశికళ వస్తారనే సమాచారంతో సీఎం కూడా అదే సమయానికి వచ్చారు. అయితే 10.45 గంటలకు శశికళ రాగా సమావేశం ప్రారంభమైంది. శశికళ కోసం సీఎం సైతం 45 నిమిషాలు వేచి ఉండడం గమనార్హం. -
ఈ సమావేశాలు ఎందుకో?
► 4 నుంచి 9 వరకు జిల్లాల వారీగా సమావేశాలు ► నాలుగు జిల్లాలతో అంకురార్పణ సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఆరురోజులపాటు బిజీబిజీగా గడపనున్నారు. జిల్లా వారీగా సమావేశాలతో తలమునకలు కానున్నారు. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే సాగిస్తున్న సన్నాహాలు తనపై వ్యతిరేకతను పారదోలేందుకా లేక సీఎం కుర్చీలో కూర్చునేందుకా అనే మీమాంసలో పార్టీ పడిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత స్థానంలో శశికళ కూర్చోవడం పూర్తయింది. ఇక సీఎం కుర్చీనే తరువాయని పార్టీలోని అగ్రనేతలు ఆమె వెంటపడుతున్నారు. అయితే ద్వితీయ నుంచి కింది స్థాయి వరకు శశికళను వ్యతిరేకిస్తున్నారు. జయ స్థానంలో శశికళను సహించేది లేదని ఏనాడో తేల్చిచెప్పేశారు. అంతేగాక రాష్ట్రంలో వెలిసిన బ్యానర్లు, ఫ్లెక్సీల్లోని శశికళ చిత్రాన్ని చింపివేసి తమ నిరసను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవిలోనే ఇంతటి ప్రతిఘటనను ఎదురవుతుండగా ఇక సీఎం పగ్గాలు చేపడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని శశికళకు బెంగపట్టుకున్నట్లు సమాచారం. ఇలాంటి ఎదురుగాలులు ఎక్కువ కాలం కొనసాగితే ముప్పు తప్పదని శశికళ జంకుతున్నారు. సీఎం సీటులో ప్రశాంతంగా కూర్చోవాలంటే పార్టీలో తన ప్రతికూరులను అనుకూలురుగా మార్చుకోవడం ముఖ్యమని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగా 9వ తేదీ వరకు జిల్లాల వారిగా నేతలతో సమావేశమవుతున్నారు. అంతేగాక జయలలిత మరణ మిస్టరీలో శశికళను అనుమానించడం ఎక్కువైంది. కోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ సాగుతోంది. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నెంబర్ 2 ముద్దాయిగా ఉన్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో సీఎం పదవి చేపట్టడం మంచిది కాదని వెనక్కుతగ్గినట్లు సమాచారం. సీఎం బాధ్యతలపై శశికళను ఒత్తిడి చేయరాదని పార్టీ బుధవారం హుకుం జారీ చేసింది. పార్టీపై పట్టు కోసం: సీఎం పదవిని చేపట్టేలోగా పార్టీపై పూర్తి స్థాయిలో పట్టుకు శశికళ ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత శశికళ తొలిసారిగా బుధవారం ఉదయం 11 గంటలకు రాయపేటలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. సమాలోచనలు నిర్వహణకు బుధవారం శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పలువురు మంత్రులు ఆమెకు స్వాగతం పలికారు. కార్యాలయ మొదటి అంతస్థులోని బాల్కని వద్ద నిల్చుని కార్యకర్తలకు రెండాకుల చిహ్నాన్ని చూపుతూ అభివాదం చేశారు. ఆ తరువాత చ్నెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు, తిరువన్నామలై జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సాయంత్రం వరకు శశికళ సమాలోచనలు చేశారు. జయలలిత హయాం నాటి మిలిటరీ క్రమశిక్షణ అలాగే కొనసాగాలని, ఎటువంటి కారణాలచేతనూ అవినీతికి పాల్పడరాదని ఆమె సూచించారు. అమ్మ వెలిగించిన దీపాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల సమయంలో విద్యార్థులతో వివిధ పోటీలను నిర్వహించాలని ఆదేశించారు. పార్టీలోకి యువతను ఎక్కువగా చేర్చుకోవాలని సూచించారు. ఈనెల 6వ తేదీన తేదీన తేని, దిండుగల్లు, విరుదునగర్, శివగంగై, రామనాధపురం, సేలం, నామక్కల్, ఈరోడ్, 7వ తేదీన నాగపట్నం, తిరువారూరు, పుదుక్కోట్టై, మదురై, కడలూరు, విళుపురం, కృష్ణగిరి, ధర్మపురం, 8వ తేదీన తిరునెల్వేలి, తూత్తుకూడి, కన్యాకుమారి, 9వ తేదీన తిరుప్పూరు, కోయంబత్తూరు, నీలగిరి, తిరుచ్చి, అరియలూరు, కరూరు, తంజావూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. మళ్లీ పెరిగిన బందోబస్తు: జయలలిత మరణం తరువాత కూడా పోయెస్‌గార్డెన్ లో అదే స్థాయిలో బందోబస్తు అవసరమా అంటూ ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సహా పలువురు విమర్శలు చేయడంతో పోలీసులు సంఖ్యను ఇటీవల తగ్గించారు. అయితే శశికళ ప్రస్తుతం అధికార పార్టీకి ప్రధాన కార్యదర్శిగా మారడంతో మళ్లీ బందోబస్తును పెంచారు. -
అక్కడ భద్రత ఎందుకో?
► పోయెస్ గార్డెన్ నుంచి వెనక్కు రప్పించండి ► డీజీపీకి స్టాలిన్ లేఖాస్త్రం సాక్షి, చెన్నై : ఎన్నికల కమిషన్ గుర్తింపు కల్గిన రాజకీయ పార్టీ నేత అక్కడున్నారా...? లేదా కేంద్రంలోనూ, రాష్ట్రం లోనూ ఉన్నత పదవిలో ఉన్న వాళ్లు మరెవ్వరైనా అక్కడున్నారా?, ఎం దుకు అంత భద్రత అక్కడ అని రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ ను ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే కోశాధికారి ఎంకే.స్టాలిన్ డిమాండ్ చేశారు. పోయెస్ గార్డెన్ లో ఉన్న కోర్ సెల్ సీఐడీ భద్రతను వెనక్కు రపించాలని డిమాండ్ చేశారు. అమ్మ జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆ పరిసరాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటాయి. ప్రత్యేక చెక్ పోస్టులతోపాటు, నిత్యం వాహనాల తనిఖీలు సాగేవి. అమ్మ జయలలిత అందర్నీ వీడి ఇరవై రోజులు కావస్తోంది. అమ్మకు మరణంతో ఆమెకు కల్పించిన జెడ్ ప్లస్ భద్రత మరుసటి రోజే ఉపసంహరించారు. ఈ బృందం పోయెస్ గార్డన్ ను వీడింది. అయితే, కోర్ సెల్ సీఐడీ భద్రత మాత్రం అక్కడ నేటికీ కొనసాగుతుండడం చర్చకు దారి తీసింది. అలాగే, పోయెస్ గార్డెన్ పరిసరాల్లో నగర పోలీసు యంత్రాంగం నేతృత్వంలో భద్రత కొనసాగుతూనే ఉంది. కోర్ సెల్ సీఐడీ విభాగానికి చెందిన 240 మంది పోయెస్ గార్డెన్ లో నేటికీ భద్రతా విధుల్లో ఉన్నారు. శిక్షణ పొందిన ఎస్పీ స్థాయి అధికారి ఒకరు, నలుగురు డీఎస్పీలు, ఐదుగురు ఏడీఎస్పీలు, ఏడుగురు ఇన్డ స్పెక్టర్లు, మరో ఏడుగురు సబ్ ఇన్ స్పెక్టర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ హోదా కల్గిన మిగిలిన సిబ్బంది చిన్నమ్మ శశికళ వెన్నంటి భద్రతా విధుల్లో ఉన్నారని చెప్పవచ్చు. చిన్నమ్మను పరామర్శించేందుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుండడంతో ఈ సీఐడీ భద్రతా సేవలు అక్కడే కొనసాగుతుండడం వివాదానికి దారి తీసింది. వీరి బస కోసం పోయెస్ గార్డెన్ కు ఎదురుగా ఉన్న ఓ భవనాన్ని తీసుకుని ఉన్నారు. బోట్ క్లబ్ ఆవరణలోని కమాండో ఫోర్స్ ప్రధాన కార్యాలయం మెస్ నుంచి వీరికి అన్నీ సరఫరా నేటీకి అవుతుండడంతో, ప్రజా ధనం ఎవరి కోసం...అక్కడెవ్వరున్నారని ఈ భద్రత అని పెదవి విప్పే పనిలో ప్ర«ధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ నిమగ్నం కావడంతో , వెనక్కు రప్పించే ప్రయత్నాల్లో డీజీపీ చర్యలు తీసుకుంటారా అన్న ది వేచి చూడాల్సిందే. ఈ మేరకు శనివారం డీజీపీ రాజేంద్రన్ కు స్టాలిన్ లేఖాస్త్రం సంధించారు. ఎవరున్నారని అక్కడ భద్రత: ఎన్నికల యంత్రాంగం గుర్తింపు కల్గిన పార్టీ నాయకులు ఎవరైనా అక్కడ ఉన్నారా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత పదవిలో ఉన్న వాళ్లు మరెవ్వరైనా అక్కడున్నారా అని ప్రశ్నిస్తూ, పోయెస్ గార్డెన్ లో కల్పించిన భద్రతపై లేఖలో స్టాలిన్ విరుచుకు పడ్డారు. అక్కడున్న భద్రతా సిబ్బందికి నెలసరి జీతంతో పాటు అదనంగా రిస్క్ అలెవెన్స్ రూ.ఆరు వేలు చొప్పున అందుతూ వస్తున్నదని గుర్తుచేశారు. వీరికి సకల సౌకర్యాలు అందుతున్నాయని పేర్కొన్నారు. నిత్యం రోడ్డు మీద ట్రాఫిక్ కట్టడి లక్ష్యంగా, నేరగాళ్లను పట్టుకునేందుకు రేయింబవళ్లు గస్తీలో ఉన్న పోలీసులకు కూడా దక్కని సౌకర్యాలు, ప్రత్యేక సదుపాయాలు పోయెస్ గార్డెన్ లోని సిబ్బందికి అందుతున్నట్టు వివరించారు. వీటన్నింటికీ అయ్యే ఖర్చు ప్రజాధనం నుంచే వెచ్చిస్తున్నారన్న విషయాన్ని పరిగణించాలని సూచించారు. ప్రైవేటు సెక్యూరిటీ వలే కోర్సెల్ సీఐడీ అక్కడ ప్రైవేటు వ్యక్తులకు సేవలు అందిస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. 240 మంది ప్రత్యేక సిబ్బంది, అదనంగా మరో 60 మంది నగర పోలీసులు ఇక్కడ భద్రతా విధుల్లో కొనసాగాల్సినంత అవసరం ఉందా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి ఉన్నాయని, సిబ్బంది కొరతతో పని భారంతో ఉన్న వాళ్లు తీవ్ర సంకటంలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ఎవ్వరూ లేని పోయెస్ గార్డెన్ లో మూడు వందల మందిని ఎలా భద్రతా విధుల్లో నియమించగలరని ప్రశ్నించారు. ఆ సిబ్బందిని వెనక్కు పిలిపించి, ప్రజలకు భద్రత కల్పించేందుకు తగ్గట్టుగా ఇతర బాధ్యతల్ని అప్పగించాలని కోరారు. -
పరామర్శల క్యూ!
చిన్నమ్మ ప్రసన్నం కోసం బారులు సాక్షి, చెన్నై : బ్యాంకుల ముందు, అమ్మ సమాధి ముందు కన్నా, పోయెస్ గార్డెన్ వద్ద క్యూ రోజురోజుకు పెరుగుతోంది. చిన్నమ్మ శశికళను పరామర్శించేందుకు బారులు తీరే వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చిన్నమ్మను ఓదార్చే వాళ్లు కొందరు అయితే, మీరే దిక్కు అన్నట్టు నినదించే వాళ్లు మరి కొందరు. దీంతో పోయెస్ గార్డెన్ మార్గంలో నిత్యం సందడే. దివంగత సీఎం జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె ప్రాణాలతో ఉన్న సమయంలో ఆ మార్గంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. పోయెస్ గార్డెన్ లోని వేదా నిలయం వద్ద అవసరం అయితే, తప్పా, మిగిలిన సందర్భాల్లో పార్టీ వర్గాలే కాదు, సామాన్యులు కూడా నిలబడేందుకు అవకాశం ఉండదు. ఇక, ఆ ఇంట్లోకి ముఖ్యులు తప్పా, మరెవ్వర్నీ అనుమతించే వారు కాదు. అది కూడా అవసరాన్ని బట్టే. అంతటి కట్టుదిట్ట భద్రత నడుమ ఉండే వేదా నిలయం, ఇప్పుడు చినమ్మకు పరామర్శలు, ఓదార్పులకు, సందర్శకులకు నిలయంగా మారింది. ఇంత వరకు అమ్మ జయలలిత ఇళ్లు ఎలా ఉంటుందో అన్న విషయం కూడా తెలియని వాళ్లందరూ ఇప్పుడు అక్కడ క్యూ కట్టే పనిలో పడ్డారు. అమ్మ మరణంతో అక్కడ చిన్నమ్మ శశికళ ఉన్నారు. దీంతో చినమ్మను పరామర్శించేందుకు, ఓదార్చేందుకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తొలుత పార్టీ ముఖ్యులు, తదుపరి జిల్లాల నేతలకు ఆ ఇంట్లోకి వెళ్లే అవకాశం ఇవ్వగా, ప్రస్తుతం అక్కడ ఇంత వరకు తమ పాదం కూడామోపని వాళ్లు సైతం క్యూ కట్టే పనిలో పడ్డారు. బ్యాంక్‌ల ముందు, అమ్మ సమాధి వద్ద కన్నా చిన్నమ్మకు పరామర్శ నిమిత్తం పోయెస్ గార్డెన్ లో క్యూ కట్టే వారి సంఖ్య పెరిగినంతగా పరిస్థితి ఉండడంతో ఆ గార్డెన్ లోని ఇతరులకు విస్మయం తప్పడం లేదు. ఇన్నాళ్లు చడీ చప్పుడు కాకుండా, భద్రత నడుమ ఉండే, అమ్మ ఇంటి రోడ్డులో ఇప్పుడు నిత్యం వాహనాలు, పరామర్శలకు వచ్చే వాళ్ల హడావుడితో సందడి నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పరామర్శలు హోరెత్తుతుండడం గమనించాల్సిన విషయం. కొందరు అయితే, చిన్నమ్మా నీవే దిక్కు అని నినాదిస్తుంటే, మరి కొందరు జయలలిత ఇంట్లోకి వెళ్లి మరీ పరామర్శించి వస్తున్నారు. కొందరికి లోనికి అనుమతి లభిస్తుండగా, మరి కొందరు ఇంటి గుమ్మం వద్ద క్యూ కట్టాల్సిందే. గురువారం కూడా పెద్ద సంఖ్యలో ఆయా సంఘాలు, సామాజిక వర్గాల పెద్దలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అన్నాడీఎంకే వర్గాలతో పోయెస్ గార్డెన్ వద్ద పెద్ద క్యూ కనిపించడం గమనార్హం. ఇక, సినీ నటులు, అన్నాడీఎంకే వ్యాఖ్యాతలు సీఆర్ సరస్వతి, రామరాజన్, సెంథిల్, గుండు కల్యాణం వంటి వారితో పాటు రియో పారాలింపిక్లో పతకం సాధించిన తమిళ తంగం మారియప్పన్ తంగవేలు తన కోచ్ సత్యనారాయణతో కలిసి పోయెస్ గార్డెన్ కు వచ్చారు. బంగారు పతకాన్ని చిన్నమ్మకు చూపించి వెళ్లాడు. పతకం సాధించిన సమయంలో రూ. రెండు కోట్ల నగదు బహుమతిని అమ్మ జయలలిత ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇంత వరకు ఆ బహమతి మారియప్పన్ తంగవేలు దరిచేర లేదన్న సంకేతాలు ఉన్నాయి. చిన్నమ్మ అయినా, దృష్టి పెట్టేనా అన్న ఆశ తంగవేలు అభిమానుల్లో నెలకొంది. -
తరలిన అభిమానం
► జన సందోహంలో మెరీనా ► జయ సమాధి వద్ద బారులు ►బుల్లి తెర నటుల మౌన ర్యాలీతో నివాళి సాక్షి, చెన్నై : దివంగత సీఎం, అమ్మ జయలలిత సమాధిని దర్శించుకునేందుకు జన సందోహం పెద్ద ఎత్తున తరలి వస్తోంది. ఆదివారం అభిమాన లోకం తరలిరావడంతో మెరీనా పరిసరాలు కిక్కిరిశాయి. అభిమానులందరూ అమ్మ సమాధిని దర్శించుకున్నారు. కొందర యితే, కన్నీటి పర్యంతంతో తమ ఆవేదన వ్యక్తం చేయగా, మరి కొందరు అమ్మను తలచుకుంటూ మౌనంగా రోదించారు. తమిళుల ఆరాధ్య అమ్మ, దివంగత సీఎం జయలలిత భౌతికంగా అందర్నీ వీడి రెండు వారాలు అవుతోంది. దశాబ్దాల పాటు ప్రజసేవలో నిమగ్నమై, ఇక సెలవంటూ మెరీనా తీరంలో శాశ్వత నిద్రలో ఉక్కు మహిళ, విప్లవనాయకి జయలలిత ఉన్నారు. అమ్మ సమాధిని దర్శించుకునేందుకు నిత్యం జనం తరలి వస్తూనే ఉన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మరింతగా జనం తరలి రావడంతో మెరీనా పరిసరాలు కిటకిటలాడాయి. ఉదయం ఆరేడు గంటల నుంచే జనం రాక పెరిగింది. అన్నాడీఎంకే వర్గాలు, సామాన్య ప్రజలు, పర్యాటకులు ఇలా మెరీనాతీరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మ సమాధిని దర్శించుకుని మరీ వెళ్లారు. అమ్మ సమాధిని పలు రకాల పుష్పాలతో అలంకరించారు. పార్టీ ముఖ్యులను మాత్రమే సమాధి వద్దకు అనుమతించగా, మిగిలిన వాళ్లందరూ బారికేడ్ల వద్ద నుంచి సమాధిని దర్శిం చుకుని వెళ్లారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అభిమానులు, పార్టీ వర్గాలు అమ్మ జయలలిత సమాధిని దర్శించుకున్న అనంతరం పోయెస్ గార్డెన్ బాట పట్టడం గమనార్హం. పలువురు శిరోముండనం చెయించు కొని అమ్మ సమాధి వద్ద పువ్వుల్ని చల్లి అంజలి ఘటించారు. ఇక, చెన్నై పరిసర వాసులు సైతం తరలి రావడంతో మెరీనా పోటెత్తింది. ఇక, అమ్మ అభిమానలోకం, జనానికి అన్నాడీఎంకే వర్గాలు వాటర్ ప్యాకెట్లు, అల్పాహారం అందించారు. ఇక, బుల్లి తెర నటీ నటులు గాంధీ విగ్రహం నుంచి మౌన ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. జనం అత్యధికంగా తరలి రావడంతో మహిళల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశారు. పోయెస్ గార్డెన్ వద్ద : అన్నాడీఎంకే వర్గాలు అమ్మ సమాధిని దర్శించుకున్న అనంతరం నేరుగా పోయెస్ గార్డెన్ కు చేరుకుని చిన్నమ్మ శశికళను పరామర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన అమ్మ జయలలిత చిత్ర పటం వద్ద నివాళులర్పించినానంతరం చిన్నమ్మ ముందు క్యూ కట్టారు. తిరుప్పూర్, పెరంబలూరు, కరూర్, మధురై జిల్లాల నుంచి అత్యధికంగా కేడర్, నాయకులు తరలి వచ్చారు. ఇక, కొంగు ఇలంజర్ పేరవై నేత, ఎమ్మెల్యే తనియరసు జయలలిత సమాధి వద్ద నివాళులర్పించినానంతరం పోయెస్ గార్డెన్ లో చిన్నమ్మతో భేటీ అయ్యారు. జయలలిత పేరు: ఆ శిశువుకు జయలలిత అన్న నామకరణం చేశారు. అమ్మ మరణం తదుపరి తొలి నామకరణం ఇదే కావచ్చు. ఆ పేరును స్వయంగా జయలలిత నెచ్చెలి శశికళ పెట్టడం విశేషం. తేని నుంచి పోయెస్ గార్డెన్ కు వచ్చిన ఆటో డ్రైవర్ సెంథిల్‌కుమార్, గాయత్రి దంపతులు చిన్నమ్మను కలిశారు. తమ బిడ్డకు పేరు పెట్టాలని విన్నవించారు. ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్న శశికళ జయలలిత అని నామకరణం చేశారు. -
ఇక అమ్మ దర్శనం దక్కినట్టేనా
-15 సీట్లకు వాసన్ అంగీకారం - ఒకటి, రెండు రోజుల్లో పోయెస్ గార్డెన్‌కు చెన్నై తమిళ మానిల కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం తాండ వం చేస్తున్నది. అమ్మ దర్శన భాగ్యం తమ అధినేతకు ఒకటి, రెండు రోజుల్లో దక్కనున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నా యి. తమకు పదిహేను సీట్లను సర్దుబాటు చేయడంతో, అందు కు తమ అధినేత అంగీకరించినట్టు చెబుతున్నారు. తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) గురించిన చర్చే ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతోంది. ఆ యా పార్టీలు పొత్తులు కుదుర్చుకుని సీట్ల పందేరాలు సాగించే పనిలో పడ్డాయి. అయితే, తన తండ్రి దివంగత నేత మూపనార్ చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన టీఎంసీ నేత జీకే వాసన్ నిర్ణయాన్ని నిర్భయంగా తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని చెప్పవచ్చు. వెనుకడుగు వేస్తున్నారా? లేదా, చివరి వరకు వేచి చూసి అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుందామా? అన్న యోచనతో ఆయన ముందుకు సాగుతున్నారన్నది ఆ పార్టీ వర్గాల వాదన. అన్నాడీఎంకేతో కలసి అడుగులు వేయాలన్నదే వాసన్‌కు తొలినాటి నుంచి ఉన్న అభిప్రాయం. అయితే, అక్కడి తలుపులు తెరుచుకున్నా, సీట్ల పందేరం చిక్కుల్ని సృష్టించడంతో డైలమాలో పడ్డారు. అదే సమయంలో అమ్మ తలుపులు ఇక మూసుకున్నట్టేనన్న భావనతో తదుపరి డీఎంకే వైపు, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి వైపుగా ఆయన దృష్టి సాగిందని చెప్పవచ్చు. అయితే, వాసన్ తీరుకు డీఎంకే గట్టి సమాధానమే ఇచ్చింది. తమ కూటమిలో చోటు లేదని తేల్చింది. ఇక పదే పదే ఆహ్వానం పలికిన ప్రజా కూటమి తాజాగా మౌనం అనుసరించడం మొదలెట్టడంతో వాసన్ పరిస్థితి ఏమిటో అన్న చర్చ బయలు దేరింది. ఎన్నికల గుర్తుగా తమ నేత వాసన్‌కు కొబ్బరితోట చిక్కినా, ఎన్నికల పొత్తు ఖరారు కాకపోవడంతో మల్లగుల్లాలు పడుతూ వచ్చిన టీఎంసీ వర్గాలు, ప్రస్తుతం ఆనంద తాండవం చేస్తున్నాయి. ఇందుకు కారణం మళ్లీ అన్నాడీఎంకే తలుపులు తెరుచుకుని ఉండడమేనటా. టీఎంసీకి పదిహేను సీట్లు సర్దుబాటు చేయడానికి అన్నాడీఎంకే సిద్ధపడ్డట్టుగా వచ్చిన సంకేతాలతో ఇక, పోయేస్ గార్డెన్ మెట్లు ఎక్కినట్టే అన్న ఆనందాన్ని ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు సీట్ల సర్దుబాటుకు అన్నాడీఎంకే నిర్ణయించడంతో ఆ పదిహేనుకు అంగీకారం తెలిపిన జీకే వాసన్, ఇక అమ్మ దర్శనం కోసం ఎదురు చూపుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో అమ్మ దర్శనం ఖాయం అని, అన్నాడీఎంకేతో కలసి ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నామని పేర్కొంటున్నారు. అయితే, అన్నాడీఎంకేలో ఏ చిహ్నం మీద వాసన్ పోటీ చేయాల్సి ఉంటుందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొబ్బరి తోటకు అమ్మ అనుమతి ఇస్తారా, అన్నది వేచి చూడాల్సిందే. ఇందుకు నిదర్శనం ఇప్పటి వరకు అమ్మ గొడుగు నీడన చేరిన వారందరూ అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంతో బరిలోకి దిగేందుకు సిద్ధపడ డమే. 2001లో అన్నాడీఎంకేతో కలసి టీఎంసీ ఎన్నికల పయనం సాగించిన విషయం తెలిసిందే. అమ్మ దర్శనం కోసం : ఓ వైపు వాసన్ అమ్మ దర్శనం కోసం సిద్ధం అవుతోంటే, మరో వైపు అమ్మకు మద్దతు అంటూ పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కేందుకు మరెన్నో చిన్నా చితక పార్టీలు, సామాజిక వర్గాలు, ప్రజా సంఘాలు పరుగులు తీస్తున్నాయి. తమ మద్దతు అమ్మకే అంటూ లేఖల్ని పోయెస్ గార్డెన్‌కు పంపించే పనిలో పడ్డాయి. అక్కడి నుంచి పిలుపు వచ్చిన తరువాయి, అమ్మను దర్శించుకునేందుకు ఆయా నేతలు చెన్నైలో తిష్ట వేసి ఉండడం గమనార్హం. ఇక, ఆదివారం సినీ నటుడు, ముక్కళత్తూరు పులి పడై అధ్యక్షుడు కరుణాస్ అమ్మ జయలలితను కలిశారు. తమ మద్దతును ప్రకటించారు. అన్నాడీఎంకే తరఫున 234 స్థానాల్లోనూ తాను ప్రచారం చేయబోతున్నట్టుగా కరుణాస్ పేర్కొన్నారు. ఇక, గత ఎన్నికల్లో ఒక్క సీటుతో సర్దుకున్న ఇండియ కుడియరసు కట్చి నేత, ఎమ్మెల్యే సేకు తమిళరసన్ ఈ సారి అమ్మ ముందు మరిన్ని సీట్ల డిమాండ్‌ను ఉంచారు.