-15 సీట్లకు వాసన్ అంగీకారం
- ఒకటి, రెండు రోజుల్లో పోయెస్ గార్డెన్‌కు
చెన్నై
తమిళ మానిల కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం తాండ వం చేస్తున్నది. అమ్మ దర్శన భాగ్యం తమ అధినేతకు ఒకటి, రెండు రోజుల్లో దక్కనున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నా యి. తమకు పదిహేను సీట్లను సర్దుబాటు చేయడంతో, అందు కు తమ అధినేత అంగీకరించినట్టు చెబుతున్నారు. తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) గురించిన చర్చే ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతోంది. ఆ యా పార్టీలు పొత్తులు కుదుర్చుకుని సీట్ల పందేరాలు సాగించే పనిలో పడ్డాయి.
అయితే, తన తండ్రి దివంగత నేత మూపనార్ చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన టీఎంసీ నేత జీకే వాసన్ నిర్ణయాన్ని నిర్భయంగా తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని చెప్పవచ్చు. వెనుకడుగు వేస్తున్నారా? లేదా, చివరి వరకు వేచి చూసి అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుందామా? అన్న యోచనతో ఆయన ముందుకు సాగుతున్నారన్నది ఆ పార్టీ వర్గాల వాదన. అన్నాడీఎంకేతో కలసి అడుగులు వేయాలన్నదే వాసన్‌కు తొలినాటి నుంచి ఉన్న అభిప్రాయం. అయితే, అక్కడి తలుపులు తెరుచుకున్నా, సీట్ల పందేరం చిక్కుల్ని సృష్టించడంతో డైలమాలో పడ్డారు.
అదే సమయంలో అమ్మ తలుపులు ఇక మూసుకున్నట్టేనన్న భావనతో తదుపరి డీఎంకే వైపు, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి వైపుగా ఆయన దృష్టి సాగిందని చెప్పవచ్చు. అయితే, వాసన్ తీరుకు డీఎంకే గట్టి సమాధానమే ఇచ్చింది. తమ కూటమిలో చోటు లేదని తేల్చింది. ఇక పదే పదే ఆహ్వానం పలికిన ప్రజా కూటమి తాజాగా మౌనం అనుసరించడం మొదలెట్టడంతో వాసన్ పరిస్థితి ఏమిటో అన్న చర్చ బయలు దేరింది. ఎన్నికల గుర్తుగా తమ నేత వాసన్‌కు కొబ్బరితోట చిక్కినా, ఎన్నికల పొత్తు ఖరారు కాకపోవడంతో మల్లగుల్లాలు పడుతూ వచ్చిన టీఎంసీ వర్గాలు, ప్రస్తుతం ఆనంద తాండవం చేస్తున్నాయి. ఇందుకు కారణం మళ్లీ అన్నాడీఎంకే తలుపులు తెరుచుకుని ఉండడమేనటా. టీఎంసీకి పదిహేను సీట్లు సర్దుబాటు చేయడానికి అన్నాడీఎంకే సిద్ధపడ్డట్టుగా వచ్చిన సంకేతాలతో ఇక, పోయేస్ గార్డెన్ మెట్లు ఎక్కినట్టే అన్న ఆనందాన్ని ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
తమకు సీట్ల సర్దుబాటుకు అన్నాడీఎంకే నిర్ణయించడంతో ఆ పదిహేనుకు అంగీకారం తెలిపిన జీకే వాసన్, ఇక అమ్మ దర్శనం కోసం ఎదురు చూపుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో అమ్మ దర్శనం ఖాయం అని, అన్నాడీఎంకేతో కలసి ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నామని పేర్కొంటున్నారు. అయితే, అన్నాడీఎంకేలో ఏ చిహ్నం మీద వాసన్ పోటీ చేయాల్సి ఉంటుందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొబ్బరి తోటకు అమ్మ అనుమతి ఇస్తారా, అన్నది వేచి చూడాల్సిందే. ఇందుకు నిదర్శనం ఇప్పటి వరకు అమ్మ గొడుగు నీడన చేరిన వారందరూ అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంతో బరిలోకి దిగేందుకు సిద్ధపడ డమే. 2001లో అన్నాడీఎంకేతో కలసి టీఎంసీ ఎన్నికల పయనం సాగించిన విషయం తెలిసిందే.
అమ్మ దర్శనం కోసం : ఓ వైపు వాసన్ అమ్మ దర్శనం కోసం సిద్ధం అవుతోంటే, మరో వైపు అమ్మకు మద్దతు అంటూ పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కేందుకు మరెన్నో చిన్నా చితక పార్టీలు, సామాజిక వర్గాలు, ప్రజా సంఘాలు పరుగులు తీస్తున్నాయి. తమ మద్దతు అమ్మకే అంటూ లేఖల్ని పోయెస్ గార్డెన్‌కు పంపించే పనిలో పడ్డాయి. అక్కడి నుంచి పిలుపు వచ్చిన తరువాయి, అమ్మను దర్శించుకునేందుకు ఆయా నేతలు చెన్నైలో తిష్ట వేసి ఉండడం గమనార్హం. ఇక, ఆదివారం సినీ నటుడు, ముక్కళత్తూరు పులి పడై అధ్యక్షుడు కరుణాస్ అమ్మ జయలలితను కలిశారు. తమ మద్దతును ప్రకటించారు.
అన్నాడీఎంకే తరఫున 234 స్థానాల్లోనూ తాను ప్రచారం చేయబోతున్నట్టుగా కరుణాస్ పేర్కొన్నారు. ఇక, గత ఎన్నికల్లో ఒక్క సీటుతో సర్దుకున్న ఇండియ కుడియరసు కట్చి నేత, ఎమ్మెల్యే సేకు తమిళరసన్ ఈ సారి అమ్మ ముందు మరిన్ని సీట్ల డిమాండ్‌ను ఉంచారు.
ఇక అమ్మ దర్శనం దక్కినట్టేనా
Published Mon, Apr 4 2016 9:09 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM
Advertisement
Advertisement