tamil nadu elections
-
స్టాలినే సీఎం: డీఎంకేకు 180 స్థానాలు ఖాయం!
ఉదయ సూర్యుడికే ప్రజలు పట్టం కట్టారా..? డీఎంకే అభ్యర్థులకే గంపగుత్తగా ఓట్లేశారా..? ఆ పార్టీ అధినేత స్టాలిన్ వైపే మొగ్గుచూపారా..? అత్యధిక స్థానాలతో అధికార పీఠం చేపట్టనున్నారా..? అన్నాడీఎంకే హవాకు ఓటర్లు మంగళం పాడేశారా..? అతి తక్కువ సీట్లకే పరిమితం చేయనున్నారా..? తమిళనాట కమల వికాసం కలేనా..? బోణీ కొట్టే పరిస్థితి కూడా ఉండదా..? అవుననే అంటున్నాయి సర్వేలు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తిరుగులేని విజయం సాధిస్తుందని ఘంటాపథంగా వెల్లడిస్తున్నాయి. సాక్షి , చెన్నై : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత డీఎంకేలో ఆనందం వెల్లివిరుస్తోంది, అన్నాడీఎంకేలో నైరాశ్యం అలుముకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా అన్నాడీఎంకే– డీఎంకే తలపడ్డాయి. 70 శాతం వరకు పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రజలు అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళి డీఎంకేకు అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఐ బ్యాక్ సంస్థ ఎన్నికలకు ముందు మొత్తం 234 స్థానాల్లో సర్వేలో నిర్వహించి డీఎంకేకు 180 స్థానాలు ఖాయమని తేల్చింది. ఈ క్రమంలో పోలింగ్ న ఆడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చెన్నైలోని ఐ బ్యాక్ సంస్థ కార్యాలయానికి సైతం వెళ్లడం విశేషం. పోలింగ్ ముగిసిన తర్వాత డీఎంకేకు 180 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని ఐ బ్యాక్ సంస్థ వెల్లడించింది. దీంతో డీఎంకే శ్రేణుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. స్టాలిన్ కూడా డీఎంకే అభ్యర్థులను చెన్నైకి పిలిపించుకుని విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా గురు, శుక్రవారాల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు సైతం స్టాలిన్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్ డీఎంకే అగ్రనేతలతో సమావేశమై మంత్రి పదవులు, శాఖల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులు స్టాలిన్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది. రెండాకుల్లో గుబులు! అన్నాడీఎంకే విషయానికి వస్తే ఎన్నికలకు ముందు సీఎం ఎడపాడి పళనిస్వామి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత డీలా పడిపోయినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పలువురు మంత్రులు సైతం ఓటమిపాలవుతున్నట్లు ఆయనకు సమాచారం అందింది. పోలింగ్ పూర్తయిన తర్వాత పళనిస్వామి సేలం జిల్లా సూరమంగళంలోని తన సొంతింటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈక్రమంలో మంత్రులు ఎంసీ సంపత్, ఆర్బీ ఉదయకుమార్, విజయభాస్కర్, కేసీ వీరమణి, జయకుమార్ సహా పలువురు అభ్యర్థులు సేలం వెళ్లి ఎడపాడిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులే ఓడిపోయే పరిస్థితి ఉందని వారు చెప్పడంతో పళనిస్వామి మరింత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే 20–30 సీట్లకు పరిమితమవుతుందని, బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఐ బ్యాక్ సంస్థ వెల్లడించినట్లు సమాచారం. చదవండి: సీనియర్ నటుడికి అత్యవసర చికిత్స -
తమిళ ఎన్నికల్లో ‘అనంత’ పోలీసుల సేవలు
సాక్షి, అమరావతి: తమిళనాడు ఎన్నికల బందోబస్తులో అనంతపురం జిల్లా పోలీసులు విశేష సేవలు అందించారు. పోలింగ్ రోజైన మంగళవారం నాడు ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు నడవలేని స్థితిలో ఉండే వారిని వీల్ చైర్లో కూర్చోబెట్టి పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తల్లుల నుంచి చిన్నారులను తీసుకుని వారిని ఎత్తుకుని పోలీసులు ఆడించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్క్ లు, శానిటైజర్లు వినియోగించేలా ఓటర్లను చైతన్యపరిచారు. మాసు్కలు లేకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి మాస్క్ లను అందించారు. ఇలా సేవలు అందించిన నల్లమాడ కానిస్టేబుల్ రాము, బొమ్మనహళ్ కానిస్టేబుల్ ధనసింగ్ నాయక్‌లను అనంతపురం జిల్లా ఎస్పీ సత్యేయేసుబాబు అభినందించారు. -
'డీఎంకే అభ్యర్థులదే అన్నిచోట్లా విజయం'
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులు అన్నిచోట్ల విజయం సాధిస్తారని డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం.. స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే అధినేత్రి, జయలలిత తిరిగి అధికారంలోకి రావాలని ఎవ్వరూ కోరుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాగా, చెన్నైలోని గోపాలపురంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. నేడు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. -
హోరాహోరీ
సాక్షి, చెన్నై: అధికార పగ్గాలు అమ్మకే అని ఓ సారి, కాదు..కాదు కరుణకే అంటూ మ రో సారి..! సర్వే ఫలితాలు ఇన్నాళ్లు రాష్ట్రంలో సాగుతూ వచ్చాయి. అయితే, ప్రప్రథమంగా నువ్వా...నేనా అన్నట్టుగా వెలువడ్డ సర్వే అందరి దృష్టిని మరల్చి ఉంది. అమ్మకు 73 , కరుణకు 64 గ్యారంటీ అని ప్రకటించిన ఈ తాజా సర్వే, 83 స్థానాల్లో నువ్వా...నేనా అన్నట్టు హోరా హోరీ సమరం నెలకొని ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే, బీజేపీ కూట మి...ఇలా..పంచ ముఖ సమరం నెలకొంది. మునుపెన్నడూ లేని రీతిలో సాగుతున్న ఈ పోరులో ఓటరు నాడి ఎటో అన్నది అంతు చిక్క డం లేదు. పెద్ద ఎత్తున ఓట్ల చీలిక తథ్యం అన్నది మాత్రం స్పష్టం అవుతున్నది. ఈ చీలిక ఆధారం గా గెలుపు గుర్రాలు అవతరించబోతున్నాయి. అది ఎవరు..? అన్న ప్రశ్న సర్వత్రా నెలకొని ఉన్నది. స్థానిక, జాతీయ సంస్థలు, మీడియా వర్గాలు ఇప్పటి వరకు సాగిన సర్వేల్లో విచిత్ర ఫలితాల్ని ప్రకటించాయి. ఓ సంస్థ ఏమో అమ్మ జయలలిత సీఎం కావడం ఖాయం అని, క్వీన్ స్వీప్ తథ్యం అంటే, మరో సంస్థ అధికార పగ్గాలు చేపట్టేందుకు తగ్గ సీట్లు దక్కుతాయని వివరించాయి. ఇక, మరికొన్ని సర్వేలు కరుణానిధి సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టి తీరుతారంటూ నొక్కి చెప్పాయి. అయితే, ప్రసుత్తం జూనియర్ విగడన్ పత్రిక సర్వే అందరి దృష్టిని మరల్చి ఉంది. ఇందుకు కారణం ఆ ఫలితాలే. తమిళనాడులో నెంబర్ ఒన్‌గా వారంలో రెండు రోజులు వెలువడే పత్రికగా జూనియర్ విగడన్ ప్రఖ్యాతి గాంచింది. ఈ సర్వే మేరకు పేద, మధ్య తరగతి, యువతరం ఓటర్ల వద్ద సేకరించిన వివరాల మేరకు ఈ సర్వే వివరాల్ని ప్రకటించి ఉన్నారు.రాష్ట్రంలోని 234 స్థానాల్లో 73 స్థానాల్లో అన్నాడీఎంకే, 64 స్థానాల్లో డీఎంకే గెలుపు ఖాయం అయిందని వివరించారు. కాంగ్రెస్ పది చోట్ల, పీఎంకే, పుదియ తమిళగం, ఐయూఎంఎల్, ఎంఎంకేలు తలా ఓ చోట్ల గెలుపు తథ్యం అని ప్రకటించారు. 151 ఒక్క స్థానాలు పోగా, మిగిలిన 83 స్థానాల్లో గెలుపు ఎవరిదీ..? అన్నది నిర్ణయించలేమని స్పష్టం చేసింది. ఇందుకు కారణం ఆ నియోజకవర్గాల్లో నువ్వా...నేనా అన్నట్టుగా సమరం ఉందని, గెలుపు ఎవరిదో అన్నది తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే అన్నట్టుగా ఆ పత్రిక స్పష్టం చేసింది. -
ఓటు వేయకుంటే చంపేస్తాడు: కెప్టెన్
కేకేనగర్: ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి ఓటు వేసి గెలిపించకపోతే తన కుల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఓటర్ల ప్రాణాలు తీస్తాడని ఆ పార్టీ అధినేత కెప్టెన్ విజయకాంత్ విచిత్ర ప్రచారానికి దిగారు. దేవుడి పేరు చెప్పి ఓటర్ల ను భయపెడుతున్న కెప్టెన్ తీరుకు ప్రజలు, రాజకీయ పార్టీల వారు విస్తుపోతున్నారు. ఓటర్లను బుజ్జగించడం, లేకపోతే భయపెట్టి ఎలాగైనా ఓట్లు సాధించడమే ధ్యేయం గా కెప్టెన్ ప్రచారం సాగిస్తున్నారు. విల్లుపురం జిల్లా ఊళుందూరుపేట నియోజక వర్గంలో విజయకాంత్ పోటీ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తిరునావలూర్ నియోజకవర్గంలో రాత్రి వరకు భారీగా ప్రచారం చేశారు. మడపట్టు గ్రామంలో విజయకాంత్ మాట్లాడుతూ ప్రస్తుతం మీడియాలో వచ్చే అభిప్రాయ సేకరణను ప్రజలు నమ్మవద్దని కోరారు. వాటి అన్నింటిని అధిగమించి ప్రజా సంక్షేమ కూటమి అమోఘ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మడపట్టు ప్రాంతంలో వీధిదీపాలు వెలగకపోవడంతో ఇక్కడ నగదు బట్వా డా జరుగుతోందా? అని కెప్టెన్ ప్రశ్నించారు. తాను పరిక్కల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఓటర్లకు నగదు పంపిణీ చేయనని ప్రమా ణం చేసినట్లు తెలిపారు. ‘నాకు మీరు ఓటు వేయకుంటే నరసింహస్వామి మిమ్మల్ని చంపకుండా వదలడు. నా లాగా ఇతర పార్టీల వారు అవినీతి చేయమని ప్రమాణం చేయగలరా’? అని విజయకాంత్ ప్రశ్నించారు. -
తెలుగు ఓటరే కీలకం
తిరువళ్లూరు: చెన్నైకు సమీపంలోని జిల్లా తిరువళ్లూరు. పదేల్ల నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరువళ్లూరును జిల్లా కేంద్రంగా 1996వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి వరకు కాంచీపురం జిల్లాలో ఉన్న తిరువళ్లూరును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి తిరువళ్లూరు, గుమ్మిడిపూండి, తిరుత్తణి, పూందమల్లి, తిరువొత్తియూర్, పొన్నేరి, మధురవాయల్, మాధవరం, అంబత్తూరు, ఆవడి పది అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేశారు. 2011లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగించారు. అయితే తిరుత్తణి, తిరువళ్లూరు, గుమ్మిడిపూండి నియోజకవర్గంలో మెజారిటీ స్థాయిలో ఉన్న తెలుగు ప్రజలు ఎటువైపు మొగ్గితే అటువైపే విజయం దక్కే అవకాశాలు ఉండడంతో అభ్యర్థులందరూ తెలుగు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. తిరువళ్లూరులో పోటాపోటీ: జిల్లా కేంద్రమైన తిరువళ్లూరులో వ్యవసాయం, చేపల పెంపకం, చేనేత రంగాలపై ఆధారపడి జీవించే వారు అధికం. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వీరరాఘవుని ఆలయం, తొమ్మిది మూలలు ఉండే పుష్కరిణి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైన అభిప్రాయం ఉంది. 1957లో ఏర్పాటైన తిరువళ్లూరు నియోజకవర్గంలో 1957, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఏకాంబరం మొదలియార్, అరుణాచలం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొత్తానికి తిరువళ్లూరు నియోజకవర్గం ఏర్పాటైన తరువాత 13 సార్లు ఎన్నికలు జరగగా ఐదు సార్లు డీఎంకే, ఐదు సార్లు అన్నాడీఎంకే, రెండు సార్లు కాంగ్రెస్, ఒక సారి తమిళమానిల కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించాయి. ఈ నియోజకవర్గంలో 2.35 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఎస్సీలు, వన్నియర్లు, మొదలియార్ ఓటర్లు అధికశాతంలో ఉండగా పూండి, తిరువళ్లూరు టౌన్, రామంజేరి, కనకమ్మసత్రం తదితర 20 గ్రామాల్లో తెలుగు ఓటర్లు అధికంగా వున్నారు. వీరు ఎటు వైపు మొగ్గితే అటు వైపు విజయం సాధించే అవకాశాలు ఉండడంతో తెలుగులోనే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అన్నాడీఎంకే తరఫున భాస్కరన్, డీఎంకే తరఫున వీజీ రాజేంద్రన్, పీఎంకే తరఫున బాలయోగి, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థిగా బాలసింగం, బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాసన్ సహ 21 మంది పోటీ చేస్తున్నారు. ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. అన్నాడీఎంకే తరఫున ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండడంతో పాటు ప్రజల్లో నేరుగా వెళ్లికలుస్తున్నారు. అక్కడక్కడ తెలుగులోనే ప్రసంగిస్తూ తెలుగు వారిని ఆకట్టుకుంటున్నాడు. తెలుగు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నా అంతర్గత కుమ్ములాట, ఎవ్వరిని లెక్కచేయడన్న ప్రచారం, వరద సాయం అందరికి అందడం లేదన్న విమర్శలు, ప్రభుత్వంపై వ్యతిరేకత మైనస్‌గా మారే అవకాశం ఉంది. దీంతో పాటు నియోజకవర్గంలో బలమైన నేతగా వున్న తెలుగు ప్రముఖుడు రమణ సైతం సహాయ నిరాకరణ భాస్కరన్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రమణ రంగంలోకి దిగి చక్రం తిప్పితే అన్నాడీఎంకే గెలుపు నల్లేరుపై నడకే కావచ్చు. డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీజీ రాజేంద్రన్ తిరువళ్లూరులో ప్రముఖ విద్యాసంస్థలను నడుపుతున్నాడు. విద్యావేత్తగా అందరికి సుపరిచితుడే అయినా స్థానిక నేతలను లెక్క చేయడన్న విమర్శలు ఎక్కువగానే ఉంది. దీంతో పాటు డీఎంకేలో ఉన్న కుమ్ములాటలు ఎక్కడ కొంప ముంచుతుందోన్న ఆందోళన వీజీఆర్లో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇటీవల స్టాలిన్ లాంటి స్టార్ల ప్రచారంతో నెట్టుకురావచ్చన్న ధీమాతో వున్న రాజేంద్రన్ తన భార్య ఇందిరా తెలుగు మహిళ కావడంతో వారి ఓట్లను సాధించడానికి ప్రత్యేకంగా వ్యూహరచన చేసి ఆకట్టుకుంటున్నారు. గతంలో అన్నాడీఎంకేకు అండగా నిలిచిన తెలుగు ఓటర్లు ఇందిరకు సహకరిస్తే వీజీఆర్‌కు సానుకూల పరిస్థితి ఏర్పడే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలయోగి వన్నియర్ ఓట్లపైనే ఆధారపడి ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికి తిరువళ్లూరు నియోజకవర్గంలో తెలుగు ఓటరే కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు తమ అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. గుమ్మిడిపూండిలో సిట్టింగ్ గెలిచేనా : తెలుగు ఓటర్లు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో గుమ్మిడిపూండి ప్రధానమైనది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాకు సరిహద్దు ప్రాంతంగా గుమ్మిడిపూండి వుంది. ఇక్కడ ఇసుక క్వారీపై నిరసన, తాగునీటి ఎద్దడి, విద్యుత్ సమస్యతో మూత పడిన పరిశ్రమలతో వేలాది మంది నిరుద్యోగులుగా మారడం లాంటి సమస్యలు వున్నాయి. చేపలు, రొయ్యల పెంపకం ప్రధాన వృత్తి. 1957వ సంవత్సరంలో ఏర్పాటైన గుమ్మిడిపూండి నియోజవర్గంలో ఇప్పటి వరకు అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు ఏడు సార్లు, డీఎంకే నాలుగుసార్లు, కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు తలోసారి విజయం సాధించారు. 2011వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి డీండీకే అభ్యర్థి సీహెచ్ శేఖర్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విజయకుమార్, డీఎంకే కూటమి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శేఖర్, పీఎంకే అభ్యర్థిగా సెల్వరాజ్, బీజేపీ అభ్యర్థిగా భాస్కరన్, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థిగా గీత పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థితిలో తెలుగు ఓటర్లు వుండగా, గతంలో తెలుగు సంఘాలు, తెలుగు ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యే శేఖర్‌కు మద్దతు పలకడంతో భారీ విజయాన్ని సాధించారు. అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్న సీహెచ్ శేఖర్ ప్రస్తుతం తెలుగు ఓటర్లపైనే భారీ ఆశలు ఉంచుకున్నా, అన్నాడీఎంకే అభ్యర్థి విజయకుమార్, బీజేపీ అభ్యర్థి భాస్కరన్ తెలుగు వాడే కావడంతో తెలుగు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. డీఎంకే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శేఖర్ గతంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వంపై వ్యతిరేకత, యువతలో వున్న ఫాలోయింగ్ ప్లస్‌గా మారుతుంది. అయితే శేఖర్ ఎవ్వరి మాటలను వినడన్న విమర్శలు, డీఎంకేలో సీటు ఆశించి భంగపడ్డ వేణు, టీజేఎస్ గోవిందరాజన్ లాంటి సీనియర్లు చురుగ్గా వ్యవహరించకపోవడం, సొంత నిర్ణయాలతో సీనియర్లను గౌరవించడన్న విమర్శలు మైనస్‌గా మారుతున్నాయి. అయితే శేఖర్ భార్య మయూరి చేస్తున్న ఇంటింటి ప్రచారం, తెలుగింటి ఆడపడుచును ఆదరించాలని విన్నూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. అన్నాడీఎంకే కోటగా చెప్పబడే గుమ్మిడిపూండిలో పార్టీకి మంచి పట్టుంది. విజయకుమార్ మృదుస్వభావి, నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉండడంతో పాటు అనవసర విషయాల్లో తలదూర్చే వ్యక్తి కాదన్న అభిప్రాయం ప్రజల్లో ఉండడం ప్లస్. దీంతో పాటు తెలుగు సంఘాలతో విజయకుమార్‌కు వున్న వ్యక్తిగత పరిచయం. తెలుగు ప్రముఖులు జెడ్పీ చైర్మన్ రవిచంద్రన్, రాజమాణిక్యం, గోపాల్‌నాయుడు లాంటి తెలుగు వ్యక్తులు అండదండలు పుష్కలంగా ఉండడంతో విజయకుమార్ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భాస్కరన్ సైతం తెలుగు ఓటర్లను నమ్ముకున్నారు. పీఎంకే, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొత్తానికి తిరువళ్లూరు, గుమ్మడిపూండిలో తెలుగు ఓటర్లు కీలకం. వారు ఎటువైపు మొగ్గితే వారే గెలిచే అవకాశం ఉండడడంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తెలుగు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
రజనీ దారెటు?
* ఎన్నికలపై మౌనం * అదే బాటలో అభిమాన సంఘాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నా దారి రహదారి...బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే’..అంటూ తన డైలాగులతో వెండితెరపై ప్రత్యర్థులను దడదడలాడించే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంతకూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన దారెటో చెప్పనే లేదు. తమిళానాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనాకర్షణ మెండుగా ఉండే సినీతారల మద్దతు కోసం అన్ని పార్టీలూ వెంపర్లాడుతాయి, వెంటపడతాయి. 1996 ఎన్నికల సమయంలో ఈ సినీ మోజు ఆకాశాన్ని అంటింది. తమిళనాడులో అత్యధిక జనాకర్షణ నటుల్లో ఆనాటి ఎంజీ రామచంద్రన్ తరువాత నేటి రజనీకాంత్ అని ఒప్పుకోక తప్పదు. ‘తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడు’ అంటూ డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్‌కు మద్దతుగా 1996లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేశాయి. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఆనాటి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆనాటి నుండి నేటి వరకు ఎన్నికల సమయంలో అటువంటి చురుకైన వ్యాఖ్యానాలు రజనీ చేయలేదు. 2001, 2006, 2011లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రజనీకాంత్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అనేక పార్టీలు ప్రయత్నించాయి. అయితే రజనీకాంత్ తనదైన శైలిలో మౌనం పాటించారు. క్రమేణా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సమదూరం పాటించడం ప్రారంభించారు. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ నేరుగా రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిసినా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నోరు మెదపలేదు. నేడు కూడా మౌనమేనా? ఇదిలా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ వైఖరి ఏమిటనే చర్చ ఆయన అభిమానుల్లో నలుగుతోంది. 20 ఏళ్ల క్రితం డీఎంకే, తమాకా వలెనే నేడు పీఎంకే తరఫున ప్రయత్నాలు సాగిన సఫలం కాలేదు. రజనీకాంత్ ఆదేశాల మేరకు ఆయన అభిమానులు సైతం పార్టీల ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. రజనీ దారెటు అని ఆయన అభిమాన సంఘం నేత ఒకరిని ప్రశ్నించగా, తమ ఓటు హక్కు వినియోగంపై ఆయన ఎలాంటి నిబంధన విధించలేదు, ఇష్టపడిన పార్టీకి ఓటు వేయండి అనే స్వేచ్ఛను ఇచ్చారని తెలిపాడు. తమ అభిమాన నేత రజనీకాంత్ మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రముఖ నటీనటులు ఎందరో మౌనం పాటిస్తున్నారని చెప్పాడు. -
ఉపన్యాసాలకు విజయకాంత్ తగడు
సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ ఎద్దేవా మదురై: వేదికలపై ప్రసంగించేందుకు విజయకాంత్ తగిన వాడు కాదని ఆయన మాటలు అతనికే అర్థం కావని సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఆయన గురువారం మదురై అన్నాడీఎంకే నార్త్ నియోజకవర్గం అభ్యర్థి మాజీ మేయర్ రాజన్ చెల్లప్పకు మద్దతుగా శరత్‌కుమార్ మదురై పుదూర్, సెల్లూర్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. డీఎంకే కోశాధికారికి గణాంకాలు కూడా సరిగ్గా తెలియవన్నారు. కచ్చదీవిని ధారాదత్తం చేసిన ఘనత డీఎంకేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడును అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 234 నియోజకవర్గాలలో ఘన విజయం సాధించడం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. -
జయకు పోటీగా 44 మంది
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉత్కంఠ భరితంగా సాగుతున్న తమిళనాడు ఎన్నికల రణరంగంలో 3800 మంది పోటీకి నిలిచారు. మొత్తం 234 స్థానాల్లో 3800 మంది తలపడుతున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల పర్వంలో గత నెల 22వ తేదీన మొదలైన నామినేషన్ల ఘట్టంలో 234 స్థానాలకు 7156 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 30వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగగా 2975 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 4181 నామినేషన్లు అర్హత పొందాయి. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ అంకం ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు, వారి డమ్మీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అలాగే ప్రధాన పార్టీల్లో సైతం డమ్మీ అభ్యర్థులు అసలు అభ్యర్థులుగా మారిపోయారు. మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఉపసంహరణల అంకంతో బరిలో నిలిచే అభ్యర్థులు ఎందరో తేలిపోయింది. 300 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా మొత్తం 234 స్థానాలకు 3800 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోటీచేస్తున్న ఆర్కేనగర్లో 45 మంది, డీఎంకే అధినేత పోటీపడుతున్న తిరువారూరులో 15 మంది, డీఎండీకే అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి విజయకాంత్ రంగంలో ఉన్న ఉళుందూర్‌పేటలో 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే చెన్నైలోని 16 నియోజకవర్గాల నుంచి 378 మంది తలపడుతున్నారు. -
రాష్ట్రానికి ఢిల్లీ పెద్దలు
సాక్షి, చెన్నై : ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ఓట్ల వేటకు ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీల పర్యటనలు ఖరారు అయ్యాయి. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పర్యటనకు సిద్ధం అయ్యారు. అలాగే, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు రాష్ర్టంలో ప్రచారంలో దూసుకెళుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మరి కొన్ని గంటల్లో ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించబోతున్నారు. వాతావరణం వేడెక్కడంతో ఓటర్ల ప్రసన్నంలో అభ్యర్థులు ఉరకలు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీ అధినాయకులు ప్రచారంలో దూసుకెళుతుంటే, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల ఢిల్లీ పెద్దలు రాష్ర్టం వైపుగా దృష్టి మరల్చి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల ఎనిమిదో తేదీన కన్యాకుమారి ప్రచార బహిరంగ సభతో పాటుగా మదురై, కోయంబత్తూరులలో పర్యటించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఇక, తమ అభ్యర్థులు, డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా కరుణానిధితో కలసి ఒకే వేదిక మీద దర్శనం ఇచ్చేందుకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సిద్ధమయ్యారు. ఈనెల ఐదో తేదీన ఐల్యాండ్ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అదే సమయంలో తాను సైతం అంటూ ప్రచారానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధం అయ్యారు. ఈనెల ఏడో తేదీన చెన్నై, తిరువణ్ణామలై, కోయంబత్తూరులలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు. అలాగే, ఈనెల 13న దక్షిణ తమిళనాడులో పర్యటించేందుకు నిర్ణయించారు. అయితే,ఆయన పర్యటన సాగే ప్రాంతాలను ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. అదే విధంగా రాహుల్, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ఒకే వేదిక మీద నుంచి ఓటర్లకు పిలుపు నిచ్చేందుకు తగ్గ కసరత్తులకు కాంగ్రెస్ వర్గాలు చర్యలు చేపట్టారు. అయితే, ఇది సాధ్యం అయ్యేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇక, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో కేంద్ర మంత్రులు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఆదివారం కరూర్, తిరుచ్చిల్లో ఆయన పర్యటన సాగింది. డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌లను టార్గెట్ చేసి ఆయన ప్రసంగం సాగుతున్నది. అలాగే, మరో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రచార బాటకు శ్రీకారం చుట్టారు. పుదుచ్చేరిలో జరిగిన ప్రచార సభలో అక్కడి కాంగ్రెస్, ఎన్ఆర్ కాంగ్రెస్‌లను టార్గెట్ చేసి తీవ్రంగా విరుచుకు పడ్డారు. రాష్ర్ట నేతలు ఉరకలు, పరుగులు తీస్తున్న సమయంలో, ఢిల్లీ పెద్దలు మోదీ, సోనియా, రాహుల్ సైతం మొహరించేందుకు సిద్ధం కావడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సమరం మరింతగా రాజుకుంది. -
ఎన్నికల పోరు...తారల హోరు
అన్ని పార్టీల్లోనూ కనబడుతోన్న తారల సందడి రాజకీయాలకు తోడవుతోన్న సినీ గ్లామర్ కాంగ్రెస్‌కు మద్దతుగా కుష్బూ, అన్నాడీఎంకే మద్దతుగా శరత్‌కుమార్ ప్రచారం తమిళసినిమా: ఎన్నికలు రాజకీయ నాయకులకు మాత్రమే కాదు సినిమా తారలకూ హడావిడే. ఎందుకంటే ఈ రెండు రంగాలను ఇప్పుడు వేరుగా చూడలేని పరిస్థితి కాబట్టి. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వాన్ని ఏలుతున్న వారు, ఏలాలని ఆశపడుతున్న వారిలో అధిక శాతం చిత్ర పరిశ్రమకు చెందిన వారేనన్నది గమనార్హం. ఇక్కడ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల సమరానికి సరిగ్గా 15 రోజులే ఉంది. ఈ పోరులో గెలుపే లక్ష్యంగా అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, బీజేపీ తలపడుతున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎవరి ఊహలకనుగుణంగా వారు ఇప్పటికే ప్రచారభేరి మోగిస్తున్నారు. వారికి సినీ తారల కళ తోడవుతోంది. వీరు తమ గ్లామర్ అనే ఆయుధంతో ప్రత్యర్థులపై అస్త్రశస్త్రాలు సంధించడానికి సిద్ధం అయ్యారు. ఏ తారలు ఏ పార్టీకి మద్దతు: దాదాపు అన్ని పార్టీలలోనూ తారల సందడి కనిపించడం విశేషం. అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా నటుడు రామరాజన్, ఆనంద్‌రాజ్, సెంథిల్, మనోబాలా, పొన్నంబలం, గుండు కల్యాణం, సింగముత్తు, వైయాపురి, నటి వింధ్య, ఫాతిమాబాబు అంటూ పెద్ద పటాలమే ప్రచార గోదాలోకి దిగింది. వీరంతా 234 శాసనసభ స్థానాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇక సమత్తువ కట్చి నేత శరత్‌కుమార్ కూడా అన్నాడీఎంకే పార్టీ గెలుపునకు తన వంతు ప్రచారం చేస్తున్నారు. ఆయన పోటీ చేస్తున్న తిరుచెందూర్ సెగ్మెంట్లో ఆయన విజయానికి నటి రాధికా శరత్‌కుమార్ ప్రచారం చేస్తున్నారు. నటి కుష్భు ప్రచారం: ఇక కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్న నటి కుష్భు కాంగ్రెస్-డీఎంకే కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఇటీవలే డీఎంకే తీర్థం పుచ్చుకున్న బుల్లితెర, వెండితెర నటుడు ఇమాన్ అన్నాచ్చి ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. నటుడు వాసు విక్రమ్ బోస్ వెంకట్ తదితరులు ఆ పార్టీకి మద్దతుగా గళమెత్తుతున్నారు. ఇక భారతీయ జనతా పార్టీకి మద్దతుగా సంగీత దర్శకుడు గంగైఅమరన్, నటి గాయత్రి రఘురామ్ తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి నడుం బిగించారు. -
మౌనంగా రంగస్వామి!
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి సీఎం రంగస్వామి మౌనం ఎన్ఆర్ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను రేపింది. నామినేషన్‌కు శుక్రవారం ఒక్క రోజే సమయం ఉండడంతో సీటు ఆశిస్తున్న వారు సందిగ్ధంలో పడ్డారు. గురువారం అయినా, జాబితా విడుదల అయ్యేనా అన్న ఎదురు చూపుల్లో పడ్డారు. పుదుచ్చేరి కాంగ్రెస్‌ను చీల్చి ఎన్ఆర్ కాంగ్రెస్‌ను రంగస్వామి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2011 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆవిర్భవించిన ఎన్ఆర్ కాంగ్రెస్ తన సత్తాను చాటుకుంది. అన్నాడీఎంకేతో కలిసి పయనం సాగించి ముప్పై నియోజకర్గాల్ని కల్గిన పుదుచ్చేరిలో అధికార పగ్గాల్ని రంగస్వామి చేపట్టారు. అయితే, తమకు కావాల్సిన మెజారిటీ రావడంతో అన్నాడీఎంకేను పక్కన పడేశారు. ఇప్పుడు అదే ఆయన్ను వెంటాడుతున్నది. అన్నాడీఎంకే హ్యాండివ్వడంతో, బీజేపీతో కలసి పయనం సాగించేందుకు నిర్ణయించి వెనక్కు తగ్గారు. చివరకు ప్రజాసంక్షేమ కూటమి అని ఆలోచించి మనస్సు మార్చుకున్నారు.ప్రస్తుతం ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రంగస్వామికి తప్పలేదు. ఇన్నాళ్లు పొత్తు ప్రయత్నాలకే సమయాన్ని ఎక్కువగా రంగస్వామి వెచ్చించడంతో ప్రచార ఆర్భాటాలు, అభ్యర్థుల ఎంపిక ఎక్కడ వేసిన గంగొళి అక్కడే అన్న చందంగా పడి ఉన్నాయి. ఇక్కడ ఓట్ల వేటలో కాంగ్రెస్-డీఎంకే కూటమి, అన్నాడీఎంకే, ప్రజా సంక్షేమ కూటమి, బీజేపీ కూటమిలు దూసుకెళుతుంటే, ఇంత వరకు అభ్యర్థుల జాబితా వెలువడక పోవడంతో ఎన్ఆర్ కాంగ్రెస్‌లో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుంది. ఇక, గురువారం కూడా జాబితా వెలువడని పక్షంలో రంగస్వామి నిర్ణయం ఏమిటో అన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో ఉత్సాహంగా అందరి కన్నా ముందుగా ఎన్నికల్లో దూసుకెళ్లిన రంగస్వామి , ఈ సారి మౌనంగా ఉండడంతో పుదుచ్చేరి రాాజకీయాల్లో చర్చ బయలు దేరింది. అయితే, రంగస్వామి మౌనం వెనుక కారణాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి పదవుల కోసం తనను ఉక్కిరి బిక్కిరి చేసిన వాళ్లు, మళ్లీ సీటు ఆశిస్తుండడం, మంత్రులు కొందరు మళ్లీ రేసులో దిగేందుకు సిద్ధ పడటం వెరసి రంగస్వామి ఆచీతూచీ అడుగులు వేయడానికి సిద్ధమయ్యార ని చెబుతున్నారు. పలువురు మాజీలకు సీట్లు ఇవ్వకూడదని రంగస్వామి నిర్ణయించి ఉన్నారని, అలాగే,మరి కొందరికి చెక్ పెట్టే విధంగా, సరికొత్త అభ్యర్థులతో రేసులో దిగేందుకు కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారని చెబుతున్నారు. అయితే, మాజీలకు సీట్లు నిరాకరించ బడ్డ పక్షంలో ఎన్నికల వేళ చివరిక్షణంలో ఎన్ఆర్ కాంగ్రెస్‌లో ఎలాంటి ప్రకంపనలు బయలు దేరుతాయో అన్నది వేచి చూడాల్సిందే. -
స్టాలిన్‌కు సొంత కారు లేదట
సాక్షి ప్రతినిధి, చెన్నై : డీఎంకే కోశాధికారి స్టాలిన్ తనకు కనీసం సొంతకారు కూడా లేదని తెలిపారు. చెన్నై జిల్లా కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్టాలిన్ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో ఆస్తుల వివరాలను పొందుపరిచారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.13.23 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన వద్ద రొక్కంగా రూ.50 వేలు, తన భార్య దుర్గ వద్ద రూ.25 వేలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. తనకు చెందినవిగా బంగారు, వెండినగలు లేవని, అయితే తన భార్య దుర్గకు మాత్రం 720 గ్రాముల పాత బంగారు నగలు ఉన్నాయని చెప్పారు. రూ.80.33 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు సొంత కారు కూడా లేదని, భార్య దుర్గకు రూ.31.25 లక్షల ఆస్తి ఉందని తెలిపారు. ప్రజా సేవ చేయడమే తన వృత్తిగా పేర్కొన్న స్టాలిన్, తన భార్య ఒక ప్రయివేటు సంస్థకు మేనేజర్‌గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. -
మద్య నిషేధం
రాష్ట్రంలో అన్ని పార్టీలు సంపూర్ణ మద్య నిషేధం నినాదాన్ని అందుకుని ఉన్నా యి. ఇందులో బీజేపీ కూడా ఒకటి. తమ ఎన్నికల మేనిఫెస్టోలో తొలి పలుకుగా అదే నినాదాన్ని అందుకున్నారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు. తమకు ఒక్క చాన్స్ ఇచ్చి చూడాలని, తమిళనాడును సమగ్రాభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ఈసందర్భంగా నితిన్ గడ్కారి హామీ ఇచ్చారు. సాక్షి, చెన్నై : చిన్న పార్టీలతో కలిసి బీజేపీ ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 150కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల్ని రంగంలోకి దించింది. తమ పార్టీతో పాటుగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా కమలనాథులు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు అవకాశం ఇస్తే, చేసి చూపించే అంశాలతో కూడిన మేనిఫెస్టోను కమలనాథులు సిద్ధం చేశారు. దీనిని టీ నగర్లో జరిగిన కార్యక్రమంలో గురువారం సాయంత్రం కేంద్ర రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కారి విడుదల చేయగా, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ అందుకున్నారు. ముందుగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తన ప్రసంగంలో తమకు అవకాశం ఇస్తే, రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇక, మేనిఫెస్టోను సిద్ధం చేసిన కమిటీని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా అభినందించారు. తదుపరి నితిన్ గడ్కారి తన ప్రసంగంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచే విధంగా ముందుకు సాగుతున్నామన్నారు. తమిళనాడులో బిజేపికి ఒక్కఛాన్స్ ఇచ్చి చూడాలని, బిజేపి పాలిత ప్రాంతాల్లో ఏమేరకు అభివృద్ధి పనులు సాగుతున్నాయో, దానికి రెండింతలుగా నిధుల్ని తమిళనాడులో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీ ధరరావు, సీనియర్ నేత ఇలగణేషన్ పాల్గొన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించిన అంశాలు అనేకం ఉండడం గమనార్హం. మేనిఫెస్టోలో కొన్ని : - అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం - రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ - అన్నదాతలకు పెద్ద పీట, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ - లోకాయుక్త ఏర్పాటు - కొత్త పారిశ్రామిక విధానం - విద్యా, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం - జౌళి పార్కుల ఏర్పాటు, ఇళ్లు లేని నేత కార్మికులకు సొంత గృహాలు, ఉదయ్ పథకం ద్వారా విద్యుత్ సౌకర్యం - రెండేళ్లలో రాష్ర్టంలో మిగులు విద్యుత్ లక్ష్యం - రాష్ట్రంలో క్రీడావర్సిటీ ఏర్పాటుకు, జిల్లాకో క్రీడా కేంద్రం - శాంతి వనంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం, రాజకీయ జోక్యం లేని విధంగా కొత్త విధానాలు - ఆదిద్రావిడ సంక్షేమ శాఖ , అరుంధతీయులకు ప్రత్యేక బోర్డు - సీబీఎస్ఈ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలు. నిర్భంధ తమిళంపై పరిశీలన(మాతృభాషల్లో చదువుకునేందుకు వీలుగా అవకాశం) - తీవ్రవాదాన్ని, అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణగదొక్కడం లక్ష్యంగా కఠిన నిర్ణయాలు. -మహిళా సంక్షేమం లక్ష్యంగా పథకాలు, పేద యువతుల వివాహానికి ఎనిమిది గ్రాముల బంగారు పథకం, ఉపాధి కల్పన దిశగా శిక్షణా కేంద్రాలు. ప్లస్ టూ వరకు చదువుకునే పేద విద్యార్థినులకు నెలకు రూ. ఐదు వేలు ప్రోత్సాహం. విద్యార్థినులకు ప్రత్యేకంగా అన్నిప్రాంతాల్లో హాస్టళ్లు. - జాలర్ల సంక్షేమం లక్ష్యంగా చర్యలు, దాడుల సమస్యకు శాశ్వత పరిష్కారం - నీటివ్యాపారాన్ని అడ్డుకునే విధంగా రోజుకు 20 లీటర్ల నీటి క్యాన్ పంపిణీ - ఆలయాల పరిరక్షణ, మతమార్పిడి అడ్డుకట్ట, ఆలయాల్లో దర్శనాలకు రుసుం రద్దు. ఆక్రమణలో ఉన్న ఆలయాల ఆస్తుల స్వాధీనం - అన్ని రాష్ట్ర రహదారులు ఫోర్ వేలుగా మార్పు - రేషన్‌కు స్మార్ట్ కార్డు, అన్ని రకాల వస్తువులు ఎల్లప్పుడు లభించే విధంగా చర్యలు - జిల్లాకు ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులు. ఉచిత వైద్యం. - ప్రభుత్వ గుప్పెట్లోకి ఇసుక విక్రయాలు, ధాతు ఇసుక, గ్రానైట్ క్వారీలు కూడా. -2017 సంక్రాంతి పర్వదినంలో మళ్లీ జల్లికట్టు -
ఆమెకు అనారోగ్యం, ఆయనకు వృద్ధాప్యం!
తమిళనాడు రాజకీయాలు చాలా విలక్షణమైనవి. తమిళ పరిపాలన పీఠంపై సినిమా ప్రభావం ఎప్పుడు విస్పష్టంగా ఉంటుంది. ప్రస్తుతం సీఎం అభ్యర్థులుగా బరిలో నిలిచిన ముగ్గురు ప్రధాన పార్టీల నేతలకూ సినీ నేపథ్యముంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన అన్నాడీఎంకే, డీఎంకే ముఖ్యమంత్రులే గత 50 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్నారు. అయితే ఈసారి మాత్రం ఈ రెండు పార్టీల ఆధిపత్యాన్ని, సినీ ఛరిష్మాను అధిగమిస్తానంటున్నారు పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) సీఎం అభ్యర్థి అన్బుమణి రాందాస్. పార్టీ పరంగా కొన్ని బలహీనతలు ఉన్నా అన్నాడీఎంకే, డీఎంకే కంచుకోటలను బద్దలు కొడతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వృతిరీత్య వైద్యుడు, టెక్ శావీ అయిన అన్బుమణి ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కులవాద పార్టీ ముద్రపడిన పీఎంకేను ప్రజలందరికీ చేరువ చేస్తానని, మంచి పరిపాలన కోసం యువతకు తాను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఎం అభ్యర్థులుగా బరిలోకి దిగిన జయలలిత, కరుణానిధి, విజయ్‌కాంత్ గురించి ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 'సీఎం అభ్యర్థులుగా బరిలో ఉన్న ఆ ముగ్గురిని నేను గౌరవిస్తాను. కానీ, వారు తమ దైనందిన కార్యకలాపాలు తాము సొంతంగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో సీఎం తన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేదు. (ఆరోగ్య కారణాలతో జయలలిత ఇంటికే పరిమితమయ్యారు). 93 ఏళ్ల నాయకుడు (కరుణానిధి) కూడా బరిలోకి దిగారు. ఆయన రిటైరైతే మంచిదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మూడో వ్యక్తి (విజయ్‌కాంత్)కి పొందిక లేదు. ఆయన ప్రజలు చెప్పేది వినడు. ప్రజలకు ఆయన చెప్పేది అర్థం కాదు. ఈ నేపథ్యంలో వృత్తిరీత్య డాక్టర్ అయినా నా పట్ల ప్రజలకు విశ్వాసముంది. కేంద్రమంత్రిగా నా సత్తాను చాటాను. రాష్ట్రంలోని 2.5 కోట్ల యువ ఓటర్లకు నేను ఉత్తమ ప్రత్యామ్నాయాన్ని. వారి ఆకాంక్షలు నిలబెట్టేవిధంగా పరిపాలిస్తాను. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రజల మన్నన పొందుతాను' అని అన్బుమణి ధీమా వ్యక్తం చేశారు. -
ప్రత్యామ్నాయం మేమే..
‘ఆడ లేక మగ’ అన్న చందంగా తమిళనాడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది డీఎంకే లేదా అన్నాడీఎంకే అనేది ఐదు దశాబ్దాలుగా అలవాటుగా మారిపోయింది. పాలిటిక్స్ తెలియని పిల్లోడిని అడిగినా జయలలిత లేదా కరుణానిధి సీఎం అని ఇట్టే చెబుతారు. ఉదయించే సూర్యునికి ఇక శాశ్వత గ్రహణమే, రెండాకులు ఇక శాశ్వతంగా చిరిగిపోయినట్లే అంటున్నారు పాట్టాలిమక్కల్ కట్చి(పీఎంకే) యువజన విభాగ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్. రాజకీయాల్లో పదవుల కోసం ఆరాటపడే ఈరోజుల్లో వెత్తుక్కుంటూ వచ్చిన అవకాశాలను సైతం కాదన్న డాక్టర్ రాందాస్ తనయుడే ఈ అన్బుమణి. ఆ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారు, ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు, మార్పును కోరుతున్నారు. ఇదిగో మేమున్నామని ముందుకొచ్చింది పీఎంకే. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానని పార్టీ యువజన విభాగం అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ అంటున్నారు. ఈ సందర్భంగా సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. - సాక్షి ప్రతినిధి, చెన్నై * హామీలు కాదు, విశ్లేషణలతో ప్రజలను ఒప్పించా * లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టుకున్న డీఎంకే, అన్నాడీఎంకేలు నిషేధం విధిస్తాయా? * రైతు సంక్షేమంలో వైఎస్ఆర్ పాలనే నాకు ఆదర్శం * పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ రాందాస్ సాక్షి: రాజకీయాల్లో కాకలు తీరిన కరుణానిధే పొత్తుల కోసం వెంపర్లాడిన తరుణంలో మీ పార్టీ ఒంటరిపోరుకు సిద్ధం కావడంలోని మీ ధైర్యం? అన్బుమణి: ఈ ప్రశ్నకు కొంచెం పెద్ద జవాబే చెప్పాల్సి ఉంటుంది. అన్నిపార్టీలు ఎన్నికలు సమీపించిన తరువాత ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. నేను ఏడాది క్రితమే క్యాంపెయిన్ ప్రారంభించా. సీఎం అభ్యర్థిగానే ప్రజల్లోకి వెళ్లాను. దాదాపుగా రాష్ట్రమంతా చుట్టేశాను. 22 జిల్లాల్లో లిక్కర్ వ్యతిరేక ప్రచారాలు చేసినపుడు మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతు పలకడమేకాదు పీఎంకేలో చేరిపోయారు. ఏడు రోజులు, ఏడు సిటీలు, ఏడు సమస్యలు అంటూ సరికొత్త విధానంతో ప్రజలవద్దకు వెళ్లాను. ఒక్కో సిటీలో నాలుగు గంటలపాటు ప్రజలతో పరస్పర సంభాషణ సాగిం చాను. ఈ సుదీర్ఘ ప్రయాణం వల్ల ప్రజలు మార్పు కోరుతున్నట్లు స్పష్టమైంది. డీఎంకే లేదా అన్నాడీఎంకేలు యాభై ఏళ్లుగా సాగించిన పాలనతో ప్రజలు విసిగిపోయినట్లు స్పష్టంగా గోచరించింది. ప్రజలు మార్పుకోరుకున్నపుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో డిల్లీలో కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాలే ఉదాహరణ. సాక్షి: పార్టీకి మరింత బలం చేకూరేలా పొత్తులకోసం ఎందుకు ప్రయత్నించలేదు.? అన్బుమణి: ఆ తప్పు జీవితంలో చేయం. రెండుసార్లు ఆ తప్పుచేశాం...ప్రజలకు క్షమాపణ చెప్పాల్సివచ్చింది. ఒకసారి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ, మరోసారి భారతీయ జనతాపార్టీ నాయకత్వంలో ఎన్డీఏతో పొత్తుపెట్టుకుని జీవితంలో పెద్ద పొరపాటు చేశాము. చేసిన తప్పుకు ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాము. కేడర్ ఒత్తిడి మేరకు అలాంటి నిర్ణయం తీసుకవాల్సి వచ్చింది. ఆ తప్పు చేయకుంటే ఈరోజు రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉండేది. సాక్షి: అన్నాడీఎంకే, డీఎంకేల కంటే మెరుగైన పాలనను మీరు ఇస్తారని ఓటర్లను ఎలా నమ్మిస్తారు ? అన్బుమణి: ఆదర్శమైన పాలనకు ఆరు సూత్రాలు. ఆదర్శవంతమైన పాలనకు అరుసూత్రాలు సిద్ధం చేసుకుని వాటిని ఎలా అమలు చేయగలుతామో ప్రజలకు వివరించాను. లిక్కర్ , అవినీతి నిర్మూలన, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక విధానంలో సమూలమైన మార్పులు ...ఈ ఆరు సూత్రాలతో ఆదర్శమైన పాలన అందిస్తాము. కేవలం చెప్పడం కాదు, ఎలా సాధించగలుగుతామో ప్రజలకు సశాస్త్రీయంగా వివరించాను. ప్రభుత్వ లావాదేవీలన్నీ కంప్యూటీకరణ చేస్తాం. పేపర్ అనేది లేకుండా ఈ గవర్నర్సెను ప్రవేశపెడతాం. ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉంటా. ఫోన్ ద్వారా ప్రజలు సీఎం సెల్‌కు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే తగిన చర్య ఉంటుంది. ప్రతిపక్ష నేతలతో సత్సంబంధాలు నెరుపుతూ స్వయంగా కలుస్తాను. కేబినెట్ సమావేశాలను సచివాలయంలోగాక జిల్లాల్లో నిర్వహిస్తాను. నాతోపాటూ మంత్రులంతా పాల్గొని ఆయా జిల్లాల సమస్యను చర్చించి వెంటనే నిర్ణయం తీసుకుంటాం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జిల్లాల్లో కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళతా. సాక్షి: అనేక ఆకర్షణీయమైన పథకాలు, ఉచిత వస్తువులకు అలవాటుపడిన ఓటర్లు మీసుపరిపాలనను అర్థం చేసుకుంటారా? అన్బుమణి: ఉచితాల ప్రసక్తేలేదు. దానికోసం వెచ్చించే నిధులను మరో శాశ్వత అభివృద్ధికి వినియోగిస్తాం. మిక్సీలు, గ్రైండర్లు ఉచితంగా ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలకు దూరంగా ఉంటాము. ఆ నిధులను మరో మంచి కార్యక్రమాలకు వినియోగిస్తాం. సాక్షి: ఇరుగు పొరుగు జిల్లాలతో సాగునీటి సమస్యల వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు. ? అన్బుమణి: సాటి ప్రభుత్వాలపై సవాల్ చేసే ధోరణి సరికాదు. సామరస్యంగా మాట్లాడితే సులువుగా అంగీకరిస్తారు. వ్యవసాయానికి సాగునీరు ఎంతో ఆధారం, ఈ విషయంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలను స్వయంగా వెళ్లి సామరస్య ధోరణిలో వివాదాలు పరిష్కరిస్తాను. నాకు ఈగో లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేనే పొరుగురాష్ట్రాల సీఎంల వద్దకు వెళతాను. పరిష్కారం కోసం ఎవరి వద్దకైనా వెళ్లేందుకు నేను సిద్ధం. అంతే గాక నదులు, చెరువులు తదితర నీటి పరివాహక ప్రాంతాల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున చెక్‌డ్యాంలను నిర్మించడం ద్వారా నీటి వనరులను కాపాడుకుంటాము. సాక్షి: అనేక అవస్థలు పడుతున్న అన్నదాతలు అన్బుమణి నుండి ఏమేరకు ఆశించవచ్చు.? అన్బుమణి: వైఎస్ఆర్ పాలనే ఆదర్శం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు ఆదర్శం. రైతు సంక్షేమం కోసం ఆయన రాజకీయజీవితాన్నే అంకితం చేశారు. మాది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం. రైతుల కష్టనష్టాలపై పూర్తిగా అవగాహన ఉంది. రాష్ట్ర జనాభాలో 60 శాతం రైతన్నలే. అన్బుమణి అధికారంలోకి వస్తే తమకు మేలు జరగడం ఖాయమని వారు నమ్ముతున్నారు. వ్యవసాయం, హార్టికల్చర్, వాటర్ మేనేజిమెంట్ ఇలా వ్యవసాయాన్ని మూడుగా విభజించి ముగ్గురు మంత్రులను నియమిస్తాం. వైఎస్ఆర్ తన హయాంలో ఏపీ వార్షిక బడ్జెట్లో వైఎస్ఆర్ వ్యవసాయానికి రూ.18వేల కోట్లు కేటాయించారు. 35 హెక్టార్ల సాగుభూమిని 75 లక్షల హెక్టార్లకు పెంచగలిగారు. ఇదే పద్ధతిని నా పాలనలో అనుసరిస్తాను. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 48 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని కోటి హెక్టార్లకు పెంచడం నా లక్ష్యం. ఇందులో నీటి ఆధారిత 33 లక్షల హెక్టార్లను 60 లక్షల హెక్టార్లకు పెంచుతాను. రూ.55వేల కోట్లు వ్యవసాయ బడ్జెట్ నిర్ణయం. సాక్షి: వ్యవసాయం సరే గిట్టుబాటు దర మాటేమిటి ? అన్బుమణి: అందరికీ అన్నంపెట్టే రైతులు తాము పండించిన ధాన్యానికి తాము ధర నిర్ణయించుకోలేని పరిస్థితి నిజంగా దుర్భరమే. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు వ్యవసాయ దిగుబడుల ధరను రైతులు, నిపుణులే నిర్ణయిస్తారు. ప్రభుత్వం కేవలం మానిటరింగ్ చేస్తుంది. 30 జిల్లాల్లో స్పెషల్ ఆగ్రో ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేస్తాను. అలాగే ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తాం. సాక్షి: మీ ప్రణాళికను వింటూ ఉంటే మాకు నమ్మశక్యంగానే ఉంది. మరి ఓటర్ల మాటేమిటి ? అన్బుమణి: రాష్ట్రంలో 5.70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 60 శాతం మంది తటస్థ ఓటర్లు. అంటే పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించేవారు. 35 ఏళ్లకు అటు ఇటుగా ఉండే యువత 2.5 లక్షల వరకు ఉన్నారు. వీరంతా నా ఆలోచనను విశ్వసిస్తున్నారు. గడచిన పార్లమెంటు ఎన్నికల్లో ధర్మగిరిలో ఎంపీగా గెలిచానంటే సీనియర్ సిటిజన్లు, తటస్థ ఓటర్లే ప్రధాన కారణం. అలాగే మహిళలు మద్య నిషేధం కోరుతున్నారు. సాక్షి: కులపరమైన ముద్రను అధగమించారా? అన్బుమణి: వన్నియర్ల సమస్యలపై పోరాడాం. అంతమాత్రానా మాది కులపరమైన పార్టీ కాదు. మా పార్టీలో అన్ని కులాలు, మతాలవారు ఉన్నారు. సాక్షి: రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో మీరు ఎన్నిగెలుస్తారని ధీమాతో ఉన్నారు.? అన్బుమణి: 150 సీట్లు గ్యారంటీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా స్పష్టమైన మెజార్టీ సాధిస్తాం. సాక్షి: మీకు అంతటి నమ్మకం ఎలా వచ్చింది. ? అన్బుమణి: 1989లో పార్టీని ప్రారంభించి ఈ 26 ఏళ్ల కాలంలో ఏటా షాడో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాం. అంటే మా పార్టీ అధికారంలో ఉంటే బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయి, దేనికి ఎంత ప్రధాన్యత అనేది ప్రజలకు చెబుతూనే ఉన్నాము. నిర్మాణాత్మకమైన రాజకీయాలను నడుపుతున్నాము. అందుకనే పార్టీ పెట్టిన కొత్తల్లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాము. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ హత్యోదంతం హవాలోనూ ఒక ఎమ్మెల్యేను గెలిపించుకున్నాము. 1996లో నలుగురు ఎమ్మెల్యేలు గెలవగా 8.5 శాతం ఓట్లు సాధించాం. మధ్యలో యూపీఏ, ఎన్డీఏలతో పొత్తులకు పోకుండా అదే పోకడను కొనసాగించి ఉంటే ఈపాటికి అధికారంలోకి వచ్చేవారం. సాక్షి: తమిళనాడులో సంఖ్యాపరంగా ద్వితీయ పౌరులైన తెలుగువారు ఎదుర్కొంటున్న భాషాపరమైన సమస్యపై మీ సమాధానం ఏమిటి? అన్బుమణి: తమిళనాడు ప్రజల్లో తెలుగువారు కూడా ఒక భాగమే. రాష్ర్టంలో తమిళ జనాభా తరువాత తెలుగువారే అధికం, రాష్ట్రాలుగా విడిపోయాముగానీ ఒకప్పుడు అందరం ఒకటే కదా. తమిళనాడు నుండి ఏపీ, తెలంగాణ గా విడిపోయినా ఇక్కడ స్థిరపడిపోయిన తెలుగువారికి సమగౌరవం ఇవ్వడం మా విధి. మా ప్రభుత్వం వస్తే ఈ విషయాన్ని స్పష్టంగా పాటిస్తాం. నిర్బంధ తమిళం వంటి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తాం. సాక్షి: రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అనేది ఈ ఎన్నికల్లో ఒక ప్రధాన నినాదంగా మారిపోయింది. అన్నిపార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో సైతం చోటు చేసుకునే అవకాశం ఉంది. మీ పార్టీ స్టాండ్ ఏమిటి ? అన్బుమణి: రాష్ట్రంలో అనాది నుంచి అంటే గత మూడు దశాబ్దాలుగా మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నది మా పార్టీ మాత్రమే. అంతేకాదు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నాం. ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై ఉండే 600 టాస్మాక్ దుకాణాలను తమ ఉద్యమాలతో ఇటీవల మూయించాం. ఒక్క లిక్కర్ మాత్రమే కాదు సిగరెట్ సైతం అనారోగ్యమని భావించేవారం. అందుకే గతంలో కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రిగా పొగత్రాగడం (సిగరెట్) ఎంతటి చేటో తెలియజెపుతూ మంచి ఫలితాలను రాబట్టాను. కేంద్రమంత్రిగా మంచి చేశాడు, సీఎం అయితే కూడా అలానే చేస్తాడు, సంపూర్ణ మద్య నిషేధం సాధిస్తాడని ప్రజలు విశ్వసిస్తున్నారు. సాక్షి: మరి ఇదే వాగ్దానాన్ని జయలలిత, కరుణానిధి కూడా ఇచ్చారు కదా ? అన్బుమణి: సంపూర్ణ మద్య నిషేధం విషయంలో జయలలిత, కరుణ ఇద్దరూ సమానులే. అధికారంలో ఉన్నపుడు మద్యాన్ని ఏరులై పారించి నేడు మోసపూరిత మాటలు వల్లిస్తున్నారు. మద్య నిషేధం అమలు సాధ్యం కాదని గతంలో అసెంబ్లీలో ప్రకటించిన జయలలిత నేడు ఎన్నికల వేళ హామీ ఇవ్వడం ప్రజలను చీట్ చేయడమే అవుతుంది. జయలలితలో ఆ ఉద్దేశమే ఉండి ఉంటే ఐదేళ్ల క్రితం ఆమె అధికారంలోకి వచ్చినపుడే చేసి ఉండవచ్చు. అలాగే కరుణానిధి సైతం గత 20 ఏళ్ల కాలంలో మద్య నిషేధంపై ఆరుసార్లు ప్రకటించారు. నేడు ఏడోవాగ్దానంతో ఎన్నికలకు దిగుతున్నాడు. రాష్ట్రంలో 12 లిక్కర్ ఫ్యాక్టరీలు ఉండగా వాటిల్లో 6 డీఎంకే వారివి, 3 అన్నాడీఎంకే, 2 కాంగ్రెస్ వారివి. వీరా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం సాధించేది. సాక్షి: పీఎంకే వ్యవస్థాపకులైన డాక్టర్ రాందాస్ రాజకీయాల్లో ఉన్నా ఎన్నికల్లో పోటీచేయక పోవడానికి కారణం ఏమిటి ? అన్బుమణి: పదవులకు నాన్న దూరం 40 ఏళ్లక్రితం క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పార్లమెంటు, అసెంబ్లీలోకి అడుగుపెట్టనని నిర్ణయించుకున్నారు. నైతిక విలువలు, సిద్ధాంతపరమైన రాజకీయాలు ఆయనకు ఇష్టం. అందుకే ఇంతవరకు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వాజ్‌పేయి,రాజీవ్‌గాంధీ స్వయంగా ఆహ్వానించినా సున్నితంగా నిరాకరించారు. సాక్షి: ఆల్‌ది బెస్ట్ సార్. అన్బుమణి: ధ్యాంక్స్. -
ఆ పన్నెండు మంది ఎవరు..?
- నీలగిరుల్లో పోస్టర్లు - రైల్వే ట్రాక్ పై పేలుడు అటవీ గ్రామాల్లో ఎన్నికల్ని బహిష్కరిద్దామన్న నినాదాలతో పోస్టర్లు వెలిసి ఉండడం పోలీసు యంత్రాంగానికి షాక్ ఇచ్చేలా చేసింది. పన్నెండు మంది తుపాకులతో తమ ప్రాంతాల్లో పర్యటిస్తూ, ఎన్నికల్ని బహిష్కరించాలని ఒత్తిడి తెస్తున్నట్టుగా నీలగిరుల్లోని పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో అప్రమత్తం అయ్యారు. ఆ పన్నెండు మంది ఎవరు అన్న ప్రశ్న బయలు దేరిన సమయంలో ధర్మపురి సమీపంలో రైల్వేట్రాక్‌పై బాంబు పేలుడు జరగడం ఉత్కంఠను రేపుతోంది. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఇటీవల కాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నట్టున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా తమిళనాడు - కేరళ సరిహద్దుల్లో ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో వీరి కదలికల మీద సమాచారాలు పెరుగుతున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక సంయుక్తంగా కూంబింగ్ సాగిస్తున్నా, జాడ మాత్రం కాన రాలేదు. అయితే, ఇటీవల నీలగిరుల్లోని దట్టమైన అడవుల్లో కాల్పులు సైతం జరగడం, గాయపడ్డ వాళ్లు ఏమయ్యారో అన్న ఆచూకీ ఇంత వరకు చిక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు చాప కింద నీరులా వ్యూహ రచనలు చేసి ఒక్కసారిగా తమ ఉనికి చాటుకునేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రస్తుతం కొన్ని సంఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసు యంత్రాంగం షాక్‌కు గురి కాక తప్పలేదు. ఓ వైపు కూంబింగ్ సాగుతున్నా, మరో వైపు మావోయిస్టులు తరచూ కొన్ని గ్రామాల్లో ప్రత్యక్షం అవుతున్నట్టు సమాచారాలు వస్తుండడంతో క్యూబ్రాంచ్ వర్గాలు డైలమాలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో గత రెండు మూడు రోజులుగా నీలగిరి జిల్లాల్లోని అటవీ గ్రామాల్లో పన్నెండు మంది తుపాకులతో సంచరిస్తున్నట్టుగా వచ్చిన సంకేతాలతో మరింత అప్రమత్తం అయ్యారు. పోస్టర్లు సరే.. వాళ్లెక్కడ నీలగిరుల్లో అటవీ గ్రామాల సంఖ్య ఎక్కువే. కేరళ- తమిళనాడును అనుకుని ఉండే గ్రామాల్లో అయితే, ఎవర్నీ గుర్తు పెట్టడం కూడా వీలు పడదు. అలాంటి వాతావరణం, పరిస్థితులు అక్కడ ఉంటాయి. కొన్ని చోట్లకు ఈవీఎంలు తరలించాలంటే మరీ కష్టమే. ఇలాంటి ప్రాంతాల్లోని ప్రజల్ని ఎన్నికల బహిష్కరణ పిలుపుతో, వారి హక్కుల్ని గుర్తు చేస్తూ, పన్నెండు మందితో కూడిన బృందం సంచరిస్తున్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ పన్నెండు మంది తుపాకులతో గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల్ని బహిష్కరిద్దామని, మన భూమి, మన అడవులు, మన జీవనం అన్న బోధనల్ని వల్లిస్తూ వస్తున్నట్టు సమాచారం. శనివారం రాత్రి ఈ బృందం కోల కొంబై గ్రామాల్లో సంచరించడమే కాకుండా, అక్కడడక్కడ కరపత్రాలు వదలి వెళ్లడం, కొన్ని చోట్ల ఏకంగా పోస్టర్లను అంటించి ఉంది. కోల కొంబైలో మావోయిస్టులు ఉన్న సమాచారంతో కూంబింగ్‌లో ఉన్న క్యూబ్రాంచ్ వర్గాలు అక్కడికి ఉరకలు తీశారు. అయితే, అప్పటికే ఆ పన్నెండు మంది పత్తా లేకుండా పోగా, పోస్టర్లు కరపత్రాలను మాత్రం వదలి వెళ్లడంతో వాళ్లెక్కడ అన్న అన్వేషణను క్యూబ్రాంచ్ తీవ్రతరం చేసింది. సీపీఐ మావోయిస్టు అంటూ ప్రచురించిన ఆ పోస్టర్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఇక, ఒకప్పుడు ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో మావోయిస్టుల సంచారం అధికంగా ఉన్న విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పేలుడు ఆదివారం ధర్మపురి సమీపంలోని మరప్పూర్ రైల్వే స్టేషన్‌కు మూడు కి.మీ దూరంలో రైల్వేట్రాక్‌పై పేలుడు శబ్దం రావడంతో ఆ జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ధర్మపురి జిల్లా ఎస్పీ లోకనాథన్ నేతృత్వంలోని బృందం అక్కడికి పరుగులు తీసింది.రైల్వేట్రాక్ వద్ద కండెన్సర్లు, విద్యుత్ మోటార్‌కు ఉపయోగించే పరికరాలు, వైర్లు లభించడంతో, ఒకప్పుడు మావోయిస్టులు పేలుళ్లకు ఇలాంటి వాటినే ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా, గతంలో అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టులు మళ్లీ చొరబడ్డారా..? అన్న ప్రశ్న బయలు దేరింది. రైలుబోల్తా కుట్ర లక్ష్యంగా వీటిని అమర్చి ఉండొచ్చన్న అనుమానంతో దర్యాప్తును వేగవంతం చేసి ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల నినాదం తెర మీదకు వస్తుండడంతో అటవీ గ్రామాల్లో ఎన్నికల భద్రత కట్టుదిట్టపై దృష్టి పెట్టేందుకు ఈసీ సమాయత్తం అవుతోంది. -
ఇక అమ్మ దర్శనం దక్కినట్టేనా
-15 సీట్లకు వాసన్ అంగీకారం - ఒకటి, రెండు రోజుల్లో పోయెస్ గార్డెన్‌కు చెన్నై తమిళ మానిల కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం తాండ వం చేస్తున్నది. అమ్మ దర్శన భాగ్యం తమ అధినేతకు ఒకటి, రెండు రోజుల్లో దక్కనున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నా యి. తమకు పదిహేను సీట్లను సర్దుబాటు చేయడంతో, అందు కు తమ అధినేత అంగీకరించినట్టు చెబుతున్నారు. తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) గురించిన చర్చే ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతోంది. ఆ యా పార్టీలు పొత్తులు కుదుర్చుకుని సీట్ల పందేరాలు సాగించే పనిలో పడ్డాయి. అయితే, తన తండ్రి దివంగత నేత మూపనార్ చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన టీఎంసీ నేత జీకే వాసన్ నిర్ణయాన్ని నిర్భయంగా తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని చెప్పవచ్చు. వెనుకడుగు వేస్తున్నారా? లేదా, చివరి వరకు వేచి చూసి అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుందామా? అన్న యోచనతో ఆయన ముందుకు సాగుతున్నారన్నది ఆ పార్టీ వర్గాల వాదన. అన్నాడీఎంకేతో కలసి అడుగులు వేయాలన్నదే వాసన్‌కు తొలినాటి నుంచి ఉన్న అభిప్రాయం. అయితే, అక్కడి తలుపులు తెరుచుకున్నా, సీట్ల పందేరం చిక్కుల్ని సృష్టించడంతో డైలమాలో పడ్డారు. అదే సమయంలో అమ్మ తలుపులు ఇక మూసుకున్నట్టేనన్న భావనతో తదుపరి డీఎంకే వైపు, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి వైపుగా ఆయన దృష్టి సాగిందని చెప్పవచ్చు. అయితే, వాసన్ తీరుకు డీఎంకే గట్టి సమాధానమే ఇచ్చింది. తమ కూటమిలో చోటు లేదని తేల్చింది. ఇక పదే పదే ఆహ్వానం పలికిన ప్రజా కూటమి తాజాగా మౌనం అనుసరించడం మొదలెట్టడంతో వాసన్ పరిస్థితి ఏమిటో అన్న చర్చ బయలు దేరింది. ఎన్నికల గుర్తుగా తమ నేత వాసన్‌కు కొబ్బరితోట చిక్కినా, ఎన్నికల పొత్తు ఖరారు కాకపోవడంతో మల్లగుల్లాలు పడుతూ వచ్చిన టీఎంసీ వర్గాలు, ప్రస్తుతం ఆనంద తాండవం చేస్తున్నాయి. ఇందుకు కారణం మళ్లీ అన్నాడీఎంకే తలుపులు తెరుచుకుని ఉండడమేనటా. టీఎంసీకి పదిహేను సీట్లు సర్దుబాటు చేయడానికి అన్నాడీఎంకే సిద్ధపడ్డట్టుగా వచ్చిన సంకేతాలతో ఇక, పోయేస్ గార్డెన్ మెట్లు ఎక్కినట్టే అన్న ఆనందాన్ని ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు సీట్ల సర్దుబాటుకు అన్నాడీఎంకే నిర్ణయించడంతో ఆ పదిహేనుకు అంగీకారం తెలిపిన జీకే వాసన్, ఇక అమ్మ దర్శనం కోసం ఎదురు చూపుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో అమ్మ దర్శనం ఖాయం అని, అన్నాడీఎంకేతో కలసి ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నామని పేర్కొంటున్నారు. అయితే, అన్నాడీఎంకేలో ఏ చిహ్నం మీద వాసన్ పోటీ చేయాల్సి ఉంటుందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొబ్బరి తోటకు అమ్మ అనుమతి ఇస్తారా, అన్నది వేచి చూడాల్సిందే. ఇందుకు నిదర్శనం ఇప్పటి వరకు అమ్మ గొడుగు నీడన చేరిన వారందరూ అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంతో బరిలోకి దిగేందుకు సిద్ధపడ డమే. 2001లో అన్నాడీఎంకేతో కలసి టీఎంసీ ఎన్నికల పయనం సాగించిన విషయం తెలిసిందే. అమ్మ దర్శనం కోసం : ఓ వైపు వాసన్ అమ్మ దర్శనం కోసం సిద్ధం అవుతోంటే, మరో వైపు అమ్మకు మద్దతు అంటూ పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కేందుకు మరెన్నో చిన్నా చితక పార్టీలు, సామాజిక వర్గాలు, ప్రజా సంఘాలు పరుగులు తీస్తున్నాయి. తమ మద్దతు అమ్మకే అంటూ లేఖల్ని పోయెస్ గార్డెన్‌కు పంపించే పనిలో పడ్డాయి. అక్కడి నుంచి పిలుపు వచ్చిన తరువాయి, అమ్మను దర్శించుకునేందుకు ఆయా నేతలు చెన్నైలో తిష్ట వేసి ఉండడం గమనార్హం. ఇక, ఆదివారం సినీ నటుడు, ముక్కళత్తూరు పులి పడై అధ్యక్షుడు కరుణాస్ అమ్మ జయలలితను కలిశారు. తమ మద్దతును ప్రకటించారు. అన్నాడీఎంకే తరఫున 234 స్థానాల్లోనూ తాను ప్రచారం చేయబోతున్నట్టుగా కరుణాస్ పేర్కొన్నారు. ఇక, గత ఎన్నికల్లో ఒక్క సీటుతో సర్దుకున్న ఇండియ కుడియరసు కట్చి నేత, ఎమ్మెల్యే సేకు తమిళరసన్ ఈ సారి అమ్మ ముందు మరిన్ని సీట్ల డిమాండ్‌ను ఉంచారు. -
జోష్
మనసు మార్చుకున్న శరత్‌కుమార్ ఎదురు చూపుల్లో వాసన్ ఫిర్యాదులతో సతమతం రెబల్స్‌కు గ్యారంటీ 20 మందికి ఒక ఇన్చార్జ్ అన్నాడీఎంకే కొత్త వ్యూహం ఇంటర్వ్యూల రూపంలో తమకు అమ్మ దర్శనం లభిస్తుండడంతో అన్నాడీఎంకే వర్గాలు ఆనంద తాండవం చేస్తున్నారు. ఓ వైపు ఆశావహుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ, మరో వైపు వివిధ పార్టీల సంఘాల నాయకులతో మంతనాల్లో సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బిజీబిజీగా ఉన్నారు. ఇక, అటూ...ఇటూ అని చివరకు అమ్మ చెంతకే చేరాల్సిన పరిస్థితి శరత్‌కుమార్‌కు ఏర్పడింది. అమ్మ కరుణతో ఆయన ముఖంలో ఆనందం వెల్లి విరిసింది. చెన్నై: మళ్లీ అధికారం లక్ష్యంగా అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత వ్యూహ రచనల్లో మునిగి ఉన్నారు. చిన్న పార్టీల్ని తప్పా, పెద్ద పార్టీల్ని దగ్గరకు రానివ్వకుండా నాలుగైదు రోజులుగా రోజూ వారి బిజీ షెడ్యూల్‌తో ఆమె ముందుకు సాగుతున్నారు.అభ్యర్థుల ఎంపిక భారాన్ని తన భుజాన వేసుకుని ఇంటర్వ్యూల్ని సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా తమకు ఇంటర్వ్యూల రూపంలో అమ్మ దర్శనం అవుతుండడంతో పార్టీ వర్గాలు ఆనంద తాండవం చేస్తున్నారు. తమకు సీటు రాకున్నా పర్వాలేదని, అమ్మను నేరుగా కలుసుకునే అవకాశం దక్కడం ఆనందంగా ఉందంటూ పలువురు కొత్త ముఖాలతో కూడిన ఆశావహులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆశావహులు, వారి మద్దతు దారులు తరలి వస్తుండటంతోపాటు, పలు రాజకీయ పక్షాల నాయకులు మద్దతు నిమిత్తం పడగలెత్తుతుండడంతో పోయెస్‌గార్డెన్ పరిసరాలు ఎన్నికల వాతావరణంలో మునిగి ఉన్నాయి. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల నుంచి వస్తున్న ఆశావహుల మీద ఫిర్యాదులు సైతం బయలు దేరడం గమనార్హం. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురంల నుంచి ఇంటర్వ్యూకు వచ్చి వెళ్లిన వాళ్లలో పలాన వ్యక్తికి అంటే, పలాన వ్యక్తికి సీటు ఇవ్వొద్దంటూ ఫిర్యాదులు రాష్ట్ర కార్యాలయానికి వచ్చి చేరుతున్నాయి. ఇది కాస్త కొత్త భారాన్ని , సమస్యను సృష్టిస్తున్నదంటూ అన్నాడీఎంకే కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, డీఎండీకేలో ఉంటూ రెబల్స్ అవతారం ఎత్తి చివరకు పదవుల్ని వదులుకున్న మాజీ ఎమ్మెల్యేకు అమ్మ సీట్లు ఖరారు చేసినట్టుగా సంకేతాలు రావడం విశేషం. అదే సమయంలో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ శాతం మందిపై అమ్మ కన్నెర్ర చేసినట్టు సమాచారం. మనసు మార్చుకున్న శరత్: గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ పయనం సాగించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అయితే, సినీ నటుల సంఘం ఎన్నికల తదుపరి అన్నాడీఎంకేకు దూరంగా ఆయన వ్యవహరించిన విషయం విధితమే. అన్నాడీఎంకే నుంచి బయటకు వస్తున్నామని ప్రకటించి, చివరకు పార్టీని రెండుగా చీల్చుకోవాల్సిన పరిస్థితుల్ని శరత్‌కుమార్ చవి చూశారు. బీజేపీతో జత కట్టేందుకు ప్రయత్నించి, చివరకు మనస్సు మార్చుకున్న శరత్‌కుమార్‌కు అమ్మే దిక్కు అయ్యారు. అన్నాడీఎంకే నుంచి పిలుపు వచ్చిందో, లేదా, అమ్మకు వేడుకోలు పంపించారో ఏమోగానీ, పోయెస్ గార్డెన్లో బుధవారం ప్రత్యక్షం అయ్యారు. జయలలితతో భేటీ అనంతరం ఎన్నికల్లో అన్నాడీఎంకేకు తన మద్దతును ప్రకటించారు. కొన్ని కారణాలతో ఇది వరకు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, అమ్మ దర్శనంతో అన్ని తొలగినట్టు పేర్కొన్నారు. మళ్లీ అమ్మ పాలన లక్ష్యంగా శ్రమిస్తానని స్పష్టం చేశారు. ఎదురుచూపుల్లో: చిన్నా చితక పార్టీలకు, ఇది వరకు టాటా చెప్పిన శరత్‌కుమార్ లాంటి వాళ్లకు అమ్మ దర్శనం లభిస్తుంటే, తనకు దక్కేది ఎప్పుడో అన్న వేదనలతో టీఎంసీ నేత జీకే వాసన్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తమిళ మానిల కాంగ్రెస్‌ను(టీఎంసీ) పునరుద్ధరించిన జీకే వాసన్ అమ్మ నీడన చేరాలన్న ఆశతో ఎదురు చూపుల్లో ఉన్నారు. ఆ పార్టీ వర్గాల సంప్రదింపుల్లో 25 సీట్ల డిమాండ్‌ను అమ్మ ముందు ఉంచి ఆయన తప్పు చేసినట్టున్నారు. ఇందుకు కారణం ఇప్పటి వరకు అమ్మ దర్శన భాగ్యం అందుకున్న పార్టీలందరికీ సింగిల్ డిజిట్ సీట్లు ఖారరయ్యాయని చెప్పవచ్చు. అయితే, వాసన్ డబుల్ డిజిట్ సంఖ్యను ఉంచిన దృష్ట్యా, వేచి చూసే ధోరణిలో అమ్మ ఉన్నట్టు సమాచారం. తాము ఇచ్చే సీట్లతో సర్దుకునే వాళ్లకే పోయేస్ గార్డెన్ తలుపులు తెరచుకుని అమ్మ దర్శనం లభిస్తున్నదని, ముందే డిమాండ్లు పెడితే కష్టమేనంటూ అన్నాడీఎంకే వర్గాలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. అందుకే మరో రెండు మూడు రోజులు వేచి చూసి, తదుపరి తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు వాసన్ నిర్ణయించి ఉన్నారు. ఈనెలాఖరులోపు పొత్తు ఎవరితో అన్నది స్పష్టం చేస్తానని ఆయన మీడియా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 20 మందికి ఒక ఇన్చార్జ్: ఇంటర్వ్యూలు, మద్దతు, ఫిర్యాదుల పరిశీలన బిజీలో ఉన్నా, ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కొత్త వ్యూహాల్ని రచించే పనిలో జయలలిత ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మళ్లీ అధికారం లక్ష్యంగా ఉరకలు తీస్తున్న జయలలిత 20 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జ్ చొప్పున నియమించే పనిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఒక్కో గ్రామంలో, ఆయా వీధుల్లో ఉన్న ఓటర్లను పరిగణలోకి తీసుకుని అక్కడి స్థానిక నేతల్ని ఇన్‌చార్జ్‌లుగా నియమించే పనిలో ఉన్నారు. ఈ ఇన్చార్జ్లుఆ ఓటర్లను కలవడం, వారి సమస్యల్ని తెలుసుకోవడం, వాటి పరి ష్కారం దిశగా ముందుకు సాగేందుకు ‘రచ్చ బండ’ చర్చ అన్న నినాదాన్ని ఇందుకు ఎంపిక చేసి ఉండడం విశేషం. -
ఒంటరికి సై!
డీఎండీకే అధినేత విజయకాంత్ తీరుతో కమలనాథులు విసిగి వేసారినట్టున్నారు. ఇక, ఆయనతో ఎలాంటి చర్చలు సాగించ కూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇందుకు తగ్గట్టుగామంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై వ్యాఖ్యానించారు. ఒంటరి నినాదంతో ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో మునిగారు. చెన్నై : డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని చాటుకునే ప్రయత్నంలో ఢీలా పడ్డ కమలనాథులకు ప్రాంతీయ పార్టీల తీరు తీవ్ర అసహనానికి గురిచేస్తున్నట్టుంది. పొత్తు వ్యవహారంలో పీఎంకే తన స్పష్టతను తెలియజేసినా, నాన్చుడు ధోరణితో ఒంటరి నినాదాన్ని డీఎండీకే అందుకున్నా, ఆ ఇద్దరు తమతో కలసి వస్తారన్న ఆశల పల్లకిలో ఇన్నాళ్లు కమలనాథులు ఊగిసలాడారని చెప్పవచ్చు. అయితే, పొత్తు మంతనాల్లో తమతో ఆ పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరుతో కలత చెందిన కమలనాథులు, ఇక వారిని తమ దరి దాపుల్లోకి చేర్చకూడదన్న నిర్ణయానికి వచ్చేసినట్టుంది. ఇం దుకు తగ్గ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఇక చర్చల్లేవ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒంటరి కసరత్తు : డీఎండీకే, పీఎంకేలు ఇక తమతో కలసి వచ్చేది అనుమానం గానే మారడంతో తమ బలాన్ని చాటుకునేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో తమదైన శైలిలో రాజకీయం సాగించేందుకు కసరత్తుల్లో మునిగారు. ఈ సారికి ఆయా పార్టీలు తమ దైన బాణిలో పయనిస్తుండడంతో, ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ఓట్ల చీలిక ద్వారా లబ్ధిపొందాలన్న వ్యూహంతో ముందుకు సాగేందుకు కమలనాథులు నిర్ణయించి ఉన్నారు. ఇందుకు తగ్గ కార్యచరణను సిద్ధం చేసే పనిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై నిమగ్నం అయ్యారు. మంగళవారం టీ నగర్‌లోని కమలాలయంలో ఒంటరి నినాదాన్ని అందుకునేందుకు తగ్గ కసరత్తుల్ని చేపట్టారు. రాష్ర్టంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యవర్గంతో ఆమె సమాలోచించారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ బలా బలాలను జిల్లాల వారీగా సమీక్షించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఉన్న బలాన్ని అంచనా వేశారు. ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థుల వివరాల్ని పరిశీలించారు. ఇందుకు తగ్గ నివేదికను ఢిల్లీకి పంపించేందుకు నిర్ణయించారు. చర్చల్లేవ్ : ఈ కసరత్తుల తదుపరి మీడియాతో తమిళి సై మాట్లాడుతూ, ఇక, డీఎండీకేతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పొత్తు కోసం వెనక్కు తగ్గే స్థితిలో బీజేపీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ పార్టీ అన్న విషయాన్ని గుర్తెరగాలని పరోక్షంగా విజయకాంత్‌కు హితవు పలికారు.ఈ ఎన్నికల్ని ఎలా ఎదుర్కొనాలో తమకు తెలుసునని, ఎవర్నీ తాము నిర్బంధించబోమని, వస్తే కలిసి పనిచేస్తామేగానీ, వాళ్ల డిమాండ్లకు తలొగ్గి, సామరస్య పూర్వకంగా వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 234 స్థానాల్లోనూ అభ్యర్థుల్ని నిలబెట్టగలిగిన బలం బీజేపీకి ఉందని, అందుకు తగ్గ కసరత్తులోనే ఉన్నామని వ్యాఖ్యానించడం విశేషం. నేడు అమిత్ షా : తమిళనాట ఎన్నికల రాజకీయ రసవత్తరంగా మారిన సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం చెన్నైకు రానున్నారు. ఆయన రాకతో రాజకీయ ప్రాధాన్యతకు ఆస్కారం ఉంటుందా..? అన్న చర్చ బయలు దేరింది. అయితే, ఆయన కామరాజర్ అరంగంలో జరిగే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సహస్త్ర చంద్ర దర్శనం వేడుకకు హాజరై వెంటనే ఢిల్లీ వెళ్లేలా పర్యటనను సిద్ధం చేసుకుని ఉన్నారు. -
జయ కోసం శశి పూజలు
భర్తల గెలుపు కోసం భార్యల మొక్కులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు గెలుపు ఓటములు దైవాధీనాలు అనే నానుడికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు రాష్ట్రంలోని రాజకీయ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజలే దిక్కు అని భర్తలు... ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా, వారి భార్యలు మాత్రం తమ భర్తల గెలుపు కోసం దేవుడే దిక్కని ఆలయాల్లో ప్రదక్షిణలకు శ్రీకారం చుట్టారు. చెన్నై : విద్యార్థులకు పరీక్షలో ఉత్తీర్ణత ఎంత ముఖ్యమో రాజకీయ నేతలకు ఎన్నికల్లో గెలుపు అంతే ముఖ్యం. పరీక్షా ఫలితాల్లో ఫెయిలైనా, ఎన్నికల ఫలితాల్లో ఓటమి పాలైనా పరిస్థితి దయనీయమే. అందుకేనేమో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలంతా ఓటరు బాట, నేతల సతీమణులంతా ఆలయాల బాట పట్టడం ప్రారంభించారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం అన్నాడీఎంకే, డీఎంకేలలో చురుకుగా సాగుతోంది. దరఖాస్తుల కోసం అభ్యర్థులు రెండు పార్టీల్లోనూ ఎగబడుతున్నారు. గెలుపు ఓటములు దైవాధీనాలనుకుంటూ రాజకీయ నేతలు ప్రజల వైపు తాము పయనిస్తూ తమ సతీమణులను ఆలయాల చుట్టూ తిప్పుతున్నారు. జయ కోసం శశికళ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గెలుపు కోసం ఆమె నెచ్చెలి శశికళ ఈ నెల 20వ తేదీన శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ అమ్మవారి ఆలయంలో బంగారు విమాన కుంభాభిషేకం ఉత్సవాలు నిర్వహించారు. యుద్ధంలో గెలుపు కోసం ఆలయాల్లో మాంగల్య పూజలు నిర్వహించి ముత్తయిదువులకు ప్రసాదాలు పంచడం రాజుల కాలం నాటి ఆనవాయితీ. అదే ఆనవాయితీగా ఆలయ కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న శశికళ... జయ గెలుపును ఆశిస్తూ విశేష పూజలు నిర్వహించారు. 25 మంది మహిళా భక్తులకు రవిక వస్త్రం, తాళిబొట్టు తాడు, పసుపు, కుంకుమ తదితర 9 రకాల వస్తువులతో కూడిన సంచీని అందజేశారు. స్టాలిన్ కోసం సతీమణి దుర్గ శశికళ పూజల సంగతి తెలిసిందో ఏమో కాని డీఎంకే అధినేత కరుణానిధి కోడలు, కోశాధికారి స్టాలిన్ సతీమణి దుర్గ పక్కరోజే కంచి కామాక్షి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. డీఎంకే అధికారంలో రావాలని ప్రార్థిస్తూ తైమాస పౌర్ణమిరోజైన శనివారం అర్ధరాత్రి కంచిలోని కామాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. చోళరాజులు తాము రణరంగంలోకి దిగే ముందు కామాక్షి అమ్మవారికి నవ ఆవర్ణ పూజలు జరిపేవారు. స్టాలిన్ భార్య దుర్గ సైతం నవ ఆవర్ణ పూజ జరిపించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన పూజలు అర్ధరాత్రి వరకు సాగాయి. దుర్గతోపాటూ ఆమె తల్లి, సోదరి కూడా పూజల్లో పాల్గొన్నారు. అన్బుమణి కోసం భార్యామణి సౌమ్య కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే తరఫున సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన అన్బుమణి రాందాస్ సతీమణి సౌమ్య సైతం ధర్మపురి జిల్లా కుమారస్వామిపేటలోని శివసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. తన భర్త సీఎం అయ్యేలా ఆశీర్వదించు అంటూ తైపూస పుణ్యదినమైన ఆదివారం నాడు సౌమ్య ప్రత్యేక పూజలు జరిపారు. ఇలా మూడు ప్రధాన పార్టీలకు చెందిన నేతల గెలుపు కోసం వారి సతీమణులు, జయ కోసం ఆమె నెచ్చెలి శశికళ వరుసగా పూజలు జరిపించడం విశేషం. ఇదే కోవలో తన భర్తకు పోటీకి సీటు దక్కాలని, గెలుపొందాలని, పార్టీ అధికారంలోకి వస్తే భర్త మంత్రి కావాలని... ఇలా రకరకాల కోర్కెలతో ఇక ఆలయాల్లో నేతల సతీమణులు సందడి చే యడం ఖాయమని అంటున్నారు.