సాక్షి ప్రతినిధి, చెన్నై : డీఎంకే కోశాధికారి స్టాలిన్ తనకు కనీసం సొంతకారు కూడా లేదని తెలిపారు. చెన్నై జిల్లా కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్టాలిన్ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో ఆస్తుల వివరాలను పొందుపరిచారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.13.23 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన వద్ద రొక్కంగా రూ.50 వేలు, తన భార్య దుర్గ వద్ద రూ.25 వేలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. తనకు చెందినవిగా బంగారు, వెండినగలు లేవని, అయితే తన భార్య దుర్గకు మాత్రం 720 గ్రాముల పాత బంగారు నగలు ఉన్నాయని చెప్పారు. రూ.80.33 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు సొంత కారు కూడా లేదని, భార్య దుర్గకు రూ.31.25 లక్షల ఆస్తి ఉందని తెలిపారు. ప్రజా సేవ చేయడమే తన వృత్తిగా పేర్కొన్న స్టాలిన్, తన భార్య ఒక ప్రయివేటు సంస్థకు మేనేజర్‌గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
స్టాలిన్‌కు సొంత కారు లేదట
Published Thu, Apr 28 2016 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM
Advertisement
Advertisement