చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి అయితే దేశం మరోసారి సార్వత్రిక ఎన్నికలను చూడబోదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. భారత్‌లో ఉన్న ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మార్చివేసి.. నిరంకుశత్వాన్ని తీసుకువస్తారని ప్రధాని మోదీపై ధ్వజమేత్తారు.
డీఎంకే అధినేత స్టాలిన్ ఓ జాతీయా మీడియా ఇంటర్య్వూలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశం నిరంకుశ రాజ్యంగా మారకుండా అడ్డుకోవటమే తమ పార్టీ ప్రధానాంశమని తెలిపారు. నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలో వస్తే.. బీజేపీకి కూడా ఎంటువంటి లబ్ధి జరగదన్నారు. నెమ్మదిగా బీజేపీ పార్టీ తన ఉనికి కోల్పోతుందన్నారు. కేవలం నరేంద్ర మోదీ మాత్రమే మిగులుతారని అన్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తున్న ఎన్నికల ప్రచారంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ ప్రభావం తగ్గుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి ఈసారి ఎన్నికల్లో కూడా ఓట్లు వేయరని స్పష్టం చేశారు.
ఇండియా కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎన్నికల ఫలితాల అనంతరమే తెరమీదకు వస్తారని తెలిపారు. గతంలో మన్మోహన్ సింగ్ మాదిరిగానే ఎన్నికల ఫలితాలు వెలువడగానే పీఎం అభ్యర్థిని కూటమి ప్రకటింస్తుందని తెలిపారు. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థులుగా సమర్థులైన, అనుభవం గల నేతలు చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు.
కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శ్రీలంకను చాలా సార్లు సందర్శించారు. ఎందుకు ఒక్కసారి కూడా కచ్చతీవు ద్వీపం గురించి ప్రస్తావించలేదని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల వేళ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ ముసలి కన్నీరు కారుస్తున్నారని సీఎం స్టాలిన్ మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే కూటమి 38 సీట్లతో పోటి చేయగా 23 స్థానాల్లో గెలుపొందింది. అందులో కాంగ్రెస్ పార్టీ 8 సిట్లలో విజయం సాధించింది. సీపీఐ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇక.. 39 స్థానాలు ఉన్న తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరనుంది. ఫలితాలు జూన్4న వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment