చెన్నై: డీఎంకేని అవినీతి పార్టీ అన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి అనే ఓ యూనివర్సిటీ ఉంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఛాన్సలర్ అవుతారని అని సెటైర్లు వేశారు.
‘అవినీతి పేరుతో ఓ విశ్వవిద్యాలయం స్థాపిస్తే.. ఆ యూనివర్సిటీకి ప్రధాన మంత్రి మోదీ ఛాన్సలర్ అవుతారు. ఛాన్సలర్ కావడానికి ప్రధాని మోదీకి అన్ని అర్హతలు ఉన్నాయి. బీజేపీనే దేశంలో అతిపెద్ద అవినీతీ పార్టీ. దానికి ఉదాహారణ.. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం. అది ఒక్కటే కాదు.. పీఎం కేర్స్ ఫండ్, కేసుల్లో ఇరుకున్న ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరిన తర్వాత విచారణ ఉండకపోవటం. అసలు అవినీతితో కూడిన పార్టీ బీజేపీ’ అని సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు.
ఇక.. బుధవారం తమిళనాడులోని వెల్లూరులో బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అధికార డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే అవినీతి పార్టీ అని మండిపడ్డారు. ‘అవినీతికి మొదటి కాపీ రైట్ డీఎంకేకు చెందుతుంది. ఎంకే స్టాలిన్ కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంది. తమిళనాడు ప్రజలను అవినీతి కుటుంబ పాలన కొనసాగించే డీఎంకే తమ ట్రాప్‌లో పడిపోయారు. డీఎంకే పార్టీ తమిళ సంస్కృతి, సాంప్రదాయానికి వ్యవతిరేకంగా ఉంది. సీఎం స్టాలిన్ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నారు’ అని మోదీ విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment