లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి రగులులోంది. ప్రచారంలో తమదైన శైలిలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో ఒకరిపైనొకరు విరుచుపడుతున్నారు.
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారంపై విచారణ చేస్తామని మోదీ గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైనా ఆక్రమించిన భారత్‌లోని భూగాలను తిరిగి వెనక్కి రప్పించాలని, కులగణనతోపాటు ఇతర విషాయాల్లో మోదీ గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు.
2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ‘మోదీ గ్యారంటీ’ పేరుతో ఎన్నికల హామీలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్టాలిన్ స్పందిస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సీఏఏకు చేసిన సవరణలను వెనక్కితీసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల నిధులను తక్షణమే విడుదల చేయాలని సవాల్ విసిరారు. గ్యారంటీ కార్డుతో వస్తున్న ప్రధాని ఈ గ్యారంటీలను ఇవ్వగలరా అని నిలదీశారు.
చదవండి: తెలంగాణ ‘చిన్నమ్మ’ కుమార్తె.. బన్సూరి స్వరాజ్ కంటికి గాయం
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు, ప్రతి ఏడాది రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలపై కూడా ప్రధాని హామీ ఇవ్వాలని మోదీ గ్యారంటీల జాబితాలో పొందుపరచాలని స్టాలిన్ కోరారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, గిట్టబాటు ధరపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కూడా మోదీని డిమాండ్ చేశారు. సైన్యంలో అగ్నిపథ్ పధకాన్ని రద్దు చేయాలని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ప్రధాని మోదీ విస్తృత పర్యటనలపై కూడా స్టాలిన్ మండిపడ్డారు. సీజన్‌లో వచ్చే వలస పక్షుల మాదిరిగా ఎన్నికల సమయంలో ప్రధాని తమిళనాడు చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. గ్యారంటీ కార్డుతో తిరుగుతున్న మోదీ.. పైన పేర్కొన్న గ్యాంరటీలు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇవ్వకుంటే ఈ వారంటీలన్నీ మేడ్ ఇన్ బీజేపీ వాషింగ్ మేషీన్ అని బట్టబయలవుతుందని డీఎంకే అధినేత తన సోషల్ మీడియా పోస్ట్‌లో విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment