‘నితీష్‌కు తెలివే లేదు’: తేజస్వి సంచలన వ్యాఖ్యలు | Modijis Photo in JDU Office Tejashwi Yadav Mocks Nitish Kumar | Sakshi
Sakshi News home page

‘నితీష్‌కు తెలివే లేదు’: తేజస్వి సంచలన వ్యాఖ్యలు

Jul 2 2025 11:33 AM | Updated on Jul 2 2025 3:11 PM

Modijis Photo in JDU Office Tejashwi Yadav Mocks Nitish Kumar

పట్నా: ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అక్కడి రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, ఎన్నికల వాతావారణానికి కొత ఊపు తెస్తున్నారు. తాజాగా బీహార్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నితీష్‌ కుమార్‌కు ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఆయన బీహార్‌ను ఇకపై పరిపాలించలేరని తేజస్వి యాదవ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతున్న వేళ తేజస్వి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)నేత తన మాజీ మిత్రుడైన నితీష్‌పై పలు వ్యాఖ్యలు చేయడమే కాకుండా, జేడీయూ కార్యాలయంలో ఎప్పుడూ లేనిది.. ఇప్పుడు ప్రధాని మోదీ ఫొటో కనిపిస్తున్నదన్నారు. నితీష్‌కు తెలివే లేదు... అందుకే మోదీ ఫోటోను కార్యాలయంలో తగిలించారని అన్నారు.  ఇదే ముఖ్యమంత్రి ఒకప్పుడు ‍ప్రధాని మోదీతో కరచాలనం చేసి, వివాదాల్లో చిక్కుకున్నారని తేజస్వి పేర్కొన్నారు.

నితీష్‌ కుమార్‌ అతని హృదయం చెప్పిన మాట వినరని, ఎందులో అతనికి సమ్మతి ఉందని తేజస్వి ప్రశ్నించారు. ఆయన పార్టీ మారనని చెబుతూ, అందుకు పదే పదే ఇందుకు రుజువులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. ఆయనకు ప్రజల్లో విశ్వసనీయత లేదని,అతని వయస్సు కూడా  ఇందుకు ఒక కారణమని తేజస్వి వ్యాఖ్యానించారు. బీహార్‌లో ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయని, అటువంటి సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలాలే లేవని ఆరోపించారు.

రాష్ట్రంలో ఓటర్ల జాబితాల సవరణకు  రెండేళ్లు పట్టవచ్చని, ఎన్నికలకు ఆరు నెలల కన్నా తక్కువ సమయమే ఉన్నందున ఈ కసరత్తు ఇప్పుడు ఎందుకని తేజస్వి ప్రశ్నించారు. ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభానికి రెండు నెలలలే మిగిలి ఉంది. ఇప్పుడు  ఎన్నికల కమిషన్ ఎనిమిది కోట్ల మందితో కూడిన కొత్త జాబితాను కేవలం 25 రోజుల్లో తయారు చేయాలి. రాష్ట్రంలోని 73 శాతం మంది వరదల బారిన పడిన సమయంలో కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన సాధ్యమవుతుందా? అని తేజస్వి యాదవ్‌ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: అరెస్టు హెచ్చరికలు.. ట్రంప్‌పై జోహ్రాన్ మమ్దానీ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement