తల్లి ఓటు వేసేందుకు వెళ్లడంతో పాపను ఎత్తుకున్న పోలీస్
సాక్షి, అమరావతి: తమిళనాడు ఎన్నికల బందోబస్తులో అనంతపురం జిల్లా పోలీసులు విశేష సేవలు అందించారు. పోలింగ్ రోజైన మంగళవారం నాడు ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు నడవలేని స్థితిలో ఉండే వారిని వీల్ చైర్‌లో కూర్చోబెట్టి పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తల్లుల నుంచి చిన్నారులను తీసుకుని వారిని ఎత్తుకుని పోలీసులు ఆడించారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్క్ లు, శానిటైజర్లు వినియోగించేలా ఓటర్లను చైతన్యపరిచారు. మాసు్కలు లేకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి మాస్క్ లను అందించారు. ఇలా సేవలు అందించిన నల్లమాడ కానిస్టేబుల్ రాము, బొమ్మనహళ్ కానిస్టేబుల్ ధనసింగ్ నాయక్‌లను అనంతపురం జిల్లా ఎస్పీ సత్యేయేసుబాబు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment