- ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం హిజ్రాల పట్టు
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి నామ్‌తమిళర్ కట్చి(ఎన్‌టీకే) అభ్యర్థిగా సేలం దేవి అనే హిజ్రా పోటీ చేయనున్నారు. తమిళనాడుకు చెందిన 12 స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు చెన్నై ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుల, మత భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు ప్రభుత్వం అనేక రాయితీలు, పథకాలు అమలు చేస్తుండగా హిజ్రాలు మాత్రం వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించేందుకు ఇకపై జరుగనున్న ఎన్నికల్లో హిజ్రాలకు రాజకీయ రిజర్వేషన్లు, పోటీచేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రతి పార్టీ ఒక టికెట్‌ను హిజ్రాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. చెన్నై ఆర్కేనగర్ నుంచి సేలం దేవి (హిజ్రా) నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా ఖరారైనట్లు వారు తెలిపారు.
చెన్నై ఆర్కేనగర్ నుంచి హిజ్రా పోటీ
Published Tue, Mar 22 2016 8:39 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM
Advertisement