సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని బాబాసాహబ్ పహడ్‌లో ఓ హిజ్రా ఆత్మహత్య చేసుకున్నారు. ఆరోటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పదేళ్ల క్రితం హరీష్ అనే వ్వాపారి హిజ్రాగా మారారు. స్నేహగా నగరంలో బాబాసాహెబ్ పహడ్‌లో ఉంటోంది. గత నాలుగేళ్లుగా కంఠేశ్వర్‌కు చెందిన నాగరాజ్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.
స్నేహను తరుచూ ఫోన్‌లో తిట్టడంతో ఇద్దరి మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. దీంతో మనస్థాపం చెందిన స్నేహ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం తలుపులు తీయకపోవడంతో చుట్టు పక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా స్నేహ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. నాగరాజ్‌ను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment