Hizra
-
మనస్తాపంతో హిజ్రా ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని బాబాసాహబ్ పహడ్‌లో ఓ హిజ్రా ఆత్మహత్య చేసుకున్నారు. ఆరోటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పదేళ్ల క్రితం హరీష్ అనే వ్వాపారి హిజ్రాగా మారారు. స్నేహగా నగరంలో బాబాసాహెబ్ పహడ్‌లో ఉంటోంది. గత నాలుగేళ్లుగా కంఠేశ్వర్‌కు చెందిన నాగరాజ్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. స్నేహను తరుచూ ఫోన్లో తిట్టడంతో ఇద్దరి మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. దీంతో మనస్థాపం చెందిన స్నేహ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం తలుపులు తీయకపోవడంతో చుట్టు పక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా స్నేహ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. నాగరాజ్‌ను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. -
నకిలీ హిజ్రాను చితక్కొట్టిన అసలు హిజ్రాలు
సాక్షి, వరంగల్ : వరంగల్‌లో నకిలీ హిజ్రా హల్ చల్ చేశాడు. బాలాజీ నగర్ వద్ద ఓ యువకుడు హిజ్రా వేషధారణలో వచ్చి జనాలనుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అసలు హిజ్రాలు అక్కడికి చేరుకుని అతన్ని పట్టుకుని నడిరోడ్డుపైనే చితక్కొట్టారు. మూకుమ్మడిగా దాడి చేసి, కాళ్లతో తన్నుతూ కర్రలతో చితకబాదారు. హిజ్రా వేషధారణలో ఉన్న అతన్ని బట్టలు విప్పి మరీ పడిగుద్దులు కొట్టారు. గతంలో కూడా నర్సంపేటకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఇలాగే ప్రవర్తించడంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. -
నకిలీ హిజ్రాపై అసలు హిజ్రాలు మూకుమ్మడి దాడి
-
రైలులో ప్రయాణికుడిపై హిజ్రాల దాడి
కాజీపేట రూరల్: అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిపై హిజ్రాలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. హిజ్రాల దాడిలో గాయాలపాలైన ప్రయాణికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాజీపేట జీఆర్పీ ఎస్సై పి.దయాకర్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌కు చెందిన ఓంప్రకాష్ జైశ్వాల్ వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార నిమిత్తం నాగపూర్ నుంచి ఒంగోలుకు అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయల్దేరాడు. జమ్మికుంటలో ఈ రైలులోకి ఎక్కిన హిజ్రాలు ఓం ప్రకాష్ ను డబ్బులు ఇవ్వమని అడగగా ఇవ్వకపోవడంతో అతడిని కాళ్లతో తన్ని కిటికి వద్దకు నెట్టేశారు. దీంతో అతడికి తలకు తీవ్రగాయాలై రక్త స్రావం జరిగింది. హిజ్రాలు కాజీపేట–వరంగల్ మధ్య దిగి పరారయ్యారు. కాజీపేట జీఆర్పీ పోలీసులు ఓం ప్రకాష్‌ను ఆస్పతికి పంపించారు. పరారైన హిజ్రాల కోసం గాలిస్తున్నారు. -
చెన్నై ఆర్కేనగర్ నుంచి హిజ్రా పోటీ
- ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం హిజ్రాల పట్టు చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి నామ్‌తమిళర్ కట్చి(ఎన్టీకే) అభ్యర్థిగా సేలం దేవి అనే హిజ్రా పోటీ చేయనున్నారు. తమిళనాడుకు చెందిన 12 స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు చెన్నై ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుల, మత భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు ప్రభుత్వం అనేక రాయితీలు, పథకాలు అమలు చేస్తుండగా హిజ్రాలు మాత్రం వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించేందుకు ఇకపై జరుగనున్న ఎన్నికల్లో హిజ్రాలకు రాజకీయ రిజర్వేషన్లు, పోటీచేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రతి పార్టీ ఒక టికెట్‌ను హిజ్రాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. చెన్నై ఆర్కేనగర్ నుంచి సేలం దేవి (హిజ్రా) నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా ఖరారైనట్లు వారు తెలిపారు. -
తప్పిపోయిన చిన్నారిని చేరదీసిన హిజ్రా
వరంగల్ :చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా తిరుగుతున్న పాయిల్(9) అనే చిన్నారిని వరంగల్‌కు చెందిన ఓ హిజ్రా చేరదీసింది. వివరాల్లోకి వెళ్తే... ఆదివారం రాత్రి నవజీవన్ఎక్స్ప్రెస్లో తల్లిదండ్రులు నుంచి తప్పిపోయిన పాయిల్ ఏడుస్తుండగా ఓ హిజ్రా గమనించి చిన్నారి గురించి రైలులో ఆరా తీసింది. పాప తల్లిదండ్రుల జాడ తెలియకపోవడంతో ఆ చిన్నారిని చేరదీసి వరంగల్ రైల్వేస్టేషన్లో దిగి తన ఇంటికి తీసుకెళ్లింది. సోమవారం ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు తెలుపగా వారు చిన్నారిని చైల్డ్ లైన్‌కు అప్పగించారు. పాప తల్లిదండ్రుల స్వస్థలం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. -
వైన్ షాప్ వద్ద హిజ్రా హల్చల్
హైదరాబాద్ : రోజురోజుకు హిజ్రాల ఆగడాలకు అదుపులేకుండా పోతోంది. తాజాగా పాతబస్తీలోని షంషీర్ గంజ్‌లో గురువారం ఓ హిజ్రా హల్చల్ చేసింది. అక్కడే ఉన్న మహాలక్ష్మి వైన్స్ వద్దకు వెళ్లి రూ.1100 డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే చీర విప్పేస్తానంటూ బెదిరించింది. వైన్స్ యజమాని రూ.500 ఇస్తే తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో యజమాని సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ దాదాపు 40 నిమిషాల పాటు సర్దిచెప్పారు.. అయినా వారి మాట వినకుండా అక్కడే తిష్ట వేసింది. పోలీసులకు కూడా ఏమి చేయాలో దిక్కు తోచక బిక్కమొఖం వేశారు. -
ప్రత్యేక చర్చ : హిజ్రాల్లో అసలైన హిజ్రాలు వేరు!
-
ఇది గుర్తించండి : హిజ్రాలూ మనుషులే..!
-
ఇరు ఊర్ల హిజ్రాలు కొట్టుకున్నారిలా..!
-
ఔను... ఇప్పుడు మాకూ 'గుర్తింపు' ఉంది
-
పాపం.. కల్కి!
కల్కి.. 40 ఏళ్ల ఈ హిజ్రాను తమిళనాడులోని రాజకీయ పార్టీలు నిరాశపరిచాయి! విళుపురం జిల్లా కొట్టాక్కరైలో నివసించే ఈమె పుదుచ్చేరి నుంచి లోక్‌సభకు పోటీచేసేందుకు ఉత్సుకత చూపించినా ఏ పార్టీ టికెట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ‘సహోదరి’ అనే స్వచ్చంద సంస్థ నడుపుతున్న కల్కి.. గత పదేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తమిళనాడులో ఒక హిజ్రా పోటీచేసేందుకు ముందుకు రావడం ఇదే ప్రథమం. ‘‘ఏదైనా పార్టీ నుంచి పోటీచేయాలని భావించా కానీ కుదరలేదు. ఇక ఏదో ఒక పార్టీలో చేరి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తా..’’ అని కల్కి చెప్పింది.