నకిలీ హిజ్రాను చితక్కొట్టిన అసలు హిజ్రాలు | Hizras attack on fake Hizra in Warangal  | Sakshi
Sakshi News home page

నకిలీ హిజ్రాను చితక్కొట్టిన అసలు హిజ్రాలు

Published Tue, Feb 12 2019 7:19 PM | Last Updated on Tue, Feb 12 2019 7:32 PM

Hizras attack on fake Hizra in Warangal  - Sakshi

సాక్షి, వరంగల్‌ : వరంగల్‌లో నకిలీ హిజ్రా హల్‌ చల్‌ చేశాడు. బాలాజీ నగర్‌ వద్ద ఓ యువకుడు హిజ్రా వేషధారణలో వచ్చి జనాలనుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న​ అసలు హిజ్రాలు అక్కడికి చేరుకుని అతన్ని పట్టుకుని నడిరోడ్డుపైనే చితక్కొట్టారు. మూకుమ్మడిగా దాడి చేసి, కాళ్లతో తన్నుతూ కర్రలతో చితకబాదారు. హిజ్రా వేషధారణలో ఉన్న అతన్ని బట్టలు విప్పి మరీ పడిగుద్దులు కొట్టారు. గతంలో కూడా నర్సంపేటకు చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఇలాగే ప్రవర్తించడంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement