
తప్పిపోయిన చిన్నారిని చేరదీసిన హిజ్రా
వరంగల్ :చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా తిరుగుతున్న పాయిల్(9) అనే చిన్నారిని వరంగల్‌కు చెందిన ఓ హిజ్రా చేరదీసింది. వివరాల్లోకి వెళ్తే... ఆదివారం రాత్రి నవజీవన్‌ఎక్స్‌ప్రెస్‌లో తల్లిదండ్రులు నుంచి తప్పిపోయిన పాయిల్ ఏడుస్తుండగా ఓ హిజ్రా గమనించి చిన్నారి గురించి రైలులో ఆరా తీసింది.
పాప తల్లిదండ్రుల జాడ తెలియకపోవడంతో ఆ చిన్నారిని చేరదీసి వరంగల్ రైల్వేస్టేషన్‌లో దిగి తన ఇంటికి తీసుకెళ్లింది. సోమవారం ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు తెలుపగా వారు చిన్నారిని చైల్డ్ లైన్‌కు అప్పగించారు. పాప తల్లిదండ్రుల స్వస్థలం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.