
హీరోయిన్ నయనతార (Nayanthara) ప్రస్తుతం సినిమాలు చాలావరకు తగ్గించేసింది. అడపాదడపా మాత్రమే చేస్తోంది. రీసెంట్ గానే తమిళంలో ఒకటి కమిటైంది. కానీ ఇప్పటికే నటిగా బోలెడంత పేరు, లెక్కలేనంత ఆస్తి సంపాదించుకుంది. ఇప్పుడు అలా తాను సంపాదించుకున్న డబ్బుతో కోట్ల ఖరీదు ఇల్లు కమ్ స్టూడియోని (Nayan New House)కొనుగోలు చేసింది.
(ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)
దక్షిణాదిలో దాదాపు 15 ఏళ్లకు పైగా సినిమాలు చేస్తున్న నయన్.. రీసెంట్ టైంలో ఏదో ఒకలా వార్తల్లో నిలుస్తూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ అమ్మిన తన పెళ్లి వీడియో కోసం ఏకంగా హీరో ధనుష్(Dhanush)తోనే గొడవ పెట్టుకుంది. ఇదేమో రూ.10 కోట్ల పరువు నష్టం దావా వరకు వెళ్లింది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు చెన్నైలోని రజనీకాంత్, ధనుష్ తదితర సెలబ్రిటీలు నివసించే ఖరీదైన పోయెస్ గార్డెన్ ఏరియాలో ఇప్పుడు నయన్.. భర్తతో కలిసి కొత్తగా ఇల్లు కొనుగోలు చేసింది.

మూడు అంతస్తులు ఉన్న ఈ ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్టూడియో సెటప్, పైన ఇల్లుకు తగ్గట్లు డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు స్వయంగా నయన్ ఇన్ స్టాలోనే కనిపించాయి. చూస్తుంటేనే రాజసం ఉట్టిపడేలా 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు ఖరీదు రూ.100 కోట్లు ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. సాధారణంగా అక్కడ సాధారణమైన ఇల్లు రూ.2 కోట్ల ఖరీదు పలుకుతుంది. అలాంటి ఇంతలా సెటప్, ఇంటీరియర్ డిజైన్ చూస్తుంటే రూమర్స్ నిజమే అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: థియేటర్‌లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు)



Comments
Please login to add a commentAdd a comment