Poes Garden
-
రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్?
హీరోయిన్ నయనతార (Nayanthara) ప్రస్తుతం సినిమాలు చాలావరకు తగ్గించేసింది. అడపాదడపా మాత్రమే చేస్తోంది. రీసెంట్ గానే తమిళంలో ఒకటి కమిటైంది. కానీ ఇప్పటికే నటిగా బోలెడంత పేరు, లెక్కలేనంత ఆస్తి సంపాదించుకుంది. ఇప్పుడు అలా తాను సంపాదించుకున్న డబ్బుతో కోట్ల ఖరీదు ఇల్లు కమ్ స్టూడియోని (Nayan New House)కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)దక్షిణాదిలో దాదాపు 15 ఏళ్లకు పైగా సినిమాలు చేస్తున్న నయన్.. రీసెంట్ టైంలో ఏదో ఒకలా వార్తల్లో నిలుస్తూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ అమ్మిన తన పెళ్లి వీడియో కోసం ఏకంగా హీరో ధనుష్(Dhanush)తోనే గొడవ పెట్టుకుంది. ఇదేమో రూ.10 కోట్ల పరువు నష్టం దావా వరకు వెళ్లింది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు చెన్నైలోని రజనీకాంత్, ధనుష్ తదితర సెలబ్రిటీలు నివసించే ఖరీదైన పోయెస్ గార్డెన్ ఏరియాలో ఇప్పుడు నయన్.. భర్తతో కలిసి కొత్తగా ఇల్లు కొనుగోలు చేసింది.మూడు అంతస్తులు ఉన్న ఈ ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్టూడియో సెటప్, పైన ఇల్లుకు తగ్గట్లు డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు స్వయంగా నయన్ ఇన్ స్టాలోనే కనిపించాయి. చూస్తుంటేనే రాజసం ఉట్టిపడేలా 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు ఖరీదు రూ.100 కోట్లు ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. సాధారణంగా అక్కడ సాధారణమైన ఇల్లు రూ.2 కోట్ల ఖరీదు పలుకుతుంది. అలాంటి ఇంతలా సెటప్, ఇంటీరియర్ డిజైన్ చూస్తుంటే రూమర్స్ నిజమే అనిపిస్తోంది.(ఇదీ చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు) -
నయన తార కొత్త ఇల్లు కొనుగోలు.. ఎక్కడో తెలుసా ?
Nayantara Buys A New House At Poes Garden In Chennai: నయనతార.. ఈ స్టార్ హీరోయిన్ అందం, అభినయం గురించి ఎంత చెప్పిన తక్కువే. పుట్టింది కేరళలోని తిరువల్ల అయిన తెలుగు అమ్మాయికి ఏమాత్రం తీసిపోదు. లక్ష్మీ, తులసి, యోగి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. నయన్ తాజాగా చెన్నైలోని పొయెస్ గార్డెన్లో నాలుగు పడక గదుల ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. త్వరలో తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి కొత్త ఇంటికి మారనుందని ప్రచారం జరుగుతోంది. నయన్ కొత్త ఇళ్లు తీసుకున్న పొయెస్ గార్డెన్ చెన్నైలోని నాగరిక ప్రదేశాలలో ఒకటి. ఈ గార్డెన్‌కు మంచి సెలబ్రిటీ చరిత్ర కూడా ఉంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్‌ల నివాసాలు ఈ పొయెస్ గార్డెన్‌లోనే ఉన్నాయి. రజనీ కాంత్ ఇంటిపక్కనే ధనుష్ తన డ్రీమ్ హౌజ్‌ను నిర్మిస్తున్నాడు. చెన్నైలోని పొయెస్ గార్డెన్లో భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అదే ప్రాంతంలో మరో ఇంటిని కూడా కొనుగోలు చేయాలని ఆలోచిస్తుందట. సుమారు అక్కడ ఫ్లాట్స్ కోట్లలో ఉండొచ్చని సమాచారం. నయనతార ఇటీవలే 37 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాతువాకుల రెండు కాదల్ సినిమా సెట్లో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో పుట్టిన రోజు జరుపుకుంది. వివిధ భాషల్లో చిత్రాలతో బిజీగా ఉన్న నయన్. ఈ సంవత్సరం ప్రారంభంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో ఈ విషయాన్ని చెప్పింది నయన తార. -
కొత్తింటి కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్న ధనుష్!
తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీలే చెన్నైలోని పోయిస్ గార్డెన్లో నూతన గృహ నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడు ఈ ఇంటికోసం ఖర్చు పెడుతున్న వివరాలు బయటకు వచ్చాయి. నాలుగు అంతస్తులుగా నిర్మితమవుతున్న ఈ భవనం నిర్మాణం కోసం అతడు ఏకంగా రూ.150 కోట్లు వెచ్చిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఇంట్లోని గదులను ధనుష్ దగ్గరుండి తనకు నచ్చిన రీతిలో డిజైన్ చేయించుకున్నాడట. ఈ గృహం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి దగ్గరలో ఉండటం విశేషం. ధనుష్ ప్రస్తుతం గ్రే మ్యాన్ షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నాడు. అక్కడి నుంచి తిరిగి రాగానే దర్శకుడు కార్తీక్ నరేన్‌తో చేస్తున్న సినిమా షూటింగ్‌ను పునఃప్రారంభించనున్నాడు. అలాగే శేఖర్ కమ్ములతోనూ త్రిభాషా చిత్రం చేయనున్నాడు. సాయిపల్లవి మరోసారి ధనుష్‌తో జోడీ కట్టనున్న ఈ సినిమా ఆగస్టు నుంచి షూటింగ్ జరుపుకోనుంది. వీటితో పాటు ఆయన చేతిలో కిట్టీ, ఆత్రంగిరే ప్రాజెక్టులు ఉన్నాయి. చదవండి: లోకల్ ట్రైన్లో రజనీ అలా.. ఫోటోలు లీక్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ -
రజనీ.. రండి కలిసి పనిచేద్దాం: కమల్
సాక్షి, చెన్నై: రండి కలిసి పనిచేద్దాం అని పరోక్షంగా తలైవా రజనీకాంత్‌కు మక్కల్ నీది మయ్యం నేత కమల్‌హాసన్ పిలుపునిచ్చారు. శనివారం చెన్నై పోయెస్ గార్డెన్లో దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కమల్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆదివారం చెన్నైలో కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం కట్చి నాలుగో వసంతం వేడుక జరిగింది. ఇందులో పార్టీ నేతలతో మాట్లాడే సమయంలో తలైవాకు పరోక్షంగా కమల్ పిలుపునిచ్చారు. రండి కలిసి పనిచేద్దాం అని పిలుపునిస్తూ వ్యాఖ్యలు చేశారు. తలైవాగా పిలవబడే నాయకుడు రోజూ వారి రాజకీయ వ్యవహారాల్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారని, రండి కలిసి పనిచేద్దాం అని కమల్ పిలుపునివ్వడం గమనార్హం. చదవండి: అగ్ర హీరోల భేటీ: తమిళనాడులో కాక -
స్మారక మందిరంగా జయలలిత నివాసం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని జయ స్మారక మందిరంగా మార్చాలని మద్రాసు హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. జయ ఆస్తులపై ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్లకూ వారసత్వపు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. జయకు రూ.913 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదమైంది. జయ ఆస్తుల పర్యవేక్షణకు ప్రైవేటు నిర్వాహకుడిని నియమించాల్సిందిగా కోరుతూ అన్నాడీఎంకే తిరుగుబాటు నేత పుహళేంది (ప్రస్తుతం పార్టీతో రాజీ), జానకిరామన్ అనే మరో వ్యక్తి మద్రాసు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. -
జయలలిత నివాసంపై కీలక నిర్ణయం
చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నివాసమైన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జయలలితన నివాసాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకోనున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులకు తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కూడా ఆమోద ముద్ర వేశారు. ఈ నివాసానికి సంబంధించి చట్టబద్ధమైన వారసులకు పరిహారం అందజేయకపోవడంతో తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీచేసినట్టు అధికారులు చెప్పారు. వారసులకు కేటాయింపుల కోసం రూ. 66 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఈ బంగ్లాను జయలలిత స్మారక మ్యూజియంగా మార్చనున్నారు. ఈ మ్యూజియం వ్యవహారాలు చూసుకునేందుకు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని ఈ ట్రస్ట్‌కు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, సమచార శాఖ మంత్రి కె రాజు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. కాగా, జయలలిత బతికి ఉన్న కాలంలో వేద నిలయం రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా కూడా ఆమె ఈ బంగ్లా నుంచే చక్రం తిప్పారు. జయలలిత మరణించిన తర్వాత వేద నిలయానికి సంబంధించి వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. -
వెయిట్ అండ్ సీ : రజనీకాంత్
సాక్షి, చెన్నై : కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేయవద్దని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోను దేశ భద్రతకు భంగం కలగకూడదన్నారు. ఏయే విషయాల్లో రాజకీయాలు మాట్లాడాలనేది నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. తమిళ సినిమాలకు జాతీయ అవార్డులు రాకపోవడం బాధాకరమని అన్నారు. అయితే ఈ సందర్భంగా తమిళ రాజకీయాల్లో మళ్లీ పోయెస్ గార్డెన్ కీలక భూమిక పోషిస్తుందనే ప్రశ్నకు ఆయన వెయిట్ అండ్ సీ అంటూ సమాధానమిచ్చారు. కాగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం ఉన్న పోయోస్ గార్డెన్ ప్రాంతంలోనే రజనీ నివాసం ఉన్న సంగతి తెలిసిందే సోమవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ ఆర్టికల్ 370, కశ్మీర్ విభజన అంశాల్లో బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. అయితే రజనీ ఈ విధంగా మాట్లాడంపై కాంగ్రెస్‌తోపాటు, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రజనీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం ఆయన అత్తివరదరాజు స్వామి వారిని దర్శించుకున్నారు. -
ఆటో ఎక్కిన తలైవా.. రహస్యంగా ప్రయాణం!
సాక్షి, చెన్నై: నేను ఆటో వాణ్ణి.. ఆటో వాణ్ణి.. అంటూ రెండున్నర దశాబ్దాల క్రితం బాషా చిత్రంలో ఆటోవాలాగా అలరించిన దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ ఆటో ఎక్కాడు. అయితే ఈ సారి ఆయన ఆటో ఎక్కింది సినీ ప్రియులను అలరించటానికి కాదు. తన మనవడి కోరిక తీర్చేందుకు. మనవడు వేద్ కోరిక మేరకు ఆయన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని తన నివాసం నుంచి ఆళ్వార్ పేటలోని చిన్న కుమార్తె సౌందర్య ఇంటికి ఆదివారం అత్యంత రహస్యంగా ఆటోలో పయనించారు. -
జయలలిత ఇంట్లో సోదాలు
-
పెన్ డ్రైవ్‌లో రహస్యమా?
ఆదాయ పన్ను శాఖ మరింతగా దూకుడు పెంచనుంది. చిన్నమ్మ కుటుంబీకులకు చెందిన 85 బ్యాంకుల్లోని 240 లాకర్ల తాళాల్ని తెరిచేందుకు చర్యలు వేగవంతం అయ్యాయి. ఢిల్లీ నుంచి అనుమతి రాగానే, పోయెస్ గార్డెన్ వేద నిలయంలోని అమ్మ గదిలో సోదాలకు ప్రత్యేక బృందం సిద్ధం అవుతోంది. మరికొన్ని చోట్ల దాడులు లక్ష్యంగా మరికొన్ని బృందాలు రంగంలోకి దిగబోతున్నాయి. అలాగే, పరప్పన అగ్రహార చెరలోని ఆ ఇద్దర్నీ విచారించేందుకు అనుమతి కోరుతూ బెంగళూరు కోర్టును ఆశ్రయించేందుకు తగ్గ చర్యల్లో మరో బృందం నిగమ్నమైనట్టు సమాచారం. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ అండ్ ఫ్యామిలీని గురిపెట్టి సాగిన ఐటీ సోదాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ప్రస్తుతం విచారణ వేగం పెరిగింది. ఇందులో భాగంగా అమ్మ జయలలిత సహాయకుడు పూంగుండ్రన్ ఇచ్చిన సమాచారం మేరకు పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో తనిఖీలు సాగాయని సమాచారం. అక్కడ అన్ని గదుల్లో తనిఖీలు సాగినా, అమ్మ జయలలిత గది దగ్గరకు మాత్రం వెళ్ల లేదు. ఆ ఇంటి నుంచి కంప్యూటర్, పెన్ డ్రైవర్‌తో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఐటీ అధికారులు తీసుకెళ్లారు. అందులో లభించిన సమాచారం, ఐదారు రోజుల పాటు సాగిన సోదాల్లో దొరికిన ఆధారాల మేరకు ఇక, చిన్నమ్మ శశికళతో పాటు పరప్పన అగ్రహార చెరలో ఉన్న ఇళవరసిని కూడా విచారణ వలయంలోకి తెచ్చేందుకు కసరత్తులు సాగుతున్నాయి. మనో వేదనలో చిన్నమ్మ పరప్పనఅగ్రహార చెరలో ఉన్న శశికళ, ఇళవరసిలను విచారించడం లక్ష్యంగా ప్రత్యేక బృందం ఒకటి రెండు రోజుల్లో బెంగళూరుకు పయనం అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. బెంగళూరు కోర్టును ఆశ్రయించి అనుమతుల్ని కోరబోతున్నట్టు చెబుతున్నారు. ఇక్కడకు చిన్నమ్మను గానీ, ఇళవరసిని గానీ తీసుకొచ్చే ప్రసక్తే లేదని, అంతా బెంగళూరు జైలు వేదిగానే విచారణలు సాగుతాయని ఓ అధికారి పేర్కొన్నారు. ఇక, ఈ విచారణ గురించి పరప్పన అగ్రహార చెర అధికారి రమేష్ కుమార్‌ను ఓ మీడియా కదిలించగా, ఆ ఇద్దర్ని విచారించేందుకు తగ్గ సమాచారం తమకు ఇంతవరకు రాలేదన్నారు. కోర్టు అనుమతితో వస్తే అంగీకరిస్తామని పేర్కొన్నారు. ఇదివరకు కోర్టు అనుమతితో ఇక్కడ విచారణలో సాగాయని గుర్తుచేశారు. కాగా, ఇప్పటికే ఐటీ దాడులు, భర్త నటరాజన్‌కు జైలు శిక్ష, ప్రస్తుతం తమ వద్ద విచారణకు రంగం సిద్ధం అవుతుండడంతో చిన్నమ్మకు కంటి మీద కనుకు కరువైనట్టు సమాచారం. బ్యాంకు లాకర్లపై గురి ఐటీ సోదాల్లో లభించిన సమాచారాల మేరకు చిన్నమ్మ అండ్ ఫ్యామిలీకి ప్రైవేటు, సహకార పరిధిలోని 85 బ్యాంకుల్లో ప్రత్యేకంగా 240 లాకర్లు ఉన్నట్టు ఐటీ వర్గాలు గుర్తించాయి. ఆ లాకర్లను తెరిచేందుకు చర్యలు చేపట్టి ఉన్నారు. ఆయా బ్యాంకులకు ఇప్పటికే తనిఖీలకు సంబంధించి లేఖలు వెళ్లినట్టు, ఒకటి రెండు రోజుల్లో లాకర్లలో ఉన్న మరింత అక్రమార్జన గుట్టును బయటపెట్టడంతో పాటు, మరికొన్ని ఐటీ సోదాలకు అవకాశాలు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, ఢిల్లీ నుంచి అనుమతి రాగానే, అమ్మ జయలలిత గది తాళం తెరవడం ఖాయం అని చెబుతున్నారు. మిడాస్ మద్యం బంద్ శశికళ కుటుంబానికి చెందిన మిడాస్ స్పిరిట్, లిక్కర్స్ ద్వారా అనేక మద్యం బ్రాండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కాంచీపురం జిల్లా పడప్పై సమీపంలోని వేల ఎకరాల విస్తీరణంలో ఉన్న పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే బ్రాండ్లన్నీ టాస్మాక్ మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక్కడి బ్రాండ్లకే ఇదివరకు ప్రాధాన్యత ఉండేది. అయితే, ప్రస్తుతం ఐటీ దాడుల నేపథ్యంలో మిడాస్ మద్యం కొనుగోలును టాస్మాక్ వర్గాలు నిలుపుదల చేశాయి. ఐటీ దాడులు, విచారణల నేపథ్యంలో ఎక్కడ తమ మీద ఐటీ కన్ను పడుతుందో అనే బెంగో లేదా, మరేదేని కారణాలో ఏమోగానీ మిడాస్ బ్రాండ్ల కొనుగోలును నిలుపుదల చేస్తూ మార్కెటింగ్ శాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పెన్ డ్రైవ్‌లో రహస్యమా? దినకరన్ ఆదివారం తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ, అబ్బో పెన్‌డ్రైవ్‌లో రహస్యాలు ఉన్నాయా..? అని వ్యంగ్యాస్త్రం సంధించారు. పెన్ డ్రైవ్ అంటే అందులో వ్యక్తిగత విషయాలు ఉండవచ్చు, రహస్యాలూ ఉండ వచ్చని వ్యాఖ్యానించారు. అంత మాత్రాన అభూత కల్పనలతో వ్యాఖ్యలు చేయ వద్దు అని సూచించారు. శశికళ భద్రతకు అమ్మ చర్యలు తీసుకోలేదని దివాకరన్ వ్యాఖ్యానించడంలో తప్పు లేదని పేర్కొన్నారు. జయలలిత కష్ట సుఖాల్లో శశికళ పాలు పంచుకున్నారని, అమ్మ ఇప్పుడు లేని దృష్ట్యా, చిన్నమ్మకు ఎదురు అవుతున్న కష్టాల్ని చూసి, ఆమె సోదరు దివాకరన్ అలా చెప్పి ఉంటారని, దీనిన భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. సింహం లేదు కాబట్టే .. ఐటీ సోదాల గురించి పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సింహం జీవించి ఉన్నప్పుడు గుంట నక్కలు గుహలోకి చొరబడ్డాయని, ఆ నక్కల పుణ్యమా ఇప్పుడు గుహలో సోదాలు తప్పలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం కోటిన్నర మందితో కూడిన అన్నాడీఎంకే కేడర్‌కు ఆలయం అని, ఆ గుంట నక్కల రూపంలో ఇప్పుడు ఆలయానికి సంక్లిష్ట పరిస్థితులు తప్పడం లేదని వ్యాఖ్యానించారు. సింహం గుహలో ఉండి ఉంటే, దర్జాగా చొరబడి తనిఖీలు చేసి ఉంటారా..? అని ఐటీ వర్గాలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇక, పీఎంకే అధినేత రాందాసు ఓ ప్రకటనలో పేర్కొంటూ, జయలలిత ఏదో అవినీతికి దూరం అన్నట్టుగా అనేక మంది వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. అవినీతిలో జయలలిత మహారాణి అయితే, శశికళ యువ రాణి అని ఎద్దేవా చేశారు. కాగా, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఐటీ దాడుల గురించి తూత్తుకుడిలో పేర్కొంటూ, ఇక్కడ వ్యక్తిగత దాడులు జరగలేదని, ఐటీ వర్గాలు సేకరించిన సమగ్ర సమాచారం మేరకు సోదాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం పళని స్వామి మరో మారు మీడియా ముందు స్పందిస్తూ పోయెస్ గార్డెన్లో సోదాలు తీవ్ర మనోవేదనకు గురి చేసినట్టు వ్యాఖ్యలు గుప్పించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ స్పందిస్తూ, ఐటీ దాడులు చిన్నమ్మ కుటుంబానికే పరిమితం చేయకుండా, అన్నాడీఎంకే వర్గాలందర్నీ గురి పెట్టాలని, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మాజీలు, అందర్నీ వలయంలోకి తీసుకొస్తే బండారాలన్నీ బయటకు వచ్చి తీరుతాయని వ్యాఖ్యానించారు. వీడియోను అమ్మే చిత్రీకరించమన్నారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య చికిత్సల గురించి అమ్మ జయలలిత వీడియో చిత్రీకరించమన్నట్టు శశికళ సోదరుడు దివాకరన్ వ్యాఖ్యానించారు. ఓ మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడుతూ, అమ్మకు అందుతున్న వైద్యంలో అనుమానాలు అంటూ, డీఎంకే ఆరోపణలు గుప్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో అమ్మ జయలలిత వైద్య చికిత్సల గురించి వీడియో చిత్రీకరణ చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు.తనకు ఏదేని జరిగిన పక్షంలో, మరేదేని జరగవచ్చు అని, ద్రోహులు మన వద్దే ఉన్నట్టు శశికళ వద్ద అమ్మే స్వయంగా వ్యాఖ్యానించినట్టు వివరించారు. అయితే, శశికళకు భద్రతగా ప్రత్యేక వలయం ఏర్పాటు చేయక పోవడం ప్రశ్నార్థకం అని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి జయకుమార్ లాంటి వాళ్లు తమను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, వ్యక్తిగత పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఐటీ దాడులు ఎక్కడైనా జరగనీయండి, జరగవచ్చు అని వ్యాఖ్యానిస్తూ, పోయెస్ గార్డెన్లో జరగడం మనో వేదనకు గురిచేసిందన్నారు. పోయెస్ గార్డెన్లో పెన్ డ్రైవ్, కంప్యూటర్లు సీజ్ చేసినట్టుగా తనకు తెలియదన్నారు. అయితే, విచారణ అన్నది వచ్చాక, ఆ వలయంలోకి అందరూ తప్పకుండా వచ్చి తీరుతారని, ఇది జరుగుతుందని ముగించారు. -
మోదీ, జైట్లీ మా నాశనం కోరుకుంటున్నారు
సాక్షి, చెన్నై : పోయెస్ గార్డెన్లో జరుగుతున్న ఐటీ దాడులపై అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారంటూ ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఒకానోక దశలో ప్రధాన మోదీ, ఆర్థికశాఖ మంత్రి జైట్లీపై దినకరన్ తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. ట్యుటికోరన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘మోదీ, జైట్లీ మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అందులో వారి ఆధీనంలో ఉండే ఐటీ శాఖను మాపై దాడులకు ప్రయోగిస్తున్నారు. కేంద్రం కవ్వింపు చర్యలకు మేం భయపడే ప్రసక్తే లేదు. మేము ఎక్కడికి పారిపోం. చాతనైంది చేసుకోండి అంటూ మండిపడ్డారు. జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చెప్పుకున్న మోదీ.. ఆమె ఆప్పత్రిలో ఉన్నంత కాలం ఒక్కరోజు కూడా పరామర్శించేందుకు రాలేదని... కానీ, ఇప్పుడు కరుణానిధి ఇంటికి వెళ్లటం ఏంటని? ఆయన ప్రశ్నించారు. అయితే దానిని రాజకీయం చేయటం తమకు ఇష్టం లేదని ఆయన చెప్పారు. అమ్మ గౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెట్టి తమ పదువులను కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారంటూ సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్ పై దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయెస్ గార్డెన్లో సోదాలు జరుగుతున్నంత సేపు తమ వర్గానికి చెందిన కార్యకర్తలే బయట ఆందోళన చేపట్టారే తప్ప... పళని-పన్నీర్ వర్గానికి చెందిన వారు ఒక్కరైనా కనిపించారా? అని ఆయన నిలదీశారు. దీనిని బట్టే వారిద్దరికీ ఆమెపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా భారీ భద్రతా నడుపు జయ నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు.. శశికళ, పూన్‌గంద్రన్‌లు వినియోగించిన గదులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. -
పోయెస్ గార్డెన్లో ఐటీ దాడులు
-
పోయెస్ గార్డెన్లో ఐటీ దాడులు
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో శుక్రవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. న్యాయస్థానం అనుమతితో వారు ఈ దాడులు చేశారు. శుక్రవారం రాత్రి ఐటీ అధికారుల బృందం పోయెస్ గార్డెన్‌కు చేరుకుంది. అంతకముందే శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జయ టీవీ సీఈవో వివేక్‌కు ఫోన్ చేసి వేద నిలయం తాళాలు తీసుకుని రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లిన అధికారులు జయ, శశికళ వ్యక్తిగత గదుల్లో తనిఖీలు చేపట్టారు. శశికళ కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి ఒక లాప్టాప్, నాలుగు పెన్ డ్రైవ్‌ల కోసం ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం. పూంగున్రన్ గది, రికార్డుల గది, శశికళ వాడిన గదుల్లో మాత్రమే సోదాలు చేశామని ఐటీ అధికారి చెప్పారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేద నిలయం చుట్టుపక్కల భారీ భద్రత ఏర్పాట్లు చేసినా.. తనిఖీల విషయం తెలియగానే పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకుని పోలీసులతో ఘర్షణ పడ్డారు. దాడుల్ని శశికళ వర్గం తప్పుపట్టింది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ మాట్లాడుతూ.. అమ్మ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. శశికళ భర్తకు రెండేళ్ల జైలు సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొత్త కారు సెకండ్‌హ్యాండ్ అని చెప్పి కస్టమ్ శాఖను మోసగించిన కేసులో శశికళ భర్త నటరాజన్‌కు సీబీఐ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో శశికళ అక్క కుమారుడు భాస్కరన్‌తో పాటు మరో ఇద్దరికి కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. 1994 సెప్టెంబర్ 6వ తేదీన నటరాజన్ లండన్ నుంచి లెక్సెస్ అనే లగ్జరీకారును తమిళరసి పబ్లికేషన్ పేరిట దిగుమతి చేసుకున్నారు. -
'వేద' ఘోష!
పోలీస్ వలయంలో పోయెస్‌గార్డెన్ వందకుపైగా బలగాలతో మోహరింపు పనివాళ్లు, ప్రయివేటు సెక్యూరిటీకి చెక్ శశికళ కుటుంబ ప్రవేశంపై నిషేధం సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేదనిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జయ స్మారక మందిరంగా మార్చనున్నట్లు సీఎం ఎడపాడి చేసిన ప్రకటనతో పోయెస్‌గార్డెన్ పోలీస్ వలయంగా మారింది. గురువారం రాత్రి సీఎం ప్రకటించగానే పోలీసులు చేరుకోగా శుక్రవారం ఉదయానికి భారీ సంఖ్యలో బారికేడ్లు, సుమారు వందమందికి పైగా పోలీసు బలగాలు ప్రత్యక్షమయ్యాయి. వేదనిలయం సమీపించే రోడ్డులో మూడు చోట్ల పోలీసులు పహరా కాస్తున్నారు. శశికళ కుటుంబీకులను లోనికి వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారు. అలాగే ఆ పరిసరాలతో సంబంధం లేని వ్యక్తులను సైతం అనుమతించడం లేదు. వేదనిలయం సమీపంలో నివసిస్తున్న వారిని నిర్ధారించుకున్న తరువాతనే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం వేదనిలయం బెంగళూరు జైల్లో శశికళతోపాటు శిక్షను అనుభిస్తున్న ఇళవరసి కుమారుడు వివేక్ స్వాధీనంలో ఉంది. అయితే వీరికి సంబంధించిన వారెవ్వరూ అక్కడ నివసించడం లేదు. ఇటీవల వరకు మన్నార్‌కుడి (శశికళ స్వస్థలం)కి చెందిన కొందరు పనివాళ్లు, ప్రయివేటు సెక్యూరిటీ గార్డులు ఇంటిని కనిపెట్టుకుని ఉండేవారు. అయితే వారిని శుక్రవారం అక్కడి నుంచి పంపివేశారు. నాడు రూ.1.32 లక్షలు.. నేడు రూ.90 కోట్లు పోయెస్‌గార్డెన్‌లోని ఇంటిని జయ తల్లి సంధ్య 1967 జూలై 15 వ తేదీన తనపేరుపై కొనుగోలు చేశారు. 24 వేల చదరపు అడుగుల స్థలంలో 21,662 చదరపు అడుగుల్లో భవనాన్ని నిర్మించి ఉంది. రూ.1.32 లక్షలతో సొంతం చేసుకున్న వేదనిలయం విలువ నేడు రూ. 90 కోట్లని సమాచారం. ప్రభుత్వ నిర్ణయంపై దీప, దీపక్‌ల వివాదం: వేదనిలయంను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సహించేది లేదని గురువారమే అభ్యంతరం వ్యక్తం చేసిన జయ మేనకోడలు కేసు వేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అలాగే దీప సోదరుడు సైతం సదరు భవనం దీపకు, తనకు సొంతమని, అందుకు తగిన డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని దీపక్ శుక్రవారం ప్రకటిస్తూ సీఎం ఎడపాడికి లేఖ రాశారు. ప్రభుత్వానికి చేతనైతే చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని దీపక్ సవాలు విసిరారు. వేదనిలయం తన తదనంతరం కుమారుడు (జయకుమార్), కుమార్తె (జయలలిత)కు చెందాలని సంధ్య వీలునామా రాశారు. ప్రస్తుతం ఆ వీలునామా దీపక్ వద్ద ఉంది. అయితే ప్రజల కోసం ఏ ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. వారసత్వ హక్కును రుజువు చేసుకున్న వారికి నష్టపరిహారం చెల్లించి వేదనిలయంను స్వాధీనం చేసుకుంటామని మంత్రి సీవీ షణ్ముగం చెబుతున్నారు. చిన్నమ్మ కోసం దినకరన్ పరుగు: జయ మరణంపై విచారణ కమిషన్, పోయెస్‌గార్డెన్ ఇళ్లు ప్రభుత్వపరం కావడం, ఎడపాడి, పన్నీర్ ఏకమయ్యే ప్రయత్నాలు ఊపందుకోవడంతో అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు పరుగులు తీశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ తనకు ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చితీరుతానని దినకరన్ వ్యాఖ్యానించారు. -
జయలలిత ఆస్తులన్నీ మావే
► మేనత్త స్థానం నాతోనే భర్తీ : దీప ► ఆస్తులన్నీ మావే :దీపక్ చెన్నై : మేనత్త ఆస్తి కోసం మేనకోడలు, మేనల్లుడు పోటీ పడుతున్నారు. అత్తమ్మ ఆస్తులకు తామే అసలైన వారసులమంటూ ఎవరికి వారే ప్రకటించుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కోసం ఆమె సోదరుడి సంతాపం అయిన దీపక్, దీపలు ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం టీ నగర్‌లోని తన నివాసంలో దీప మీడియాతో మాట్లాడుతూ ఇక ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మాటల తూటాల్ని సంధించారు. పొయస్ గార్డెన్‌ను కైవసం చేసుకుంటానని, ఎవరు అడ్డొచ్చినా ఎదిరించి చొరబడటమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆస్తుల కైవసం లక్ష్యంగా చట్ట నిపుణులతో చర్చిస్తున్నానని, చట్టపరంగా అన్నీ సొంతం చేసుకుంటానని దీప ధీమా వ్యక్తం చేశారు. పొయస్ గార్డెన్లో ఏదో జరుగుతోందన్న అనుమానం వస్తోందన్నారు. తాను వేద నిలయంలోకి వెళ్లిన సమయంలో ఎవ్వరూ లేరని, శశికళ ఫోటోను తాను బయట పడేయడానికి ప్రయత్నించిన సమయంలో లోపలి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు చొచ్చుకు రావడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నదని అన్నారు. ప్రధాని మోదీ తనకు అపాయింట్మెంట్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నానని, ఆయన దృష్టికి అన్ని వివరాలను తీసుకెళ్తానని, పొయస్ గార్డెన్‌నే కాదు పార్టీని కూడా దక్కించుకుంటానని దీప ధీమా వ్యక్తం చేశారు. మేనత్త స్థానాన్ని తన ద్వారా భర్తీ చేయడానికి అన్నాడీఎంకే కేడర్ ఎదురు చూస్తున్నదని, వారి అభీష్టం మేరకు రెండాకుల చిహ్నాన్ని రక్షిస్తానని చెప్పారు. పదవులు ఉన్నంత వరకే సీఎం, మాజీ సీఎంల చుట్టూ కేడర్ ఉంటుందని, ఆ పదవులు దూరం కాగానే తన వైపుకు నేతలు వచ్చి తీరుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జయ పేరవై తరహాలో అన్నాడిఎంకేకు అనుబంధంగా ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై ఉంటుందన్నారు. ఆస్తులన్నీ మావే మరోవైపు జయ మేనల్లుడు దీపక్ మీడియాతో మాట్లాడుతూ తమ నానమ్మ గతంలో మేనత్త పేరిట ఆస్తుల వీలునామా రాసిందని, అవన్నీ అత్త జయలలిత పేరుతోనే ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో రాసిన వీలునామా మేరకు మేనత్త కోర్టుకు సమర్పించిన జాబితాలోని ఆస్తులకు ప్రస్తుతం తాను,తన సోదరి మాత్రమే వారసులం అని వ్యాఖ్యానించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని, చిన్నత్త శశికళ ఫోటోను బయట పడేయడాన్ని తాను వ్యతిరేకించడంతో దీప ఆగ్రహించినట్టు తెలిపారు. అంతకుముందు తామిద్దరం అక్కడే అల్పాహారం కూడా తీసుకున్నట్టు, అయితే చిన్నత్త సెక్యూరిటీ అడ్డుకుంటే తాను ఏమి చేయగలనని ప్రశ్నించారు. తాను ఇప్పుడు, ఎప్పుడూ ఒక్కటే చెబుతానని, మేనత్తకు చెందిన అన్ని ఆస్తులకు తామిద్దరం మాత్రమే వారసులం అని, మరెవ్వరూ లేరని స్పష్టం చేశారు. కొన్ని ఆస్తులు వేరే వ్యక్తుల గుప్పెట్లో ఉన్నాయని, వారు తప్పుకుంటే మంచిదని హెచ్చరించారు. గార్డెన్‌లోని ఇంటికి తాను తరచూ వెళ్లి వస్తున్నట్టు, అక్కడ ఎలాంటి అనుమానాస్పద విషయాలు, దాడులు తనకు ఎదురు కాలేదని స్పష్టం చేశారు. తొలుత చిన్నమ్మ శశికళకు అనుకూలంగా వ్యవహరించిన దీపక్ తదుపరి పరిణామాలతో తన సోదరికి దగ్గరయ్యే విధంగా వ్యవహరించడం మొదలెట్టారు. -
సోదరుడిపై దీప సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసత్వ పోరు మరో మలుపు తిరిగింది. జయ వారసురాలిని తానేనని ప్రకటించుకున్న ఆమె మేనకోడలు దీపా కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తన సొంత సోదరుడు దీపక్ జయకుమార్‌పై విరుచుకుపడ్డారు. దీపక్.. శశికళ వర్గంతో చేతులు కలిపి తనను మోసం చేశాడని పేర్కొన్నారు. ‘దీపక్ తెల్లవారుజామున 5.30 గంటలకు నాకు ఫోన్ చేసి పోయెస్ గార్డెన్‌కు రమ్మని చెప్పాడు. మీరు నన్ను లోపలికి అనుమతించడం లేద’ని పోలీసులతో దీప వాగ్వాదానికి దిగారు. జయ నివాసంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన మద్దతుదారులతో కలిసి ఆమె ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని అన్నారు. పోయెస్ గార్డెన్ వస్తువులు మాయమవుతున్నాయని ఆరోపించారు. తనను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు. కాగా, జయలలిత ఆస్తులను తనకు, తన సోదరికి సమానంగా రాసిచ్చారని గతంలో దీపక్ కుమార్ తెలిపారు. జయ ఆస్తులు తమిద్దరికీ చెందుతాయని అన్నారు. మరోవైపు ఈ వివాదంపై మంత్రి డి. జయకుమార్ స్పందించారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. -
జయలలిత ఆస్తులు నాకే దక్కాలి!
పోయెస్ గార్డెన్ వద్ద హైడ్రామా చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమున్న పోయెస్ గార్డెన్ వద్ద ఆదివారం హైడ్రామా నెలకొంది. జయలలిత మేనకోడలు దీప అనూహ్యంగా పోయెస్‌గార్డెన్ వద్ద ప్రత్యక్షమై.. అక్కడ ఉన్న జయ నివాసం ‘వేదవల్లి’లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జయ నివాసంలోకి వెళ్లకుండా తనను అడ్డుకున్న పోలీసులతో దీప వాగ్వాదానికి దిగారు. జయలలితకు అధికారికంగా వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తులు ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. పోయెస్ గార్డెన్‌లోని ఆమె ‘వేదవల్లి’ నివాసం కూడా సర్కారు అధీనంలోనే ఉంది. అయితే, ఈ నివాసాన్ని తాను స్వాధీనం చేసుకుంటానని, తనను నివాసంలో ఉండేందుకు అనుమతించాలంటూ దీప ఆదివారం హల్చల్ చేశారు. తన అనుచరులతో వచ్చి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. జయలలిత ఆస్తులు తమకే దక్కాలని, జయలలిత వారసులను ఇంటిలోకి వెళ్లకుండా అనుమతించడం సరికాదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
అన్నీ సుడిగుండాలే!
♦ నిన్నటి వరకు పొగడ్తలు ♦ నేడు తిట్ల పురాణం ♦ టీటీవీకి అన్నీ కష్టాలే ♦ ఇక కోర్టుల చుట్టూ ప్రదక్షణలే అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా ఏ క్షణాన పగ్గాలు చేపట్టాడో ఏమోగానీ, అడుగడుగునా సుడిగుండాల్ని దాటాల్సిన పరిస్థితి దినకరన్‌కు తప్పలేదు. నిన్నమొన్నటి వరకు పొగడ్తల పన్నీరులో ముంచిన వాళ్లు, నేడు తిట్ల పురాణం అందుకోవడం టీటీవీకి పెద్ద షాక్కే. రెండు నెలల వ్యవధిలో అన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో కోర్టుల చుట్టూ తిరగక తప్పదేమో..! సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే వర్గాలు అమ్మ జయలలిత బతికే ఉన్నప్పుడు నెచ్చెలి శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్‌ను అన్నాడీఎంకే నుంచి బయటకు పంపించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే విదేశీ మారక ద్రవ్యంతో పాటు మరికొన్ని కేసులు దినకరన్ మెడకు వేలాడుతున్నా, విచారణల వేగం మాత్రం వాయిదాల పర్వంతో సాఫీగా సాగుతూ వచ్చాయి. అమ్మ ఉన్నంత కాలం పోయెస్ గార్డెన్ వైపుగానీ, పార్టీ కార్యాలయం వైపుగానీ కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి. ఆ అమ్మ మరణంతో పోయెస్‌గార్డెన్‌లో తిష్ట వేయడమే కాదు, చిన్నమ్మ శశికళ ఆశీస్సులతో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు. చిన్నమ్మ ప్రతినిధిగా పార్టీని పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకునేందుకు తగ్గ అస్త్రాలతో దినకరన్ ముందుకు సాగారని చెప్పవచ్చు. పార్టీ పదవికి చేతికి చిక్కిన వారం రోజుల అనంతరం ఫిబ్రవరి 23వ తేదీ అధికారికంగా బాధ్యతలు నిర్వహించారు. దీంతో టీటీవీ జై...అంటూ పొగడ్తల పన్నీరు చల్లేందుకు ఆ కార్యాలయం వైపుగా పోటేత్తిన సేనలు కోకొల్లలు. కాళ్ల మీద ఆశ్వీరచనాలు తీసుకున్న వాళ్లూ ఉన్నారు. ఇక, అమ్మ తరహాలో కార్యాలయం మీద నుంచి విక్టరీ చిహ్నం చూపించడం ఏమిటో, తానే ఇక అన్నాడీఎంకేకు భవిష్యత్తు అన్నట్టుగా ఠీవీని ప్రదర్శించారని చెప్పవచ్చు. అన్నీ సుడిగుండాలే : ఏ ముహూర్తాన ఆ పదవిలో దినకరన్ కూర్చున్నారో ఏమోగానీ వరుస గండాలు, సుడిగుండాల్ని దాటక తప్పలేదు. జయలలిత మేనల్లుడు దీపక్ ఆయనకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తున్నా, మాజీ సీఎం పన్నీరు రూపంలో చిక్కులు ఎదురైనా అన్నింటినీ అడ్డుకునేందుకు వీరోచితంగా శ్రమించక తప్పలేదు. ఓ వైపు తన పట్టు పార్టీలో బిగిసే రీతిలో నేతలతో మంతనాలు, అసంతృప్తి వాదులకు బుజ్జగింపులు ఇలా నిత్యం రాయపేట కార్యాలయంలో ఉంటూ తన సత్తాను చాటుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. ఆర్కేనగర్లో గెలుపుతో సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయం అన్నంతగా ఎదిగిన దినకరన్‌ను ఒక్కసారిగా పాత, కొత్త సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఇరకాటంలో పడ్డారని చెప్పవచ్చు. ఇక కోర్టు చుట్టూ ప్రదక్షిణలేనా: ఆర్కేనగర్ రూపంలో కష్టాలు మరింతగా చుట్టుముట్టడంతో సాగిన పరిణామాలు ప్రస్తుతం టీటీవీకి కష్టాలను కొని తెచ్చిపెట్టారు. ఓ వైపు విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ వేగవంతం కావడం, కోర్టుమెట్లు ఎక్కాల్సిన పరిస్థితుల నేపథ్యంలో రెండాకుల చిహ్నం కోసం సాగిన లంచం వ్యవహారం మెడకు బిగుసుకోవడంతో ఇక కేసుల ఊబిలో కూరుకు పోయినట్టు పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో నిన్న మొన్నటి వరకు పొగడ్తల పన్నీరు చల్లిన వాళ్లు, ప్రస్తుతం తిట్ల పురాణంతో తప్పుకో...అంటూనే, తప్పించేశాం...ఇక కార్యాలయం వైపుగా అడుగులు కూడా పెట్టొదంటూ హెచ్చరికలు చేసే పనిలో పడడం గమనార్హం. ఇప్పటికే పాస్‌పోర్టు సీజ్ చేయబడి ఉన్నా, తాజా పరిణామాల నేపథ్యంలో విదేశాలకు పారిపోకుండా వాంటెడ్ లిస్టులో ఆయన పేరు ఎక్కడం, ఎగ్మూర్ కోర్టు మెట్లు ఎక్కడం అన్నీ ఒకే రోజు జరిగి పోవడంతో గమనార్హం. దీన్ని బట్టి చూస్తే మున్ముందు దినకరన్ పరిస్థితి ముందు గొయ్యి...వెనక నొయ్యి అన్నట్టుగా ఉంటుందేమోనని ఎద్దేవా చేసే వాళ్లూ పెరుగుతున్నారు. మొన్నటి వరకు కేడర్ మధ్యలో ఠీవీగా నడిచిన దినకరన్ ఇక, న్యాయవాదులు, పోలీసులు నడుమ కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పదేమో..!. ఇందుకు అద్దం పట్టే రీతిలో బుధవారం ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎగ్మూర్ కోర్టు విచారణకు తన న్యాయవాదులతో కలిసి అడుగు పెట్టారు. ఇక, తన బలాన్ని చాటుకునే విధంగా పార్టీ కార్యాలయంలో సమావేశానికి సిద్ధ పడ్డా, అడుగు పెట్ట వద్దంటూ వచ్చిన హెచ్చరికతో గౌరవంగానే తప్పుకుంటున్నా..అన్నట్టు మీడియా ముందుకు వ్యాఖ్యలు వళ్లించడం బట్టి చూస్తే, కొన్ని సామెతులు గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుందేమో..! -
వీడని ఉత్కంఠ
రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేదెవరో అన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా రాజ్‌భవన్ చుట్టూ రాజకీయం సాగింది. ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన కె పళనిసామి మరో మారు వేర్వేరుగా గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. గార్డెన్ నుంచి బయలు దేరి అమ్మ సమాధి వద్ద నివాళులర్పించినానంతరం చిన్నమ్మ శశికళ బెంగళూరు కోర్టుకు వెళ్తున్న సమయంలో ఆమె శిబిరం తీవ్ర విషాదంలో మునిగింది. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో రాజకీయ పోరు ఉత్కంఠ భరితంగానే సాగుతోంది. చిన్నమ్మ శశికళకు జైలు శిక్ష పడడం ఆమె శిబిరాన్ని ఢీలా పడేలా చేసింది.అయినా, సేనలకు భరోసా, ధైర్యాన్ని ఇచ్చిన చిన్నమ్మ శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో బయటకు వచ్చారు. అక్కడున్న మద్దతుదారులు చిన్నమ్మకు ఎదురైన కష్టాన్ని తలచుకుని ఉద్వేగానికి గురయ్యారు. తన కంట నీరు సుడులు తిరుగుతున్నా, బయటకు రానివ్వకుండా, మద్దతుదారులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని చిన్నమ్మ చేశారు. చివరకు సెలవంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. నేరుగా మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్ద, రామాపురం తోట్టంలోని ఎంజీఆర్ ఇంటి వద్ద కాసేపు మౌనంగా కూర్చున్నారు. అక్కడి నుంచి ఆమె బెంగళూరుకు పయనం అవుతున్న వేళ, మద్దతు దారుల హృదయాలు బరువెక్కాయి. కంటి నుంచి నీటి ధార పొంగింది. ముందుగా, చిన్నమ్మ జైలుకు వెళ్లనుండడంతో పార్టీ పరంగా తమకు పెద్ద దిక్కుగా ఎవరు ఉంటారో అని మద్దతుదారులు ఎదురు చూస్తున్న సమయంలో హఠాత్తుగా టీటీవీ దినకరన్ తెర మీదకు రావడం ఆ శిబిరానికి ఊరట. దినకరన్ చేతిలో అధికారం: అధికారం తన విధేయుడు పళనిసామి చేతికి చేరిన పక్షంలో, జైలు నుంచే ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించేందుకు తగ్గ వ్యూహంతో చిన్నమ్మ బెంగళూరుకు బయలు దేరి వెళ్లారు. తన సోదరి వనిత వాణి కుమారుడు టీటీ దినకరన్ చేతిలో పార్టీని ఉంచడం, సర్వాధికారాల్ని అప్పగించి వెళ్లడంతో ఇక, శశికళ కుటుంబ రాజకీయ హవా చిన్నమ్మ శిబిరంలో మరింతగా పెరిగినట్టే. అదే సమయంలో దినకరన్‌కు చిన్నమ్మ శిబిరంలో వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మున్ముందు ఈ శిబిరంలో ఆసక్తికర మలుపులకు అవకాశాలు ఎక్కువే. ఇక, ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ, కిడ్నాప్‌నకు గురయ్యారంటూ వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించినానంతరం చిన్నమ్మ శిబిరంపై కేసుల మోత మోగించే పనిలో పోలీసులు పడటం గమనార్హం. పన్నీరు శిబిరంలో సందడి కరువు: చిన్నమ్మ శిబిరంలోఉద్వేగ భరిత వాతావరణం చోటు చేసుకుంటే, గ్రీన్‌వేస్ రోడ్డులోని పన్నీరు శిబిరంలో సందడి కరువు అయింది. నిన్నటి వరకు పెద్ద సంఖ్యలో మద్దతు దారులు తరలి రాగా, బుధవారం సంఖ్య తగ్గింది. సినీ నటి గౌతమి అక్కడికి వచ్చిన పన్నీరు మద్దతు పలికారు. ముఖ్య నేతలతో పన్నీరు సమాలోచనలో బిజీబిజీ అయ్యారు. కూవత్తూరులో ...: కూవత్తూరులోని క్యాంప్ ఆవరణలో మధ్యాహ్న సమయంలో హై టెన్షన్ వాతావరణం కాసేపు నెలకొంది. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. పోలీసు బలగాలు క్యాంప్ వైపుగా దూసుకు రావడంతో శిబిరాన్ని ఖాళీ చేయిస్తారా..?అన్న ఉత్కంఠ తప్పలేదు. చిన్నమ్మ శిబిరంలోని ఎమ్మెల్యేలు కిడ్నాప్‌నకు గురయ్యారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయడంతో, అందుకు తగ్గ చర్యలు ఏదేని చేపట్టనున్నారా అన్న ప్రశ్న బయలు దేరింది. చివరకు ఉత్కంఠ వీడినా, చిన్నమ్మకు విశ్వాసంగా ఉన్న ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మీడియా ముందుకు వచ్చి, తాము ఆనందంగా, స్వతంత్రంగా ఉన్నామని, తమను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని ప్రకటించారు. గవర్నర్ నుంచి పిలుపు వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రాజ్ భవన్ చుట్టూ: అన్నాడీఎంకే రాజకీయ సమరం రాజ్‌భవన్ చుట్టూ సాగింది. తమను ఆహ్వానిస్తారా...తమను ఆహ్వానిస్తారా..? అన్న ఎదురు చూపుల్లో రెండు శిబిరాలు సాయంత్రం వరకు నిమగ్నమయ్యాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంగా న్యాయ నిపుణులతో గవర్నర్(ఇన్) సీహెచ్ విద్యాసాగర్ రావు సంప్రదింపుల్లోనే ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ సమయంలో సాయంత్రం పళనిస్వామి గవర్నర్‌తో భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంగా ఎలాంటి నిర్ణయాలు, హామీలు గవర్నర్ నుంచి రాలేదు. తదుపరి ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, మంత్రి పాండియరాజన్ రాజ్‌భవన్‌లో అడుగు పెట్టడంతో ఎదురు చూపులు మరింతగా పెరిగాయి. అయితే, ఇవన్నీ కేవలం భేటీలుగా మిగిలినా, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కీలక మలుపులు తిరిగేనా అన్న చర్చ బయలు దేరింది. కొన సాగుతున్న ఉత్కంఠకు తెర పడేది ఎప్పుడో అన్న ఎదురు చూపుల్లో రాజకీయ వర్గాలు, రాష్ట్ర ప్రజలు నిమగ్నమయ్యారు. -
చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ
♦ నేడు కోర్టు తీర్పు ♦ పోయెస్ గార్డెన్‌కు పోటెత్తిన అభిమానం ♦ కార్యకర్తల్లోకి శశికళ ♦ భద్రత మరింత కట్టుదిట్టం అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో వెలువడే తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ చిన్నమ్మ శశికళ మద్దతుదారుల్లో నెలకొంది. దీంతో రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సోమవారం చిన్నమ్మకు మద్దతుగా పోయెస్‌గార్డెన్‌కు అభిమానులు పోటెత్తారు. గార్డెన్ నుంచి బయటకు వచ్చిన శశికళ కార్యకర్తలతో ముచ్చటించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ సమరంలో ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వంకు మద్దతుగా ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, తారలు, మాజీ ఎమ్మెల్యేలు గ్రీన్ వేస్ రోడ్డు వైపుగా కదులుతున్నారు. పెద్ద సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానుల తాకిడి రెండు రోజులుగా గ్రీన్‌వేస్ రోడ్డు వైపుగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం చిన్నమ్మ కువత్తూరు వేదికగా చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం అన్నాడీఎంకే కింది స్థాయి కార్యకర్తల్ని, నాయకులను కదిలించినట్టుంది. రెండు రోజులుగా అంతంత మాత్రంగానే పోయెస్‌గార్డెన్ పరిసరాల్లో సందడి నెలకొనగా, ప్రస్తుతం అభిమాన కెరటం పోటెత్తుతోంది. శశికళకు మద్దతుగా తండోపతండాలుగా కార్యకర్తలు తరలి రావడంతో ఆ పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. ముందుగా పార్టీ ముఖ్యులతో మాట్లాడే క్రమంలో అమ్మ జయలలిత వెన్నంటి ఉంటూ తాను చేసిన సేవలు, అందించిన సహకారాన్ని వివరించారు. పన్నీరు రూపంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ, ఆ శిబిరం ఎత్తులను చిత్తు చేస్తూ, అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఒకే మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. క్రమంగా అభిమాన తాకిడి పెరగడంతో శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బయటకు రాక తప్పలేదు. కార్యకర్తల్లో చొచ్చుకు వస్తూ, వారితో ముచ్చటించారు. కార్యకర్తల మ«ధ్యలో నిలబడి మరీ ప్రసంగ పాఠంతో ఆకర్షించే యత్నం చేశారు. పోయెస్ గార్డెన్ నుంచి కువత్తూరుకు వెళ్లే మార్గంలో ప్రజాకర్షణ దిశలో చిన్నమ్మ పయనం సాగినా, చిన్నమ్మ ప్రసంగాలు ఆకర్షించే విధంగా ఉన్నా, మంగళవారం వెలువడబోయే తీర్పుపై ఆమె మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ మాత్రం తప్పడం లేదు. చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ: అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించనుంది. మంగళవారం పదిన్నర గంటలకు తీర్పును ప్రకటించనున్నట్టు సుప్రీంకోర్టులో నుంచి వెలువడ్డ ప్రకటనతో చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనన్న ఆందోళన బయల్దేరింది. చిన్నమ్మకు అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందో అన్న చర్చ మీడియాల్లో సైతం పెరగడంతో తీర్పుపై ఆసక్తి పెరిగింది. తీర్పు వ్యతిరేకంగా ఉన్న పక్షంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఏదేని సంఘటనలు చోటు చేసుకోవచ్చన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భద్రత పెంచుతూ, ప్రధాన ప్రాంతాల్లో చెక్ పోస్టులు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
పన్నీర్ అమ్ముడుపోయారు చిన్నమ్మే కావాలి
-
పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి
నిన్న మొన్నటి వరకు బోసిపోయిన పోయెస్ గార్డెన్స్ ఒక్కసారిగా శశికళ మద్దతుదారులతో నిండిపోయింది. సోమవారం ఉదయం నుంచి తమిళనాడు వ్యాప్తంగా పలువురు మద్దతుదారులు, కార్యకర్తలు పోయెస్ గార్డెన్స్ వద్దకు వెల్లువెత్తారు. పన్నీర్ సెల్వం అమ్ముడుపోయారని, అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటున్నారని, కానీ ఒకరోజు ఆలస్యమైనా ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం కచ్చితంగా చిన్నమ్మేనని ఆమె మద్దతుదారులు అన్నారు. ఇంతకుముందు వరకు ఎక్కడ చూసినా జయలలిత ఫొటో మాత్రమే కనిపించగా, ఇప్పుడు అక్కడకు చేరుకున్న అందరివద్ద జయలలిత, శశికళ ఇద్దరూ ఉన్న ఫొటోలు దర్శనమిచ్చాయి. తమకు కావల్సింది చిన్నమ్మేనని, ఆమె ముఖ్యమంత్రి కావడం ఖాయమని మద్దతుదారులు గట్టిగా చెబుతున్నారు. గవర్నర్ ఎందుకంత మౌనంగా ఉన్నారని.. ఇది ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం వద్ద ఉన్నది ఏడు- ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమేనని, వాళ్లతోనే ఆయన ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటుచేస్తారని, అసెంబ్లీలో బలం ఎలా నిరూపించుకుంటారని మండిపడ్డారు. మొత్తమ్మీద ఇన్నాళ్ల తర్వాత మళ్లీ శశికళకు క్షేత్రస్థాయి మద్దతు కొంతవరకు కనిపించినట్లు అయింది. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
‘అమ్మ’ ఇల్లు ఎవరికి సొంతం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై లోని పోయెస్ గార్డెన్లో దివంగత సీఎం జయలలితకు చెందిన ఇల్లు ఎవరి కి దక్కుతుందనే చర్చ మొద లైంది. ప్రస్తుతం రూ.90 కోట్ల విలువ చేసే ఈ ఇంటిని జయలలిత, ఆమె తల్లి సంధ్య కలిసి కొనుగోలు చేశారు. సంధ్య మరణాంతరం ఆ ఇంటిని తనకు ఇవ్వాల్సిందిగా జయ అన్న జయరామన్ కోరారు. తాను ఇక్కడే నివసిస్తానని, మరొకరికి ఇవ్వనని జయ చెప్పారు. జయ మరణిం చాక..ఆమెకు వారసులు లేకపోవడంతో ఆ ఇల్లు ఎవరికి సొంత మనే సందేహం తలెత్తింది. జయ అన్న కుమారుడు దీపక్, కుమా ర్తె దీప రక్త సంబంధీకులుగా ఉన్నారు. అయితే జయతోపాటు శశి కళ కూడా అదే ఇంటిలో నివసించారు. ‘అమ్మ’ మరణం తరువాత కూడా అందులోనే ఉంటున్నారు. జయ నివసించిన ఇల్లు తమకు దేవాలయం లాంటిదని, దీన్ని స్మారక మందిరంగా మారుస్తా మని ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం ప్రకటించారు. అయితే, ఈ ఇల్లు శశికళ సోదరుడి భార్య ఇళవరసి పేరున ఉన్నట్లు ఒక ఆంగ్ల టీవీ చానల్‌కు వారి బంధువులు తెలిపారు. ఇందుకు సంబంధిం చిన డాక్యుమెంట్లు కూడా చూపారు. -
జయను రజనీ ఎందుకు ఓడించారు?
ఇప్పటికీ రాజకీయాల్లోకి వచ్చే చాన్స్ ఉందా! 'నేను ఆమె(జయలలిత)ను గాయపరిచాను. ఆమె పార్టీ ఓడిపోవడానికి నేను ప్రధాన కారణం'.. ఇటీవల కన్నుమూసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, జర్నలిస్టు-నటుడు చో రామస్వామికి సినీ నటులు ఏర్పాటుచేసిన సంతాప సభలో సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యక్తం చేసిన పశ్చాత్తాపం ఇది. 1996నాటి అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'జయలలిత మరోసారి అధికారంలోకి వస్తే.. దేవుడు కూడా తమిళనాడును కాపాడలేరు' అంటూ అప్పట్లో రజనీ చేసిన రాజకీయ ప్రకటన పెద్ద సంచలనమే రేపింది. 'బాషా' వంటి సూపర్‌హిట్ సినిమాలతో అప్పట్లో రజనీ ఇమేజ్ శిఖరస్థాయిలో ఉంది. అంతేకాకుండా 'నేను ఒక్కసారి చెప్తే.. వందసార్లు చెప్పినట్టే' అంటూ రజనీ ఈ సినిమాలో చెప్పిన పంచ్‌డైలాగ్ ప్రజల్లో నాటుకుపోయింది. ఈ క్రమంలో రజనీ ప్రకటనతో 1996 ఎన్నికల్లో జయలలిత అన్నాడీఎంకే పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. 234 స్థానాల్లో నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకుంది. జయలలిత పోటీ చేసిన రెండుస్థానాల్లోనూ ఓడిపోయారు. వైరం ఎందుకు? రజనీకి, జయలలితకు వైరం ఎందుకు అంటే ఓ వదంతి లాంటి కథ వినిపిస్తూ ఉంటుంది. పోయెస్ గార్డెన్లో రజనీ, జయ ఇళ్లు ఇరుగుపొరుగునే ఉంటాయి. పోయెస్ గార్డెన్ వీధుల్లో రజనీ, జయ ఎదురుపడితే భూమి దద్దరిల్లిపోయేదని స్థానికులు చెప్పేవారు. ఓ రోజు రజనీ కారులో వెళుతుండగా సీఎం జయలలిత సెక్యూరిటీ సిబ్బంది.. రోడ్డు క్లియర్ చేసేందుకు రజనీని అడ్డుకున్నారు. దీంతో రజనీ కారు దిగి బయటకు వచ్చి సిగరెట్ (స్థానికంగా ఉన్న వ్యాపారి దగ్గర రజనీయే స్వయంగా కొన్నారని అంటారు) కాలుస్తూ నిలుచుండి పోయారు. కొద్దిక్షణాల్లో అక్కడ రజనీ అభిమానులు పెద్ద ఎత్తున మూగడంతో సీఎం సెక్యూరిటీ సిబ్బందికి చుక్కలు కనిపించాయి. ఈ ఘటనతో సూపర్‌స్టార్ అంటే ఏంటో రజనీ నేరుగా సందేశం ఇచ్చినట్టు అయింది. రాజకీయ ఎంట్రీ చాన్స్ ఇంకా ఉందా? 1996 ఎన్నికల్లో రజనీ ప్రకటన ప్రకంపనలు రేపింది. మరీ ఇప్పటికీ రాజకీయ ప్రవేశానికి రజనీకి అవకాశం ఉందా? అంటే పరిశీలకులు లేదనే అంటున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు రజనీకి వచ్చిన మహాత్తర అవకాశం ఇప్పుడు చేయి జారిపోయిందని అభిప్రాయపడుతున్నారు. 1996లో రజనీకి ఒక మహాత్తరమైన రాజకీయ అవకాశం వచ్చిందని, తొలిసారి ఆయన చెడ్డ ప్రభుత్వం గురించి మాట్లాడగా.. అది ప్రజల్లోకి వెళ్లిందని, కానీ, ఇప్పుడు అలాంటి అవకాశమేది రజనీకి లేదని అంటున్నారు. రజనీ ప్రకటన తర్వాతే నటులకు ఉన్న ఛరిష్మాతో లబ్ధి పొందేందుకు విజయ్‌కాంత్ లాంటి నటులు రాజకీయాల్లో అడుగుపెట్టారు. సినీ నటులు అయినంత మాత్రాన ప్రజలు ఎన్నికల్లో వారికి బ్రహ్మరథం పడతారనడానికి వీలు లేదని ఇటీవలి అనుభవాలు చాటుతున్నాయి. అయితే, 2014 ఎన్నికల సందర్భంగా చెన్నైలో ప్రచారానికి వచ్చిన నరేంద్రమోదీ రజనీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ ఇది మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమే. ఆ తర్వాత రజనీ రాజకీయ ఎంట్రీ గురించి ఎవరూ మాట్లాడింది లేదు. ఆయన అభిమానులు చాలామంది కూడా రజనీ రాజకీయాలకు దూరంగా ఉండాలనే కోరుకుంటున్నారు. -
మా అత్తకు శశికళ చెడ్డపేరు తెచ్చారు
చెన్నై: జయలలిత వారసురాలిని తానేనని, పోయెస్ గార్డెన్ బంగ్లా తనకే చెందాలని ఆమె మేనకోడలు దీప అన్నారు. శశికళ నటరాజన్‌పై అవినీతి కేసులున్నాయని, అన్నా డీఎంకే పార్టీని నడపడానికి ఆమె సరైన వ్యక్తి కాదని జాతీయ మీడియాతో చెప్పారు. శశికళపై ఉన్న అవినీతి కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దీప గుర్తు చేశారు. ప్రజలు ఆమెను నాయకురాలిగా కోరుకోవడం లేదని చెప్పారు. గొప్ప నాయకురాలైన జయలలితకు శశికళ చెడ్డపేరు తెచ్చారని అన్నారు. జయలలిత తన ఆస్తులకు సంబంధించి వీలునామా రాయకపోవడంతో ఎవరికి దక్కుతాయనేది ప్రశ్నగా మారింది. జయలలిత మరణానంతరం పోయెస్ గార్డెన్ ఇంట్లో ఆమె స్నేహతురాలు శశికళ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో దీప స్పందించారు. శశికళ పన్నిన కుట్ర వల్లే తమ కుటుంబం అత్తకు దూరమైందని ఆరోపించారు. ఇదిలావుండగా, జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి స్వాధీనం చేసి.. ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని ఆమె సోదరి కుమార్తె అమృత డిమాండ్ చేసిన విషయం విదితమే. జయలలితకు స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కూతురు దీప కాగా.. జయ సొంత చెల్లెలు కుమార్తె అమృత. -
చెన్నైలో పోయెస్ గార్డెన్ వద్ద ఉద్రిక్తత
-
పోయెస్ గార్డెన్ వద్ద ఉద్రిక్తత.. ముట్టడికి యత్నం
చెన్నై: జయలలిత మృతిచెందిన తర్వాత తమిళనాడు రాజకీయాలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేటి ఉదయం తమిళనాడు అసెంబ్లీ సమావేశం కావడం.. శశికళకే పార్టీ పగ్గాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వదంతులు ప్రచారమయ్యాయి. శశికళను పార్టీ చీఫ్ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అన్నాడీఎంకే కార్యకర్తలు పోయెస్ గార్డెన్ వద్ద ఆందోళనకు దిగారు. కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు పోయెస్ గార్డెన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అక్కడినుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. గత సోమవారం రాత్రి జయ మృతిచెందగా ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ.పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, ఆపై అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత నెచ్చెలి శశికళ బాధ్యతలు తీసుకున్నారు. జయ మరణానంతరం ఆమె స్నేహితురాలు శశికళ పోయెస్ గార్డెన్ లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పన్నీరు సెల్వం ఇప్పటికే రెండుసార్లు పోయెస్ గార్డెన్‌కు వెళ్లి శశికళతో సమావేశమయ్యారు. కొందరు సీనియర్ నేతలు కూడా శశికళకు బాధ్యతలు ఇవ్వడంపై సముఖంగా లేరని తెలుస్తోంది. పార్టీ నేతలు మాత్రం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా శశికళ పేరును ప్రకటించకపోవడం గమనార్హం. -
అమ్మ ఆస్తులు ఎవరికి ?
-
అమ్మ ఆస్తులు ఎవరికి?
చెన్నై: నంబర్ 81, వేదా నిలయం, పోయెస్ గార్డెన్.. తమిళనాట రాజకీయానికి ఈ చిరునామా బలమైన అడ్డా. దాదాపు పాతికేళ్లు తమిళనాడులో అసలైన రాజకీయాలు ఈ చోటు నుంచే ప్రారంభమయ్యాయి. ఎప్పుడో తమిళనాడు ముఖ్యమత్రి జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఈ ఆస్తిని తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు జయ ఉపయోగించుకున్నారు. పోస్ గార్డెన్ అనగానే చుట్టుపక్కలవారికి బలమైన రాజకీయ శక్తికి నిలయం అని గుర్తించేలా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల అంచనా ప్రకారం ఈ ఎస్టేట్ విలువ ఇప్పుడు దాదాపు రూ.90కోట్లపై మాట. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన తర్వాత ప్రస్తుత పరిస్థితులు సర్దుమణిగేలా చేసేందుకు పార్టీ పగ్గాలు జయ ప్రాణ స్నేహితురాలు శశికలకు, సీఎం పదవి జయ విశ్వసనీయుడైన పన్నీర్ సెల్వంకు అప్పగించారు. అయితే, అమ్మ ఆస్తులకు ఎవరు వారసులుగా ప్రకటించబడతారనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో ఏనాడు తన తర్వాత ఎవరూ అనే విషయాన్ని జయ ప్రకటించలేదు. ఆమె అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు సైతం ఒక వీలునామా అంటూ రాయలేదు. దీంతో ఇప్పుడు ఆ ఆస్తులు ఎవరికీ కేటాయిస్తారనే అంశం ఉత్కంఠగా మారింది. ప్రధానంగా పరిశీలించినప్పుడు జయ స్నేహితురాలు శశికళ నటరాజన్‌కు వేదా నిలయంలో శాశ్వతంగా ఉండే హక్కు వస్తుందా లేక ఆమె మేనకోడలు దీపా జయకుమార్, సోదరుడు దీపక్ లకు ఈ అవకాశం వస్తుందా అని ఒక ప్రశ్న తలెత్తుతుండగా.. జయ రాజకీయ గురువు ఎంజీ రాంచంద్రన్‌కు రామాపురం, చెన్నైలో ఉన్న ఇళ్ల మాదిరిగానే చట్టపరమైన వివాదాల్లో చిక్కి ఇప్పటికీ ఎవరికీ దక్కనట్లుగానే అలాగే ఉండిపోతుందా అనేది మరో ప్రశ్న. జయలలిత అంతిమ సంస్కారాలను పూర్తి చేసిన శశికళ అనంతరం నేరుగా వేద నిలయానికి వెళ్లారు. వాస్తవానికి పోయెస్ గార్డెన్‌ను జయలలిత, ఆమె తల్లి సంధ్య కలిసి కొనుగోలు చేసినందున తమ నాయనమ్మ ఆస్తిలో వాటా వస్తుందని జయ మేనళ్లుడు, మేనకోడలు అడిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. -
పొత్తు కసరత్తు
అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత పొత్తు కసరత్తుల్లో ఆదివారం నిమగ్నమయ్యారు. ఆమె ప్రసన్నంతో సీట్లను దక్కించుకునేందుకు పలు పార్టీల నాయకులు పోయెస్ గార్డెన్ బాట పట్టారు. ఏడు పార్టీలకు పోయెస్ గార్డెన్‌లోకి అనుమతి దక్కడంతో, ఇక తనకు పిలుపు ఎప్పుడు వస్తుందో అన్న ఎదురుచూపుల్లో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ ఉన్నారు. * నేతల పోయెస్ గార్డెన్ బాట * పిలుపు కోసం వాసన్ ఎదురు చూపు సాక్షి, చెన్నై: మళ్లీ అధికారమే లక్ష్యంగా అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత తీవ్ర కసరత్తుల్లో మునిగారు. ఇంటర్వ్యూలు ముగిం చి, అభ్యర్థుల చిట్టాకు మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. మేనిఫెస్టో పనుల కసరత్తులు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు తమను నమ్ముకుని పార్టీలు నడుపుతున్న వారికి అవకాశం కల్పించే విధంగా పొత్తు కసరత్తులకు చర్యలు చేపట్టారు. పోయెస్ గార్డెన్ నుంచి పిలుపు ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ వచ్చిన కొన్ని సామాజిక వర్గాల పార్టీలు అనుమతి దక్కడం తరువాయి అమ్మ ఎదుట ప్రత్యక్షం అయ్యారని చెప్పవచ్చు. ఆయా పార్టీల నాయకులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా పోయెస్ గార్డెన్ బాట పట్టారు. ఇందులో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నేతలు దేవరాజన్, కదిరవన్, కొంగు ఇలంజర్ పేరవై నేత, ఎమ్మెల్యే తనియరసు, ఇండియ కుడియరసు కట్చి నేత, ఎమ్మెల్యే సేకు తమిళరసు, తమిళర్ వాల్వురిమై కట్చి నేత , మాజీ ఎమ్మెల్యే వేల్ మురుగన్, సమత్తువ మక్కల్ కళగం నేత, ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్, తౌఫిక్ జమాత్ వర్గాలు ఉన్నారు. అమ్మ వెంటే : గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అమ్మే దిక్కు అని, అన్నాడీఎంకే వెంట నడిచిన పార్టీల నాయకులకు పోయెస్ గార్డెన్ తలుపులు తెరచుకున్నాయి. అమ్మ ప్రసన్నంతో పొత్తు పదిలం చేసుకుని, సీట్ల హామీతో ఆయా పార్టీల నాయకులు ఆనందంగానే బయటకు అడుగు పెట్టారని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఓ స్థానాన్ని దక్కిం చుకున్న ఫార్వర్డ్ బ్లాక్ ఈ సారి అదనపు సీట్లు కోరినట్టు సమాచారం. ఇక, తమ సిట్టింగ్ స్థానాల్ని తమిళరసు, తనియరసు, ఎర్నావూర్ నారాయణన్ పదిలం చేసుకోగా, తమిళర్ వాల్వురిమై కట్టికి మూడు స్థానాలు కేటాయించేందుకు అమ్మ అంగీకరించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా? అన్నది తేల్చుకునే పనిలో తౌఫిక్ జమాత్ ఉన్నట్టు సమాచారం. పలు సామాజిక వర్గ పార్టీలకు పోయెస్ గార్డెన్‌లోకి అనుమతి దక్కడంతో, ఇక తమకు పిలుపు ఎప్పుడో అన్న ఎదురు చూపుల్లో టీఎంసీ వర్గాలు ఉన్నాయి. ఎదురు చూపుల్లో : కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ తన తండ్రి మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను మళ్లీ తెర మీదకు తెచ్చిన విషయం తెలిసిందే. పొత్తు ప్రయత్నాలకు దూరంగా ఉన్న జీకే వాసన్, అమ్మ పిలిస్తే చాలు చటుక్కున వాలేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. అన్నాడీఎంకేతో కలసి పయనం సాగించాలన్న ఆశతో జీకే వాసన్‌తో పాటుగా ఆ పార్టీ వర్గాలు ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పొత్తు కసరత్తుల్లో అమ్మ మునగడంతో ఇక, తమకు పోయెస్ గార్డెన్ పిలుపు ఎప్పుడు వస్తుందో అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. ఒక వేళ పోయెస్ గార్డెన్‌లోకి అనుమతి దక్కి, పొత్తు, సీట్లు ఖరారు చేసుకున్నా, ఎన్నికల్లో పార్టీ చిహ్నం ‘సైకిల్’ వాసన్‌కు దక్కేది డౌటే. ఇందుకు కారణం ఉత్తరాదిలో సైకిల్ చిహ్నంకు సొంత దారుడిగా ఉన్న సమాజ్ వాది పార్టీ తరఫున రాష్ర్టంలోని 234 స్థానాల్లో పోటీకి కసరత్తులు సాగుతుండడమే. -
అమ్మ ఎక్కడ?
ఫ్లెక్సీలతో ఆహ్వానం సచివాలయ మార్గంలో హోరు కానరాని కాన్వాయ్ ఎదురు చూపుల్లో అభిమానులు కొంతకాలంగా సచివాలయానికి దూరంగా ఉన్న అమ్మ సోమవారం వస్తున్నారన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు, అభిమానులు పోస్టర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. కానీ అమ్మ కాన్వాయ్ కానరాలేదు. అభిమానులకు ఎదురుచూపులే మిగిలాయి. అమ్మ ఎక్కడ ఉందో.. ఎప్పుడు వస్తుందోనన్న ఆందోళన మిగిలింది. సాక్షి,చెన్నై :సీఎం జే.జయలలిత ఇటీవల సచివాలయానికి వారంలో రెండు రోజులు మాత్రమే వస్తూవచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ప్రారంభోత్సవాలతో బిజీగా గడిపి గంటల వ్యవధిలో మళ్లీ పోయేస్ గార్డెన్‌కు వెళ్లేవారు. ఈ పరిస్థితుల్లో ఈనెల ఒకటో తేదీన ఆమె కొడనాడుకు విశ్రాంతి నిమిత్తం వెళ్తారన్న సంకేతాలు వచ్చాయి. ఆ కార్యక్రమం రద్దయ్యింది. గత తొమ్మిది రోజులుగా సచివాలయానికి ముఖ్యమంత్రి జయలలిత రాలేదు. అన్ని వ్యవహారాలను ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో తాజాగా సీఎం జయలలిత ఉన్నా, మంత్రులు ప్రకటనలు విడుదల చేయడం జరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం కొన్ని ప్రతి పక్ష పార్టీల నాయకులు సీఎం ఆరోగ్యంపై బహిర్గతం చేయాలంటూ అనుమానాలు లేవదీశారు. సీఎం జయలలితకు ఏమయ్యిందోనన్న చర్చ బయలుదేరింది. ఈ ప్రచారానికి ముగింపు పలికే రీతిలో సీఎం జయలలిత సచివాలయానికి రాబోతున్నారన్న సమాచారం సోమవారం ఉదయాన్నే వెలువడింది. ఎదురు చూపులే: అమ్మ సచివాలయానికి రాబోతున్నారంటూ ఉదయాన్నే ఆ మార్గంలో పోస్టర్లు వెలిశాయి. జయలలితకు ఆహ్వానం పలుకుతూ ఈ పోస్టర్లు వెలవడడం విశేషం. అమ్మావందాచ్చా...అమ్మా వందాచ్చీ..(అమ్మ వచ్చారా...అమ్మ వచ్చిందా..) అన్న ఎదురు చూపులు పెరిగాయి. మధ్యాహ్నం పలు కార్యక్రమాలను సచివాలయం నుంచి సీఎం జయలలిత శ్రీకారం చుట్టబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. పాఠశాల విద్యా శాఖ తరపున ఉద్యోగ నియామకాలు, టీఎన్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామక ఉత్తర్వులతో పాటుగా పలు కార్యక్రమాలు సాగనున్నడంతో మీడియా సైతం సచివాలయానికి ముందుగానే చేరుకుంది. ఎంత సేపు ఎదురు చూసినా అమ్మ కాన్వాయ్జాడ మాత్రం కాన రాలేదు. చివరకు అమ్మ కార్యక్రమాలు రద్దయినట్టు సంకేతాలువెలువడడంతో విస్తుపోవాల్సి వచ్చింది. -
‘అమ్మ’ చెంతకు ఫిర్యాదులు
అన్నాడీఎంకే నాయకుల్లో గుబులు పట్టుకుంది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులు నేరుగా పోయెస్ గార్డెన్‌కు వెళ్లడమే ఇందుకు కారణం. ఇది వరకు వీటిని ఫిర్యాదుల కమిటీ విచారించేది. ప్రస్తుతం అధినేత్రి జయలలిత చెంతకు వెళ్లడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, చెన్నై: పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ చిన్న తప్పు చేసినా, ఆరోపణలు వచ్చినా వారికి ఉద్వాసనలు పలికే రీతిలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయాలు తీసుకోవడం సహజం. అయితే, గత ఏడాది పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని విచారించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రాయపేటలోని పార్టీ కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదునూ ఈ కమిటీ పరిశీలించి నివేదిక రూపంలో జయలలితకు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఈ కమిటీలో మంత్రులు గోకుల ఇందిర, ఉదయకుమార్, నేతలు సెల్వరాజ్, కుమార్‌ను సభ్యులుగా నియమించారు. ఇన్నాళ్లూ ఈ కమిటీ అన్ని ఫిర్యాదుల్ని పరిశీలించి, నివేదిక రూపంలో జయలలితకు సమాచారం అందించేది. అయితే, జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో ఎక్కడి ఫిర్యాదులు అక్కడే అన్న చందంగా పడి ఉండడం వెలుగులోకి వచ్చింది. మంత్రులు ఇద్దరు ప్రభుత్వ కార్యక్ర మాల్లో బిజీగా ఉండడం, మిగిలిన ఇద్దరు తమ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల్లో బిజిబిజీగా ఉండడంతో ఫిర్యాదులు అన్నాడీఎంకే కార్యాలయంలో పేరుకు పోయినట్టు సమాచారం. అమ్మ చెంతకు పార్టీ కార్యాలయంలో పేరుకుపోయిన ఫిర్యాదులు పోయేస్ గార్డెన్‌కు చేరినట్టుంది. పార్టీ కార్యాలయానికి తాను వెళ్లలేని పరిస్థితి ఉన్నందున, ఆ ఫిర్యాదుల్ని పోయేస్ గార్డెన్‌కు జయలలిత తెప్పించుకునే పనిలో పడ్డట్టు వచ్చిన సంకేతాలు అన్నాడీఎంకే వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. జయలలిత శిక్ష నేపథ్యంలో కొందరు నేతలు పార్టీ కార్యాక్రమాలకు దూరంగా, నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించి ఉండడంతో అట్టి వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అదే సమయంలో గతంలో విధించిన కమిటీ కొన్ని చిన్న చిన్న తప్పుల్ని చూసీచూడనట్టు వ్యవహరించిన సందర్భాలు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా ఫిర్యాదులు అన్నీ అమ్మ చెంతకు చేరడం, ఆమె వాటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తుండడంతో మరింత ఆందోళన బయలుదేరింది. జయలలిత కారాగారంలో ఉన్న సమయంలో కొందరు నేతలు తమ రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు చాప కింద నీరులా కొత్త ప్రయత్నాలు చేసినట్టు, మరి కొందరు జయలలిత నెచ్చెలి శశికళ బంధు వర్గానికి దగ్గరగా వెళ్లినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం పన్నీరు సెల్వం ద్వారా జయలలిత దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అలాంటి ప్రయత్నాలు చేసిన నేతల్లో మరింత ఆందోళన బయలుదేరింది.