
తలైవా రోజూ వారి రాజకీయ వ్యవహారాల్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారు
సాక్షి, చెన్నై: రండి కలిసి పనిచేద్దాం అని పరోక్షంగా తలైవా రజనీకాంత్‌కు మక్కల్ నీది మయ్యం నేత కమల్‌హాసన్ పిలుపునిచ్చారు. శనివారం చెన్నై పోయెస్ గార్డెన్‌లో దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కమల్ సమావేశమైన విషయం తెలిసిందే.
ఈ పరిస్థితుల్లో ఆదివారం చెన్నైలో కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం కట్చి నాలుగో వసంతం వేడుక జరిగింది. ఇందులో పార్టీ నేతలతో మాట్లాడే సమయంలో తలైవాకు పరోక్షంగా కమల్ పిలుపునిచ్చారు. రండి కలిసి పనిచేద్దాం అని పిలుపునిస్తూ వ్యాఖ్యలు చేశారు. తలైవాగా పిలవబడే నాయకుడు రోజూ వారి రాజకీయ వ్యవహారాల్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారని, రండి కలిసి పనిచేద్దాం అని కమల్ పిలుపునివ్వడం గమనార్హం.
చదవండి:
అగ్ర హీరోల భేటీ: తమిళనాడులో కాక