
తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీలే చెన్నైలోని పోయిస్ గార్డెన్‌లో నూతన గృహ నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడు ఈ ఇంటికోసం ఖర్చు పెడుతున్న వివరాలు బయటకు వచ్చాయి. నాలుగు అంతస్తులుగా నిర్మితమవుతున్న ఈ భవనం నిర్మాణం కోసం అతడు ఏకంగా రూ.150 కోట్లు వెచ్చిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఇంట్లోని గదులను ధనుష్ దగ్గరుండి తనకు నచ్చిన రీతిలో డిజైన్ చేయించుకున్నాడట. ఈ గృహం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి దగ్గరలో ఉండటం విశేషం.
ధనుష్ ప్రస్తుతం గ్రే మ్యాన్ షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నాడు. అక్కడి నుంచి తిరిగి రాగానే దర్శకుడు కార్తీక్ నరేన్‌తో చేస్తున్న సినిమా షూటింగ్‌ను పునఃప్రారంభించనున్నాడు. అలాగే శేఖర్ కమ్ములతోనూ త్రిభాషా చిత్రం చేయనున్నాడు. సాయిపల్లవి మరోసారి ధనుష్‌తో జోడీ కట్టనున్న ఈ సినిమా ఆగస్టు నుంచి షూటింగ్ జరుపుకోనుంది. వీటితో పాటు ఆయన చేతిలో కిట్టీ, ఆత్రంగిరే ప్రాజెక్టులు ఉన్నాయి.
చదవండి: లోకల్ ట్రైన్‌లో రజనీ అలా.. ఫోటోలు లీక్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
Comments
Please login to add a commentAdd a comment