తమిళసినిమా: పదమూడేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం అవతార్. హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ క్యామరన్ అద్భుత సృష్టి అది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం అవతార్ ది వే ఆఫ్ వాటర్. ఇది శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 52 వేల థియేటర్లలో విడుదల కావడం విశేషం. అదే విధంగా చిత్రాన్ని 160 భాషల్లో విడుదల చేసినట్లు సమాచారం.
ఇకపోతే ఒక్క ఇండియాలోనే ప్రముఖ నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్‌తో రూ. 20 కోట్లు వసూలు చేసింది. దీన్ని హిందీ, ఇంగ్లీష్ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలో విడుదల చేశారు. చిత్రాన్ని ప్రేక్షకులు మైమరచి చూస్తున్నారు. కోలీవుడ్‌లో పలువురు సినీ ప్రముఖులు అవతార్ – 2 చిత్రాన్ని మొదటి రోజునే చూడడానికి ఆసక్తి కనబరచడం మరో విశేషం.
ఆ విధంగా నటుడు ధనుష్ తన ఇద్దరు పిల్లలు లింగా, యాత్రలతో కలిసి అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశారు. ఆయన తన కొడుకులతో చిత్రాన్ని చూసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా ధనుష్ శనివారం అవతార్ –2 చిత్రం గురించి తన ట్విట్టర్లో ఇట్స్ అవతార్ డే అని పేర్కొనడం మరో విశేషం.
ITS AVATAR DAY 🤩🤩🤩😍😍😍
— Dhanush (@dhanushkraja) December 16, 2022
Comments
Please login to add a commentAdd a comment