
నయనతార (Nayanthara)పై ధనుష్ వేసిన పరువునష్టం దావాను సవాలు చేస్తూ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేసిన పిటిషన్‌ను మద్రాస్ న్యాయస్థానం కొట్టివేసింది. నటుడి అనుమతి లేకుండా అతడి సినిమా క్లిప్స్ వాడుకోవడాన్ని తప్పుపట్టింది. నయనతార బయోపిక్‌లో నానుమ్ రౌడీదాన్ సినిమా క్లిప్స్ వాడుకోవడంపై నిర్మాత ధనుష్ (Dhanush) అభ్యంతరం వ్యక్తం చేశాడు. రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు. దీన్ని సవాలు చేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా కోర్టు దీన్ని కొట్టిపారేసింది. మరోవైపు బయోపిక్‌పై మధ్యంతర నిషేధం విధేంచాలన్న ధనుష్ నిర్మాణ సంస్థ పిటిషన్‌పై ఫిబ్రవరి 5న విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.
అసలేం జరిగింది?
నయనతార జీవితకథ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ నయతార: బియాండ్ ది ఫెయిరీటేల్(Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. ఇందులో నానుమ్ రౌడీదాన్ సినిమాలోని మూడు సెకన్ల సన్నివేశాన్ని వాడుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సమయంలోనే విఘ్నేశ్, నయన్ ప్రేమలో పడ్డారు.
అందుకని సదరు సినిమా క్లిప్స్ వాడుకున్నారు. అయితే దానికి ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 24 గంటల్లో ఆ సన్నివేశాలను తొలగించాలని, లేదంటే రూ.10 కోట్లు జరిమానా విధిస్తానన్నాడు. ఆయన హెచ్చరికలను అటు నయనతార, ఇటు నెట్‌ఫ్లిక్స్ ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో ధనుష్ హైకోర్టును ఆశ్రయించాడు.
చదవండి: ప్లాస్టిక్ సర్జరీ.. అవమానంగా ఫీలవడానికేముంది?: ఖుషీ కపూర్