‘అమ్మ’ ఇల్లు ఎవరికి సొంతం! | Poes Garden Home For Jayalalithaa Memorial? O Paneerselvam's New Move | Sakshi
Sakshi News home page

‘అమ్మ’ ఇల్లు ఎవరికి సొంతం!

Published Fri, Feb 10 2017 4:36 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

‘అమ్మ’ ఇల్లు ఎవరికి సొంతం!

‘అమ్మ’ ఇల్లు ఎవరికి సొంతం!

సాక్షి ప్రతినిధి, చెన్నై:  చెన్నై లోని పోయెస్‌ గార్డెన్‌లో దివంగత సీఎం జయలలితకు చెందిన ఇల్లు ఎవరి కి దక్కుతుందనే చర్చ మొద లైంది. ప్రస్తుతం రూ.90 కోట్ల విలువ చేసే ఈ ఇంటిని జయలలిత, ఆమె తల్లి సంధ్య కలిసి కొనుగోలు చేశారు. సంధ్య మరణాంతరం ఆ ఇంటిని తనకు ఇవ్వాల్సిందిగా జయ అన్న జయరామన్‌ కోరారు. తాను ఇక్కడే నివసిస్తానని, మరొకరికి ఇవ్వనని జయ చెప్పారు. జయ మరణిం చాక..ఆమెకు వారసులు లేకపోవడంతో ఆ ఇల్లు ఎవరికి సొంత మనే సందేహం తలెత్తింది.

 జయ అన్న కుమారుడు దీపక్, కుమా ర్తె దీప రక్త సంబంధీకులుగా ఉన్నారు. అయితే జయతోపాటు శశి కళ కూడా అదే ఇంటిలో నివసించారు. ‘అమ్మ’ మరణం తరువాత కూడా అందులోనే ఉంటున్నారు. జయ నివసించిన ఇల్లు తమకు దేవాలయం లాంటిదని, దీన్ని స్మారక మందిరంగా మారుస్తా మని ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం ప్రకటించారు. అయితే, ఈ ఇల్లు శశికళ సోదరుడి భార్య ఇళవరసి పేరున ఉన్నట్లు ఒక ఆంగ్ల టీవీ చానల్‌కు వారి బంధువులు తెలిపారు. ఇందుకు సంబంధిం చిన డాక్యుమెంట్లు కూడా చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement