
Nayantara Buys A New House At Poes Garden In Chennai: నయనతార.. ఈ స‍్టార్ హీరోయిన్ అందం, అభినయం గురించి ఎంత చెప్పిన తక్కువే. పుట్టింది కేరళలోని తిరువల్ల అయిన తెలుగు అమ్మాయికి ఏమాత్రం తీసిపోదు. లక్ష్మీ, తులసి, యోగి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. నయన్ తాజాగా చెన్నైలోని పొయెస్ గార‍్డెన్‌లో నాలుగు పడక గదుల ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. త్వరలో తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి కొత్త ఇంటికి మారనుందని ప్రచారం జరుగుతోంది. నయన్ కొత్త ఇళ్లు తీసుకున్న పొయెస్ గార్డెన్ చెన్నైలోని నాగరిక ప్రదేశాలలో ఒకటి. ఈ గార్డెన్‌కు మంచి సెలబ్రిటీ చరిత్ర కూడా ఉంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్‌ల నివాసాలు ఈ పొయెస్ గార్డెన్‌లోనే ఉన్నాయి. రజనీ కాంత్ ఇంటిపక్కనే ధనుష్ తన డ్రీమ్ హౌజ్‌ను నిర్మిస్తున్నాడు.
చెన్నైలోని పొయెస్ గార్డెన్‌లో భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అదే ప్రాంతంలో మరో ఇంటిని కూడా కొనుగోలు చేయాలని ఆలోచిస్తుందట. సుమారు అక్కడ ఫ్లాట్స్ కోట్లలో ఉండొచ్చని సమాచారం. నయనతార ఇటీవలే 37 సంవత‍్సరాలు పూర్తి చేసుకుంది. కాతువాకుల రెండు కాదల్ సినిమా సెట్‌లో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో పుట్టిన రోజు జరుపుకుంది. వివిధ భాషల్లో చిత్రాలతో బిజీగా ఉన్న నయన్. ఈ సంవత్సరం ప్రారంభంలో వారి కుటుంబ సభ‍్యుల సమక్షంలో విఘ్నేష్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్య‍్వూలో ఈ విషయాన్ని చెప్పింది నయన తార.