Poes Garden house
-
నయన తార కొత్త ఇల్లు కొనుగోలు.. ఎక్కడో తెలుసా ?
Nayantara Buys A New House At Poes Garden In Chennai: నయనతార.. ఈ స్టార్ హీరోయిన్ అందం, అభినయం గురించి ఎంత చెప్పిన తక్కువే. పుట్టింది కేరళలోని తిరువల్ల అయిన తెలుగు అమ్మాయికి ఏమాత్రం తీసిపోదు. లక్ష్మీ, తులసి, యోగి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. నయన్ తాజాగా చెన్నైలోని పొయెస్ గార్డెన్లో నాలుగు పడక గదుల ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. త్వరలో తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి కొత్త ఇంటికి మారనుందని ప్రచారం జరుగుతోంది. నయన్ కొత్త ఇళ్లు తీసుకున్న పొయెస్ గార్డెన్ చెన్నైలోని నాగరిక ప్రదేశాలలో ఒకటి. ఈ గార్డెన్‌కు మంచి సెలబ్రిటీ చరిత్ర కూడా ఉంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్‌ల నివాసాలు ఈ పొయెస్ గార్డెన్‌లోనే ఉన్నాయి. రజనీ కాంత్ ఇంటిపక్కనే ధనుష్ తన డ్రీమ్ హౌజ్‌ను నిర్మిస్తున్నాడు. చెన్నైలోని పొయెస్ గార్డెన్లో భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అదే ప్రాంతంలో మరో ఇంటిని కూడా కొనుగోలు చేయాలని ఆలోచిస్తుందట. సుమారు అక్కడ ఫ్లాట్స్ కోట్లలో ఉండొచ్చని సమాచారం. నయనతార ఇటీవలే 37 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాతువాకుల రెండు కాదల్ సినిమా సెట్లో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో పుట్టిన రోజు జరుపుకుంది. వివిధ భాషల్లో చిత్రాలతో బిజీగా ఉన్న నయన్. ఈ సంవత్సరం ప్రారంభంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో ఈ విషయాన్ని చెప్పింది నయన తార. -
‘అమ్మ’ ఇంట్లో 8 వేల వస్తువులు
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేదనిలయంను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇంటిని చెన్నై జిల్లా కలెక్టరేట్ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తెచ్చారు. త్వరలో ట్రస్ట్‌కు అప్పగించనున్నారు. ప్రస్తుతం సేకరించిన జాబితా మేరకు అమ్మ ఇంట్లో 8 వేల వస్తువులు ఉన్నట్టు తేలింది. దివంగత సీఎం జయలలితకు పోయెస్‌గార్డెన్‌లో వేదనిలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇంటిని తన గుప్పెట్లోకి తీసుకునేందుకు పాలకులు ప్రయత్నించి ఫలితాన్ని సాధించారు. ఆ ఇంటిని అమ్మ స్మారక మందిరంగా మార్చే రీతిలో సీఎం, డిప్యూటీ సీఎంల నేతృత్వంలో ట్రస్ట్ ఏర్పాటైంది. న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా ప్రత్యే క చట్టాన్ని సైతం తీసుకొచ్చారు. అలాగే, అమ్మ కుటుంబవారసులుగా ఉన్న దీప, దీపక్‌ల నుంచి భవిష్యత్తులో చిక్కులు ఎదురుకాని రీతిలో ఆ ఇంటిని కొనుగోలు చేస్తూ, అందుకు తగ్గ నగదు బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. అయితే, దీనిని దీప తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరో న్యాయ పోరాటం అన్న ప్రకటన చేశారు. ఈ పరిస్థితుల్లో అమ్మ ఇంటిని ప్రస్తుతం చెన్నై జిల్లా కలెక్టరేట్ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తీసుకొ చ్చి ఉండడం మనార్హం. త్వరలో ఆ ట్రస్ట్‌కు ఈ ఇంటిని అప్ప గించబోతున్నారు. కలెక్టరేట్ నుంచి సమాచార శాఖకు వచ్చిన సమాచారాల మేరకు ఆ ఇంట్లో ఉన్న వస్తువుల చిట్టా వెలుగు చూసింది. భారీ గానే వస్తువులు.... అమ్మ ఇంట్లో 32 వేల 700 పుస్తకాలు ఉన్నట్టు లెక్కించారు. అలాగే, 8,376 వస్తువులు ఉండడం గమనార్హం. ఇందులో 14 కేజీలుగా పేర్కొంటున్న 437 బంగారు ఆభరణాలు, 601.4 కేజీలుగా పేర్కొంటున్న 867 వెండి వస్తువులు ఉన్నాయి. అలాగే, ఆరు వేల పాత్రలు, 556 ఫర్నీచర్లు, 162 చిన్న చిన్న వెండి వస్తువులు,108 అలంకరణ వస్తువులు, 29 ఫోన్లు, సెల్ఫోన్లు, 15 పూజా సామగ్రి, పది ఫ్రిడ్జ్‌లు, 38 ఎసీలు, 11 టీవీలు, ఆరు గడియారాలు ఉన్నట్టుగా లెక్క తేల్చారు. అలాగే, 10,438 వివిధ వస్త్రాలు ఉన్నట్టు తేల్చారు. వీటన్నింటిని ట్రస్ట్‌కు మరి కొద్ది రోజుల్లో అప్పగించబోతున్నారు. ఈ వస్తువుల్లో కొన్నింటిని అమ్మ స్మారక మందిరంలో ప్రజల సందర్శన కోసం ఉంచే అవకాశాలు ఎక్కువేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, వేద నిలయంను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవడంతో ఆ పరిసరాల్లో భద్రతను పెంచారు. ఆ ఇంటి వైపుగా అధికారులు తప్ప, మరెవ్వరూ వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. -
పోయెస్ గార్డెన్‌పై పోరు.. చిన్నమ్మకు చిక్కే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకప్పటి పవర్ఫుల్ రాజకీయకేంద్రమైన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం స్మారకమందిరం వివాదంలో నలిగిపోతోంది. జయ వారసులు దీప, దీపక్ ఒకవైపు, ప్రభుత్వం మరోవైపు సమరం సాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై పోయెగార్డెన్‌లో అత్యంత విలాసవంతమైన భవనంలో నివసించేవారు. రాజకీయ వర్గాలు ‘గార్డెన్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. జయలలిత అధికారంలో ఉన్నపుడు ‘గార్డెన్’ నుంచి ఆదేశాలు వచ్చాయా అని ముందుగా ప్రశ్నించేవారు. సచివాలయం కంటే పోయెగార్డెన్ కే ప్రాధాన్యతతో రాజకీయ, అధికార కేంద్రంగా వెలిగిపోయేది. జయ మరణించిన తరువాత కూడా దాని ప్రాభవం తగ్గలేదు. జయకు వందలకోట్ల రూపాయల ఆస్తులున్నా గార్డెన్హౌస్ చుట్టూనే రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. జయకు సొంతమైన వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తికి ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ వారసులని మద్రాసు హైకోర్టు తేల్చడంతో ఇంతకూ ఆస్తులెక్కడెక్కడ ఉన్నాయి, వాటి విలువ ఎంత అనే అంశంపై జోరుగా చర్చ బయలుదేరింది. (వారిద్దరూ అమ్మ వారసులే) అవినీతి నిరోధకశాఖ కోర్టులో దాఖలు చేసిన జాబితాలో ఎన్నికల సమయంలో జయలలిత దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో చూపిన ఆస్తులనే పేర్కొన్నారు. జయకు వారసులమని తమను ప్రకటించి ఆమె ఆస్తుల పర్యవేక్షణ బాధ్యతను తమకు అప్పగించాల్సిందిగా దీప, దీపక్ గతంలో వేర్వేరుగా మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం వెలువడిన తీర్పుతో స్పష్టత వచ్చింది. వారిద్దరూ జయ ఆస్తికి రెండోతరం వారసులని కోర్టు పేర్కొంది. జయ ఆస్తులపై పర్యవేక్షణాధికారం వారిద్దరికీ ఉంటుందని తెలిపింది. పోయెస్ గార్డెన్లోనిఇంటిని జయ స్మారక మందిరంగా మార్చాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సింది ప్రభుత్వాన్ని కోర్టు సూచించింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హర్షం వ్యక్తంచేసిన దీప, దీపక్ ఇద్దరూ కలిసి చెన్నై మెరీనాబీచ్‌లోని జయ సమాధికి వెళ్లి అంజలి ఘటించారు. గార్డెన్‌లోనే కాపురం: దీప కోర్టు తీర్పులో సైతం గార్డెన్‌కు ప్రాధన్యత ఇవ్వడంతో జయ నివాసం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ, చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయం తమ పూర్వీకుల ఆస్తి, ఆ భవనం తమకు సొంతమని కోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. జయకు నేరుగా వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తిని కాజేయాలని ఎందరో చేసిన ప్రయత్నాలకు కోర్టు అడ్డుకట్టవేసింది. పోయెస్‌గార్డెన్ ఇంటిని జయ స్మారకమందిరంగా మార్చడాన్ని అంగీకరించం. ఇందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర చట్టంపై కోర్టులో అప్పీలు చేస్తాం. జయకు చెందిన ఆస్తులన్నీ మాకే సొంతం. వాటిని స్వాధీనం చేసుకునేందుకు న్యాయవాదులతో చర్చిస్తున్నాం. జయ ఆస్తులను ఆక్రమించిన వారికి నోటీసులు జారీచేస్తాం. చట్టపరమైన సమస్యలు పరిష్కారం కాగానే పోయెస్‌గార్డెన్‌లో నివసిస్తాం. జయ ఆస్తులను స్వాధీనం చేసుకుని కాపాడే బాధ్యత మాపై ఉంది. జయ పేరున మేమే ట్రస్టును ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సేవచేస్తామని దీప చెప్పారు. దీపక్ మాట్లాడుతూ, పోయెస్‌గార్డెన్ ఇల్లు వారసత్వంగా మాకు సంక్రమించిన ఆస్తి, దాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని అంగీకరించే ప్రసక్తేలేదని అన్నారు. జయ స్మారకమందిరంగా ప్రభుత్వం మార్చదలచుకుంటే తాముగా ఇవ్వాలేగాని వారు ఏకపక్ష నిర్ణయం తీసుకునేందుకు వీలులేదు. వేద నిలయంను సీఎం క్యాంపాఫీస్ చేయా లన్న సూచన కూడా సరికాదు. డీఎంకే అధి కారంలోకి వచ్చి స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన పక్షంలో అందులో ఉంటారా. మాకు సాయుధ పోలీస్ బందోబస్తు కావాలని కోరలేదు. ఒక ఆస్తి కోసం నన్ను హత్యచేస్తే అందుకు బాధ్యులెవరు. ఎడపాడి, పన్నీర్‌సెల్వం తమ పూర్వీకుల ఆస్తిని జయ స్మారకమందిరంగా చేసుకుంటే మంచిదని దీపక్ వ్యాఖ్యానించారు.(స్మారక మందిరంగా జయలలిత నివాసం) చిన్నమ్మకు చిక్కే.. జయ ఆస్తులపై కోర్టు ఇచ్చిన తీర్పు శశికళను చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. జయలలిత, శశికళ సంయుక్తంగా అనేక సంస్థలు నడుపుతుండేవారు. వాటిల్లోని జయ వాటాను దీప, దీపక్‌లకు కేటాయించాల్సి ఉంటుంది. లేదా జయ ఆస్తులన్నీ ట్రస్ట్ కిందకు తీసుకొస్తే మారుమాట్లాడకుండా శశికళ అప్పగించాల్సి రావచ్చు. కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్‌లోని ద్రాక్ష తోట వివాదాలు కుదుటపడవచ్చు. ప్రభుత్వానికే అధికారం: సీవీ షణ్ముగం చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసాన్ని స్మారక మందిరంగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు తీర్పుతో స్పష్టమైందని న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యానించారు. జయ ఇంటిని స్మారకమందిరంగా మార్చడంపై పునరాలోచించాలని, ఒక భాగం స్మారక మందిరం, మరో భాగం సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మార్చవచ్చని కోర్టు సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోర్టు తీర్పు ప్రతులు అందిన తరువాత క్షుణ్ణంగా అధ్యయనం చేసి బదులు పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. -
పోయెస్ గార్డెన్ వెలవెల
చెన్నై: పోయెస్ గార్డెన్ వేదనిలయం, చెన్నై.. తమిళనాడు ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలవారికి ఈ చిరునామా సుపరిచితం. జయలలిత బతికున్న రోజుల్లో ఈ ఇల్లు ఓ వెలుగు వెలిగింది. తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు, కీలక నిర్ణయాలకు, అనూహ్య ఘటనలకు వేదికగా నిలిచింది. జయలలిత హీరోయిన్గా ఉన్నప్పుడు ఆమె తల్లి ఈ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి జయలలిత శాశ్వత నివాసం ఇక్కడే. జయలలిత సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కొని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంటిలోనే ఉన్నారు. అన్నా డీఎంకే రాజకీయాలకు పోయెస్ గార్డెన్ కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది. అమ్మ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీఐపీలు, పలు రంగాల ప్రముఖులతో ఈ ఇల్లు నిత్యం కళకళలాడుతుండేది. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం పోయెస్ గార్డెన్ బోసిపోయింది. ఇప్పడక్కడ అమ్మ అభిమానులు లేరు. పార్టీ కార్యకర్తలు లేరు. నాయకులు లేరు. ఇంటి బయట పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన, ఉత్కంఠ వాతావరణం మధ్య ఆ ప్రాంతం నిర్మానుషంగా మారింది. ప్రస్తుతం ఈ ఇంటిలో జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె బంధువులు ఉంటున్నారు. అన్నాడీఎంకేలో చీలిక కారణంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలను శశికళ వర్గం ఇతర ప్రాంతాలకు తరలించి క్యాంపులు నిర్వహిస్తోంది. ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు. జయలలిత మరణించినపుడు ఆమెకు నివాళులు అర్పించేందుకు పోయెస్ గార్డెన్‌కు జనం పోటెత్తారు. ఆ తర్వాత ఈ ఇంటిపై వివాదం నడుస్తోంది. జయలలిత ఆస్తి తమకే దక్కుతుందని, శశికళ కుట్ర చేసి తమను దూరం చేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక ఇంటిని అమ్మ మెమోరియల్‌గా మార్చాలని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నిర్ణయించారు. ఏదేమైనా అమ్మ లేని పోయెస్ గార్డెన్ వెలవెలబోతోంది. సంబంధిత వార్తలు చదవండి గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు? పన్నీర్‌కే 95 శాతం మద్దతు! గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఎత్తుకు పైఎత్తు నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం