జయలలిత ఇంట్లో సోదాలు | I-T Dept Searches Jayalalithaa's Poes Garden : Sasi group protest | Sakshi
Sakshi News home page

జయలలిత ఇంట్లో అధికారుల తనిఖీలు

Published Sat, Dec 30 2017 11:08 AM | Last Updated on Thu, Mar 21 2024 9:09 AM

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో ఐటీ, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయమే వేదనిలయానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న శశికళ వర్గీయులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పోయెస్‌ గార్డెన్‌ పరిసర ప్రాంతాలను స్వాధీనంలోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 5 బెటాలియన్ల అదనపు బలగాలను మోహరింపజేశారు. ఆ రెండు గదులే కీలకం : విశాలమైన వేదనిలయం భవంతిని జయ స్మారక కేంద్రంగా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం ఇదివరకే తీర్మానించింది. పొంగల్‌(సంక్రాంతి)లోపే ఆ కేంద్రాన్ని ప్రారంభించాలనుకున్న సీఎం పళని.. ఆ మేరకు చేయవలసిన పనుల బాధ్యతను చెన్నై కలెక్టర్‌కు అప్పగించారు. అయితే, జయ పర్సనల్‌ గదులు రెండింటి విషయంలో కొంత అయోమయం నెలకొంది. ఎందుకంటే.. గతంలో ఐటీ శాఖ వేదనిలయంలో సోదాలు నిర్వహించినప్పుడు ఆ రెండు గదులను సీజ్‌ చేశారు. వాటిని అలాగే వదిలేసి స్మారక కేంద్రంగా మార్చడం దాదాపు అసాధ్యం. కాబట్టే ఆ గదులను తెరిచే విషయమై ఐటీ, రాష్ట్ర రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ వారు వేదనిలయానికి వచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement