Veda Nilayam
-
వేద నిలయం విక్రయించే ప్రసక్తే లేదు.. త్వరలోనే..
సాక్షి, చెన్నై: పోయేస్ గార్డెన్‌లోని వేద నిలయంలోకి మరికొద్ది రోజుల్లో గృహప్రవేశం చేయనున్నట్లు దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప తెలిపారు. ఆ భవనాన్ని తాము విక్రయించే ప్రసక్తే లేదని, ఇది తమ పూర్వీకుల ఆస్తి, వారి జ్ఞాపకం అని స్పష్టం చేశారు. దివంగత సీఎం జయలలితకు పోయేస్‌గార్డెన్‌లో వేద నిలయం పేరిట భవనం ఉ న్న విషయం తెలిసిందే. ఆమె మరణించే వరకు అదే భవనంలోనే జీవించారు. ఈ భవనాన్ని గత అన్నా డీఎంకే ప్రభుత్వం స్మారక మందిరంగా మార్చే ప్రయత్నం చేసి భంగ పడింది. కోర్టులో న్యాయ పో రాటం ద్వారా ఆ భవనాన్ని జయలలిత మేన కోడ లు దీప, మేనల్లుడు దీపక్ సొంతం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ భవనం పర్యవేక్షణ, తదితర వ్యవ హారాలు దీప, దీపక్‌కు భారమైనట్టు ప్రచారం జోరందుకుంది. అలాగే ఆ భవనాన్ని విక్రయించేందుకు చాప కింద నీరులా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో దీప మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ ఆడియోను విడుదల చేశారు. ఎన్నో మధుర జ్ఞాపకాలు... పోయేస్ గార్డెన్ నివాసం తమ పూర్వీకుల ఆస్తి అని, ఈ ఇంట్లోనే చిన్నప్పుడు తాను, దీపక్ పెరిగినట్టు దీప గుర్తు చేశారు. మేనత్త జయలలిత, తన తండ్రి జయకుమార్ ఆ ఇంట్లోనే ఎక్కువ కాలం ఉన్నారని, తాను జన్మించింది కూడా ఇదే భవనంలో అని వివరించారు. అభిప్రా య భేదాలతో తన తండ్రి ఆ ఇంట్లో నుంచి టీ నగర్‌లోని మరో పూర్వీకుల ఇంటికి వచ్చేశారని, అయినా, అత్త పిలిచినప్పుడల్లా పోయేస్గార్డెన్కు వెళ్లి వచ్చేవారిమని తెలిపా రు. పూర్తిగా ఆమె రాజకీయాల్లోకి వెళ్లడంతో తాము బయటకు వచ్చేశామని, అయితే, ఇది తమ ఆస్తి కావడంతోనే కోర్టులో న్యాయం దక్కిందని పేర్కొన్నారు. జయలలిత సీఎంగా ఉన్నంత కాలం, ఆమె వెన్నంటి నడిచిన వాళ్లు, పయనించిన వాళ్లు ఎందరో ఉన్నారని, వారందరూ రక్త సంబంధీకులు కాలేరని వ్యాఖ్యలు చేశారు. ఇది చిన్నమ్మ శశికళ కుటుంబానికి సైతం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ భవనం తమ కుటుంబ ఆస్తి అని, దీనిని విక్రయింబోమని స్పష్టం చేశారు. ఈ ఇంటిని అమ్మేస్తామని తాము ఎవ్వరికీ చెప్పలేదని, ఎవరిని సంప్రదించ లేదని తేల్చి చెప్పా రు. వదంతులను నమ్మ వద్దని, వేద నిలయాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తనతో పాటుగా దీపక్‌పై ఉందన్నారు. మరికొద్ది రోజుల్లో ఆ ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నట్లు వెల్లడించారు. -
నాద నిలయంలో వేదం పలకాలని..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు(బృందావనం): నెల్లూరు నగరంలోని తిప్పరాజు వారి వీధిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల స్వార్జితంతో నిర్మించుకుని నివసించిన ఇంటిని ఈ ఏడాది ఫిబ్రవరిలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్రసరస్వతి స్వామికి అప్పగించారు. ఆ ఇంట్లో వేదం పలకాలన్న ఆకాంక్షతో రూ. కోట్లు విలువైన తన తల్లిదండ్రుల జ్ఞాపికను ఆ పీఠానికి అప్పగిస్తున్నట్లుగా అప్పట్లో బాలు వివరించారు. తాను తరచూ నెల్లూరుకు వచ్చి వేదనిలయం అభివృద్ధికి సహకారాన్ని అందిస్తానని కూడా చెప్పారు. ఈ ఇల్లు అంటే బాలు తల్లి శకుంతలమ్మకు మమకారం. తాను చనిపోయేంత వరకు ఇక్కడే ఉన్నారు. బాలు ప్రతి నెలా వచ్చి తల్లితో గడిపి వెళ్తుండేవాడు. నాద నిలయంగా ఉన్న ఇల్లు వేద నిలయంగా కూడా మారాలనే తల్లి కోరికతో ఆ ఇంటిని కంచి పీఠానికి అప్పగించారు. తండ్రి తొలిగురువు.. 2015 అక్టోబర్ 3న సాంబమూర్తి విగ్రహావిష్కరణ నెల్లూరులోని శ్రీకస్తూర్బా కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో బాలు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి తన తొలిగురువని, ఆయన తనను నాటక రంగానికి పరిచయం చేయడంతో పాటు నేపథ్య గాయకుడిగా మారడానికి ప్రోత్సాహించారని చెప్పారు. జీవితంలో సర్వస్వం అయిన నాన్నకు విగ్రహం పెట్టి జన్మ ధన్యం చేసుకున్నానని తెలిపారు. తొలిమెట్టు గూడూరులో.. గూడూరు: ఎస్పీ బాలు గాన ప్రస్థానానికి తొలిమెట్టు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకాళిదాస కళానికేతన్. సంగీత పోటీలు నిర్వహించడానికి షేక్ గౌస్‌బాషా, ప్రభాకర్‌రావు తమ మిత్ర బృందంతో కలిసి ఈ సంస్థను స్థాపించారు. 1962లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న బాలుకు మొదటి బహుమతి లభించింది. 1963లో జరిగిన పోటీలకు న్యాయనిర్ణేతగా గానకోకిల జానకి వచ్చారు. ఈ పోటీల్లో బాలుకు 2వ బహుమతి వచ్చింది. సంస్థ ఆనవాయితీ ప్రకారం ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందినవారితో పాటలు పాడించేవారు. ఈ క్రమంలో బాలు పాడిన పాట ఆహూతులను మంత్రముగ్దుల్ని చేసింది. ‘‘నీలాంటి వారు సినిమాల్లో పాడాలి’’ అంటూ జానకి బాలును ప్రోత్సహించారు. 1964లో భానుమతిని కలసిన సందర్భంలో బాలు పాడిన పాట ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. దేశం గర్వించదగ్గ గాయకుడిగా ఎదుగుతావంటూ ఆమె బాలును దీవించారు. నిగర్వి అయిన బాలు వంటి మహానుభావుని పోగొట్టుకోవడం ఎంతో బాధాకరమని శ్రీకాళిదాస కళానికేతన్ వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ షేక్ గౌస్‌బాషా కన్నీటి పర్యంతమయ్యారు. -
‘అమ్మ’ ఇంట్లో 8 వేల వస్తువులు
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేదనిలయంను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇంటిని చెన్నై జిల్లా కలెక్టరేట్ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తెచ్చారు. త్వరలో ట్రస్ట్‌కు అప్పగించనున్నారు. ప్రస్తుతం సేకరించిన జాబితా మేరకు అమ్మ ఇంట్లో 8 వేల వస్తువులు ఉన్నట్టు తేలింది. దివంగత సీఎం జయలలితకు పోయెస్‌గార్డెన్‌లో వేదనిలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇంటిని తన గుప్పెట్లోకి తీసుకునేందుకు పాలకులు ప్రయత్నించి ఫలితాన్ని సాధించారు. ఆ ఇంటిని అమ్మ స్మారక మందిరంగా మార్చే రీతిలో సీఎం, డిప్యూటీ సీఎంల నేతృత్వంలో ట్రస్ట్ ఏర్పాటైంది. న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా ప్రత్యే క చట్టాన్ని సైతం తీసుకొచ్చారు. అలాగే, అమ్మ కుటుంబవారసులుగా ఉన్న దీప, దీపక్‌ల నుంచి భవిష్యత్తులో చిక్కులు ఎదురుకాని రీతిలో ఆ ఇంటిని కొనుగోలు చేస్తూ, అందుకు తగ్గ నగదు బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. అయితే, దీనిని దీప తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరో న్యాయ పోరాటం అన్న ప్రకటన చేశారు. ఈ పరిస్థితుల్లో అమ్మ ఇంటిని ప్రస్తుతం చెన్నై జిల్లా కలెక్టరేట్ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తీసుకొ చ్చి ఉండడం మనార్హం. త్వరలో ఆ ట్రస్ట్‌కు ఈ ఇంటిని అప్ప గించబోతున్నారు. కలెక్టరేట్ నుంచి సమాచార శాఖకు వచ్చిన సమాచారాల మేరకు ఆ ఇంట్లో ఉన్న వస్తువుల చిట్టా వెలుగు చూసింది. భారీ గానే వస్తువులు.... అమ్మ ఇంట్లో 32 వేల 700 పుస్తకాలు ఉన్నట్టు లెక్కించారు. అలాగే, 8,376 వస్తువులు ఉండడం గమనార్హం. ఇందులో 14 కేజీలుగా పేర్కొంటున్న 437 బంగారు ఆభరణాలు, 601.4 కేజీలుగా పేర్కొంటున్న 867 వెండి వస్తువులు ఉన్నాయి. అలాగే, ఆరు వేల పాత్రలు, 556 ఫర్నీచర్లు, 162 చిన్న చిన్న వెండి వస్తువులు,108 అలంకరణ వస్తువులు, 29 ఫోన్లు, సెల్ఫోన్లు, 15 పూజా సామగ్రి, పది ఫ్రిడ్జ్‌లు, 38 ఎసీలు, 11 టీవీలు, ఆరు గడియారాలు ఉన్నట్టుగా లెక్క తేల్చారు. అలాగే, 10,438 వివిధ వస్త్రాలు ఉన్నట్టు తేల్చారు. వీటన్నింటిని ట్రస్ట్‌కు మరి కొద్ది రోజుల్లో అప్పగించబోతున్నారు. ఈ వస్తువుల్లో కొన్నింటిని అమ్మ స్మారక మందిరంలో ప్రజల సందర్శన కోసం ఉంచే అవకాశాలు ఎక్కువేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, వేద నిలయంను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవడంతో ఆ పరిసరాల్లో భద్రతను పెంచారు. ఆ ఇంటి వైపుగా అధికారులు తప్ప, మరెవ్వరూ వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. -
సీఎం నివాసంగా వేద నిలయం..
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా మార్చేందకు పరిశీలిస్తున్నట్లు బుధవారం తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. జయలలిత నివాసాన్ని స్మారక చిహ్నంగా మారుస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై నివాసితుల సంఘం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ వేద నిలయాన్ని సీఎం నివాసంగా మార్చనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్‌కు తెలిపారు. వేదనిలయంలో ఎక్కువ భాగం స్మారకంగా కాకుండా రాష్ట్ర సీఎం అధికారిక నివాసంగా మార్చాలని హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన సూచనను పరిశీలిస్తున్నట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. (వేదనిలయంలోకి దీపక్) అదే విధంగా సోయెస్ గార్డెన్, కస్తూరి ఎస్టేట్ హౌజ్ ఓనర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏజీ వ్యతిరేకించారు. వేద నిలయాన్ని స్మారకంగా మార్చడనికి అనుమతిస్తే వేల మంది సందర్శన వల్ల చుట్టూ ఉన్న ప్రజల ప్రశాంతతపై ప్రభావం పడుతుందని నివాసితుల సంఘం పేర్కొంది. పోయస్ గార్డెన్‌ను తాత్కలికంగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం మేలో ఆర్డినెన్స్‌ని జారీ చేసిన విషయం తెలిసిందే. (జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే: మద్రాసు హైకోర్టు) -
జయలలిత నివాసంపై కీలక నిర్ణయం
చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నివాసమైన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జయలలితన నివాసాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకోనున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులకు తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కూడా ఆమోద ముద్ర వేశారు. ఈ నివాసానికి సంబంధించి చట్టబద్ధమైన వారసులకు పరిహారం అందజేయకపోవడంతో తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీచేసినట్టు అధికారులు చెప్పారు. వారసులకు కేటాయింపుల కోసం రూ. 66 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఈ బంగ్లాను జయలలిత స్మారక మ్యూజియంగా మార్చనున్నారు. ఈ మ్యూజియం వ్యవహారాలు చూసుకునేందుకు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని ఈ ట్రస్ట్‌కు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, సమచార శాఖ మంత్రి కె రాజు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. కాగా, జయలలిత బతికి ఉన్న కాలంలో వేద నిలయం రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా కూడా ఆమె ఈ బంగ్లా నుంచే చక్రం తిప్పారు. జయలలిత మరణించిన తర్వాత వేద నిలయానికి సంబంధించి వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. -
జయలలిత ఇంట్లో సోదాలు
-
పోయెస్ గార్డెన్లో ఐటీ దాడులు
-
పోయెస్ గార్డెన్లో ఐటీ దాడులు
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో శుక్రవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. న్యాయస్థానం అనుమతితో వారు ఈ దాడులు చేశారు. శుక్రవారం రాత్రి ఐటీ అధికారుల బృందం పోయెస్ గార్డెన్‌కు చేరుకుంది. అంతకముందే శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జయ టీవీ సీఈవో వివేక్‌కు ఫోన్ చేసి వేద నిలయం తాళాలు తీసుకుని రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లిన అధికారులు జయ, శశికళ వ్యక్తిగత గదుల్లో తనిఖీలు చేపట్టారు. శశికళ కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి ఒక లాప్టాప్, నాలుగు పెన్ డ్రైవ్‌ల కోసం ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం. పూంగున్రన్ గది, రికార్డుల గది, శశికళ వాడిన గదుల్లో మాత్రమే సోదాలు చేశామని ఐటీ అధికారి చెప్పారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేద నిలయం చుట్టుపక్కల భారీ భద్రత ఏర్పాట్లు చేసినా.. తనిఖీల విషయం తెలియగానే పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకుని పోలీసులతో ఘర్షణ పడ్డారు. దాడుల్ని శశికళ వర్గం తప్పుపట్టింది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ మాట్లాడుతూ.. అమ్మ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. శశికళ భర్తకు రెండేళ్ల జైలు సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొత్త కారు సెకండ్‌హ్యాండ్ అని చెప్పి కస్టమ్ శాఖను మోసగించిన కేసులో శశికళ భర్త నటరాజన్‌కు సీబీఐ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో శశికళ అక్క కుమారుడు భాస్కరన్‌తో పాటు మరో ఇద్దరికి కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. 1994 సెప్టెంబర్ 6వ తేదీన నటరాజన్ లండన్ నుంచి లెక్సెస్ అనే లగ్జరీకారును తమిళరసి పబ్లికేషన్ పేరిట దిగుమతి చేసుకున్నారు. -
తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
టీ.నగర్ (చెన్నై): దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని స్మారక మండపంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ తెలుపుతూ జయ మేనకోడలు దీప దాఖలు చేసిన కేసులో సంజాయిషీ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం మద్రాస్ హైకోర్టు నోటీసులు పంపింది. జయలలిత ఇంటిని స్మారక మండపంగా మారుస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి ఆగస్టు 18న ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ జయ మేనకోడలు దీప మద్రాసు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. తమ బామ్మ సంధ్య పోయెస్ గార్డెల్‌లో ఉన్న వేద నిలయం ఇంటితో సహా అనేక ఆస్తులు కొనుగోలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్తిని స్మారక మండపంగా మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి కె.రవిచంద్రబాబు సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది సంజాయిషీ ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ప్రభుత్వం 23 లోగా సంజాయిషీ ఇవ్వాలంటూ ఉత్తర్వులిచ్చారు. -
శశికళపై తిరుగుబాటుకు మరో ఉద్యమం
-
శశికళపై తిరుగుబాటుకు మరో ఉద్యమం
రంగం సిద్ధం చేసిన ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం జయ నివాసాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు సంతకాల సేకరణ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా అధిరోహించాలని తాపత్రయపడుతున్న శశికళకు, ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకుల మీద షాకులిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్లో మకాం వేసిన శశికళను అక్కడి నుంచి గెంటేయ్యడానికి రంగం సిద్దం చేసుకున్నారు. జయలలిత నివాసాన్ని స్మారకమందిరంగా మార్చడానికి సంతకాల సేకరణ ఉద్యమంతో ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ప్రజల మద్దతు కోరుతూ సంతకాల సేకరణను శనివారం పన్నీర్‌సెల్వం ప్రారంభించారు. అంతేకాక వేదనిలయంలో ఉంటున్న శశికళను ఖాళీ చేయించాలని అధికారులకు కూడా ఆదేశాలు జారీచేశారు. జయలలిత తన తల్లి మీద ప్రేమతో పోయెస్ గార్డెన్‌లోని తన నివాసానికి వేదనిలయంగా పేరు పెట్టుకున్నారు. జయలలిత అనారోగ్యంతో మరణించడంతో ఆమె నివాసాన్ని స్మారకమందిరంగా మార్చాలని అప్పుడే పలువురు డిమాండ్ చేశారు. కానీ ఎప్పటినుంచో జయతో కలిసి ఉంటున్న శశికళ, అమ్మ అంత్యక్రియల అనంతరం డైరెక్ట్‌గా పోయెస్ గార్డెన్‌కే వెళ్లారు. ఇక అక్కడే ఆమె నివాసం ఉంటూ వస్తున్నారు. అక్కడి నుంచి చక్రం తిప్పుతున్న శశికళను ఎలాగైనా అక్కడి నుంచి బయటికి తరిమివేయాలని పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్నారు. -
అమ్మ ఆస్తులు ఎవరికి ?
-
అమ్మ ఆస్తులు ఎవరికి?
చెన్నై: నంబర్ 81, వేదా నిలయం, పోయెస్ గార్డెన్.. తమిళనాట రాజకీయానికి ఈ చిరునామా బలమైన అడ్డా. దాదాపు పాతికేళ్లు తమిళనాడులో అసలైన రాజకీయాలు ఈ చోటు నుంచే ప్రారంభమయ్యాయి. ఎప్పుడో తమిళనాడు ముఖ్యమత్రి జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఈ ఆస్తిని తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు జయ ఉపయోగించుకున్నారు. పోస్ గార్డెన్ అనగానే చుట్టుపక్కలవారికి బలమైన రాజకీయ శక్తికి నిలయం అని గుర్తించేలా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల అంచనా ప్రకారం ఈ ఎస్టేట్ విలువ ఇప్పుడు దాదాపు రూ.90కోట్లపై మాట. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన తర్వాత ప్రస్తుత పరిస్థితులు సర్దుమణిగేలా చేసేందుకు పార్టీ పగ్గాలు జయ ప్రాణ స్నేహితురాలు శశికలకు, సీఎం పదవి జయ విశ్వసనీయుడైన పన్నీర్ సెల్వంకు అప్పగించారు. అయితే, అమ్మ ఆస్తులకు ఎవరు వారసులుగా ప్రకటించబడతారనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో ఏనాడు తన తర్వాత ఎవరూ అనే విషయాన్ని జయ ప్రకటించలేదు. ఆమె అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు సైతం ఒక వీలునామా అంటూ రాయలేదు. దీంతో ఇప్పుడు ఆ ఆస్తులు ఎవరికీ కేటాయిస్తారనే అంశం ఉత్కంఠగా మారింది. ప్రధానంగా పరిశీలించినప్పుడు జయ స్నేహితురాలు శశికళ నటరాజన్‌కు వేదా నిలయంలో శాశ్వతంగా ఉండే హక్కు వస్తుందా లేక ఆమె మేనకోడలు దీపా జయకుమార్, సోదరుడు దీపక్ లకు ఈ అవకాశం వస్తుందా అని ఒక ప్రశ్న తలెత్తుతుండగా.. జయ రాజకీయ గురువు ఎంజీ రాంచంద్రన్‌కు రామాపురం, చెన్నైలో ఉన్న ఇళ్ల మాదిరిగానే చట్టపరమైన వివాదాల్లో చిక్కి ఇప్పటికీ ఎవరికీ దక్కనట్లుగానే అలాగే ఉండిపోతుందా అనేది మరో ప్రశ్న. జయలలిత అంతిమ సంస్కారాలను పూర్తి చేసిన శశికళ అనంతరం నేరుగా వేద నిలయానికి వెళ్లారు. వాస్తవానికి పోయెస్ గార్డెన్‌ను జయలలిత, ఆమె తల్లి సంధ్య కలిసి కొనుగోలు చేసినందున తమ నాయనమ్మ ఆస్తిలో వాటా వస్తుందని జయ మేనళ్లుడు, మేనకోడలు అడిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.