
టీ.నగర్ (చెన్నై): దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని స్మారక మండపంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ తెలుపుతూ జయ మేనకోడలు దీప దాఖలు చేసిన కేసులో సంజాయిషీ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం మద్రాస్ హైకోర్టు నోటీసులు పంపింది. జయలలిత ఇంటిని స్మారక మండపంగా మారుస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి ఆగస్టు 18న ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ జయ మేనకోడలు దీప మద్రాసు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. తమ బామ్మ సంధ్య పోయెస్ గార్డెల్‌లో ఉన్న వేద నిలయం ఇంటితో సహా అనేక ఆస్తులు కొనుగోలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రైవేటు ఆస్తిని స్మారక మండపంగా మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి కె.రవిచంద్రబాబు సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది సంజాయిషీ ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ప్రభుత్వం 23 లోగా సంజాయిషీ ఇవ్వాలంటూ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment