Deaf
-
Methil Devika: నాట్య వెన్నెల
వెన్నెలకు పరిమితులు ఉండవు. ధనిక, పేద, దివ్యాంగులు అనే తేడాలుండవు. ‘నృత్యం కూడా వెన్నెలలాంటిదే. అది అందరి కోసం. అందరిదీ’ అంటున్న మెథిల్ దేవిక బధిరుల కోసం కొత్త నృత్యశైలిని సృష్టించింది. నాట్యంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న కేరళకు చెందిన దేవిక డ్యాన్స్ రిసెర్చ్ స్కాలర్, ఎడ్యుకేటర్, కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుంది. సైన్లాంగ్వేజ్ నేర్చుకుంది. హస్తముద్రలను, సైన్లాంగ్వేజ్తో మిళితం చేసి ‘క్రాస్వోవర్’ నృత్యానికి రూపకల్పన చేసింది. గత నెల తిరువనంతపురంలో దేవిక ఇచ్చిన శాస్త్రీయ నృత్యప్రదర్శనను ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న బధిరులు ఆనందంగా ఆస్వాదించారు. ఒకసారి నృత్యప్రదర్శన ఇవ్వడానికి గుజరాత్‌కు వెళ్లిన దేవిక అక్కడ బధిరుల బృందాన్ని చూసింది. నృత్యం చూడాలనే ఆసక్తి వారిలో ఉన్నా సంపూర్ణంగా ఆస్వాదించగలరా? నృత్యం ద్వారా చెప్పే కథను వారు అర్థం చేసుకోగలరా? వారికి సులభంగా అర్థం కావాలంటే ఏంచేయాలి... ఇలాంటి విషయాలు ఎన్నో ఆలోచించింది దేవిక. దేవిక సందేహించినట్లుగానే వారు తన నృత్యప్రదర్శనతో కనెక్ట్ కాలేదు. అర్థం కానట్లు ముఖం పెట్టారు. ఇక అప్పటి నుంచి ‘డ్యాన్స్ ఫిలాంత్రపి అండ్ సోషల్ ఇన్‌క్లూజన్’ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. డ్యాన్స్ వొకాబ్యులరీని అభివృద్ధి చేయడానికి ఎంతోమందితో మాట్లాడింది. ‘నృత్యకారులకు తమతో తాము సంభాషించుకునే, తమలో ఊహాలోకాన్ని ఆవిష్కరించుకునే ఏకాంతంలో కొత్త ఆలోచనలు వస్తుంటాయి. నృత్యప్రదర్శనలు లేని ఖాళీ సమయంలో బధిరులను దృష్టిలో పెట్టుకొని మనసులోనే డ్యాన్స్‌ను కంపోజ్ చేశాను. ఊహల్లోని నృత్యానికి వాస్తవరూపం ఇవ్వడానికి సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను’ అంటుంది దేవిక. కేరళలోని పాలక్కాడ్‌లో కళాకారుల కుటుంబంలో పుట్టింది దేవిక. నాలుగేళ్ల వయసులోనే కాలికి గజ్జె కట్టింది. 20 సంవత్సరాల వయసులో సోలోపెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కేరళ కళామండపం’లో విద్యార్థులకు నాట్యపాఠాలు బోధించింది. టీవీ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించింది. ‘నృత్యానికి పరిమితులు ఉన్నప్పుడు దాని ఉద్దేశం నెరవేరదు. అది సంపన్న కళాప్రియులకే కాదు అందరికీ చేరువ కావాలి’ అంటున్న దేవిక తన నృత్యప్రదర్శన సామాన్యులకు చేరువ చేయడానికి ప్రయత్నిస్తోంది. తిరువనంతపురం డ్యాన్స్ షోలో బధిరులు తన హస్తముద్రలను అనుకరించడం దేవికకు సంతోషం ఇచ్చింది. ‘అదొక గొప్ప అనుభవం. వారి కళ్లు ఆనందంతో వెలిగిపోయాయి. ఎన్నో సంస్కృతులు, ఎన్నో భాషలకు చెందిన ప్రేక్షకుల ముందు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ఆ సంతోషాన్ని మించిన సంతోషం ఇది. నా నృత్యం వారి హృదయానికి దగ్గరైంది. నా ఉద్దేశం నెరవేరింది’ అంటోంది దేవిక. ‘నృత్యాన్ని ప్రజాస్వామీకరించాలి. అది అందరికీ చేరువ కావాలి’ అంటున్న దేవిక తన ప్రాజెక్ట్ ద్వారా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటోంది. మనం ఒక ప్రయోగానికి సిద్ధపడినప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. దేవిక ఆలాగే చేసింది. ధైర్యంగా ముందు అడుగు వేసింది. బధిరులలో ఎంతోమందికి నృత్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండవచ్చు. అయితే ప్రతికూల ఆలోచనలు వారిని వెనక్కి లాగవచ్చు. అలాంటి వారిని నృత్యకారులుగా తయారుచేయడానికి దేవిక సృష్టించిన నృత్యశైలి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. క్రాస్వోవర్ నృత్యప్రదర్శన చూస్తున్నప్పుడు వారి ముఖాల్లో కనిపించిన వెలుగు నాకు సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి. మనం వెదకాలేగాని దారులు ఎన్నో ఉన్నాయి. ‘క్రాస్వోవర్’ ద్వారా నాకు ఒక కొత్త దారి దొరికింది. – మెథిల్ దేవిక -
చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ' ఇచ్చే శక్తిగా..!
భవిష్యత్తుకు ప్రేరణ ‘మీ కూతురు ఇక నడవలేదు. వినలేదు’ అంటూ వైద్యుడి నోటి నుంచి వచ్చిన మాట విన్న తరువాత ఉజ్వల, ఆమె భర్త తమ జీవితాలను అర్ధంతరంగా చాలించాలనుకున్నారు. నిరాశే తప్ప ఆశ కనిపించని ఆ కఠిన సమయంలో హెలెన్ కెల్లర్ ఆత్మకథ చదివిన ఉజ్వల ఆత్మస్థైర్యం తెచ్చుకొని, జీవితాన్ని వెలుగుమయం చేసుకుంది. కూతురికి ఉజ్వల భవిష్యత్ ఇచ్చింది... ఆ రోజులు ఎలాంటివి అంటే... పాప నవ్విన ప్రతిక్షణం ఆ దంపతులకు పండగే. అలాంటి ఆనందమయ రోజుల్లో ఆరు నెలల పాప ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ ప్రమాదం వల్ల పాప పక్షవాతానికి గురైంది. వినికిడి శక్తి కోల్పోయింది. ‘పాప ఇక ఎప్పటికీ నడవలేదు’ అన్నట్లుగా చెప్పాడు డాక్టర్. ఆ ఇల్లు ఒక్కసారిగా చీకటిలోకి వెళ్లిపోయింది. ‘ఆత్మహత్య తప్ప మన జీవితానికి మరో పరిష్కారం లేదు’ అనుకున్నారు ఉజ్వల, ఆమె భర్త. ఆ సమయంలో ఒకరోజు తన సోదరి దగ్గర మనసులోని బాధను బయట పెట్టింది ఉజ్వల. సోదరి ఏం మాట్లాకుండా హెలెన్ కెల్లర్ ఆత్మకథ పుస్తకం ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ చేతిలో పెట్టి ‘ఇది ఒకసారి చదువు... ఇంతకుమించి ఏమీ చెప్పను’ అన్నది. ‘ప్రతి నిమిషం నిరాశే’ లాంటి ఆ రోజుల్లో ఒకరోజు ఉజ్వల హెలెన్ కెల్లర్ ఆత్మకథ చదవడం మొదలుపెట్టింది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ‘గుడ్ ఇంగ్లీష్’పై హెలెన్ పట్టుసాధించిన విధానం నుంచి జీవితంలోని నిరాశామయ సమయాల్లోనూ ధైర్యంగా ముందుకు వెళ్లడం వరకు ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. నయాగరా జలపాతం దగ్గర ఉన్నప్పుడు ఆ జలపాతం అందాలను హెలెన్ మనోనేత్రంతోనే చూసిన విధానం అపురూపంగా అనిపించింది. ఆ పుస్తకం చదవడం పూర్తిచేసిన తరువాత తన మనసులో కమ్మిన నిరాశ మేఘాలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ‘నా బిడ్డ కనీసం చూడగలుగుతుంది కదా’ అనుకుంది ఉజ్వల. తనలో సానుకూల శక్తికి అక్కడే బీజం పడింది. ‘ప్రియాంక’గా ఉన్న పాప పేరును ‘ప్రేరణ’ గా మార్చింది. మార్పు మొదలైంది. అది ఆశావహమైన మార్పు. మరోవైపు... నడవడం కష్టం అనుకున్న పాప వైద్యం, వ్యాయామాల వల్ల నడవడం ప్రారంభించింది. అయితే వినికిడి లోపం మాత్రం పోలేదు. ప్రేరణను స్పీచ్ అండ్ హియరింగ్–ఇంపేర్డ్ స్కూలులో చేర్పించింది. ప్రేరణకు శాస్త్రీయ నృత్యంపై ఉన్న ఆసక్తిని గమనించి పుణెలోని ‘సాధన నృత్యాలయ’లో చేర్పించింది ఉజ్వల. ‘నృత్యాలయలో చేర్పించిన మాటేగానీ ప్రేరణ ఎలా డ్యాన్స్ చేయగలుగుతుంది? గురూజీ చెప్పే ముద్రలను ఎలా అర్థం చేసుకోగలదు... ఇలాంటి సందేహాలెన్నో నాలో ఉండేవి. అయితే గురూజీ షమిత మహాజన్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ప్రేరణను ఎలాగైనా మంచి నృత్యకారిణిగా తయారు చేయాలనే పట్టుదల ఆమె కళ్లలో కనిపించింది’ అంటుంది ఉజ్వల. శమిత మహాజన్ దగ్గర నృత్యంలో పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది ప్రేరణ. మొదటి రెండు సంవత్సరాలు బాగానే కష్టపడాల్సి వచ్చింది ప్రేరణ. ‘మాటల ద్వారా ప్రేరణకు నాట్యానికి సంబంధించిన ముద్రలను నేర్పించడం కష్టం. చాలా ఓపిక ఉండాలి. గురూజీ ఎప్పుడూ ఓపిక కోల్పోలేదు. గురూజీ చెప్పేదాన్ని లిప్–రీడింగ్ ద్వారా అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది ప్రేరణ’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఉజ్వల. ఎంతోమంది సీనియర్ డ్యాన్సర్ల ముందు ప్రేరణ ఆరంగేట్రం ఇచ్చింది. సింగిల్ మిస్టేక్ కూడా చేయలేదు. ‘నాట్యకారిణిగా నీకు ఉజ్వల భవిష్యత్ ఉంది’ అని పెద్దలు ప్రేరణను ఆశీర్పదించారు.‘చీకటిగా ఉన్న నా ఆత్మగదుల్లోకి ఒక కాంతికిరణం ప్రసరిస్తే ఎలా ఉంటుంది?’ అని తన ఆత్మకథ చివరిలో ప్రశ్నిస్తుంది హెలెన్ కెల్లర్. అది అచ్చంగా ఆత్మస్థైర్యంతో తెచ్చుకున్న అపూర్వ విజయంలా ఉంటుంది. అందుకు ఉదాహరణ ప్రేరణ. ఒక ద్వారం మన కోసం... బాధ, ఆవేశంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరంగా ఉంటాయి. ప్రశాంతమైన హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మన కోసం ఎక్కడో ఒక చోట ఒక ద్వారం తెరుచుకొనే ఉంటుంది. ఆవేదన, ఆవేశాలతో ఆ ద్వారం దగ్గరకు చేరలేము. – ఉజ్వల సహానే (చదవండి: ప్లాస్టిక్‌పై కొత్త ఉద్యమం బర్తన్ బ్యాంక్ !) -
జాలిచూపులు, హేళనలు.. అన్నీ దాటి రాజస్తాన్ రాయల్స్‌కు ఎంపికైన కడప కుర్రాడు
పుట్టుకతో మూగ, చెవుడు.. చుట్టూ ఉన్నవారి హేళనలు.. జాలిచూపులు.. వీటన్నింటినీ దాటుకుని తనకంటూ ప్రత్యేకతను చాటిచెబుతూ ఓ వైపు క్రికెట్లో మరోవైపు వాలీబాల్ పోటీల్లో కడప నగరానికి చెందిన బిల్లా రాజు రాణిస్తున్నాడు. ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐడీసీఏ 4వ టీ–20 డెఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో పాల్గొనే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో ఈయన ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు కోల్‌కతాలో నిర్వహించే టీ–20 టోర్నమెంట్లో పాల్గొననున్న నేపథ్యంలో రాజు క్రీడాప్రస్థానంపై ప్రత్యేక కథనం. - కడప స్పోర్ట్స్ కడప నగరం మరియాపురంనకు చెందిన కుమారి (గృహిణి), సుబ్బరాయుడు (మున్సిపల్ వాటర్ విభాగంలో పంప్ ఆపరేటర్) దంపతుల కుమారుడైన బిల్లా రాజుకు పుట్టుకతోనే మూగ, చెవుడు. దీంతో వారి తల్లిదండ్రులకు కొద్దిరోజుల పాటు ఇబ్బందులు తప్పలేదు. తొమ్మిదో తరగతిలో చుట్టూ ఉన్నవారి జాలిచూపులు, హేళనలు బాధించినా రాజును ఉన్నతంగా చూడాలన్న తల్లిదండ్రులు.. కడప నగరంలోని హెలెన్కెల్లెర్స్ బధిరుల పాఠశాలలో చేర్పించారు. రాజు సోదరుడు రవి క్రికెట్ ఆడుతున్న సమయంలో అతనితో పాటు వెళ్తూ మెల్లగా క్రికెట్ సాధన చేయడం ప్రారంభించాడు రాజు. తమ్మునిలోని క్రికెట్ నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాడు. దీంతో 9వ తరగతికి వచ్చేనాటికి క్రికెట్, వాలీబాల్ క్రీడలపై అభిమానం పెంచుకున్నాడు. దీంతో కడప నగరంలోని డీఎస్ఏ క్రికెట్ స్టేడియంలో క్రికెట్‌కు, వాలీబాల్ క్రీడల్లో శిక్షణకు వచ్చేవాడు. వాలీబాల్ పోటీల్లో పలుమార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. తొలుత హైదరాబాద్ కెప్టెన్.. ఇప్పుడు రాజస్తాన్‌కు క్రికెట్ కోచ్ ప్రసాద్, ఇలియాస్‌లు ప్రోత్సహించడంతో ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారాలని భావించాడు. పదోతరగతి అనంతరం ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని స్వీకార్ ఉపకార్ కళాశాలలో చేరాడు. అక్కడే ఆయన క్రికెట్ జీవితం మలుపుతిరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ అకాడమీలో శిక్షణ పొందుతూ డెఫ్ క్రికెట్లో పాల్గొనడం ప్రారంభించాడు. అనతి కాలంలోనే హైదరాబాద్ డెఫ్ జట్టుకు కెప్టెన్‌గా రాణించాడు. ఎడమచేతి వాటం గల రాజు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా హైదరాబాద్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గత సీజన్లో హైదరాబాద్ డెఫ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈయన తాజాగా రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడమే లక్ష్యంగా ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు కోల్‌కతాలో నిర్వహించనున్న ఐడీసీఏ 4వ డెఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో పాల్గొనే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఈయన ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇప్పటి వరకు సౌత్‌జోన్ టీ–20, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తూ వస్తున్న ఈయన అంతర్జాతీయ పోటీల్లో భారత డెఫ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. యువతకు ఆదర్శం రాజు ఓవైపు క్రికెట్లో రాణిస్తూ కుటుంబపోషణ కోసం కడప నగరంలోని ఓ ప్రైవేట్ ఫొటోస్టూడియోలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. జిల్లాకు చెందిన రాజు రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఎంపికవడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు. చదవండి: IPL 2023: నీ తప్పిదం వల్ల భారీ మూల్యం! అమ్మో ఈ ‘మహానుభావుడు’ ఉంటేనా.. చెన్నై సూపర్ కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ.. మరో స్టార్ ప్లేయర్ ఔట్ -
విధిపై యుద్ధం! గద్దించాలనుంది.. కానీ గొంతు పెగలడంలేదు
ఉమ్మడి కుటుంబం.. ఇంటినిండా జనం.. అనుబంధాల గుమ్మం..అనురాగాల కాపురం.. విధి వికృతం..మేనరికం శాపమో..పేదరికం పాపమో.. విధిపై యుద్ధం చేయాలనుంది.. వైకల్యం వెక్కిరిస్తోంది..గద్దించాలనుంది..గొంతు ఉన్నా పెగలడంలేదు. కష్టాలను ఎదురీదుతామని విన్నవించుకోవడం తప్పా..వినలేని దైన్యం వారిది. రాయదుర్గంలోని నేసేపేటలో నివాసముంటున్న దొడగట్ట గంగమ్మ కుటుంబాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. శ్రమను నమ్ముకున్న ఈ కుటుంబంలో ఏకంగా నలుగురు బధిరులు ఉన్నారు. జీవన పోరాటం సాగిస్తూ కుటీర పరిశ్రమ కోసం చేయూత కోరుకుంటున్నారు. రాయదుర్గం: రాయదుర్గంలోని నేసేపేటలో నివాసముంటున్న దొడగట్ట గంగమ్మ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అందులో ఒక కుమారుడు దేవేంద్ర, కుమార్తె తిప్పక్క పుట్టుకతోనే మూగవారు. ఎదిగే కొద్దీ వినికిడి శక్తినీ కోల్పోయారు. దేవేంద్రకు సమీప బంధువైన నాగవేణితో వివాహమైంది. వీరికి రాధ, సంజయ్, పల్లవి సంతానం. వీరిలో సంజయ్‌కు మూగ, చెవుడు, అవయవలోపం ఉంది. పల్లవి కూడా మూగ, చెవుడుతో బాధపడుతోంది. వీరు పదో తరగతి వరకు చదువుకున్నారు. తిప్పక్కకు వివాహమైనప్పటికీ భర్తతో మనస్పర్థల నేపథ్యంలో తల్లి వద్దే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. గంగమ్మ మరో కుమార్తె వివాహమై మెట్టినింటికి వెళ్లిపోయారు. మొత్తం మీద తొమ్మిది మంది సభ్యులు గల ఈ ఉమ్మడి కుటుంబంలో నలుగురు మూగ, చెవుడు, వైకల్యంతో బాధపడుతున్నారు. సైగలతోనే సంభాషణ.. గంగమ్మ కుమారుడు దేవేంద్ర, కుమార్తె తిప్పక్క, మనవడు సంజయ్, మనవరాలు పల్లవి సైగలతోనే సంభాషిస్తుంటారు. అవతలి వారికి వీరి భాష అర్థం కాకపోతే కాగితంపై రాసి చూపుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు వేరేచోట ఉన్నపుడు వారితో అవసరం ఉంటే వాట్సాప్ వీడియో కాల్‌ను ఉపయోగించుకుంటున్నారు. కుటీర పరిశ్రమ కోసం వినతి.. దేవేంద్ర తన భార్య నాగవేణితో కలిసి ఇంట్లోనే కుట్టుమిషన్ పెట్టుకుని పీస్ వర్క్‌పై జీన్స్‌ప్యాంట్లు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్యనే కుమార్తె పల్లవికి కూడా కుట్టుమిషన్‌లో శిక్షణ ఇస్తున్నాడు. కుమారుడు సంజయ్ తనకు చేతనైన మేరకు తల్లిదండ్రులకు సహకారం అందిస్తున్నాడు. తల్లికి వృద్ధాప్య పింఛన్, దేవేంద్రకు వికలాంగుల పింఛన్ అందుతోంది. దేవేంద్ర సోదరి తిప్పక్కకు సెపరేట్ రేషన్‌కార్డు ఉన్నందున ఆమెకు పింఛన్ వస్తోంది. దీనితోనే అందరూ బతుకుబండి లాగుతున్నారు. అరకొర సంపాదనతో అవసరాలు పూర్తిస్థాయిలో తీరడం లేదు. పీస్ వర్క్ కాకుండా సొంతంగా వర్క్ ఆర్డర్ తెచ్చుకుని కుట్టివ్వడం ద్వారా సంపాదనను మరింత పెంచుకోవడానికి కుటీర పరిశ్రమ ఏర్పాటు కోసం తమకు బ్యాంకు ద్వారా రుణం ఇప్పించాలని దేవేంద్ర దంపతులు కోరుతున్నారు. ప్రతి క్షణం కుంగిపోతున్నాం నాకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు మూగ వారిగా జన్మించారు. కుమారుడికి కూడా ఇద్దరు పిల్లలు మూగ, చెవుడు, వైకల్య లోపంతో జన్మించడం బాధేస్తోంది. ఆ దేవుడు మాకే ఎందుకు ఇలా చేశాడని ప్రతిక్షణం కుంగిపోతున్నాం. అయినా బతుకుపోరాటం కొనసాగిస్తున్నాం. ఇంటి నిండా జనం. అయినా నిశ్శబ్దం. సైగలతోనే సహజీవనం. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటాం. – గంగమ్మ, కుటుంబ పెద్ద (చదవండి: పులినే చంపగల శునకం.. ఖరీదులో కనకం...) -
సరిలేరు మీకెవ్వరు!
ఒకరిని చూసి నేర్చుకోవడానికి లేదా ఒకరిని చూసి స్ఫూర్తి పొందడానికి వాళ్లు గొప్పగొప్పోళ్లే కానక్కర్లేదు.. చరిత్రను తిరగరాసినోళ్లే అవ్వాల్సిన పనిలేదు.. ఒక దత్తాత్రి, ఒక మహేశ్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు.. స్ఫూర్తినీ పొందవచ్చు.. ఇంతకీ ఎవరు వీరు.. ఈ సామాన్యులు మనకు నేరి్పస్తున్న జీవిత పాఠం ఏమిటి? తెలుసుకోవాలంటే.. చలో నిర్మల్ జిల్లా.. అప్పటికే టీ దుకాణానికి చేరుకున్న పాలావార్ దత్తాత్రికి ఫోన్ల మీద ఫోన్లు.. అవి కూడా వీడియో కాల్స్.. అందులోని ఒక వ్యక్తి చేతులతో సైగలు చేశాడు.. వెంటనే దత్తాత్రి వేడివేడి చాయ్, కప్పులు తీసుకుని బైక్ మీద బయల్దేరాడు.. ఆర్డర్ డెలివరీ చేసి వచ్చాడు.. వినడానికి, చూడటానికి ఏముంది విశేషం అని మనకు అనిపించొచ్చు.. ఉంది.. దత్తాత్రి పుట్టుకతోనే మూగ, చెవుడు. అన్నీ సరిగా ఉండీ.. అబ్బో మనకు కష్టం అనేస్తున్న రోజులివీ.. దత్తాత్రి అలా అనుకోలేదు. ఆరవ తరగతి వరకూ చదువుకున్న అతను ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని.. సొంతంగా టీ దుకాణం పెట్టుకున్నాడు.. ఇదిగో ఇలా తన వినియోగదారులందరికీ సెల్ నంబర్ ఇచ్చాడు.. అతని పరిస్థితి తెలిసిన వారు కాబట్టి.. వీడియో కాల్ చేసి.. ఎన్ని టీలు కావాలన్నది ఆర్డర్ ఇస్తారు. మనోడు వెంటనే డెలివరీ ఇస్తాడు.. రోజుకు వెయ్యి వరకూ సంపాదిస్తానని చెప్పాడు. దత్తాత్రికి మరో ముగ్గురు సోదరులు ఉన్నారు. 2004లో అతడికి వివాహమైంది. తనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్లు చెప్పాడు. చదవండి: పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయి.. ప్రియుడ్ని.. దివ్యాంగ శక్తి ఎంటర్ప్రైజెస్ షాపు.. పంచగుడి మహేశ్.. విస్తర్ల తయారీలో బిజీబిజీగా ఉన్నాడు.. అక్కడ ఉన్న మరికొందరు పర్యావరణహిత ఫినాయిల్, శానిటైజర్లు తయారుచేస్తున్నారు.. వాళ్ల పనిచూస్తే తెలియదు.. వాళ్లను దగ్గరగా చూస్తే తెలుస్తుంది.. దివ్యాంగులని.. ఈ దివ్యాంగ శక్తి ఎంటర్ప్రైజెస్ స్థాపించిన మహేశ్ అంధుడు(95%). మిగిలిన నలుగురూ దివ్యాంగులు! మహేశ్ ఒకరిపై ఆధారపడకుండా తాను స్వయం ఉపాధి పొందడమే కాకుండా.. తనలాంటి మరికొందరికి బతకడానికి దారి చూపాడు.. అంతేకాదు.. ముడిసరుకును కూడా దివ్యాంగులకు చెందిన యూనిట్ల నుంచే కొనుగోలు చేస్తాడట.. మహేశ్‌కి ఇద్దరు సోదరులు.. ఒక సోదరుడు శ్రీకాంత్ కూడా అంధుడే.. మహేశ్ డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు.. మరేంటి మహేశ్.. చదువుకున్నావుగా.. బ్యాక్లాగ్ లేదా దివ్యాంగుల కేటగిరీలో ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేకపోయావా అని అడిగితే.. ఏమన్నాడో తెలుసా? ‘‘నేను బాగుంటే.. నా కుటుంబం మాత్రమే బాగుంటుంది.. అదే నాతోపాటు నలుగురు బాగుంటే వారి కుటుంబాలు కూడా బాగుంటాయి’’ అని.. శెబ్బాష్ రా.. మహేశ్.. – భైంసా టౌన్ -
టిక్‌టాక్ చెప్పిన చిరునామా.. ఇంటికి చేరిన వ్యక్తి
భద్రాద్రి కొత్తగూడెం: టిక్‌టాక్ పుణ్యమాని రెండేళ్ల క్రితం తప్పిపోయిన బధిరుడు సొంతింటికి చేరుకున్నాడు. జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టీనగర్ గ్రామానికి చెందిన రొడ్డం వెంకటేశ్వర్లు రెండేళ్ల క్రితం కూలి పనుల నిమిత్తం దగ్గరలోని పాల్వంచ పట్టణానికి వెళ్లాడు. తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో అదే గ్రామానికి కలసాని నాగేందర్ అనే వ్యక్తి ఇటీవల టిక్‌టాక్ వీడియోలు చూస్తుండగా ఓ వీడియోలో వెంకటేశ్వర్లు కనిపించాడు. వెంటనే ఆ విషయాన్ని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో వెంకటేశ్వర్లు పంజాబ్‌లోని లూథియానాలో ఉన్నట్టు అతని కుటుంబ సభ్యులకు తెలుసుకున్నారు. వెంకటేశ్వర్లు కుమారుడు అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను సంప్రదించాడు. వారు తన తండ్రిని అప్పగించడంతో అతణ్ని తీసుకొని మంగళవారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్నాడు. వెంకటేశ్వర్లు తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆనందం వెల్లివిరిసింది. అతని ఆచూకీ పట్టించిన టిక్‌టాక్‌కు, సహకరించిన పోలీసులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఎంపీటీసీ తొటమళ్ల సరిత కలిసి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి అతడికి, అతడి భార్యకు నూతన వస్ర్తాలు అందజేశారు. -
ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు అవసరమా?
వినికిడి లోపం గల ఓ తండ్రి తన కుమార్తెతో సైగలతో సంభాషిస్తున్న వీడియోను అమెరికా మాజీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ రెక్స్ చాప్మన్ ట్విటర్లో తాజాగా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. వినికిడి లోపం గల ఓ తండ్రి అప్పుడే పుట్టిన తన చిన్నారితో సైగలతో మాట్లాడే మాటాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేమకు భాష లేకపపోతే ఏంటి? తండ్రి తనపై కురిపిస్తున్న ఆత్మీయ స్పర్శ, ప్రేమ చాలు అనేలా.. ఆ చిన్నారి చూస్తున్న చూపులు నెటిజన్లను కంటతడి పెట్టిస్తుంది. This hearing-impaired father expressing love to his newborn daughter in sign-language is the definitely Twitter content I’m here for...💪😍😇😊🔥 pic.twitter.com/CEvINcmRaX — Rex Chapman🏇🏼 (@RexChapman) October 18, 2019 వినికిడి లోపం ఉన్న ఆ తండ్రి అప్పుడే పుట్టిన తన బిడ్డతో సైగలతో మాట్లాడుతుంటే.. ఆ పాపాయి తదేకంగా నువ్వు చెప్పే ప్రతీది తనకు అర్థమవుతోంది అన్నట్లు చూస్తోంది. కుమార్తెపై ఈ మూగ తండ్రి కురిపిస్తున్న ప్రేమను చూసిన ప్రతి ఒక్కరికి నిమిషం పాటు.. నోట మాట రాదంటే నమ్మండి. ఈ వీడియోను చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు మాత్రం ఆ తండ్రి సైగలకు అర్థాన్ని వెతికే పనిలో పడ్డారు. సంకేత భాషను అర్థం చేసుకున్న కొద్దిమంది నెటిజన్లు.. ఆ తండ్రి తన చిన్నారితో.. ‘హేయ్ నేను మీ డాడీని. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కళ్లు ఆకుపచ్చ రంగులో అద్భుతంగా ఉన్నాయి. నీ అందమైన చిరునవ్వు బావుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వెచ్చని దుప్పటిలో ఉన్న ఓ చిన్నదానా..! నేను నిన్ను ప్రేమిస్తున్నానే..' అంటున్నాడని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'ప్రేమ అన్ని భాషలను మించిపోయింది' అని మరోక నెటిజన్ పేర్కొన్నాడు. -
‘కేఫ్ కాఫీ డే’లో మరో కొత్త కోణం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ కాఫీ సంస్కృతిలో కొత్త విప్లవానికి వాకిటి తెరచిన ‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆయన కాఫీ డేలకు సంబంధించి రోజుకొక సామాజిక కోణం వెలుగులోకి వస్తోంది. కాఫీ డే ప్రతి స్టోర్‌లో రకరకాల కాఫీలు కలిపే నిపుణుల్లో ఎక్కువ మంది మూగ, చెవుడు వాళ్లేనట. వాళ్లకే రకరకాల కాఫీల సువాసనలు సులభంగా పసిగట్టే సామర్థ్యం ఉంటుందట. అంతేకాకుండా వారు రుచులను కూడా సరిగ్గా గుర్తించగలరట. ఇలాంటి వాళ్లను కార్పొరేట్ రంగం సాధారంగా పనిలోకి తీసుకోదు. ఒక్క కాఫీ కేఫ్‌ల రంగంలోనే అలాంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. సమాజంలో అంతగా ఆదరణలేని మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడం ద్వారా కొంత సామాజిక బాధ్యతను నిర్వర్తించినట్లు ఉండడమే కాకుండా సువాసనలను సులభంగా పసిగట్టే వారి నైపుణ్యం కేఫ్‌లకు ఉపయోగపడుతుందని, ఆ ఉద్దేశంతోనే అలా ఎక్కువ మందిని తీసుకున్నట్లు మార్కెటింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణన్ తెలిపారు. ఇలా మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడం ఒక్క ‘కేఫ్ కాఫీ డే’లకే పరిమితం కాలేదు. కేఎఫ్సీలోని ‘కాఫీ కోస్టా’ అవుట్లెట్లకు కూడా విస్తరించింది. వాటిల్లో ఒక్క కాఫీలను తయారు చేసే నిపుణులే కాకుండా కాఫీలను, స్నాక్స్‌ను సరఫరా చేసే వాళ్లలో కూడా ఎక్కువ మంది మూగ, చెవిటి వాళ్లేనట. వాళ్లంతా సైగలతోనే మాట్లాడుకుంటారట. వారు పరస్పరం నోరు విప్పు మాట్లాడుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల కాఫీ హౌజ్‌లు నిశ్శబ్దంగా ఉంటాయట, అలాంటి నిశ్శబ్ద ప్రశాంత వాతావరణాన్ని కోరుకునే ఎక్కువ మంది వినియోగదారులు వస్తారని, ఒక్క బెంగళూరులోని తమ ‘కాఫీ కోస్టా’ అవుట్ లెట్లలో దాదాపు 200 మంది మూగ, చెవిటి వాళ్లు పనిచేస్తున్నారని ఓ అవుట్లెట్ మేనేజర్ వివరించారు. చెవిటి సిబ్బంది వినియోగదారుల నుంచి ఆర్డర్లు కాగితంపై రాయించి తీసుకుంటారని ఆయన తెలిపారు. అయితే మేనేజర్ మాత్రం మూగ, చెవుడు కాకపోవడమే కాకుండా మూగ భాష కూడా రావాలని ఆయన చెప్పారు. స్టార్‌బక్ కాఫీ హౌజుల్లో కూడా ఎక్కువ మంది చెవిటి వాళ్లే పనిచేస్తున్నారని తెల్సింది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు డీసీ స్టార్‌బక్స్ అమెరికా రాజధాని వాషింగ్టన్లో తన తొలి స్టోర్‌ను ప్రారంభించినప్పుడు కూడా చెవిటి వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారట. మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడానికి ఈ కార్పొరెట్ కాఫీ సంస్థలు రెండు కారణాలే చెబుతున్నాయిగానీ మూడో కారణం కూడా ఉందని మనం ఊహించవచ్చు. చెవిటి వాళ్లు కాస్త తక్కువ వేతనాలకు దొరకుతారన్న విషయం తెల్సిందే. -
వైఎస్ జగన్ పాదయాత్ర ఫోటోలను సేకరించిన దివ్యాంగుడు
-
వాట్సప్ కలిపింది ఇద్దరినీ
సాక్షి, బళ్లారి:ఇద్దరికీ ముఖ పరిచయం లేదు, మాటలు రావు, చెవులు వినిపించవు. అయినా ఇద్దరినీ వాట్సప్ ద్వారా చాటింగ్‌తో పరిచయం మొగ్గతొడిగి అది ఇరు హృదయాల మధ్య ప్రేమగా మారింది. వివాహ భాగ్యంతో ఒక్కటయ్యారు. ఆదివారం బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలోని బనశంకరి కళ్యాణ సముదాయ భవనంలో కుటుంబ సభ్యులు, బం«ధుమిత్రుల సమక్షంలో మూగబధిరులైన అశ్విని, ఈశ్వర్లు పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. ఈశ్వర్, అశ్వినీ ఇద్దరూ వేర్వేరు జిల్లాలకు చెందిన వారు, పుట్టుకతోనే దివ్యాంగులు. వారి వారి తల్లిదండ్రులు ఎంతో ఓర్పుతో, కష్టంతో చదివించారు. ప్రైవేటు కంపెనీలో ఇద్దరికీ ఉద్యోగాలు లభించాయి. అయితే వీరిద్దరికీ గతంలో ఎలాంటి పరిచయం లేదు. వాట్సప్ ద్వారా పరిచయమై ప్రేమగా మారింది. నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధు–మిత్రులు అతనిది రాయచూరు, ఆమెది కొట్టూరు రాయచూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తిప్పణ్ణ, మంజుల కుమారుడు ఈశ్వర్. ఐటీఐలో ఎలక్ట్రికల్ పూర్తి చేశారు. ప్రస్తుతం హెచ్‌ఆర్‌బీఎల్ కంపెనీలో పని చేస్తున్నారు. బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలో కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ తిప్పేస్వామి, రత్నమ్మ దంపతులకు కలిగిన అశ్వినీ కూడా పుట్టుకతోనే మూగ. ఆ దంపతులు తమ కూతురికి మాటలు రావనే చింతను వదిలేసి ఎంతో కష్టపడి చదివించారు. ఆమె కూడా కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది.ఇద్దరూ తమ ప్రేమను తల్లిదండ్రులకు తెలిపి పెళ్లికి ఒప్పించారు. బంధుమిత్రుల నడుమ వైభవంగా పెళ్లి వేడుక జరిగింది. -
మృత్యుంజయుడు
శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు: ఆడుకుంటూ నేలబావిలో పడిన బధిర బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. మండలంలోని హుకుంపేట గ్రామానికి చెందిన కొమర యువ కిరణ్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. బధిరుడైన యువకిరణ్ ఆదివారం ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఆడుకుంటున్నాడు. సమీపంలోనే పురాతన బావి నందపైకి ఎక్కడంతో దానిపై నుంచి జారి బావిలో పడిపోయాడు. కేకలు వేయలేని స్థితిలో గంట పాటు బావిలోనే ఉండిపోయాడు. అటుగా వెళ్లిన కొమర సింహాచలం అనే యువకుడు.. బావిలోకి దూకాడు. ఇంతలో గ్రామస్తులందరూ కలసి బావిలో నిచ్చెన వేసి ఇద్దరనీ బయటకు తీశారు. బావిలో మోకాలు ఎత్తులో తక్కువ స్థాయిలో నీరు ఉందని, దీనివల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని స్థానికులు వివరించారు. పూర్తిస్థాయిలో నీరు ఉంటే ప్రమాదమే జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బావి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ప్రాణాపాయం నుంచి బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ బావిని మూసివేయాలని లేనిపక్షంలో వాడుకలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
వినికిడి లోపమని వదిలేశారు!
కాశీబుగ్గ(పలాస): వినికిడి లోపముందని భర్త ఆదరించకపోవడం, అదనపు కట్నం తేవాలని అత్తమామలు వేధించడంతో పలాస పట్టణంలోని ఉలాసపేటకు చెందిన గెంబలి సౌందర్య బుధవారం మౌనదీక్ష చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఉలాసపేటకు చెందిన సుడియా గౌతమ్‌తో విజయనగరం జిల్లా పార్వతీపురం గ్రామానికి చెందిన గెంబలి నారాయణ, శారదల కుమార్తె సౌందర్యతో 2016 డిసెంబరు 9న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదును కట్నంగా ఇచ్చారు. నెల రోజుల తర్వాత సౌందర్యకు వినికిడి లోపం ఉన్నట్టు భర్త, అత్తమామలు గ్రహించారు. దీంతో గౌతమ్ తన భార్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య తనిఖీలు చేయించాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమెను అక్కడే విడిచిపెట్టి బెంగళూరు వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న సౌందర్య తల్లి దండ్రులు తన కుమార్తెను పార్వతీపురం తీసుకువచ్చారు. అక్కడి నుంచి వియ్యంకులకు ఫోన్ చేసి తమ కుమార్తెను తీసుకెళ్లాలని కోరారు. అయినా స్పందించకపోవడంతో బుధవారం కుమార్తెతో కలిసి పలాస వచ్చి గౌతమ్ ఇంటి ముందే మౌనదీక్ష చేపట్టారు. ఈ సమయంలో అత్త రమాదేవి మౌన దీక్ష వహిస్తున్న సౌందర్యకు కిటికీలో నుంచి తిట్ల వర్షం కురిపించింది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లకపోతే ఏం జరుగుతుందో తెలియదని హెచ్చరికలు జారీ చేసింది. దిక్కుతోచని స్థితిలో సౌందర్య 100 నంబర్ కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలతో మాట్లాడగా అదనంగా మరో రూ.20 లక్షలు ఇచ్చి కాపురానికి పంపించాలని అత్త రమాదేవి చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసు కాశీబుగ్గ పోలీసుల పరిశీలనలో ఉంది. -
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
వెల్దుర్తి రూరల్ : గుంటుపల్లె గ్రామానికి చెందిన కృష్ణయ్య(28) అనే వ్యక్తి శుక్రవారం రైలు ఢీకొని మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడికి చెవుడు ఉంది. ఇతను రోజు రాయి కొట్టే పనులకెళ్తాడు. ఎండలు ఎక్కువగా ఉన్నందున శుక్రవారం తెల్లవారుఝామునే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొన్నట్లు అనుమానం. మృతుడికి భార్య కళావతి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మూగ, చెవిటి పాత్రలో స్టార్ హీరోయిన్
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టిపెడుతున్నారు. అలా కుదరని పక్షంలో ఉన్నంతలో తమ పాత్రతో నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో సక్సెస్ సాధించగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే ప్రయత్నాల్లో ఉంది. సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తమన్నా ఇప్పుడు నటిగా ప్రూవ్ చేసుకోవాలని తాపత్రేయపడుతోంది. అందుకే అభినేత్రి సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవటంతో తమన్నా కష్టం వృథా అయ్యింది. అయితే తాజాగా మరో ఛాలెంజిగ్ రోల్‌కు ఓకె చెప్పింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్లో బిజీగా ఉన్న తమన్నా, ఈ పనులన్ని పూర్తయ్యాక, బాలీవుడ్ దర్శకుడు వసు భగ్నాని నిర్మాణంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమాలో తమన్నా మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుందట. ఈ సినిమాతో నటిగా తాను అనుకున్న ఇమేజ్ వస్తుందన్న నమ్మకంతో ఉంది తమ్ము. అంతేకాదు మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించానన్న తమన్నా, ఆ సినిమాతో తన క్యారెక్టర్ అభిమానులకు షాక్ ఇస్తుందని తెలిపింది. -
ప్రాణం తీసిన వినికిడి లోపం
గూడ్స్ ఢీకొని వ్యక్తి మృతి కోసిగి: వినికిడి లోపం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కోసిగి వడ్డే వీధికి చెందిన వడ్డే రమేష్(25) సోమవారం రాంపురం గ్రామానికి వెళ్లేందుకు కోసిగి రైల్వేస్టేషన్‌కు బయలు దేరాడు. చెన్నై నుంచి ముంబాయికు వెళ్లే మొయిల్ ఎక్స్‌ప్రెస్ సమయమైందని రైల్వేస్టేషన్‌కు అడ్డదారిలో పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. పుట్టుకతోనే అతను బధిరి (మాటలు రావు.. చెవులు వినపడువు) కావడంతో వెనుక నుంచి వచ్చే గూడ్స్‌ను గమనించక పోవడంతో వేగంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. 108లో ఆదోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
అంతరంగాన్ని తాకే ధ్వని తరంగం!
శ్రీకృష్ణుడి బృందావనాన్ని అంధులు చూడవచ్చని అంటారు! అక్కడ మూగవారు మాట్లాడగలరనీ అంటారు. ఇది ఎంత వరకు నిజమో మనకు తెలియదుగానీ.. ఈ సైన్స్ ప్రపంచంలో మాత్రం వైకల్యమున్న వారికి దాదాపుగా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలైతే కుప్పలు తెప్పలుగా జరుగుతున్నాయి. పక్కన ఫొటోలోని వారు తొడుక్కున్న షర్ట్ కూడా అలాంటిదే. వినికిడి శక్తి తక్కువ ఉన్నవారికీ, లేనివారికీ సంగీతపు మధురిమను అందిస్తుంది ఈ హైటెక్ షర్ట్. జర్మనీలోని క్యూట్ సర్క్యూట్ అనే టెక్నాలజీ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఇదే సంస్థ రెండేళ్ల క్రితం అవసరానికి తగ్గట్టుగా డిజైన్‌ను మార్చగల, ట్వీట్లు చేయగల హైటెక్ షర్ట్‌ను తయారు చేసింది. బధిరులకు ఉపయోగపడే షర్ట్‌పై కొన్ని కీలకమైన ప్రదేశాల్లో దాదాపు 16 యాక్చుయేటర్స్ ఏర్పాటు చేయడం, సంగీతానికి తగ్గట్టుగా అవి కొన్ని ప్రకంపనలు సృష్టించడం ఈ షర్ట్ ప్రత్యేకత. ఉదాహరణకు ఆర్కెస్ట్రా నడిచే స్టేజీపై పదుల సంఖ్యలో ఏర్పాటు చేసిన మైక్రోఫోన్లు అక్కడి శబ్దాలను గ్రహిస్తే... ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ వాటిని డిజిటల్ రూపంలోకి మారుస్తుంది. ఈ సమాచారం వైర్లెస్ పద్ధతిలో షర్ట్‌కు చేరుతుంది. డ్రమ్ముల శబ్దం తాలూకూ ప్రకంపనలు పొట్ట భాగంలోవస్తే... వయోలిన్వి చేతుల మీద వస్తాయన్నమాట. శబ్దం తాలూకూ తీవ్రతకు అనుగుణంగా ఉండే ఈ కంపనాలను బధిరులు ‘ఫీల్’ కావచ్చునని తద్వారా సంగీతాన్నీ ఆస్వాదించవచ్చునని అంటున్నారు ఈ షర్ట్‌ను అభివృద్ధి చేసిన ఆర్కెస్ట్రా సభ్యులు. ఇప్పటికే దీన్ని కొంతమంది బధిరులు వాడి ఆ అనుభూతిని పొందారు కూడా. జర్మనీలోని జంగ్జే సింఫోనికర్ ఆర్కెస్ట్రా వీటిని ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి పెట్టేసింది. ఇంతకీ దీని పేరేమిటో తెలుసా? సౌండ్ షర్ట్! -
యువత చెవిటిదైపోతోంది!
సంగీతం హోరులో యువత చెవిటిదైపోతోంది. నిశ్శబ్దం, మెలొడీలోని ప్రశాంతతను గుర్తించలేక.. వేలం వెర్రిగా భారీ శబ్దాల వెంట పరిగెడుతూ చెవిటిదైపోతోంది. క్లబ్బుల్లో హోరెత్తే సంగీతంతో పాటు.. చెవిలోపలికి దూరి మరీ భారీ శబ్దాలను వినిపించే హెడ్ ఫోన్స్ కారణంగా 40 ఏళ్లు వచ్చే లోపే హియర్ మెషిన్లను చెవులకు తగిలించుకునే పరిస్థితి వస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సావోపాలో మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. 11 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కులపై జరిపిన ఈ పరిశోధనలో.. అధిక శబ్దాలను ఆస్వాదించే వారిలో ఎక్కువ శాతం మంది టిన్నిటస్( చెవికి సంబంధించిన రుగ్మత)తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. చెవిలోని కాక్లియర్ హెయిర్ సెల్స్ దెబ్బతినడం మూలంగా టిన్నిటస్ వస్తోంది. క్లబ్బుల్లో హోరెత్తే మ్యూజిక్, హెడ్‌ఫోన్స్ కాక్లియర్ హెయిర్ సెల్స్ దెబ్బతినేలా చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. పిల్లలు టీనేజ్ నుంచే భారీ శబ్దాలకు అలవాటు పడటం మూలంగా వారు 35 నుంచి 40 ఏళ్లకు వచ్చేసరికి తీవ్రమైన వినికిడి సమస్యలు ఎదుర్కొంటారని వెల్లడించారు. మరో విషాదం ఏమిటంటే.. యువత అసలు ఈ సమస్యను గుర్తించి డాక్టర్లను సంప్రదించడం లేదు. సాధారణంగా అరవై ఏళ్లకు పైబడిన వారిలో కనిపించే వినికిడి సమస్యలను యువత కోరి మరీ ముందే తెచ్చుకుంటుందన్నమాట. -
కలశ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు
-
వసతుల్లేని గృహం
♦ అవస్థలు పడుతున్న దివ్యాంగులు ♦ అధికారుల హామీలు మాటలకే పరిమితం కడప నగరం మోచంపేటలోని ప్రభుత్వ వికలాంగుల వసతి గృహం సమస్యలకు నిలయంగా మారింది. కనీస వసతుల్లేని ఈ వసతి గృహంలో ఇరవై ఏళ్లుగా దివ్యాంగులైన విద్యార్థులు అవస్థలు పడుతున్నా అధికారు లకు కనికరం కలగడం లేదు. దీంతో విసిగి వేసారిపోయిన విద్యార్థులు మంగళవారం కడపకు వచ్చిన ప్రతిపక్షనే త వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కడప కార్పొరేషన్: మోచంపేటలోని ప్రభుత్వ వికలాంగుల వసతి గృహంలో చెవుటి, మూగ విద్యార్థినులు 18 మంది, అంధ విద్యార్థినులు 8 మంది, వికలాంగులు ముగ్గురు ఉన్నారు. రెడ్‌క్రాస్ సంస్థకు చెందిన భవనంలో ఈ వసతి గృహం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నెలనెలా వారికి రూ.5వేలు బాడుగ చెల్లిస్తుంది. అయితే ఇటు రెడ్‌క్రాస్ సంస్థ వారుగానీ, ప్రభుత్వంగానీ విద్యార్థినులకు కనీస వసతులు కల్పించలేదు. తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు లేనే లేవు, చెవిటి, మూగ విద్యార్థినులు ఉంటున్న డార్మెటరీ చిన్నవాన పడినా ఉరుస్తోంది. వానపడితే గోడలకు విద్యుత్ సరఫరా అవుతోంది. కొంచెం పెద్ద వాన పడితే వెనకాల ఉన్న పెద్ద డ్రైనేజీ కాలువలోంచి బాత్రూముల ద్వారా వసతిగృహంలోకి మురికినీరు వచ్చేస్తుంది. సమస్యలున్న మాట వాస్తవమే వసతి గృహంలో సమస్యలున్న విషయం వాస్తవమే. వీటిని పరిష్కరించాలని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ దృష్టికి తీసుకెళ్లాము. ఎక్కడైనా మా విద్యార్థులకు కనీస వసతులున్న వసతి గృహాన్ని కేటాయిస్తే బాగుంటుంది. - మల్లీశ్వరి, హాస్టల్ వార్డెన్ ఎంపీ వైఎస్ అవినాష్ ముందుకొచ్చినా... ప్రభుత్వ వికలాంగుల వసతి గృహానికి స్థలం చూపితే తన నిధులతో భవనాలు నిర్మిస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ రెవెన్యూ అధికారులు వీరికి స్థలం కేటాయించే విషయమై చొరవ చూపకపోవడంతో ఆ ప్రతిపాదన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. రెం డవ గాంధీ బొమ్మ వెనుక ఉన్న పాత యునానీ హాస్పిటల్ భవనాన్ని ఈ విద్యార్థులకు కేటాయించాలని వికలాంగుల శాఖ ఏడీ కలెక్టర్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ ప్రతిపాదన కూడా ముందుకు కదల్లేదు. ఈ హాస్టల్ పక్కనే ప్రభుత్వ బాలుర వసతి గృహం-1 ఉండేది. ఇక్కడ కూడా సరైన వసతులు లేకపోవడంతో ఇక్కడి విద్యార్థులంతా ప్రకాష్‌నగర్‌లో ఉన్న హాస్టల్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆ హాస్టల్ భవనాలు ఖాళీగా ఉన్నాయి. అధికారులు ఇప్పటికిప్పుడు కొత్తవి కట్టించలేని పక్షంలో ఈ వసతి గృహానికి మరమ్మతులు చేసి, కూలిపోయిన ప్రహరీని పునర్నిర్మించి దివ్యాంగులను తాత్కాలికంగా అందులో సర్దవచ్చు. దీనివల్ల నెలనెలా బాడుగ ఖర్చు కూడా మిగిలే అవకాశం ఉంది. ఆ దిశగా కూడా అధికారులు చర్యలు చేపట్టలేదు. -
వినికిడిశక్తి లేని డ్రైవర్లకు కొత్త యాప్..!
ఉబెర్ సంస్థ ఇప్పుడు ఓ కొత్త యాప్ ను అభివృద్ధి పరచింది. ముంబైలోని ఓ వినికిడి శక్తి లేని డ్రైవర్ ఇబ్బందులను గమనించిన సంస్థ.. ఈ కొత్త అనువర్తనాన్ని భారత్ లో అందుబాటులోకి తెచ్చింది. పుట్టుకతోనే చెవుడు, ఎంతోమంది వినికిడి శక్తి లేని వారికి అనుకూలంగా ఉండేట్టు ఈ కొత్త యాప్ రూపొందించింది. ఇప్పటికే లాస్ ఏంజిల్స్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్ టన్ డిసి లలో ట్యాక్సీలకోసం సృష్టించిన ఈ 'హైలింగ్ యాప్' ను అభివృద్ధి పరచి భారత్ లో ప్రవేశ పెట్టింది. ఇతర దేశాల్లో ఇప్పటికే 'ట్యాక్సీ హైలింగ్' యాప్ వాడకంలో ఉన్నప్పటికీ అక్కడ ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే భారత్ లో దీని అభివృద్ధిని ఇప్పుడు ధృవీకరించారు. యాప్ లోని ఈ కొత్త ఫీచర్ ను వాడే డ్రైవర్.. యాప్ ఆన్ చేసి ఉంచుకుంటే సరిపోతుంది. వినియోగదారులనుంచి కాల్ వచ్చినపుడు యాప్ లోఆడియోకి బదులుగా లైట్ ఫ్లాష్ అవుతుంటుంది. ఈ యాప్ లో ప్యాసింజెంర్లు డ్రైవర్ కు ఫోన్ చేసే అవకాశం ఉండదు. వినికిడి శక్తి లేనివారికోసం రూపొందించిన ఈ అనువర్తనంలోని కాల్ ఆప్షన్ కు బదులుగా టెక్స్ట్ ఆప్షన్ ను ప్రవేశ పెట్టారు. దీంతో ప్రయాణీకులు పికప్ ప్రాంతాన్నిటెక్స్ మెసేజ్ ద్వారా తెలిపే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇందులో ఏర్పాటు చేసిన అధిక స్క్రీన్ ద్వారా ప్యాసింజర్లు చేరాల్సిన ప్రాంతాన్ని టెక్స్ట్ మెసేజ్ ద్వారా సూచించాల్సి ఉంటుంది. ట్యాక్సీ హైలింగ్ యాప్ లోని ఈ కొత్త ఫీచర్.. భారతదేశంలోని వినికిడి శక్తి లేని డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉంటుందని, మరింత అవకాశాలను తెచ్చిపెట్టగలదని భావిస్తున్నట్లు ఉబెర్ ప్రొడెక్ట్ ఇన్నోవేషన్ మేనేజర్ బెన్ మెట్కఫె తన బ్లాగ్ లో రాశారు. డ్రైవర్లందరికీ ఒకేరకమైన శిక్షణ ఉంటుందని, అయితే వినికిడి శక్తి తక్కువ ఉన్నవారికి కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని అంటున్నారు. అందుకోసం ప్రత్యేక శిక్షణాధికారులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని ఉబెర్ సంస్థ ప్రతినిధి చెప్తున్నారు. వరల్డ్ హెల్గ్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 250 నుంచి 300 మిలియన్ల చెవిటివారు ఉన్నారని, వారిలో 66 శాతంమంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా అందులో ఇండియాలో అధికభాగం ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇప్పటిదాకా ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు డెఫ్ డ్రైవర్లు చాలా తక్కువమంది ముందుకు వచ్చారని ఉబెర్ ప్రతినిధి చెప్తున్నారు. ముందు ముందు తమ ప్రయత్నం అత్యంత ఉపయోగకరంగా మారుతుందని వారు భావిస్తున్నారు. -
గుండె విజయగర్వంతో నిండిపోయే సమయం
-
వికలాంగ సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ ఇస్తలేరు
సంగారెడ్డి అర్బన్: చెవిటి, మూగనైన తనకు హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రి అధికారులు ధ్రువపత్రం ఇచ్చినా పింఛన్ ఇవ్వడం లేదని తనకు పింఛన్ మంజూరు చేయాలని దుబ్బాక మండలం పెద్దగుండవెల్లికి చెందిన దండు కుమారస్వామి కోరారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు సంబంధితాధికారులకు అర్జీలను అందజేశారు. వికలాంగురాలైన తాను నిరుపేద కుటుంబంలో జన్మించానని గత 15 సంవత్సరాలుగా సొంత ఇంటి కొరకై పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, ఇల్లు మంజూరు చేయాలని రామచంద్రాపురానికి చెందిన డి.వెంకటేశ్వరమ్మ జేసీ శరత్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో జేసీ మండలంలోని ఏదైనా ఒక గ్రామంలో ఆమెకు ఇల్లు మంజూరు చేయాలని తహాశీల్దార్‌ను ఆదేశించారు. పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామం బామన్ల కుంట చెరువును చెరువును తప్పుడు సేల్‌డీడ్‌తో 32 మంది వ్యక్తులు తప్పుడు హద్దులు చూపించి అక్రమించుకున్నారని ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని గొల్ల నిమ్మలయ్య జొన్నాడ క్రిష్టా యాదవ్, శివరాజ్ ఫిర్యాదు చేశారు. సదాశివపేట మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన గౌటాన్ భూమిలో దళితులైన తమకు మూడెకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇవ్వాలని గ్రామానికి చెందిన నర్సమ్మ, ఎల్లమ్మ, యశోద, మంజుల తదితరులు కోరారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటర్ల అవగాహన వాహనానికి జేసీ శరత్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్వో దయానంద్ పాల్గొన్నారు. -
చెవిటి యువతిగా నయనతార
మార్పు అనేది చాలా అవసరం. ఎప్పుడు ఒకేలా చేస్తే ఎవరైనా మోనోటమీ ఫీలవుతారు. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించింది నటి నయనతార. నాయకిగా దశాబ్దం దాటిన ఈ భామ కెరీర్లో తెలుగు చిత్రం శ్రీరామ రాజ్యం లాంటి ఒకటి అరా చిత్రాలు మినహా గొప్ప పాత్రలేమీ లేవు. ఇప్పటి వరకు గ్లామర్‌తోనే కొట్టుకొచ్చింది. రకరకాల భంగిమల్లో సొగసులు గుప్పించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార ఇంకా యువళగీతాలు, ప్రేమ సన్నివేశాలతో అభిమానులను బోర్ కొట్టించడం ఇష్టం లేదనుకుందో? లేక తనకే అలాంటి వాటిలో నటించడం ఇష్టం లేదో గానీ తాజాగా తన రూటే మార్చింది. ఇకపై కొంచెం అయినా అభినయానికి పదును పెట్టాలని భావించింది. ప్రస్తుతం నటనకు అవకాశం వున్న పాత్రలతో కూడిన రెండు చిత్రాలు చేస్తోంది. అందులో ఒకటి మాయ. ఇది హారర్ కథా చిత్రం. ఈ కథ నయనతార చుట్టూనే తిరుగుతుందట. ఈ తరహా చిత్రంలో నటించడం నయనకు సరికొత్త అనుభవమే. అదేవిధంగా అభినయానికి అవకాశం ఉన్న పాత్రను నానుమ్ రౌడీదాన్ చిత్రంలో పోషిస్తున్నారు. ఇందులో యువ నటుడు విజయ్ సేతుపతితో జోడిగడుతోంది. ఈ చిత్రంలో నటించడానికి ఆమె పాత్రే కారణం అట. అంతగా ఆ పాత్ర విశేషం ఏమిటంటారా? నయనతార బధిర (చెవిటి) యువతిగా నటిస్తున్నారు. ఈ పాత్ర నానుమ్ రౌడీదాన్ చిత్రానికి చాలా కీలకం అట. ఆమె కూడా చాలా గొప్పగా నటిస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదలకు వరుస కడుతున్న ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన నన్భేండా, శింబు సరసన నటించిన ఇదు నమ్మ ఆళు, సూర్యతో జత కట్టిన మాస్, జయంరవితో రొమాన్స్ చేస్తున్న తనీ ఒరువన్ చిత్రాల్లో ఆమె కమర్షియల్ హీరోగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బధిరులు వినేందుకు.. సాఫ్ట్వేర్ సాయం!
లండన్: చెవిటివారు ఎదుటి వారి మాటలను వినేందుకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను లండన్‌కు చెందిన సైన్స్ రచయిత ఫ్రాంక్ స్వెయిన్ ఆవిష్కరించారు. ‘ఫాంటమ్ టెర్రెయిన్స్’ అనే ఈ సాఫ్ట్వేర్ ఐఫోన్‌తో పనిచేస్తుంది. అనవసర శబ్దాలను కూడా ఇది ఆటోమేటిక్‌గా పరిహరిస్తుందట. ఈ సాఫ్ట్వేర్ తొలుత ఐఫోన్ వై-ఫై సెన్సర్ల ద్వారా సమీపంలోని సిగ్నళ్లను గ్రహిస్తుంది. తర్వాత ఆ సమాచారాన్ని శబ్దాలుగా మలిచి వినికిడి పరికరాలకు వైర్‌లెస్‌గా అందిస్తుంది. -
చెవిటివారి కోసం టీవీ సౌండ్ సిస్టమ్
లండన్: వినికిడి సమస్యను ఎదుర్కొనే వారికోసం సరికొత్త టీవీ సౌండ్ సిస్టమ్‌ను అభివృద్ధిపరిచాడు బ్రిటన్‌కు చెందిన యువ శాస్త్రవేత్త. దీని సహాయంతో ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండానే చెవిటి వారు టీవీ శబ్దాలను లౌడ్ స్పీకర్ సిస్టమ్‌తో సులువుగా వినవచ్చట. వినికిడి సమస్య ఉన్న 70 ఏళ్ల వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని బ్రిటన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త దీనిని అభివృద్ధిపరిచాడు. డిజైన్‌లో ప్రత్యేకంగా రూపొందించిన శ్రవణ రేడియేటర్లను వినియోగించామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌండ్, వైబ్రేషన్ రిసెర్చ్ పరిశోధకుడు మార్కోస్ సైమన్ చెప్పాడు.