రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
Published Sat, Apr 29 2017 12:21 AM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM
వెల్దుర్తి రూరల్ : గుంటుపల్లె గ్రామానికి చెందిన కృష్ణయ్య(28) అనే వ్యక్తి శుక్రవారం రైలు ఢీకొని మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడికి చెవుడు ఉంది. ఇతను రోజు రాయి కొట్టే పనులకెళ్తాడు. ఎండలు ఎక్కువగా ఉన్నందున శుక్రవారం తెల్లవారుఝామునే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొన్నట్లు అనుమానం. మృతుడికి భార్య కళావతి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement