ప్రాణం తీసిన వినికిడి లోపం
Published Mon, Oct 31 2016 11:54 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
గూడ్స్ ఢీకొని వ్యక్తి మృతి
కోసిగి: వినికిడి లోపం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కోసిగి వడ్డే వీధికి చెందిన వడ్డే రమేష్(25) సోమవారం రాంపురం గ్రామానికి వెళ్లేందుకు కోసిగి రైల్వేస్టేషన్‌కు బయలు దేరాడు. చెన్నై నుంచి ముంబాయికు వెళ్లే మొయిల్ ఎక్స్‌ప్రెస్ సమయమైందని రైల్వేస్టేషన్‌కు అడ్డదారిలో పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. పుట్టుకతోనే అతను బధిరి (మాటలు రావు.. చెవులు వినపడువు) కావడంతో వెనుక నుంచి వచ్చే గూడ్స్‌ను గమనించక పోవడంతో వేగంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. 108లో ఆదోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Advertisement
Advertisement