డీవీవీ దానయ్య, శివ కార్తికేయన్, రామ్‌చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్
RRR Movie Pre Release Event Chennai: ‘‘ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నా.. యూఎస్ ప్రీమియర్స్ 2 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయన్నా అందుకు కారణం నేను కాదు.. నా ముందున్న ఇద్దరు స్టార్సే(ఎన్టీఆర్, రామ్‌చరణ్)’’ అని రాజమౌళి అన్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజమౌళి మాట్లాడుతూ–‘‘తారక్(ఎన్టీఆర్) ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. నేను షాట్ పెడితే చాలు నా ఊహలోని విజువల్‌కు తగ్గట్లుగా నటిస్తాడు. ఇలాంటి యాక్టర్ దొరకడం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు.. భారతీయ సినిమా చేసుకున్న అదృష్టం. పని గురించి ఎంతో ఆలోచించి నేను సెట్స్‌కు వస్తుంటాను. కానీ చరణ్ క్లియర్ మైండ్‌తో వచ్చి ‘నా నుంచి మీకు ఏం కావాలి?’ అని అడుగుతారు.
ఇలాంటి మెంటాలిటీని నేను ఎక్కడా చూడలేదు. తన గురించి తను అంత సెక్యూర్‌గా ఫీలైన యాక్టర్‌ను నేను ఇంతవరకు చూడలేదు. అంత అద్భుతంగా యాక్ట్ చేస్తారు’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘‘ఒకప్పుడు కమల్, రజనీసార్లు కలిసి ఒకే సినిమాలో నటించారు. అలాంటి గ్లోరీని ‘ఆర్‌ఆర్‌ఆర్’తో రాజమౌళి మళ్లీ తీసుకువస్తున్నారు. ఈ సినిమాలోని ప్రతి సీన్‌ను మళ్లీ చేయాలనుకుంటాను.. ఎందుకంటే చరణ్‌తో మళ్లీ టైమ్ స్పెండ్ చేయవచ్చు’’ అన్నారు.
(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రామ్‌చరణ్ మాట్లాడుతూ–‘‘మా ఇద్దర్నీ(రామ్‌చరణ్, ఎన్టీఆర్) కలిపి ఓ సినిమా తీసినందుకు రాజమౌళిసర్‌కి థ్యాంక్స్. నాతో, తారక్‌తో తమిళ్‌లో బాగా డబ్బింగ్ చెప్పించిన మదన్‌సర్‌కి థ్యాంక్స్. నిజ జీవితంలో నాకు, తారక్‌కి ఒక ఏడాది తేడా. కానీ తనది సింహంలాంటి పర్సనాలిటీ.. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం.. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తారక్‌లాంటి నిజమైన బ్రదర్‌ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్. తారక్‌కి థ్యాంక్స్ చెబితే మా బంధం ఇక్కడితో ముగిసిపోద్ది అనేది నా భావన.. నేను చనిపోయేవరకు ఆ బ్రదర్ హుడ్‌ని నా మనసులో పెట్టుకుంటాను’’ అన్నారు. నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఆర్‌బీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment