shiva karthikeyan
-
నటన వదిలేయాలనుకున్నా..నా భార్య మాటలే నిలబెట్టాయి
తమిళ హీరో శివకార్తికేయన్ రాజ్‌కుమార్ పెరియసామి ’అమరన్’ తో ఒక్కసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ ఆర్మీ రాజ్‌పుత్ రెజిమెంట్‌లో కమీషన్డ్ ఆఫీసర్‌గా ఉన్న మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కధగా తీసిన అమరన్ చిత్రం మంచి రివ్యూలను అందుకొని సూపర్‌హిట్‌గా నిలిచింది. దాంతో తమిళనాడులో మరో సూపర్ స్టార్ అవతరించినట్టేనని సినీ విశ్లేషకులు తీర్మానించేశారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్... అఖమురుగదాస్ వెంకట్ ప్రభు వంటి ప్రఖ్యాత దర్శకుల చిత్రాలకు సంతకం చేశాడు.అలుపెరుగని యాత్ర...ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ప్రపంచంలోకి ప్రవేశించిన శివకార్తికేయన్ సాధించిన విజయం...సాగించిన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తి దాయకం. కాలేజీ రోజుల్లోనే స్టాండప్ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్, షార్ట్ ఫిల్మ్ నటుడు..కూడా. ఆ తర్వాత తొలుత స్టార్ విజయ్ టీవీ వేదికగా.. 2011లో టీవీ షోలను హోస్ట్ చేయడం ద్వారా శివకార్తికేయన్ తన కెరీర్‌ను ప్రారంభించాడు నిదానంగా సినిమాల్లోకి వచ్చి మొదట్లో సహాయక పాత్రలను పోషించాడు, సినిమాల్లోకి వచ్చి పుష్కరకాలం పూర్తయిన తర్వాత గానీ అతనికి పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, శివకార్తికేయన్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం నటన నుంచి నిష్క్రమించాలని భావించినట్లు వెల్లడించాడు, అయితే తన భార్య ఆర్తి చెప్పిన స్ఫూర్తి దాయకమైన మాటలే తనని నటన కొనసాగించడానికి ప్రేరేపించాయంటూ చెప్పుకొచ్చాడు.పరిశ్రమ మంచిదే...వ్యక్తులే....సినిమా పరిశ్రమలో కొందరు వ్యక్తులతో తనకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకున్నప్పటికీ, పరిశ్రమపై తనకు ఎటువంటి ఫిర్యాదులు లేవని శివకార్తికేయన్ స్పష్టం చేశాడు. ఆర్ధిక ఇబ్బందులతో సహా కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. తన నటనా ప్రయాణాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నానన్నాడు. అయితే తన పోరాటాలు తన కుటుంబాన్ని ప్రభావితం చేయకూడదని ఎప్పుడూ కోరుకున్నానని, తన వారు సాధారణ జీవితాలను గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. తన ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో భార్య, అత్తమామలు, పిల్లలపై భారం వేయకూడదని భావించానని చెప్పాడు. అయితే భార్య మాటలతో స్ఫూర్తి పొంది... అడ్డంకులను అధిగమించడానికి మార్గాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఎంబిఎ గ్రాడ్యుయేట్ గా, అతను ఈ సవాళ్లను ఎలా అధిగమించాలో తెలుసుకోగలిగాడు.కుమార్, చియాన్ తర్వాత నువ్వే...అన్న భార్యఇండస్ట్రీలో కొనసాగాలనే తన నిర్ణయంలో తన భార్య ఆర్తి ప్రోత్సాహం కీలక పాత్ర పోషించిందని ఈ అమరన్ హీరో వెల్లడించాడు. ‘ఇక్కడకి వచ్చేటప్పుము ’మీ దగ్గర ఏమీ లేదు, అయినా సరే మీరు ఇంత దూరం వచ్చారు. గత 20 ఏళ్లలో,కుమార్ (అజిత్) సార్ చియాన్ (విక్రమ్) సార్ తర్వాత, బయటి వ్యక్తి ఎవరూ ఈ పరిశ్రమలో పెద్దగా ఎదిగింది లేదు, కాని నువ్వు అది సాధించావ్. ’ఇది అంత తేలికైన పనిగా తీసిపారేయవద్దు.’మీ స్టార్డమ్ ప్రయోజనాలను మేం అనుభవిస్తున్నాం కాబట్టి,కొన్ని ప్రతికూల అంశాలను కూడా ఎదుర్కోగలం’’ అని తన భార్య చెప్పిందని ఆయన గుర్తు చేసుకున్నాడు.సినీ పరిశ్రమలో తన ఎదుగుదల సమయంలో ఎదుర్కొన్న శత్రుత్వం సవాళ్ల గురించి కూడా శివకార్తికేయన్ చర్చించారు. ‘సామాన్యుడు‘ నుంచి విజయవంతమైన నటుడిగా తన ప్రయాణాన్ని కొందరు స్వాగతించగా, మరికొందరు బహిరంగంగా విమర్శించారని, పరిశ్రమలో అతని స్థానాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారని, గత ఐదేళ్లలో గణనీయమైన కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రయాణం కొనసాగించానని ఘర్షణ లేకుండా ముందుకు సాగాలని కోరుకున్నానన్నాడు..అయితే నేటి తన విజయం విమర్శకులకు ఖండన అనుకోనక్కర్లేదని, సహకరించిన కష్టపడి పనిచేసే తన చిత్ర బృందాలకుు, తన పట్ల అంకితభావంతో ఉన్న అభిమానులకు అతని కథ నుండి ప్రేరణ పొందిన వారికి వేడుకగా మాత్రమే అనుకోవాలని వినమ్రంగా చెబుతున్నాడు. -
వీడియో: అమరన్ సినిమా ఆడుతున్న థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమరన్ సినిమా నడుస్తున్న థియేటర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. చెన్నై తిరునల్వేలి జిల్లా మేలప్పాలయంలోని అలంకార్ థియేటర్‌పై శనివారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు దాడి జరింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు థియేటర్‌పై పెట్రోల్ బాంబులు విసిరారు. బాంబు దాడి నేపథ్యంలో పెద్ద శబ్ధం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ధియేటర్లో శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.పెట్రోల్ బాంబు దాడులపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేపట్టినట్టు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. అయితే, శివకార్తికేయన్ అంటే గిట్టని వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.A petrol bomb incident has stirred tension at Alangaar Theatre in Melapalayam, Tirunelveli, early this morning.The incident reportedly linked to opposition to actor Sivakarthikeyan's film #Amaran, was captured on CCTV footage. pic.twitter.com/jN3QoLrBzz— South First (@TheSouthfirst) November 16, 2024 -
సాయిపల్లవి ఉన్నారా..? అంటూ ఆ యువకుడికి భారీగా ఫోన్ కాల్స్
ఇటీవల శివకార్తికేయన్ హీరోగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన చిత్రం అమరన్. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే, అమరన్ చిత్రంలో ఉపయోగించ్చిన ఓ ఫోన్ నంబరు ప్రస్తుతం ఓ యువకుడిని ఇరకాటంలో పడేసింది. తన సెల్ నంబరును ఆ చిత్రంలో చూపించడంతో వస్తున్న కాల్స్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.తాజాగా ఈ ఘటన చైన్నెలో వెలుగు చూసింది. వివరాలు.. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోకు హీరోయిన్ ఓ పేపర్లో ఫోన్ నంబర్ రాసి ఇచ్చినట్టుగా కొన్ని సెకన్ల పాటు ఓ దృశ్యం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ ఫోన్ నంబరు వాహీసన్ అనే చైన్నె యువకుడి పాలిట శాపంగా మారింది. తాను ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్‌ను ఆ చిత్రంలో చూపించడంతో సంతోష పడ్డప్పటికీ ఆ తదుపరి పరిణామాలు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి. సాయిపల్లవి గారితో మాట్లాడాలంటూ అనేక మంది ఆ నంబర్‌కు ఫోన్ చేసి విసిగిస్తుండటంతో చివరకు అతడు తన తంటాలను ఆ సినీ యూనిట్‌కు తెలిసే విధంగా సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
Shiva Karthikeyan: ‘అమరన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
చలో కశ్మీర్?
తమిళ సినిమా: ప్రిన్స్ చిత్రం దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నటుడు శివకార్తికేయన్ కొత్త చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మావీరన్ చిత్రంలో నటిస్తున్నారు. మడోనా అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులోనూ మహావీరుడు పేరుతో విడుదలకానుంది. దర్శకుడు శంకర్ వారసురాలు అతిథి శంకర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో శివకార్తికేయన్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీన్ని కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. ఇది శివకార్తికేయన్ 21వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో సాయి పల్లవి నాయకిగా నటించనుంది. రాజకుమార్ పెరియసామి కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా తొలి షెడ్యూల్‌ను కశ్మీర్లో చిత్రీకరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే అక్కడ ఇటీవల స్వల్ప భూకంపం వచ్చి కశ్మీర్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న లియో చిత్రం షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే భూకంపం కారణంగానే లియో చిత్ర యూనిట్ హడావుడిగా షూటింగ్‌ను ముగించుకుని చైన్నెకు తిరిగొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శివకార్తికేయన్ నటించనున్న చిత్రాన్ని అక్కడ షూటింగ్ నిర్వహించడానికి ముందు అక్కడ వాతావరణం గురించి లియో చిత్రం దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌ను అడిగి తెలుసుకుని ఆ తరువాత కాశ్మీర్లో షూటింగ్ నిర్వహించాలా? లేదా? అన్నది నిర్ణయించనున్నట్లు సమాచారం. -
శివ కార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో సినిమా?
తమిళ సినిమా: ఏ రంగంలోనైనా, ఎవరికైనా గ్యాప్ రావడం అనేది సహజం. అలాంటి వారు మళ్లీ టైం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. తొలి చిత్రంతో మంచి విజయం సాధించిన ఈ దర్శకుడు ఆ తర్వాత విజయకాంత్‌తో రమణ, సూర్య కథానాయకుడిగా గజిని వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందారు. విజయ్ హీరోగా కత్తి, తుపాకీ, సర్కార్ వంటి విజయవంతమైన చిత్రాలకీ దర్శకత్వం వహాంచిన మురుగదాస్ చివరిగా రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్ చిత్రం చేశారు. అది ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతే మురుగదాస్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. విజయ్ 65వ చిత్రానికి ఈయన దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే ఏమైనా అది జరగలేదు దర్బార్ తర్వాత మురుగదాస్ ఇప్పటి వరకు ఏ చిత్రం చేయలేదు. ఇటీవల త్రిష కథానాయక నటించిన రాంకీ చిత్రానికి కథను అందించారు. ఈయన మళ్లీ ఎప్పుడు దర్శకత్వం వహిస్తారా..? అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం. ఏఆర్ మురుగదాస్ నటుడు శివ కార్తికేయన్ కాంబోలో ఒక చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. దీన్ని లైట్ హౌస్ మూవీస్ సంస్థ నిర్మించినట్లు టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలుపడాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అయిలాన్ చిత్రాన్ని పూరి చేసి మావీరన్ చిత్రంలో నటిస్తున్నారు. -
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న దివానా సాంగ్‌ని విన్నారా?
తమిళసినిమా: ప్రముఖ యువ గాయని శివాంగి పాడి నటించిన దివానా సాంగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది. నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన డాన్ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందులో గాయని శివాంగి ముఖ్యపాత్రను పోషించి అందరినీ అలరించారు. కాగా ఈమె ప్రైవేట్ సాంగ్స్, ఆల్బమ్స్లను రూపొందిస్తున్నారు. తాజాగా 1మిన్ మ్యూజిక్ సంస్థ రూపొందించిన మ్యూజిక్ ఆల్బమ్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫాంలో విడుదలై సంగీత ప్రియులను అలరిస్తోంది. సంగీత కళాకారులను, సినీ ఔత్సాహికులను ప్రోత్సహించే విధంగా ఇన్స్టాగ్రామ్ ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్‌ఫామ్ 1మిన్ మ్యూజిక్. ఇందులో దేశవ్యాప్తంగా 200 మందికి పైగా కళాకారులు తమ ఒక్క నిమిషం పాటలను విడుదల చేసి గుర్తింపు పొందుతున్నారు. కాగా ఇన్స్టాగ్రామ్ తమిళ కళాకారుల కోసం సిల్వర్ ట్రీ సంస్థతో కలిసి 25 మంది కళాకారులతో పాటల ఆల్బమ్‌లను రపొందిస్తున్నారు. అందులో భాగంగా గాయని, నటి శివాంగి పాడి నటించిన దీవానా అనే 1మిన్ మ్యూజిక్ సాంగ్ ఆల్బమ్‌గా ఇటీవల విడుదల చేశారు. కుమరన్ దర్శకత్వం వహింన ఈ మ్యూజిక్ ఆల్బమ్ సంగీత ప్రియుల విశేష ఆదరణతో ట్రెండింగ్‌గా మారిందని గాయని శివాంగి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Sivaangi (@sivaangi.krish) -
ప్రిన్స్ ఓ చాలెంజ్
‘‘ప్రిన్స్ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇందులోని డైలాగ్స్, కామెడీ చాలా ఆర్గానిక్‌గా ఉంటాయి. తెలుగు, తమిళ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరికీ మా సినిమా నచ్చుతుంది’’ అని హీరో శివ కార్తికేయన్ అన్నారు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా నటించారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ పంచుకున్న విశేషాలు... ► నటుడిగా అన్ని భాషల్లో మూవీస్ చేసి ప్రేక్షకులని అలరించాలని ఉంటుంది. ప్రస్తుతం కామెడీ సినిమాలు తగ్గిపోతున్నాయి. నాకు కామెడీ సినిమాలు చేయడం అన్నా, చూడటం అన్నా చాలా ఇష్టం. నా స్నేహితుడి ద్వారా ఒకసారి అనుదీప్‌ని కలిశాను. ఆయన చెప్పిన లైన్ చాలా ఎగై్జట్ చేయడంతో ‘ప్రిన్స్’ కి ఓకే చెప్పాను. ► ‘ప్రిన్స్ నా తొలి స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్. ఈ ప్రాజెక్ట్ ఒక సవాల్‌తో కూడుకున్నది. అనుదీప్ తెలుగులో కథ రాశారు. తెలుగు స్క్రిప్ట్‌ని తమిళ్లో చేయడం ఒక సవాల్‌గా తీసుకొని పని చేశాం. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. నా పాత్రకి తెలుగులో నేను డబ్బింగ్ చెప్పలేదు. ► ఒక ఇండియన్ అబ్బాయి బ్రిటీష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరి మనుషుల్లో ప్రేమ, పెళ్లి విషయాల్లో మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. వారి ఆలోచనలను బ్రేక్ చేసే ఆలోచన చాలా ఎగై్జట్ చేసింది. ► నేను కథని ఎంపిక చేసుకునేటప్పుడు గత చిత్రం రిజల్ట్ గురించి ఆలోచించను. ప్రేక్షకులు ఈ సినిమాని ఎందుకు చూడాలి? ఈ కథలో కొత్తదనం ఏంటి? విమర్శకులు దీన్ని ఎలా చూస్తారు? అని ఆలోచిస్తాను. నా అభిమానులు సోషల్ మీడియాలో నన్ను ప్రిన్స్ అని పిలుస్తుంటారు. పైగా ప్రిన్స్ అన్ని భాషలకు సరిపోయే టైటిల్.. అందుకే ఆ పేరు పెట్టాం. ► నేను, హీరో నానిగారు ఒకేలా కనిపిస్తామని ప్రేక్షకులు చెబుతుంటారు. నానిగారు కూడా యాంకర్‌గా, సహాయ దర్శకుడిగా పనిచేసి, హీరోగా ఎదిగారు. నేను కూడా టీవీలో పని చేసి సినిమాల్లోకి వచ్చాను. నా పదేళ్ల నట ప్రయాణంలో ప్రేక్షకులు పంచిన ప్రేమని మర్చిపోలేను. ► సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, రామ్మోహన్ రావు కాంబినేషన్లోని ‘ప్రిన్స్’ లో భాగం కావడం హ్యాపీ. తెలుగులో రాజమౌళిగారితో మూవీ చేయాలని ఉంది. అలాగే త్రివిక్రమ్, సుకుమార్గార్ల సినిమాలంటే ఇష్టం. ప్రస్తుతం ‘మహావీరుడు’ సినిమా చేస్తున్నా. భవిష్యత్‌లోనూ ద్విభాష(తెలుగు, తమిళ)చిత్రాలు చేయాలనే ఆలోచన నాకు ఉంది. ప్రస్తుతం విజయ్ హీరోగా వంశీ పైడిపల్లిగారు ఓ సినిమా చేస్తున్నారు. అలాగే హీరో రామ్ చరణ్– శంకర్‌గారు కలసి పని చేస్తున్నారు. తెలుగు–తమిళ పరిశ్రమల వాళ్లు కలిసి సినిమా చేయడం చాలా మంచి పరిణామం. ‘‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, విక్రమ్, కాంతార’ చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. దక్షిణాది పరిశ్రమ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉండటం సంతోషం. -
Sivakarthikeyan: ‘హూ యామ్ ఐ..’
శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రిన్స్’. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మారియా ర్యాబోషప్క హీరోయిన్. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘హూ యామ్ ఐ..’ (నేనెవరు) అనే పాటని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని డింకర్ కల్వల పాడారు. ‘‘కంప్లీట్ ఎంటర్టైనర్ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాత: అరుణ్ విశ్వ. -
నిజానికి నేను డాన్ కావాల్సింది: యంగ్ హీరో
'డాన్' తానే అవ్వాల్సిందని నటుడు, నిర్మాత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ అన్నారు. నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించి లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి తన ఎస్కే ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం డాన్. ప్రియాంక మోహన్ నాయకిగా నటించిన ఇందులో ఎస్.జే. సూర్య, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రం (25 రోజుల క్రితం) విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ సోమవారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ కార్యక్రమంలోనే డాన్ రూ. 100 కోట్ల క్లబ్లో చేరుతుందని చెప్పానన్నారు. ఇది డాక్టర్ చిత్ర వసూళ్లను మూడు వారాల్లోనే అధిగమించి రూ.125 కోట్లను వసూలు చేసిందన్నారు. చదవండి: ఈవారం సినిమా జాతర.. ఏకంగా 22 చిత్రాలు, సిరీస్‌లు నిజానికి 'డాన్' చిత్రంలో తాను నటించాల్సిందని, అది జరగకపోవడంతో దర్శకుడు గ్రేట్ ఎస్కేప్ అయ్యారన్నారు. ఇందులోని కళాశాల క్లైమాక్స్ సన్నివేశాల్లో నటించడం కచ్చితంగా తన వల్ల అయ్యేది కాదన్నారు. ఈ చిత్రం కరెక్ట్ నటుడి చేతిలో పడిందని అభిప్రాయపడ్డారు. చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. -
ఓటీటీకి శివకార్తికేయన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘డాన్’, ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ‘రెమో’, ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన పరిశ్రమలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా తెలుగులో డబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఆయన తాజాగా నటించిన చిత్రం డాన్. మే 13న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజై రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూళు చేసి రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. చదవండి: అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ ఈ మూవీ విడుదలై మూడు వారాలు పైనే అవుతున్న నేపథ్యంలో డాన్ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయబోతుంది. డాన్ మూవీని నెట్‌ఫ్లిక్స్ భారీ ఢిల్కు సొంతం చేసుకున్నట్లు సమాచారం. జూన్ 10 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా శిబిచక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా ప్రముఖ దర్శకుడు ఎస్జే సూర్య, సముద్రఖని కీలక పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్, శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. చదవండి: మేజర్ మూవీ చూస్తూ కంటతడి పెట్టుకున్న ఆడియన్స్, వీడియో వైరల్ It's time to put on your dancing shoes and do the Jalabulajangu with us, because the DON is arriving on June 10th! 🎉🕺🥳#DonOnNetfix pic.twitter.com/5hQbfTuJ3I — Netflix India South (@Netflix_INSouth) May 28, 2022 -
క్రేజీ న్యూస్.. రజనీకాంత్ మూవీలో యంగ్ హీరో
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'బీస్ట్' సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ వారే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీని ప్రకారం ఈ సినిమాలో యంగ్ హీరో కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు.. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్. గతంలో ఆయనకి 'డాక్టర్' సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ హిట్ ఇచ్చాడు. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఆ సినిమాకి శివకార్తికేయన్ నిర్మాత కూడా. అందుకే మరోసారి నెల్సన్ మూవీలో చేసేందుకు శివ కార్తికేయన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
SK20: ఉక్రెయిన్ బ్యూటీతో శివకార్తికేయన్ రొమాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ అప్‌కమింగ్ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. శివ కార్తీకేయన్ హీరోగా ‘జాతీరత్నాలు’ ఫేం అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. ఎస్కే20 అనే వర్కింగ్ టైటిల్ ఇటీవల చెన్నైలో ఈ మూవీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ మూవీతో ఉక్రెయిన్ నటి, మోడల్ ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరియా ర్యాబోషాప్క శివకార్తికేయన్‌తో సరసన ఈ ఉక్రెయిన్ బ్యూటీ సందడి చేయబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. అలాగే హీరో శివకార్తీకేయన్ కూడా ‘వెల్కమ్ మరియా ర్యాబోషాప్క’ అంటూ ట్వీట్ చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫుల్ లెన్త్ కామెడీతో సాగే ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లో సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. A Beautiful Angel👼has just Landed to Mesmerise✨ Team #SK20 Welcomes Actress #MariaRyaboshapka On Board as Female Lead 🎬@Siva_Kartikeyan @anudeepfilm @MusicThaman @sureshProdns @SVCLLP @ShanthiTalkies #NarayanDasNarang@SBDaggubati @puskurrammohan @iamarunviswa pic.twitter.com/75cKykYk1Z — Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) March 21, 2022 -
'జాతిరత్నాలు' డైరెక్టర్‌తో కోలీవుడ్ స్టార్ హీరో సినిమా ప్రారంభం
Shivakarthikeyan Next With Kv Anudeep Shooting Goes On Floors: తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో లాంఛనంగా ప్రారంభమయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యింది. హీరోయిన్ సహా ఇతర అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు డి. సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
హైదరాబాద్ రెస్టారెంట్లో తమిళ స్టార్ హీరో సందడి
Tamil Hero Sivakarthikeyan Dined In Hyderabad Restaurant With Friends: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో విందు చేశారు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని ఫేమస్ రెస్టారెంట్ 1980 మిలటరీ హోటల్ని సందర్శించారు.తంలో తనకు హైదరబాదీ వంటకాలంటే చాలా ఇష్టమని చెప్పిన శివ కార్తికేయన్ తాజాగా హైదరాబాదీ ఫేమస్ వంటకాల్ని రుచి చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా గతేడాది వరుణ్ డాక్టర్ చిత్రంతో హిట్ కొట్టిన శివ కార్తికేయన్ త్వరలోనే తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయనున్నాడు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే సెట్స్‌మీదకి వెళ్లనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. -
జాతిరత్నాలు డైరెక్టర్‌తో స్టార్ హీరో సినిమా అనౌన్స్మెంట్
Sivakarthikeyan Announces Next With Jathi Ratnalu Director KV Anudeep: జాతిరత్నాలు సినిమాతో కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్ అనుదీప్. డైరెక్టర్‌గా తొలి సినిమాతోనే సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా తన నెక్ట్స్ సినిమాను ప్రకటించాడు. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌తో ఆయన సినిమాను తెరకెక్కించనున్నారు. తెలుగులో ఈయనకు ఇదే మొదటి చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనికి ఎస్కే 20 అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఇక ఎస్ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇప్పటికే రెమో చిత్రంతో శివ కార్తికేయన్ తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు. ఇటీవలె ఈయన నటించిన డాక్టర్ సైతం విడుదలైంది. Very happy to join with @AsianSuniel sir @SBDaggubati sir & my frnd @iamarunviswa for #SK20 ,directed by my fav @anudeepfilm & music by @MusicThaman bro😊 A fun-filled entertainer on the way👍❤️#NarayanDasNarang @SVCLLP @SureshProdns #PuskurRamMohanRao @ShanthiTalkies pic.twitter.com/3g5sjGCePH — Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 1, 2022 -
నా ఊహలోని విజువల్‌కు తగ్గట్లుగా నటించే గొప్ప యాక్టర్ అతను: రాజమౌళి
RRR Movie Pre Release Event Chennai: ‘‘ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నా.. యూఎస్ ప్రీమియర్స్ 2 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయన్నా అందుకు కారణం నేను కాదు.. నా ముందున్న ఇద్దరు స్టార్సే(ఎన్టీఆర్, రామ్‌చరణ్)’’ అని రాజమౌళి అన్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’(ఆర్ఆర్ఆర్). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజమౌళి మాట్లాడుతూ–‘‘తారక్(ఎన్టీఆర్) ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. నేను షాట్ పెడితే చాలు నా ఊహలోని విజువల్‌కు తగ్గట్లుగా నటిస్తాడు. ఇలాంటి యాక్టర్ దొరకడం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు.. భారతీయ సినిమా చేసుకున్న అదృష్టం. పని గురించి ఎంతో ఆలోచించి నేను సెట్స్‌కు వస్తుంటాను. కానీ చరణ్ క్లియర్ మైండ్‌తో వచ్చి ‘నా నుంచి మీకు ఏం కావాలి?’ అని అడుగుతారు. ఇలాంటి మెంటాలిటీని నేను ఎక్కడా చూడలేదు. తన గురించి తను అంత సెక్యూర్‌గా ఫీలైన యాక్టర్‌ను నేను ఇంతవరకు చూడలేదు. అంత అద్భుతంగా యాక్ట్ చేస్తారు’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘‘ఒకప్పుడు కమల్, రజనీసార్లు కలిసి ఒకే సినిమాలో నటించారు. అలాంటి గ్లోరీని ‘ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి మళ్లీ తీసుకువస్తున్నారు. ఈ సినిమాలోని ప్రతి సీన్‌ను మళ్లీ చేయాలనుకుంటాను.. ఎందుకంటే చరణ్‌తో మళ్లీ టైమ్ స్పెండ్ చేయవచ్చు’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రామ్‌చరణ్ మాట్లాడుతూ–‘‘మా ఇద్దర్నీ(రామ్‌చరణ్, ఎన్టీఆర్) కలిపి ఓ సినిమా తీసినందుకు రాజమౌళిసర్కి థ్యాంక్స్. నాతో, తారక్‌తో తమిళ్లో బాగా డబ్బింగ్ చెప్పించిన మదన్సర్కి థ్యాంక్స్. నిజ జీవితంలో నాకు, తారక్‌కి ఒక ఏడాది తేడా. కానీ తనది సింహంలాంటి పర్సనాలిటీ.. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం.. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తారక్‌లాంటి నిజమైన బ్రదర్‌ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్. తారక్‌కి థ్యాంక్స్ చెబితే మా బంధం ఇక్కడితో ముగిసిపోద్ది అనేది నా భావన.. నేను చనిపోయేవరకు ఆ బ్రదర్ హుడ్‌ని నా మనసులో పెట్టుకుంటాను’’ అన్నారు. నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
హాట్ టాపిక్‌గా శివకార్తికేయన్ రెమ్యునరేషన్, తక్కువ టైంలో అంత మొత్తమా!
Young Hero Sivakarthikeyan Remuneration Goes Viral: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ‘రెమో’, ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పరిశ్రమలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా తెలుగులో డబ్ చేస్తూ అటూ కోలీవుడ్, ఇటూ టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ ఏడాది శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో శివకార్తికేయన్ సినిమాలకు మార్కెట్ కూడా పెరిగిపోయింది. చదవండి: నాగ్ సినిమా మేకర్స్‌కు చుక్కలు చూపించిన అమలా పాల్, మెహ్రీన్! ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. ఈ నేపథ్యంలో అతడి రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కార్తికేయన్ తన ఒక్కో సినిమాకు రూ. 27 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటున్నాడని టాక్. తక్కువ టైంలోనే అంత భారీ మొత్తంలో పారితోషికం అందుకోవడం చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ దృష్ట్యా మేకర్స్ కూడా ఆయన డిమాండ్‌కు ఒకే చెబుతున్నారట. కాగా ప్రస్తుతం శివ కార్తీకేయన్ అయలాన్, డాన్ సినిమాల్లో నటిస్తున్నాడు. చదవండి: ఇబ్బంది పెడుతున్నారంటూ స్టేజ్‌పైనే ఏడ్చిన హీరో శింబు వీటిలో అయలాన్ షూటింగ్ పూర్తి కాగా.. డాన్ చిత్రీకరణ దశలో ఉంది. తెలుగులో తొలిసారిగా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు శివకార్తికేయన్. త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయలాన్ షూటింగ్ పూర్తవగా..డాన్ చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల తెలుగులో తొలిసారిగా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన శివకార్తికేయన్.. త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. -
'ఆ విషయంలో హీరోయిన్లను ఫాలో అవ్వాలనుకుంటున్నా'
‘‘నెల్సన్ దిలీప్‌కుమార్ నా క్లోజ్ ఫ్రెండ్. 2007లో నేను టీవీ కెరీర్ స్టార్ట్ చేశాను. ఆ షోను నెల్సన్ డైరెక్ట్ చేశాడు. నెల్సన్‌పై ఉన్న నమ్మకంతోనే ‘వరుణ్ డాక్టర్’ సినిమాతో నిర్మాతగా మారాను’’ అని హీరో శివ కార్తికేయన్ అన్నారు. నెల్సన్ దర్శకత్వంలో శివ కార్తికేయన్, ప్రియాంకా అరుల్ మోహన్ జంటగా నటించిన చిత్రం ‘వరుణ్ డాక్టర్’. శివ కార్తికేయన్ సమర్పణలో కోటపాడి జె. రాజేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ మాట్లాడుతూ– ‘‘వరుణ్ డాక్టర్’లో నా పేరు వరుణ్. ఆర్మీ డాక్టర్ అన్నమాట. సొంతూరుకు వచ్చి ఏం చేశాడు? అనేది కథ. హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్గాన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఈ మూవీలో తమిళ వెర్షన్లో ‘చెల్లమ్మ, సో బేబీ’... పాటలు రాశా. ‘సో బేబీ..’ వీడియో చూసి ‘బుట్టబొమ్మ’ పాటలా ఉందనడం హ్యాపీ. తెలుగులో నేరుగా ఓ సినిమా కమిట్ అయ్యాను. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగులో చేయనున్న సినిమాకి హీరోయిన్లందరూ నాకు స్ఫూర్తి. వాళ్లు ఓ రోజు చెన్నైలో, మరో రోజు హైదరాబాద్‌లో, ముంబైలో షూటింగ్స్‌లో పాల్గొంటుంటారు.. భాష రాకున్నా డైలాగులు రాసుకుని, మీనింగ్ తెలుసుకుని ప్రాక్టీస్ చేస్తారు. నేనూ అలా కష్టపడాలని అనుకుంటున్నా’’ అన్నారు. -
భవిష్యత్‌లో మెగా ఫోన్ పడతా: హీరో
తమిళ సినిమా: భవిష్యత్తులో మెగా ఫోన్ పట్టాలనే ఆలోచన ఉందని నటుడు, నిర్మాత, గాయకుడు, గీత రచయిత శివ కార్తికేయన్ అన్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం డాక్టర్. ఈయన తన సొంత సంస్థ అయిన శివ కార్తికేయన్ ప్రొడక్షన్, కేజేఆర్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ప్రియాంక మోహన్ నాయకి. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటుడు శివ కార్తికేయన్ మీడియాతో ముచ్చటిస్తూ డాక్టర్ చిత్రంలో నటించడం నాకు కొత్త అనుభవం. ఇందులో ఆర్మీ డాక్టర్ గా నటించాను. ఏం చేస్తాను? ఎవరిని కాపాడతాను అన్నది చిత్రకథ. ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాల్లోనే యు/ఏ సర్టిఫికెట్ పొందిన తొలి చిత్రం ఇదే. కారణం చిత్ర కథ అలాంటిది. అయితే ఇది సీరియస్ కథా చిత్రం కాదు. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసే పాటలు, వినోదభరిత సన్నాహాలు ఉంటాయి. చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత నేను నటించిన డాన్, అయిలాన్ చిత్రాలు వరుసగా విడుదలవుతాయి. అయిలాన్ చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు అధికంగా ఉంటాయి. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా ఉంటుంది. కాగా, భవిష్యత్తులో మెగా ఫోన్ పట్టాలనే ఆలోచన ఉంది అని శివ కార్తికేయన్ పేర్కొన్నారు. -
వైద్యురాలిని పెళ్లాడిన తమిళ దర్శకుడు
చెన్నై: సిక్సర్ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు చాచి. ఆయన బుధవారం ఓ ఇంటివారయ్యారు. చెన్నైకు చెందిన వైద్యురాలు శరణ్యని కోవిలంబాక్కంలో వివాహం చేసుకున్నా రు. నటుడు శివకార్తికేయన్, సతీష్, మిర్చి శివ, సంగీత దర్శకుడు జిబ్రాన్, చాయాగ్రాహకుడు పి.జి.ముత్తయ్య, నృత్య దర్శకుడు అజయ్, నటి రిత్విక, ఆకాష్ దంపతులను ఆశీర్వదించారు. చదవండి : డ్రగ్స్ కేసు : నేడు విచారణకు రకుల్ ప్రీత్ సింగ్ అల్లు అర్జున్‌తో డ్యాన్స్.. తెగ కష్టపడుతున్న రష్మిక -
శివకార్తీకేయన్ ‘డాన్’ మూవీ టీంకు ఆదాయపన్ను శాఖ జరిమానా
సాక్షి, చెన్నై: ‘డాన్’ చిత్ర యూనిట్‌కు ఆదాయపన్నుశాఖ జరిమానా విధించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు శివకార్తికేయన్ ‘డాన్’ చిత్రం షూటింగ్‌ను ఆదివారం సాయంత్రం పొల్లా సమీపంలోని ఆనమలై బ్రిడ్జి వద్ద చిత్రీకరణ జరిపారు. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి భౌతిక దూరం, కరోనా ఆంక్షలను గాలికొదిలేశారు. వాహనాలు రోడ్డుపైనే ఆపేశారు. దీంతో పోలీసులు షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని అనుమతి లేకుండానే షూటింగ్ జరుపుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ‘డాన్’ మూవీ టీంకు రూ. 19,400 జరిమానా విధించారు. -
తగ్గేదేలే.. రష్మిక ఖాతాలో మరో సినిమా..
‘పుష్ప’, ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మికా మందన్నా ఖాతాలో తాజాగా మరో ప్రాజెక్ట్ వచ్చి చేరిందనే టాక్ వినిపిస్తోంది. తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు రష్మికా మందన్నాను తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందని సమాచారం. రీసెంట్గా అనుదీప్, రష్మికల మధ్య కథాచర్చలు కూడా జరిగాయట. మరి... శివ కార్తికేయన్, రష్మికా జోడీ కడతారా? ఈ కొత్త జంట వెండితెరపై కనువిందు చేస్తారా? వేచి చూడాలి. -
ఆ సినిమా నుంచి నన్ను తొలగించారా..?
టాలీవుడ్లో ఇంతకుముందు ఒక వెలుగు వెలిగిన నటి రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ స్టార్ హీరోలందరితోనూ జత కట్టిన ఈ బ్యూటీకి ఇప్పుడు అక్కడ అవకాశాలు కరువయ్యాయి. అయితే అంతకు ముందే కోలీవుడ్‌లో మకాం పెట్టిన ఉత్తరాది బామ్మకు ఇక్కడ చాలాకాలం విజయాలు అందలేదు. ఆ తర్వాత కార్తీతో నటించిన ధీరన్ అధిగారం ఒండ్రు చిత్రం విజయాన్ని అందించింది. అయితే ఇక్కడ అంతకముందు, ఆ తరువాత నటించిన ఏ చిత్రం సక్సెస్ కాలేదు. దీంతో కోలీవుడ్‌ను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి సమయంలో నటుడు శివకార్తికేయన్‌తో జతకట్టే అవకాశం వరించింది. అయితే ఆ చిత్ర నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరిగింది. అలాంటి సమయంలో రకుల్‌కి ఏకంగా శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌తో ఇండియన్–2 చిత్రం లో నటించే లక్కీచాన్స్ వచ్చింది. అయితే ఆ చిత్రం కూడా షూటింగ్లో క్రేన్ పడిపోవడం నలుగురు దాని కింద పడి చనిపోవడం వంటి సమస్యల కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఆ తరువాత కరోనా వ్యాప్తి చెందడంతో చిత్ర పరిశ్రమే స్తంభించిపోయింది. కాగా షూటింగ్‌తో చిత్ర పరిశ్రమ మళ్లీ ఎప్పుడు కళకళలాడుతోంది తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ శివకార్తికేయన్‌కు జంటగా నటించే అయలన్ చిత్రం నుంచి తొలగించినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఇండ్రు నేట్రు నాళై చిత్రం తర్వాత రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం అయలన్. ఇందులో నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను కథానాయకిగా ఎంపిక చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూజాకార్యక్రమాలతోనే నిలిచిపోయింది. కాగా లాక్డౌన్ ముగిసిన తరువాత షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే కరోనా భయంతో ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనడానికి రకుల్ ప్రీత్ సింగ్ నిరాకరించినట్లు, దీంతో ఆమెను చిత్రం నుంచి తొలగించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్ మీడియా ఎప్పుడు నిజాలను ప్రచారం చేస్తుందో తెలియడం లేదని వాపోయింది. వాస్తవాలను ప్రచారం చేస్తే బాగుంటుందని తన ట్విట్టర్లో పేర్కొంది. ఇకపోతే తనను అయలన్ చిత్రం నుంచి తొలగించారన్నది పూర్తిగా అవాస్తవం అని చెప్పింది. అసలు షూటింగ్ ఎప్పుడు మొదలైందని, అందులో పాల్గొనడానికి తాను నిరాకరించినట్లు ప్రచారం చేస్తున్నారు అని ప్రశ్నించింది. నిజానికి అయలన్ చిత్ర షూటింగ్లో ఎప్పుడెప్పుడు పాల్గొందామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు రకుల్ పేర్కొంది. అదేవిధంగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయం గురించి ఆ చిత్ర దర్శకుడు రవికుమార్ స్పందిస్తూ తన పనిచేసిన కళాకారులు అందరిలోకి అత్యంత అంకిత భావం కలిగిన నటి రకుల్ ప్రీత్ సింగ్ అని పేర్కొన్నారు. అలాంటిది ఆమెను తొలగించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. అదే విధంగా తమ యూనిట్ అంత చిత్ర షూటింగ్ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
నిజమేంటో తెలుసుకోండి
‘‘ఒక వార్త రాసే ముందు మీడియా నిజమేంటో? అబద్ధమేంటో చెక్ చేసుకుని రాసే రోజు ఎప్పుడొస్తుందో? కొన్ని హిట్స్ (డిజిటల్ మీడియాని ఉద్దేశించి కావొచ్చు) కోసం నిరాధారమైన వార్తలు రాయడం సరికాదు. బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని మనం ఎప్పుడు చూస్తామో?’’ అని మండిపడ్డారు రకుల్‌ప్రీత్ సింగ్. ఈ బ్యూటీ ఎందుకింత ఆగ్రహం వ్యక్తం చేశారంటే.. శివకార్తికేయన్ సరసన తమిళంలో ‘అయలాన్’ అనే సినిమా చేయడానికి రకుల్ అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్ ఆరంభించాలనుకున్నారట. అయితే కరోనా అనేది పూర్తిగా తగ్గేవరకూ షూటింగ్‌కి హాజరయ్యేది లేదని ఆ చిత్రనిర్మాతను రకుల్ ఇబ్బందిపెడుతోందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తకే రకుల్ పై విధంగా స్పందించారు. అది మాత్రమే కాదు. ‘‘షూటింగ్ ఎప్పుడు ఆరంభమవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాను’’ అన్నారు రకుల్. ఈ వార్తలకు ‘అయలాన్’ చిత్రదర్శకుడు రవికుమార్ స్పందిస్తూ – ‘‘రకుల్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఆమె గురించి వదంతులు రాయడం దురదృష్టకరం’’ అన్నారు. -
అల రీమేక్‌లో...
అల్లు అర్జున్ హీరోగా మొన్న సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, యస్. రాధాకష్ణ నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా తమిళంలోనూ రీమేక్ కానుందనే వార్త వచ్చింది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ రైట్స్ తీసుకుందట. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. -
సామాజిక బాధ్యతతో శక్తి
‘రెమో’, ‘సీమ రాజా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘హీరో’. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించారు. కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్. ఈ చిత్రంలో అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రలు చేశారు. తమిళ్లో గతేడాది డిసెంబర్లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘హీరో’ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో తెలుగులో అనువదించారు. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో కోటపాడి జె.రాజేష్ ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ– ‘‘సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రస్తుత విద్యావ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందింది. విద్యావ్యవస్థపై సినిమా అంటే ‘జెంటిల్‌మేన్’ సినిమా గుర్తుకు వస్తుంది. ప్రస్తుత విద్యా వ్యవస్థని సరిచేయడానికి ‘జెంటిల్‌మేన్’ వస్తే మా ‘శక్తి’లా ఉంటాడు. అర్జున్‌గారు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌లో ‘శక్తి’ సినిమా విడుదల చేస్తున్నాం.. 22 నుంచి తెలంగాణలో థియేటర్లు మళ్లీ ప్రారంభిస్తారని అంటున్నారు. రెండు రోజులు ఆలస్యంగా నైజాంలో కూడా విడుదల చేస్తాం. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా తమిళంలో ఓ సినిమా చేస్తున్నాం. సంతానం హీరోగా ఇంకో చిత్రం చేస్తున్నాం’’ అన్నారు. -
విద్యా వ్యవస్థపై పోరాటం
శివ కార్తికేయన్ హీరోగా ‘అభిమన్యుడు’ ఫేమ్ పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హీరో’. కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికగా నటించగా, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించారు. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ‘శక్తి’ పేరుతో తెలుగులోకి అనువాదం అవుతోంది. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో కోటపాడి. జె.రాజేష్ ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. పి.ఎస్. మిత్రన్ మాట్లాడుతూ– ‘‘సూపర్ మాన్, స్పైడర్ మాన్, శక్తి మాన్.. అంటే పిల్లలకే కాదు అన్ని వయసుల వారిలో ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వాళ్ల స్ఫూర్తితో సాహసాలు చేస్తుంటారు కొంతమంది. ఈ చిత్రంలో హీరో కూడా అలాంటివాడే. సూపర్ హీరోలా మారి విద్యా వ్యవస్థలోని విషయాలపై ఎలా పోరాడాడు? అన్నదే కథాశం. వాస్తవ ఘటనల ఆధారంగానే తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘ఏదైనా విభిన్న నేపథ్యం లేకపోతే శివ కార్తికేయన్ సినిమా చేయరు. ‘శక్తి’ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తూ హార్ట్‌ని టచ్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ నటించిన తొలి దక్షిణాది చిత్రం ఇదే’’ అన్నారు కోటపాడి. జె. రాజేష్. -
శివకార్తీకేయన్‌కు బద్ధ శత్రువు
సినిమా : క్రేజీ హీరోయిన్లుగా రాణించిన నటీమణులు విలనీయం ప్రదర్శించడానికీ వెనుకాడటం లేదు. పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ కూడా రజనీకాంత్‌తో విలనీయాన్ని ప్రదర్శించి పేరు తెచ్చుకుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఇషా కోపి కర్ కోలీవుడ్‌లో విలనిజాన్ని ప్రదర్శించడానికి రెడీ అయింది. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నాయకిగా నటించిన ఇషా కోపికర్ తమిళం, తెలుగులోనూ హీరోయిన్గా నటించింది. విజయ్‌కు జంటగా నెంజినిలే, విజయ్‌కాంత్‌కు జంటగా నరసింహా, అరవిందస్వామికి జతగా ఎన్ శ్వాస కాట్రే వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఇక తెలుగులో నాగార్జునకు జంటగా చంద్రలేఖ చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రతినాయకిగా రీఎంట్రీ ఇస్తోంది. నటుడు శివకార్తీకేయన్‌కు బద్ధ శత్రువుగా నటిస్తోంది. శివకార్తీకేయన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి డాక్టర్. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకమోహన్ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే అయలాన్ అనే మరో చిత్రంలోనూ శివకార్తీకేయన్ నటిస్తున్నారు. ఇది కొంత షూటింగ్‌ను జరుపుకుని ఆగిపోయింది. చాలా గ్యాప్ తరువాత మళ్లీ మొదలయ్యింది. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఏలియన్స్ ఇతి వృత్తంతో సైన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నటి ఇషాకోపికర్ ప్రతినాయకి పాత్రలో నటిస్తోంది. కాగా సుమారు 10 ఏళ్ల తరువాత కోలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం ఇది. ఆమె పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. -
ఆయన దర్శకత్వంలో నటించాలనుంది!
సినిమా: నటుడు శివకార్తికేయన్ దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నట్లు నటి కల్యాణి ప్రియదర్శన్ పేర్కొంది. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం ఉండదనుకుంటా. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురే ఈ బ్యూటీ. హలో చిత్రం ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైన భామ ఇప్పుడు కోలీవుడ్‌లో హీరో చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో కోటప్పాటి జే.రాజేశ్ తన కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులో హీరోయిన్గా నటించిన నటి కల్యాణి తన అనుభవాలను పంచుకుంటూ హీరో చిత్రంలో తాను మీరా అనే పాత్రలో నటించానని చెప్పింది. మీరా చాలా పరిణితి చెందిన యువతి అని పేర్కొంది. ఏం మాట్లాడినా ఏ పని చేసినా పలుమార్లు ఆలోచించి చేసే యువతి మీరా అని చెప్పింది. ఈ పాత్ర తన నిజజీవితానికి పూర్తిగా భిన్నమైందని చెప్పింది. తాను ఏదైనా అనుకుంటే మరో ఆలోచన లేకుండా చేసేస్తానని పేర్కొంది. హీరో చిత్రం ప్రధానంగా విద్యపై చర్చించే ఇతివృత్తంతో కూడిందని చెప్పింది. తాను ఇండియాలోనూ, విదేశాల్లోనూ చదివిన అమ్మాయినని,ఆ విధంగా ఈ రెండు విధానాల విద్య గురించి తెలిసిన యువతినని అంది. ఈ చిత్రంలో మన దేశంలో విద్య గురించేదిగా ఉంటుందని చెప్పింది. అంతే కాకుండా మన దేశంలో విద్యావిధానం గురించి విద్యార్థులు చర్చించుకునే విధంగా ఈ చిత్ర కత ఉంటుందని తెలిపింది. దర్శకుడు పీఎస్.మిత్రన్ తెరపై మాయాజాలం చూపడంలో దిట్ట అని పేర్కొంది. చిత్రంలోని ప్రతి చిన్న పాత్రను కూడా సరిగ్గా చూపించారని అంది. నటుడు శివకార్తికేయన్ చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని చెప్పింది. యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ అభిమానంగా చూసుకుంటారని చెప్పింది. ఆయన మంచి నటుడే కాదని, మంచి దర్శకుడు శివకార్తికేయన్‌లో ఉన్నారని అంది. ఏదో ఒక రోజు ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఈ చిత్రం వెనుక ఉన్న సూపర్‌హీరోల గురించి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంంలోనే చెప్పానని, జిల్లనిపించే యువన్‌శంకర్‌రాజా సంగీతం, ఛాయగ్రాహకుడు జార్జ్ సీ.విలియస్ వంటి సాధికులతో కలసి పని చేశానన్నది ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని అంది. తనపై నమ్మకంతో ఇందులో కథానాయకిగా నటించడానికి తనను ఎంపిక చేసిన చిత్ర నిర్మాత రాజేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నటి కల్యాణి ప్రియదర్శన్ పేర్కొంది. -
హీరోకి విలన్ దొరికాడు
‘2.ఓ’ సినిమాలో అక్షయ్‌కుమార్, ‘పేట’లో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి చేరిపోయారు బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్. ‘అభిమన్యుడు’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తమిళంలో ‘హీరో’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారు అభయ్ డియోల్. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తు్తన్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. -
పాంచ్ పటకా
టీవీ యాంకర్ నుంచి హీరోగా ఎదిగిన నటుడు శివ కార్తికేయన్ కోలీవుడ్‌లో మంచి ఊపుమీద ఉన్నారు. వరుస సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ నాలుగు సినిమాలను (రాజేశ్ (మిస్టర్ లోకల్), పీఎస్ మిత్రన్ (హీరో), రవికుమార్, పాండిరాజ్ దర్శకత్వంలో...) లైన్లో పెట్టిన కార్తికేయన్ తాజాగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో హీరోగా నటించనున్నట్లు వెల్లడించారు. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జూలైలో చిత్రీకరణను మొదలుపెట్టి, వచ్చే ఏడాది సినిమాను విడుదలకి ప్లాన్ చేశారు. ఇందులో కన్నడ బ్యూటీ రష్మికా మండన్నా హీరోయిన్గా ఎంపికయ్యే చాన్స్ ఉందటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో శివకార్తికేయన్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. అంటే పాంచ్ పటకా అన్నమాట. -
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఐశ్వర్య..?!
నటి ఐశ్వర్య రాజేశ్‌కు భారీ అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇటీవల సెక్క సివంద వానం, కనా వంటి చిత్రాల సక్సెస్ ఈమె కెరీర్‌కు బాగా ఉపయోగపడ్డాయి. అంతే కాదు కాక్కాముట్టై చిత్రంతోనే నటిగా తానేమిటో నిరూపించుకున్న ఐశ్వర్యరాజేశ్ పదహారణాల తెలుగమ్మాయి అని తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో కామ్రేడ్ అనే చిత్రంలో విజయ్‌దేవరకొండకు జంటగా నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదల కావడానికి ముస్తాబవుతోంది. ఇదేకాక మరో రెండు తెలుగు చిత్రాలు, తమిళంలో ఇదు వేదాళం సొల్లుం కథై, కర్పూరనగరం, దర్శకుడు మణిరత్నం నిర్మాణంలో విక్రమ్‌ప్రభుకు జంటగా నటించే చిత్రంతో కలిపి ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. తాజాగా కోలీవుడ్‌లోనూ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు తలుపుతడుతున్నాయి. ధనుష్‌కు జంటగా వడచెన్నై–2లో నటించనున్న ఐశ్వర్యరాజేశ్‌కు తాజాగా నటుడు శివకార్తికేయన్‌తో జతకట్టే అవకాశం దక్కినట్లు తెలిసింది. ప్రస్తుతం మిస్టర్ లోకల్ చిత్రాన్ని పూర్తి చేసి రవికుమార్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్న శివ కార్తికేయన్ తాజాగా హీరో అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ స్టార్ నటుడు మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. సుశీంద్రన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో శివ కార్తికేయన్‌కు జంటగా ఐశ్వర్య రాజేశ్‌ను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే శివ కార్తికేయన్ నిర్మించిన కనా చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాజేశ్ ఇప్పుడు ఏకంగా ఆయన పక్కనే హీరోయిన్గా కనిపించనుంది. -
నల్ల మనసు
సెట్లో వాచ్‌లను పంచి పెట్టారు కథానాయిక నయనతార. తాజా తమిళ చిత్రం ‘మిస్టర్ లోకల్’లో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారీ బ్యూటీ. అందుకే యూనిట్ సభ్యులకు ఖరీదైన వాచ్‌లను బహుమతిగా ఇచ్చారు. ఇది తెలిసిన ఆమె అభిమానులు నయనతారది నల్ల (మంచి)మనసు అని అభిమానంగా చెప్పుకుంటున్నారు. శివ కార్తీకేయన్, నయనతార జంటగా రాజేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. రాధిక, సతీష్, యోగిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయాలను కుంటున్నారు. ఈ ‘మిస్టర్ లోకల్’ సినిమా తెలుగులో నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ సినిమాకు రీమేక్ అనే వార్తలను ఖండించింది చిత్రబృందం. ఈ సంగతి ఇలా ఉంచితే... ఇటీవల ‘ఎన్జీకే’ షూటింగ్ పూర్తయినప్పుడు సూర్య, ‘కాట్రిన్మొళి’ కంప్లీట్ అయినప్పుడు జ్యోతిక ఆయా చిత్రబృందాలకు గోల్డ్ కాయిన్స్‌ను బహుకరించిన విషయం తెలిసిందే. అలాగే ‘పందెం కోడి 2’ పూర్తయినప్పుడు కీర్తీ సురేశ్ గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు. మొత్తానికి కోలీవుడ్‌లో ఇలా బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ అయింది. -
శత్రువు కూడా ముఖ్యమే
‘‘డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యాను. నిర్మాతగా ‘దండుపాళ్యం– 3’, అర్జున్ 150వ సినిమా ‘కురుక్షేత్రం’, ‘మారి–2’ విడుదల చేశా. ఇప్పుడు ‘సీమరాజా’ నా నాలుగో చిత్రం. ఇది మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సాయికృష్ణ పెండ్యాల. శివకార్తికేయన్ హీరోగా, సమంత, కీర్తీ సురేశ్ హీరోయిన్లుగా పొన్రాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీమరాజా’. ఈ సినిమాను లక్ష్మీ పెండ్యాల సమర్పణలో సాయికృష్ణా ఫిలిమ్స్ పతాకంపై సాయికృష్ణ పెండ్యాల తెలుగులో ఈ నెల 8న విడుదల చేస్తున్నారు. సాయికృష్ణ పెండ్యాల మాట్లాడుతూ– ‘‘సీమరాజా’ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి కారణం చెన్నెలో ఉండే నా మిత్రుడు. తను ఈ సినిమాలోని ‘మనిషి బతకాలంటే మిత్రుడు ఎంత ముఖ్యమో.. శత్రువు కూడా అంతే ముఖ్యం’’ అనే డైలాగ్ నాకు పంపించాడు. ఆ డైలాగ్ విని ఈ సినిమాని తమిళ్‌తో పాటు తెలుగులో ఒకేసారి విడుదల చేద్దామనుకున్నాను.. కుదరలేదు. చంద్రబోస్‌గారు, వెన్నెలకంటి గారు రాసిన పాటలకు, ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో సమంత యాక్షన్ సీన్స్‌లో బాగా నటించారు. కీర్తీసురేశ్ 30 నిమిషాలపాటు యువరాణి గెటప్‌లో కనిపిస్తారు. సిమ్రాన్‌గారు నెగటివ్ పాత్రలో అలరించారు. డిస్ట్రిబ్యూటర్‌గా 18 సంవత్సరాల్లో 300లకుపైగా సినిమాలు విడుదల చేశాను. ‘సీమరాజా’ సినిమాను ఏపీ, తెలంగాణల్లో 400 థియేటర్స్‌కుపైగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
చిన్ని చిన్ని ఆశ
ఫారిన్లో పాటలు పాడుకుంటున్నారు నయనతార, శివ కార్తికేయన్. అక్కడికి వచ్చిన ఓ చిన్నారి నయనతారను అలాగే చూస్తూ ఉండిపోయిందట. విషయం ఏంటని యూనిట్ సభ్యులు ఆ చిన్నారిని అడిగితే.. నయన్‌తో ఫొటో కావాలని ముద్దు ముద్దుగా అడిగిందట. ఆ చిన్నారి చిన్ని చిన్ని ఆశకు ముచ్చటపడిపోయి ఫొటోకు పోజు ఇచ్చారు నయనతార. ఆ వెంటనే హీరో శివ కార్తికేయన్ కూడా ఓ ఫొటో ఫ్రేమ్‌లో బందీ అయిపోయారు. ఎమ్. రాజేశ్ దర్శకత్వంలో శివ కార్తికేయన్, నయనతార జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అజర్ౖబైజాన్లో జరుగుతోంది. పాటలతో పాటు కొన్ని కీలక సీన్స్‌ను కూడా ప్లాన్ చేసింది చిత్రబృందం. పైన చెప్పిందంతా ఈ షూటింగ్ లొకేషన్లోనే జరిగింది. -
ఫుల్ ఫామ్
కోలీవుడ్‌లో బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి కథానాయకునిగా సక్సెస్ అయ్యారు శివ కార్తికేయన్. తాజాగా ఆయన హీరోగా మరో చిత్రం రూపొందనుంది. తొలి చిత్రం ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’)తోనే దర్శకునిగా మంచి పేరు సంపాదించుకున్న పీఎస్. మిత్రన్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన వెల్లడైంది. 24స్టూడియోస్ సంస్థ ఈ సినిమా నిర్మించనుంది. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటించనున్నారని సమాచారం. విశాల్ హీరోగా వచ్చిన ‘ఇరంబుదురై’ చిత్రంలో అర్జున్ విలన్‌గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారు. ఈ సినిమా కాకుండా రవికుమార్‌తో ఓ సినిమా, రాజేష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు శివ కార్తీకేయన్. ఆయన నిర్మాణంలో రూపొందిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా ‘కణ’ డిసెంబర్లో విడుదల కానుంది. ఇలా నటుడిగా, నిర్మాతగా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు శివ కార్తికేయన్. -
మళ్లీ థ్రిల్లర్
‘ఇరుంబుదురై’ దర్శకుడిగా ఫస్ట్ సక్సెస్ అందుకున్నారు మిత్రన్. ఈ సినిమా తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో రిలీజై, మంచి హిట్ సాధించింది. ఇప్పుడీ దర్శకుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ శివ కార్తికేయన్‌తో ఉంటుందని అనౌన్స్ చేశారు. ఈ విషయం గురించి మిత్రన్ మాట్లాడుతూ – ‘‘శివ కార్తికేయన్, నేను కలసి షార్ట్ ఫిల్మ్స్‌కి వర్క్ చేశాం. తన కోసం ఒక కథ ఎప్పుడో రాసుకున్నాను. ‘ఇరుంబుదురై’ కంటే ముందే మేం ఓ సినిమా చేయాలి. కానీ ఇప్పుడు కుదిరింది. ‘ఇరుంబుదురై’లానే ఈ సినిమా కూడా ఫుల్ స్పీడ్‌గా సాగే థ్రిల్లర్‌లా ఉండబోతోంది’’ అని పేర్కొన్నారు. శివకార్తికేయన్ ప్రస్తుతం రాజేశ్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం, రవి కుమార్‌తో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
మిస్టర్ గుర్కా
హాస్యనటుడు యోగిబాబు టైటిల్ రోల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. శామ్ ఆంటోని దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను హీరో శివ కార్తీకేయన్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘గుర్కా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యోగిబాబు లీడ్ రోల్ చేస్తున్న తొలి చిత్రం ఇది. ఇందులో కుక్క కూడా ఓ కీలకమైన పాత్ర పోషిస్తుందని చిత్రబృందం చెబుతోంది.ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘యోగిబాబు లీడ్ రోల్లో నటిస్తున్న గుర్కా ఫస్ట్ లుక్, టైటిల్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు శివకార్తీకేయన్. ‘‘నా నెక్ట్స్ సినిమా ‘గుర్కా’ అని అనౌన్స్ చేయడానికి ఆనందంగా ఉంది’’ అన్నారు యోగిబాబు. -
‘సీమరాజాకు’ క్లీన్ యు
సాక్షి సినిమా: ఈ రోజుల్లో సెన్సార్‌బోర్డు నుంచి యు సర్టిఫికెట్‌ను పొందడం సాధారణ విషయం కాదు. చాలా మంది దర్శక, నిర్మాతలు యు/ఏ సర్టిఫికెట్ వస్తే చాలు అనుకునే పరిస్థితి. అలాంటిది సీమరాజా చిత్రం క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందింది. ఇది విశేషమే మరి. వరుస విజయాలతో జోరు మీదున్న నటుడు శివకార్తీకేయన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సీమరాజా. వివాహానంతరం వరుస సక్సెస్‌లతో అగ్రనాయకిగా రాణిస్తున్న సమంత ఇందులో కథానాయకి. రెమో, వేలైక్కారన్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన ఆర్డీ.రాజా తన 24 ఎఎం. స్టూడియో పతాకంపై నిర్మించిన తాజా చిత్రం ఇది. పోన్‌రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీ ఇమాన్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 13న విడుదలకు ముస్తాబవుతోంది. చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు యు సర్టిఫికెట్‌ను అందంచడంతో పాటు సకుటుంబ సమేతంగా చూసి ఆనందించే మంచి కథా చిత్రం అని కితాబు కూడా ఇచ్చారట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత రాజా తెలుపుతూ సీమరాజా మంచి తరుణంలో తెరపైకి రానున్న చక్కని కమర్శియల్ ఎంటర్టెయినర్ అని చెప్పారు. శివకార్తీకేయన్, దర్శకుడు పొన్రామ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రంలో మనసుల్ని హత్తుకునే సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో కూడిన అందమైన సన్నివేశాలు ఉన్నాయన్నారు. అలరించే విజువల్స్, పాటలు వెరసి ప్రేక్షకులు మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పారు. వినాయక చతుర్ధశి పండగ సందర్భంగా సీమరాజా చిత్రాన్ని సెప్టెబరు 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత రాజా వెల్లడించారు. నటి సిమ్రాన్, సూరి, లాల్, నెపోలియన్, మనోబాల, యోగిబాబు, నాన్ కడవుల్ రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
ఆ ప్రచారం సినిమా వాళ్లు చేసిందే: సమంత
తమిళసినిమా: అది సినిమా వాళ్లు చేసే పనేనని అంటోంది నటి సమంత. నటీమణుల్లో ఈ అమ్మడంత లక్కీ హీరోయిన్ ఈ తరంలో ఉండరేమో! పెళ్లికి ముందు ఆ తరువాత కూడా కథానాయకిగా బిజీగా అదే సమయంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న నటి సమంత. నిజం చెప్పాలంటే వివాహానంతరమే ఈ బ్యూటీ నటించిన చిత్రాలు ఎక్కువ పేరు తెచ్చిపెడుతున్నాయి. అలా కథానాయకిగా దశాబ్దాన్ని చాలా సులభంగా అధిగమించేసింది. పదేళ్లుగా కథానాయకిగా నటించడాన్ని సాధారణంగానే భావిస్తున్న సమంత దీని గురించి ఏం చెబుతుందో చూద్దాం. 10 ఏళ్లుగా కథానాయకిగా రాణించడానికి పెద్దగా భావిస్తున్నారు. నా మాదిరిగానే కొందరు కథానాయికలు నటిస్తున్నారు. నాటి కథానాయికలే సినిమాలో నిలదొక్కుకుని నిలిచారని అనేవారు, ఈ తరం నటీమణులు కూడా పది కాలాల పాటు నిలడతున్నారు అదేవిధంగా. వివాహంతో హీరోయిన్ల మార్కెట్ పడిపోతుందనే ఒక అపోహ ఉంది. దాన్ని బ్రేక్ చేయాలని భావించాను. అనుకున్నట్టుగానే బ్రేక్ చేశాను. వివాహానంతరం నేను నటించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. అదేవిధంగా పెళ్లి అనంతరం హీరోయిన్లకు ఆదరణ ఉండదనే ప్రచారం సినిమా వాళ్లు చేసిందే. నిజానికి ప్రేక్షకులు అలా భావించడం లేదు అన్నది నా చిత్రాల ద్వారా నిరూపణ అయ్యింది. నాకు ముందు కూడా పలువురు హీరోయిన్లు సాధించారు. మరో విషయం ఏమిటంటే నేనీ స్థాయికి ఎదగడానికి విమర్శలే కారణం. అవే మనల్ని ఎదగడానికి దోహదపడతాయి. పలాన పాత్రలో సమంత నటించలేదు అని ఎవరన్నా అంటే దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని అలాంటి పాత్రలో నటించడానికి కఠినంగా శ్రమించడానికి సిద్ధ పడతాను. కాబట్టి విమర్శలే ఎదగడానికి సోపానాలు అని అంటున్న సమంత తాజాగా నటించిన హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం యూటర్న్, శివకార్తికేయన్‌కు జంటగా నటించిన సీమదురై షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెల ఒక వారం గ్యాప్‌లో వరుసగా తెరపైకి రావడానికి ముస్తాబవు తున్నాయి. ఈ రెండు చిత్రాలపైనా అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి. వీటిలో ఇటీవల విడుదలైన యూటర్న్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోందన్నది తెలిసిన విషయమే. -
ఆనందంగా ఆలాపన
జనరల్‌గా తండ్రీ కూతుళ్లు కలిసి నటించడం చూస్తుంటాం. కానీ ఈసారి కాస్త డిఫరెంట్. తండ్రి శివకార్తీకేయన్‌తో కలిసి పాట పాడారు చిన్నారి ఆరాధన. ఐశ్వర్యా రాజేష్ ముఖ్య పాత్రలో తమిళంలో రూపొందిన సినిమా ‘కనా’. ‘డ్రీమ్ బిగ్’ అనేది క్యాప్షన్. నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్ర చేశారు. నటుడు శివ కార్తీకేయన్ స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్‌లో రూపొందిన తొలి చిత్రమిది. ఓ పల్లెటూరి అమ్మాయి గొప్ప క్రికెటర్ కావాలనుకున్న తన కలను ఎలా నేరవేర్చుకుంది? అన్నది ఈ చిత్రకథ. ‘‘సినిమాలో ఐశ్యర్యా రాజేష్ చిన్నతనంలో తండ్రితో కలిసి పాడే పాట ఇది. ఎవరి చేత పాడిద్దాం అనుకుంటున్న టైమ్‌లో శివ కార్తీకేయన్, ఆయన కూతురు ఆరాధన గుర్తొచ్చారు. విషయం చెప్పాం. ఆనందంగా ఓకే అని ఈ పాటను ఆలపించారు. పాట పాడేప్పుడు ఆరాధన నెర్వస్‌గా ఫీలవ్వలేదు. ఈ సాంగ్‌లో సింగర్ విజయలక్ష్మి కూడా గొంతు కలిపారు’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు దిబు థామస్. లిరిసిస్ట్ అరుణ్ రాజా కామరాజ్ ఈ సినిమాతో దర్శకునిగా మారారు. -
ఆన్ స్క్రీన్.. ఆన్ సెట్స్
ఏడాది తిరగక ముందే తమిళ హీరో శివకార్తీకేయన్‌తో హీరోయిన్ నయనతార మళ్లీ జోడీ కట్టారు. గతేడాది ‘వేలైక్కారన్’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజేష్ దర్వకత్వంలో ఈ జంట నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. రాధిక, సతీష్, యోగిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా మొదలైన 25 రోజుల తర్వాత సెట్లో జాయిన్ అయ్యారు నయనతార. యాక్షన్ ఎలిమెంట్స్‌తో కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ రేపు స్క్రీన్‌కి రానుంది. అలాగే శివ కార్తీకేయన్ నెక్ట్స్ రిలీజ్ ‘సీమరాజా’. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. -
ముందు స్టూడెంట్... తర్వాత టీచర్
ఒక స్టూడెంట్ టీచర్‌గా మారాలంటే బోలెడంత టైమ్ పడుతుంది. కానీ సమంత మాత్రం తక్కువ టైమ్‌లోనే స్టూడెంట్ నుంచి టీచర్ స్థాయికి ఎదిగారు. కానీ ఆషామాషీ టీచర్‌గా కాదు. తేడా వస్తే తాట తీసే కర్రసాము టీచర్ అట. శివకార్తికేయన్, సమంత జంటగా పొన్రామ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘సీమరాజా’. ఇందులో కర్రసాము నేర్పించే టీచర్ సుదందిరదేవి పాత్రలో సమంత నటించారు. ఈ పాత్ర కోసం సమంత కష్టపడి కర్రసాము నేర్చుకున్నారు. 15 సార్లు మార్షల్ ఆర్ట్స్ క్లాసులకు వెళ్లారట. అంటే ముందు స్టూడెంట్‌గా కర్రసాము క్లాసులకు వెళ్లిన సమంత, వెండితెరపై టీచర్‌గా మారారు. ఇందులో నటి సిమ్రాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందించారు. ‘సీమరాజా’ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... పవన్‌కుమార్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘యు టర్న్’ సినిమా కూడా సెప్టెంబర్ 13నే విడుదల కానుండటం విశేషం. -
లవ్లీ టీమ్‌తో...
సౌత్ లాంగ్వేజెస్‌లోనే కాదు హిందీ భాషలోనూ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు అలనాటి కథానాయిక రాధిక. 1980లలో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. రీసెంట్గా తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో తల్లి పాత్రలో కనిపించారామె. ఇప్పుడు శివకార్తీకేయన్ హీరోగా రాజేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ తమిళ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు రాధిక. ‘లవ్లీ టీమ్‌తో జాయిన్ అయ్యాను’ అని ఆమె షూటింగ్ స్పాట్ ఫొటోను షేర్ చేశారు. నయతనార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో హాస్యనటులు యోగిబాబు, సతీష్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. -
మాకు మంచి జరగాలి
... అని మనసారా కోరుకుంటున్నారు కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్. సర్లే కానీ మాకు అని అంటున్నారు మరి మిగతా వారెవరో అంటే... ప్రస్తుతానికి తమిళ నటుడు శివకార్తీకేయన్, ఏఆర్ రెహ్మాన్ అండ్ టీమ్ అన్నమాట. ‘ఇండ్రు నేట్రు నాళై’ ఫేమ్ ఆర్. రవికుమార్ దర్శకత్వంలో శివకార్తీకేయన్ హీరోగా 24ఎమ్ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. బైలింగ్వల్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇషా కొప్పీకర్, భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో రకుల్ పాల్గొనలేకపోయారు. ‘‘మిస్సయ్యాను.. మా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ’’అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అన్నట్లు.. ఈ మిస్ ఎందుకు మిస్ అయ్యారంటే... కాస్త ఆరోగ్యం సరిగా లేదట. అందుకోసమే ఇంట్లో ఉంటూ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ రికవరీ అవుతున్నారని సమాచారమ్. అలాగే ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానున్న సూర్య ‘ఎన్జీకే’ చిత్రంలో రకుల్ ఒక కథానాయిక. కార్తీ హీరోగా రూపొందుతున్న ‘దేవ్’ సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తున్నారు ఆమె. మరోవైపు హిందీలో అజయ్ దేవగన్ సినిమాలో కూడా రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
రాజా సెప్టెంబర్‌లో ఆజా
వినాయక చవితికి వస్తున్నా అంటున్నారు ‘సీమరాజా’. తమిళ నటుడు శివకార్తికేయన్, సమంత జంటగా పొన్రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘సీమరాజా’. 24 ఏయమ్ స్టూడియోస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది చిత్రబృందం. బిగ్ బడ్జెట్‌తో రూరల్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ గెస్ట్ రోల్ చేయనుండటం విశేషం. జూన్ 19తో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవ్వనుందట. తెలుగు, తమిళంతో కలిపి ‘సీమరాజా’ ఈ సంవత్సరం సమంతకు నాలుగో రిలీజ్ కానుంది. ఆల్రెడీ ‘రంగస్థలం, మహానటి, ఇరంబుదురై (తెలుగులో ‘అభిమన్యుడు’) తో హిట్స్ సాధించిన సమంత ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు. రీసెంట్గా శివకార్తికేయన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ప్రామిస్ బ్రేక్ చేశాడు
శివకార్తికేయన్ నాకు చేసిన ప్రామిస్‌ను బ్రేక్ చేశాడు అంటున్నారు తమిళ పాటల రచయిత మదన్ కార్కీ. మదన్ కార్కీ అంటే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు. కానీ ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుల భాషను సృష్టించింది మదన్ కార్కీ అనగానే వెంటనే గుర్తుపట్టొచ్చు. ఇంతకీ మదన్, శివ చేసుకున్న ప్రామిస్ ఏంటంటే.. శివ కార్తీకేయన్ ఎప్పుడూ పాటలు రాయకూడదని. మదన్ కార్కీ ఎప్పుడూ యాక్ట్ చేయకూడదని సరదాగా ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారట. కానీ నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ (కోకో) సినిమా కోసం శివ కార్తికేయన్ ‘కల్యాణ వయస్సు’ అంటూ ఒక సాంగ్ రాసిన విషయం తెలిసిందే. ఈ పాట విన్న తర్వాత శివ కార్తికేయన్ నాకు చేసిన ప్రామిస్‌ని బ్రేక్ చేశాడని మదన్ కార్కీ సరదాగా అన్నారు. -
పెళ్లి వయసు
యాంకర్ నుంచి హీరోగా మారారు తమిళ నటుడు శివ కార్తికేయన్. ముందు కమెడియన్‌గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు హీరోగా.. ఇలా అంచలంచెలుగా ఎదిగారు. ఇలా తనలోని కొత్త టాలెంట్‌ను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారాయన. ‘మాన్ కరాటే’తో సింగర్‌గా కూడా మారారు. ఇప్పుడు పాటల రచయితగా కలం పట్టారు. నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘కోలమావు కోకిల’ సినిమా కోసం ఓ పాట రాశారు శివ కార్తికేయన్. అనిరు«ద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ‘కల్యాణ వయసు....’ అంటూ సాగే ఈ పాట మే 17న రిలీజ్ కానుంది. అన్నట్లు... ‘పెళ్లి వయసు’ అని పాట రాసిన శివ కార్తికేయన్‌కి పెళ్లయింది. ఒక పాప కూడా ఉంది. -
నా సంతోషంకోసమే !
తమిళసినిమా: నటీనటులే కాదు, ఏ శాఖకు చెందిన వారికైనా టర్నింగ్ పాయింట్ అనేది ఒకటుంటుంది.అలా నటి సాయిపల్లవి కెరీర్‌కు మలయాళం చిత్రం ప్రేమమ్ పెద్ద టర్నింగ్‌గా మారింది. అప్పటి వరకూ చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వైద్య విద్య చదుకుకుంటున్న ఈ అమ్మడికి అనూహ్యంగా వరించిన అవకాశమే ప్రేమమ్. ఆ చిత్ర విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇతర నటీమణుల కంటే సాయిపల్లవి కాస్త భిన్నమనే చెప్పాలి. డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు దక్షిణాది క్రేజీ హీరోయిన్గా మారింది. అయితే ఈ అమ్మడికి కాస్త టెక్కు అనే ప్రచారం బాగా జరుగుతోంది. చాలా షరతులు విధిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. క్రమశిక్షణను పాటించదని షూటింగ్‌లకు చెప్పిన టైమ్‌కు రాదని ఆరోపణలను ఎదుర్కొంటున్న సాయిపల్లవి విధించే మరో నిబంధన గ్లామర్‌గా నటించనన్నది. సహ నటీమణులందరూ గ్లామర్కుసై అంటుంటే నువ్వెందుకు మడికట్టుకుని ఉన్నావన్న ప్రశ్నకు ఎందుకంటే తన తల్లిదండ్రులు తన సంతోషం కోసమే నటించడానికి అనుమతించారని, అలాంటి వారి మనసు నొచ్చుకునేలా ఎలాంటి పని తాను చేయనని బదులిచ్చింది. గ్లామర్‌గా నటించకపోవడానికి కూడా అదే కారణం అని పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మలయాళ చిత్రం ప్రేమమ్ తరువాత కోలీవుడ్‌లో మణిరత్నం లాంటి దర్శకుడి అవకాశాన్నే కాలదన్నుకుందన్నుకున్నా ఈ జాణకు చేతి నిండా చిత్రాలుండడం విశేషమే. తమిళంలో ఇప్పటికి ఒక్క చిత్రం తెరపైకి రాకపోయినా మూడు చిత్రాల్లో నటించేస్తోంది. అందులో విజయ్ దర్శకత్వంలో నటించిన కరు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్యకు జంటగా ఎన్జీకే, ధనుష్ సరసన మరి–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటు తెలుగులోనూ నటిస్తోంది. దీంతో తాజాగా శివకార్తికేయన్‌తో జతకట్టే అవకాశం తలుపు తట్టగా కాల్షీట్స్ సమస్య తలెత్తడంతో సారీ అని చేతులెత్తేసింది. ఇప్పుడా అవకాశం నయనతారను వెతుక్కుంటూ వెళ్లింది. ఆ అగ్రనటి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇంతకు ముందు శివకార్తికేయన్, నయనతార నటించిన వేలైక్కారన్ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఆ ఇద్దరితో రెండో సినిమా
కమెడియన్ నుంచి హీరోగా మారిన శివ కార్తికేయన్‌తో గతేడాది ‘వేలైక్కారన్’ సినిమాలో యాక్ట్ చేసిన నయనతార మరోసారి అతనితో జోడీ కట్టడానికి రెడీ అయ్యార ని కోలీవుడ్ సమాచారం. శివ కార్తికేయన్ హీరోగా ‘నేనే అంబానీ’ ఫేమ్ రాజేష్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకున్నారట. దర్శకుడు రాజేశ్ చెప్పిన కథ నచ్చటంతో నయన్ ఓకే కూడా చెప్పేశారని సమాచారమ్. ఆల్రెడీ రాజేశ్ డైరెక్ట్ చేసిన ‘బాస్ ఎన్గిర భాస్కరన్’ (తెలుగులో ‘నేనే అంబాని’) సినిమాలో నయనతార యాక్ట్ చేశారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న తాజా సినిమా తమిళనాడు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ స్ట్రైక్ పూర్తయిన వెంటనే స్టార్ట్ అవుతుందట. ఆల్రెడీ రవికుమార్ డైరెక్షన్లో శివకార్తికేయన్ చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీతో పాటు ఈ సినిమాను కూడా ఒకేసారి షూట్ చేయనున్నారట. హీరో శివకార్తికేయన్‌తోనే కాదు దర్శకుడు రాజేశ్‌తో కూడా నయనతార సినిమా చేయడం ఇది రెండోసారి. ఈ సినిమా కాకుండా నయనతార ప్రస్తుతం చిరంజీవితో ‘సైరా’, తమిళంలో అజిత్‌తో ‘విశ్వాసం’, కొత్త దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ‘కోకో’(కోలమావు కోకిల ) సినిమాలతో బిజీగా ఉన్నారు. -
షరతులు వర్తిస్తాయి
సాక్షి, సినిమా: హీరోగా అతి వేగంగా దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్. ఈయన హీరోగా తొలి చిత్రం మనంకొత్తిపరవై యావరేజ్‌గా నిలిచింది. ఆ తరువాత నటించిన మెరీనా ఓకే అనిపించుకుంది. వరుత్తపడాద వాలిభన్ సంఘం నుంచి శివకార్తికేయన్ కేరీర్ వేగం పుంజుకుంది. ఇటీవల విడుదలైన వేలైక్కారన్ చిత్రం వరకూ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా నటిస్తున్న సీమరాజా చిత్రం నిర్మాణంలో ఉంది. తదుపరి రెండు చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే శివకార్తికేయన్ చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు. అంతే కాదు కండిషన్స్ విధించడానికి వెనుకాడటం లేదు. ఈయన దర్శకుడు ఎం.రాజేశ్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. ఈ దర్శకుడికొక సెంటిమెంట్ ఉంది. తొలి చిత్రం నుంచి ఒరుకల్ ఒరు కన్నాడీ, బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రాలన్నింటిలోనూ టాస్మాక్ సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయి. అలాంటిది శివకార్తికేయన్ ఒక టీవీకిచ్చిన భేటీలో ఇంతకు ముందు టాస్మాక్ దృశ్యాలు చాలా ఆలోచింపజేశాయని, ఇకపై అలాంటి సన్నివేశాలు గానీ, స్త్రీలను పరిహాసం చేసే అంశాలు గానీ ఉండవని పేర్కొన్నారు. అయితే ఇది దర్శకుడు రాజేశ్‌కు పెట్టే కండిషన్స్గా సినీవర్గాలు భావిస్తున్నారు. అదే విధంగా టాస్మాక్ సన్నివేశాల సెంటిమెంట్ కలిగిఉన్న దర్శకుడు రాజేశ్కిది షాక్ ఇచ్చే విషయమే అవుతుందని అనుకుంటున్నారు. మరి ఆయన శివకార్తికేయన్‌తో చేసే చిత్రాన్ని ఎలా మలుచుకుంటారో వేచి చూడాలి. -
సూపర్ ఫామ్
వన్.. టు.. త్రీ.. ఫోర్... అండ్ నాటౌట్. స్టిల్ కౌంటింగ్. ఇండస్ట్రీలో ఇలాగే అనుకుంటున్నారు హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ సూపర్ ఫామ్ గురించి. ఎందుకంటే.. ఈ ఏడాది ఇంకా వంద రోజులు కూడా పూర్తి కాలేదు.. నలుగురు పెద్ద హీరోల సరసన హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేశారు రకుల్. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘ఎన్జీకే’ చిత్రంలో రకుల్ ఒక కథానాయిక. కార్తీ హీరోగా నటించనున్న కొత్త సినిమాలోనూ రకుల్‌ను కథానాయికగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రంలో రకుల్‌ను కథానాయికగా ఎంపిక చేశారు చిత్రబృందం. కమెడియన్ నుంచి హీరోగా మారిన శివకార్తికేయన్ పెద్ద హీరో ఏంటి? అనుకోకండి. మెల్లిగా అతను ఫామ్లోకొస్తున్నాడు. పైగా ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ కాబట్టి బడ్జెట్ ఎక్కువ. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదొక్కటి చాలు.. ఇది పెద్ద సినిమా అని చెప్పడానికి. ఆల్రెడీ బాలీవుడ్లో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక అని బీటౌన్ టాక్. సినిమాల పరంగా రకుల్ స్కోర్ తమిళ్లో 3, హిందీలో 1. ఇంకా ఈ ఏడాది తెలుగులోనే బోణీ చేయలేదు. ఆ సంగతలా ఉంచితే.. ఈ సూపర్‌ఫామ్ హ్యాపీనెస్లోనే అభిమానులకు దగ్గరయ్యేందుకు సొంత యాప్‌ను రిలీజ్ చేసి, కూల్‌గా దూసుకెళ్తున్నారు రకుల్. -
ఎస్ రకుల్ ఫిక్స్
తమిళసినిమా: నటి రకుల్‌ప్రీత్‌సింగ్ జోరు దక్షిణాదిలో కాస్త తగ్గిందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ అమ్మడిప్పుడు బాలీవుడ్‌పై దృష్టి సారిస్తోందనే మాట కూడా వినిపిస్తోంది. అదేవిధంగా కోలీవుడ్‌లో రాకరాక ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంతో ఒక్క విజయం వచ్చింది. ప్రస్తుతం సూర్యకు జంటగా ఎన్జీకే చిత్రంలో నటిస్తోంది. ఇక కార్తీతో మరో చిత్రంలో నటించనుంది. ఇంతకు ముందు శివకార్తికేయన్‌తో జతకట్టనుందనే ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆ విషయాన్ని నిర్మాత అధికారికంగా వెల్లడించారు. శివకార్తికేయన్ తాజాగా పొన్రామ్ దర్శకత్వంలో సీమదురై చిత్రంలో నటిస్తున్నారు సమంత నాయకి. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని 24 ఏఎం.స్టూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా నిర్మించనున్నారు. నేట్రు ఇండ్రు నాళై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటించనున్నట్లు నిర్మాత అధికారికపూర్వకంగా వెల్లడించారు. దీనికి సంగీతమాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలను కట్టనున్నారు. అదే విధంగా నీరవ్‌షా చాయాగ్రహణం అందించనున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలను ముత్తురాజ్ నిర్వహించనున్నట్లు నిర్మాత శుక్రవారం తన ట్విట్టర్లో పేర్కొన్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం మీద రకుల్ కోలీవుడ్‌లో బిజీ అవుతోందన్న మాట. శివకార్తికేయన్, ఏఆర్.రెహ్మాన్, దర్శకుడు రవికుమార్ -
సీమరాజా పోస్టర్ అదిరింది
తమిళసినిమా: రజనీమురుగన్, రెమో, వేలైక్కారన్ ఇలా సక్సెస్‌ల స్వారీ చేస్తున్న యువ కథానాయకుడు శివకార్తికేయన్. అంతకు ముందు కూడా వరుత్తపడాద వాలిబర్సంఘం, కాక్కీసట్టై, మాన్‌కరాటే వంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్న నటుడీయన. స్వయంకృషితో ఎదిగిన కథానాయకుల్లో ఒకరు శివకార్తికేయన్. తన ఒక్కో చిత్రాన్ని అన్ని కోణాల్లో ఆచితూచి ఎంపిక చేసుకుని ముందడుగు వస్తున్నారు. వరుత్తపడాద వాలిభర్‌సంఘం, రజనీమురుగన్ చిత్రాల దర్శకుడు పొన్రామ్, రెమో, వేలైక్కారన్ చిత్రాల నిర్మాత 24ఏఎం. స్టూడియో అధినేత ఆర్డీ.రాజా, శివకార్తికేయన్‌ల సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం సీమరాజా. సమంత నాయకి, డి.ఇమాన్ సంగీతదర్శకుడు. పోలా కాంబినేషన్ అదిరిపోలా? ఇలాంటి చిత్రానికి అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. రజనీమురుగన్ చిత్రం తరువాత మరోసారి శివకార్తికేయన్ గ్రామీణ కథలో నటిస్తున్న చిత్రం ఇది. దీని చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. త్వరలో చిత్ర గీతాలను, వినాయక చవితికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత ఆర్డీ.రాజా సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. శనివారం నటుడు శివకార్తికేయన్ పుట్టినరోజు. శుక్రవారం అర్ధరాత్రి సీమరాజా టైటిల్‌ను చిత్ర వర్గాలు ట్విట్టర్లో విడుదల చేశారు. ఎగిరి రెండు కాళ్లపై నిలబడ్డ గుర్రంపై కళ్లేలు చేత బట్టి చిరుదరహాసం చేస్తూ కూర్చున్న శివకార్తికేయన్ ఫొటోతో కూడిన ఈ పోస్టర్ చాలా వేగంగా సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక శివకార్తికేయన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఈ సీమరాజా చిత్ర పోస్టర్ చిత్రవర్గాలను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. -
రకుల్‌కు లక్కీచాన్స్
తమిళసినిమా: సినీ తారలకు ముఖ్యంగా కథానాయికలు ఇక్కడ లేకుంటే అక్కడ, అక్కడ కాకుంటే మరో భాషలో అవకాశాలను చేజిక్కింకుంటూనే ఉంటారు. వారికున్న అడ్వాంటేజ్ అదే. నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌నే తీసుకుంటే మొదట్లో ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. అయితే టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. అక్కడిప్పుడు కాస్త డల్ అనుకుంటున్న సమయంలో కోలీవుడ్‌లో బిజీ అయిపోయింది. నిజానికి స్పైడర్ చిత్రం రకుల్‌ను చాలా నిరాశపరచింది. అంతే కాదు విజయ్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి పోయింది. దీంతో రకుల్ మరింత డీలా పడిపోయిందనే చెప్పాలి. అలాంటి సమయంలో సూర్య బ్రదర్స్ ఆదుకున్నారు. కార్తీతో నటించిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్ర విజయం రకుల్ప్రీత్సింగ్లో నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇక సూర్యకు జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం ఈ అమ్మడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అంతే కాదు కార్తీతో మరోసారి కొత్త దర్శకుడు రజత్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే చిత్రంలో నటించే చాన్స్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే హిందీలో నటించిన అయారి చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఆజయ్దేవ్గన్తో మరో చిత్రం చేయనుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్‌లో మరో బిగ్ అవకాశం రకుల్‌ప్రీత్‌సింగ్ తలుపుతట్టింది. అదే వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్‌తో జత కట్టడానికి రకుల్ రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. శివకార్తికేయన్ ప్రస్తుతం పోన్‌రామ్ దర్శకత్వంలో సమంతతో కలిసి సీమరాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తదుపరి ఇండ్రు నేట్రు నాళై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇది సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం అట. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్ పాత్ర చాలా డిఫెరెంట్‌గా ఉంటుందని చిత్ర దర్శకుడు అంటున్నారు. చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా ఉంటుందట. దీనికి సంగీతమాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతబాణీలు కట్టనున్నారు. చిత్రం జూన్‌లోగానీ జూలైలో గానీ సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. -
ఆమె నుంచి చాలా నేర్చుకున్నా!
తమిళసినిమా: నటి నయనతార నుంచి చాలా నేర్చుకున్నానన్నారు శివకార్తికేయన్. రజనీమురుగన్, రెమో వంటి ఘన విజయాల తరువాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్. అగ్రతార నయనతార నాయకిగా నటిస్తున్న ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రం ఇది. ఇంకా ప్రకాశ్‌రాజ్, స్నేహ, ఆర్జే.బాలాజి, సతీష్ ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని 24 ఏఎం స్టూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా భారీ ఎత్తున నిర్మించారు. మోహన్‌రాజా కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ వేలైక్కారన్ గురించి తన భావాలను పంచుకున్నారు. నేను నటించిన చిత్రాలన్నిటికంటే భారీ వ్యయంతో రూపొందిన చిత్రం ఇది. తనీఒరువన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొనడం సహజం. ఈ కారణంగా కూడా చిత్ర యూనిట్ మొత్తం ఎంతో శ్రమించారు. నేను ఇందులో అరివు అనే కార్మికుడిగా నటించాను. కార్మికుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రం వేలైక్కారన్. మంచి సామాజిక సందేశం ఉన్న కథా చిత్రంగా ఇది ఉంటుంది. ఇందులో నటి నయనతారతో తొలిసారిగా కలిసి నటించాను. తను మంచి కథా చిత్రాలను ఎంచుకుని అగ్రనటిగా రాణిస్తున్నారు. అందుకు నటనలో నయనతార చూపే అంకితభావమే కారణం. ఆమెను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇక మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను ఈ చిత్రానికి ఎంపిక చేసుకోవడానికి కేరళ మార్కెట్‌ను పెంచుకోవడానికా అని అడుగుతున్నారు. ఆ పాత్రకు ఆయనైతే బాగుంటారని ఎంచుకున్నాం. చిత్రంలో రాజకీయాలు ఉంటాయా? అని అడుగుతున్నారు. అలాంటి అంచనాలను ఈ చిత్రంలో టచ్ చేయలేదు. ఇది ఒక మంచి సోషల్ మేసేజ్ ఉన్న చిత్రం. నేను నటించిన చాలా సీరియస్ చిత్రం వేలైక్కారన్. నిర్మాత ఆర్డీ.రాజా ఏ విషయంలోనూ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. చిత్ర కథకు న్యాయం చేయడానికి నిర్మాణం ఎక్కువ రోజులు పట్టింది. ఇకపై ఏడాదికి రెండు చిత్రాలు చేసేలా ప్రయత్నిస్తాను అని శివకార్తికేయన్ పేర్కొన్నారు. -
బస్తీ మే సవాల్!
... అని విలన్స్‌కు వార్నింగ్ ఇస్తున్నారు హీరోయిన్ సమంత. అంతే కాదండోయ్.. ‘ఎవరైనా పోకిరి వేషాలు వేసినా, వెకిలి చేష్టలు చేయాలని ట్రై చేసినా.. ఖబడ్దార్! కర్రతో కొట్టానంటే.. బుర్ర బద్దలవ్వాల్సిందే’ అంటున్నారట. కానీ, ఇదంతా రీల్ లైఫ్లోనండోయ్. రియల్ లైఫ్‌లో సమంత మాటలు ఎంత స్వీట్ అండ్ క్యూట్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. పొన్రామ్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో సమంత కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో కొన్ని సీన్స్‌లో సమంత మాస్‌గా కనిపిస్తారట. అందుకోసం ఆమె కర్రసాము ప్రాక్టీసు చేస్తున్నారు. ‘‘కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో కర్రతో నా తలనే కొట్టుకుంటానేమోనని భయంగా ఉంది’’ అన్నారు సమంత. మనసులో భయం ఉన్నా.. క్యారెక్టర్ కోసం ధైర్యం చేసి నేర్చుకుంటున్నారు. -
దర్గా దర్శనం.. ఎంతో ఆనందం
గుడి... చర్చ్... మసీదు... ఏదైతేనేమి... నయనతారకు నో అబ్జెక్షన్. ఏ మతమైనా ఈ క్రిస్టియన్ బ్యూటీకి ఒకటే. చర్చ్‌కి ఎలానూ వెళతారు. అమ్మవారి గుడికీ, అల్లా దర్గాకీ వెళతారు. ఇప్పుడు అజ్మీర్ దర్గాకి వెళ్లారు. ‘స్వామి కార్యం.. స్వకార్యం’ అంటారు కదా.. అలా నయనతారకు రెండూ కలిసొచ్చాయి. తమిళ చిత్రం ‘వేలైక్కారన్’ కోసం నయన రాజస్థాన్ వెళ్లారు. అక్కడికి వెళుతున్నప్పుడే అజ్మీర్ దర్గాని సందర్శించాలని ఆమె నిర్ణయించుకున్నారు. సంకల్పం బలమైనది అయితే నెరవేరకుండా ఉంటుందా! రాజస్థాన్‌లో బిజీ షెడ్యూల్లోనూ నయనతారకు కాస్త గ్యాప్ దొరికింది. అంతే.. దర్గాకు వెళ్లారు. ఆమెతో పాటు డిజైనర్ నీరజ కోన కూడా దర్గాని దర్శించారు. ఇంకా చిత్రకథానాయకుడు శివ కార్తీకేయన్ తదితరులు వెళ్లారు. ఆ సంగతలా ఉంచితే.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తోన్నగ నయనతార కమెడియన్ నుంచి హీరోగా మారిన శివ కార్తీకేయన్కి జోడీగా ఈ సినిమాలో నటించడం ఓ విశేషం. కథ నచ్చితే, హీరో ఎవరైనా ఓకే అని చెప్పీ చెప్పక చెప్పారామె. -
సిమ్రాన్ వర్సెస్ సమంత!
సిమ్రాన్‌ను చూస్తే చాలు సమంతకు చిర్రెత్తుకొస్తుందట. సిమ్రాన్ కూడా సమంతను ఎలా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తుంటే తమిళ్ హీరో శివకార్తీకేయన్ అడ్డుపడుతుంటారట. సిమ్రాన్ ఏంటి? సమంతపై పగ పట్టడం ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా రియల్ లైఫ్‌లో అనుకొంటే తప్పులో కాలేసినట్టే మరి. శివ కార్తికేయన్ సరసన సమంత కథానాయికగా నటిస్తోన్న చిత్రంలో సిమ్రాన్ విలన్‌గా నటిస్తున్నారట. అసలు విషయం అది. పదేళ్ల క్రితం కథానాయికగా వెండి తెరను ఏలిన సిమ్రాన్ ఇప్పుడు కీలక పాత్రలు చేయడానికి రెడీ అయ్యారు. దర్శకుడు పొన్రామ్ చెప్పిన కథ నచ్చి, విలన్ రోల్ అంగీకరించారట. నాయికగా అలరించిన సిమ్రాన్ ప్రతినాయికగానూ భేష్ అనిపించుకుంటారని చెప్పొచ్చు. ఎనీ డౌట్! -
ప్రేమకథ మొదలైంది!
‘లీడర్’ ఫేం ప్రియా ఆనంద్ తమిళంలో మంచి ఫామ్‌లో ఉన్నారు. విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో పాటు నటిగా నిరూపించుకునే అవకాశం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నారామె. తమిళంలో ప్రియా నటించిన విజయవంతమైన చిత్రాల్లో ‘ఎదిర్ నీచల్’ ఒకటి. ఆర్.యస్. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో హీరో ధనుష్ నిర్మించిన ఈ చిత్రంలో శివకార్తికేయన్ హీరో. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నా లవ్‌స్టోరీ మొదలైంది’ పేరుతో జె. రామాంజనేయులు విడుదల చేస్తున్నారు. ‘వై దిస్ కొలవెరి..’ పాట ఫేం అనిరుథ్ స్వరపరచిన పాటలను ఇటీవలే విడుదల చేశారు. ఈ నెలాఖరున సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘తన మనసుని గెల్చుకోవాలంటే ఏదైనా ప్రయోజనాత్మక పని చేయాలని ప్రియురాలు విధించిన నిబంధనను నిజం చేయడానికి ఓ కుర్రాడు ఏం చేశాడు? అనేదే ఈ చిత్రకథ. హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా నటనకు అవకాశం ఉంది. ప్రేమ, వినోదం, సెంటిమెంట్ సమాహారంతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. ధనుష్, నయనతార చేసిన ప్రత్యేక పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. -
శివకార్తికేయన్‌కు జంటగా అమలాపాల్
యువ నటుడు శివకార్తికేయన్ అమలాపాల్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. వరుత్తపడాద వాలిభర్ సంగం విజయం శివకార్తికేయన్ ఇమేజ్ను పెంచింది. ప్రస్తుతం కరాటే మ్యాన్ చిత్రాన్ని పూర్తి చేశాడు. తాజాగా ఎదిర్‌నీచ్చల్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన టీమ్‌తో చిత్రం చేయనున్నాడు. ఎదిర్‌నీచ్చల్ చిత్రాన్ని నటుడు ధనుష్ వండర్‌బాల్ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ఇదే బ్యానర్‌పై దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని, వేల్‌రాజా చాయాగ్రహణను అందించనున్నారు. ఇందులో శివకార్తికేయన్ తొలిసారిగా పోలీసు అధికారి పాత్రను ధరించనున్నారు. ఈ చిత్రానికి తానా అనే టైటిల్‌ను నిర్ణయించారు. ప్రస్తుతం ధనుష్ సరసన వేళై ఇల్లా పట్టాదారి చిత్రంలో నటిస్తున్న అమలాపాల్ తానా చిత్రంలోనూ హీరోయిన్గా నటించనున్నారన్నది తాజా సమాచారం.