
... అని విలన్స్‌కు వార్నింగ్ ఇస్తున్నారు హీరోయిన్ సమంత. అంతే కాదండోయ్.. ‘ఎవరైనా పోకిరి వేషాలు వేసినా, వెకిలి చేష్టలు చేయాలని ట్రై చేసినా.. ఖబడ్దార్! కర్రతో కొట్టానంటే.. బుర్ర బద్దలవ్వాల్సిందే’ అంటున్నారట. కానీ, ఇదంతా రీల్ లైఫ్‌లోనండోయ్. రియల్ లైఫ్‌లో సమంత మాటలు ఎంత స్వీట్ అండ్ క్యూట్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే.
పొన్‌రామ్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో సమంత కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో కొన్ని సీన్స్‌లో సమంత మాస్‌గా కనిపిస్తారట. అందుకోసం ఆమె కర్రసాము ప్రాక్టీసు చేస్తున్నారు. ‘‘కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో కర్రతో నా తలనే కొట్టుకుంటానేమోనని భయంగా ఉంది’’ అన్నారు సమంత. మనసులో భయం ఉన్నా.. క్యారెక్టర్ కోసం ధైర్యం చేసి నేర్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment