రాజా సెప్టెంబర్‌లో ఆజా | Seema Raja to be released on September 13 | Sakshi
Sakshi News home page

రాజా సెప్టెంబర్‌లో ఆజా

Published Sat, Jun 16 2018 12:18 AM | Last Updated on Sat, Jun 16 2018 12:18 AM

Seema Raja to be released on September 13 - Sakshi

శివకార్తికేయన్

వినాయక చవితికి వస్తున్నా అంటున్నారు ‘సీమరాజా’. తమిళ నటుడు శివకార్తికేయన్, సమంత జంటగా పొన్రామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘సీమరాజా’. 24 ఏయమ్‌ స్టూడియోస్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న రిలీజ్‌ చేస్తున్నట్టు అనౌన్స్‌ చేసింది చిత్రబృందం. బిగ్‌ బడ్జెట్‌తో రూరల్‌ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ గెస్ట్‌ రోల్‌ చేయనుండటం విశేషం.

జూన్‌ 19తో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కంప్లీట్‌ అవ్వనుందట. తెలుగు, తమిళంతో కలిపి ‘సీమరాజా’ ఈ సంవత్సరం సమంతకు నాలుగో రిలీజ్‌ కానుంది. ఆల్రెడీ ‘రంగస్థలం, మహానటి, ఇరంబుదురై (తెలుగులో ‘అభిమన్యుడు’) తో  హిట్స్‌ సాధించిన సమంత ఈ సినిమా సక్సెస్‌ సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు. రీసెంట్‌గా శివకార్తికేయన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement