
నాగార్జున కింగ్ ఆఫ్ హార్ట్స్‌గా మారారట. మరి ఎవరెవరి మనసులు దోచుకున్నారో తెలియాలంటే టైమ్ పడుతుంది. నాగార్జున సూపర్ హిట్ చిత్రం ‘మన్మథుడు’ సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో సమంత, కీర్తీసురేశ్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్ర టీజర్‌ను రేపు(గురువారం) రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: ఎం.సుకుమార్.
Comments
Please login to add a commentAdd a comment