నాగార్జున
‘నీకు షెటర్లు మూసేసి దుకాణం సర్దేసే వయసు వచ్చింది’ అని నాగార్జునను ఉద్దేశించి నటి దేవదర్శిని అన్నప్పుడు ఆశ్చర్యపోవడం నాగార్జున వంతు. ఇంతలోనే ‘ఇంత అందంగా పుట్టి ఏం ప్రయోజనం ఉండదురా!’ అని బుజ్జగింపు. ‘ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్.. ఎండిపోయిన చెట్టుకు మళ్లీ నీళ్లు పోస్తే పూలు పూస్తాయా?’ అని ‘వెన్నెల’ కిశోర్ కామెడీ పంచ్.. ఇలా అందరూ పంచ్‌లేస్తే నాగ్ చెప్పిన డైలాగ్ ఏంటో తెలుసా.. ‘ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్. ఐ ఓన్లీ మేక్ లవ్’.
నాగార్జున హీరోగా ‘చిలసౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మన్మథుడు 2’. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటించారు. కథానాయికలు సమంత, కీర్తీ సురేశ్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. లక్ష్మీ, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 9న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment